hyderabad police

11:35 - August 10, 2018

హైదరాబాద్ : రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. కీసర పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బండ్లగూడలో మల్కాజ్‌గిరి డీసీపీ ఉమా మహేశ్వర శర్మ ఆధ్వర్యంలో 300 మంది పోలీసులతో సోదాలు జరిపారు. నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. 22 ద్విచక్రవాహనాలు, ఒక కారు, ఒక సిలిండర్, 10 గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

08:00 - August 10, 2018

హైదరాబాద్ : కంజర్ కెర్వా గ్యాంగ్ అనే ముఠా పేరు వినపడితే చాలు జనం గుండె జారిపోతోంది. ఈ ముఠా దోపిడికి తెగబడిందని తెలిస్తే చాలు పోలీసులు కేసు చేధించడాని చలా టైమ్‌ పడుతోంది. అందినంత దోచేయడం...అడ్డుపడితే ప్రాణాలు తీయడం ఈ గ్యాంగ్ కు వెన్నెతో పెట్టిన విద్య. ఎదురుతిరిగితే చాలు ముక్కలుగా నరికేస్తారు. అంతటి ఆరాచకం సృష్టిస్తారు ఈ ముఠా సభ్యులు. నరరూప రాక్షసులైన ఈ ముఠా ఆటకట్టించారు సైబరాబాద్ పోలీసులు.
నరరూపరక్షసుల కన్నా భయకరమైన ముఠా  
కంజర్ కెర్వా అనే ఈ గ్యాంగ్ పేరు పోలీసుల రికార్డులో పాపులర్. మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉండే ఈ ముఠాకు సంకెళ్లు వేయాలంటే పోలీసులు ప్రాణాలకు తెగించి చేజ్ చేయాలి. పట్టుకోవాలని చూసినా లేదా ఎదురుతిరిగినా ఈ ముఠా ఆరాచకం నరరూపరక్షసుల కన్నా భయకరంగా ఉంటుంది. ఒక్కసారి నేరం చేయాలని ఫిక్స్ అయితే చాలు పగలు రాత్రి అన్న తేడా లేకుండా పనికానిస్తారు. ఒక్కసారి స్వగ్రామం నుండి దోపిడీలకు బయలు దేరితే పక్కా ఎనిమిది రాష్ట్రాల్లో దొంగతనాలకు పాల్పడుతారు.
8 రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటెడ్‌ లిస్ట్‌లో ముఠా
తెలుగు రాష్ట్రాల్లోనే కాదు మొత్తం ఎనిమిది రాష్ట్రాల్లో ఈ ముఠా మోస్ట్ వాంటెడ్ గా పోలీసు రికార్డుల్లో  ఉంది. ఈ ముఠాకి నాయుకుడు హైదర్ అలీ. మధ్యప్రదేశ్ లోని కేర్వా జాగీర్ అనే ప్రాంతంలో ఈ ముఠా ఉండేది. ఒకప్పుడు శివారు ప్రాంతాల్లోని గ్రామాలపై దాడిచేసి అందినంత దోచుపోయే ఈ ముఠా ఇప్పుడు కాస్తా రూటు మార్చింది. హైవేలపై దారికాచి బస్సులను ఆపి ప్రయాణికులను భయభ్రాంతులకు  గురి చేసి వారి వద్ద ఉన్న డబ్బులతో ఉడాయిస్తోంది. అలా 2008 నుండి దారిదోపిడిలు మొదలు పెట్టారు. 2015లో పూణె పోలీసులు ముఠాత నాయకుడు హైదర్ అలీపై రివార్డు ప్రకటించారు.
సైబరాబాద్‌లో పెరిగిన నేరాలు
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో  ఈమధ్య నేరాల విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో రంగంలోకి దిగిన ఎస్ఓటీ పోలీసులు దోపిడిలకు పాల్పడింది కంజర్ కెర్వా గ్యాంగ్ అని గుర్తించారు. వారిని పట్టుకునేందుకు మధ్యప్రదేశ్  బయలుదేరివెళ్లారు.  అక్కడి కి వెళ్లాక పోలీసులు సీన్ చూసి అవాక్కయ్యారు. దోచుకున్న సోమ్ముతో ఈ ముఠా దర్జాగా జీవితాలు గడుపుతోంది. ఖరీదైన కార్లు, బంగ్లాలు, రిసార్ట్స్, ఫౌంహౌస్ లతో పాటు ఏకంగా పాఠశాలలను నడుపుతోంది. పోలీసులు ఈ ముఠాలోని అయిదుగురు ప్రధాన నిందితులను అదుపులో తీసుకున్నారు. ఏ రాష్ట్ర పోలీసులు చేయని సాహసం తెలంగాణ పోలీసులు తో తొలిసారిగా కంజర్ కెర్వా నేరాగాళ్ల అటకట్టించడంతో ప్రశంసలు అందుకుంటున్నారు. తొలిసారి వీరిని అరెస్ట్ చేసి పదుల సంఖ్యల్లో ఉన్న కేసుల చిక్కుమూడి విప్పారు.

 

12:41 - August 2, 2018

హైదరాబాద్ : తెలంగాణ పోలీసు శాఖలో మరో కొత్త టెక్నాలజీని ప్రవేశ పెట్టారు. ఫేషియల్ రికిగ్నిషన్ టెక్నాలజీని డీజీపీ మహేందర్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం దీనికి సంబంధించిన వివరాలు డీజీపి తెలియచేశారు. ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీకి సంబంధించిన ప్రజెంటేషన్ ఇచ్చారు. నేరస్తులందరనీ ఈ విధానం ద్వారా అనుసంధానం చేయనున్నట్లు డీజీపీ తెలిపారు. టెక్నాలజీ విస్తారంగా ఉపయోగించుకుని, కేసుల దర్యాప్తులో నైపుణ్యం పెంచుతున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో నేరం చేస్తే పట్టుబడుతామని..దొరికిపోతామని..శిక్షలు పడుతాయని భావించడానికి కొత్త కొత్త విధానాలను అవలింబిస్తున్నట్లు వెల్లడించారు. నేర రహిత సమాజం నెలకొల్పడానికి టెక్నాలజీని విరివిగా ఉపయోగిస్తామన్నారు. పోలీసులకు ఇందులో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని వెల్లడించారు.

ఈ సిస్టం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పీఎస్ లో అరెస్టు అయిన నేరస్తుల వివరాలను అన్నీ నిక్షిప్తమౌతాయి. నేరాలు ఎక్కువ చేసిన వారి ఫొటోలు పొందుపరిచారు. అదృశ్యమైన కేసులను పరిష్కరించడానికి ఆయా పోలీసులకు అవుట్ లుక్ పోస్టులు పంపించనున్నారు. నేరస్తుల ఫొటో తీసుకుని అప్ డేట్ చేస్తే సమాచారం వెంటనే ఇచ్చేస్తుంది. 

10:24 - August 2, 2018
10:14 - August 2, 2018

హైదరాబాద్ : నగరంలో కొకైన్ విక్రయాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. అక్రమంగా మాదక ద్రవ్యాలను విక్రయిస్తున్న ఘటనలు వెలుగు చూసిన సంగతి తెలిసిందే. తాజాగా హుమాయిన్ నగర్ పీఎస్ పరిధిలో కొకైన్, గంజాయి విక్రయిస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సరోజిని దేవి ఆసుపత్రి సమీపంలో కొకైన్ విక్రయిస్తున్నారని టాస్క్ ఫోర్స్ పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కొకైన్ కొనడానికి వచ్చిన వ్యక్తిని..అమ్ముతున్న వ్యక్తిని టాస్క్ ఫోర్స్ పోలీసులు రెడ్ హ్యాండెండ్ గా అదుపులోకి తీసుకున్నారు. ఇర్ఫాన్ అనే వ్యక్తిని పట్టుకొనేందుకు ప్రయత్నించగా అతను పరారయ్యాడు. వీరి వద్ద 15 గ్రాముల కొకైన్, 80 గ్రాముల డ్రై గంజాయి, 2 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు. 

09:22 - July 31, 2018

హైదరాబాద్ : అక్రమ నిర్మాణాలను కూల్చివేతలతను చేపట్టిన జీహెచ్ ఎంసీ నిరాటంకంగా కొనసాగిస్తోంది. ఈ క్రమంలో గచ్చిబౌలిలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలను కొనసాగిస్తున్న క్రమంలో స్థానికుల నుండి తీవ్రంగా వ్యతిరేకత వస్తోంది. గౌలిదొడ్డిలోని కేశవనగర్ లో అక్రమ నిర్మాణాలను జీహెచ్ ఎంసీ, రెవెన్యూ అధికారులు కూల్చివేస్తున్నారు. దీనిపై స్థానికుల నుండి చిరు వ్యాపారుల నుండి తీవ్రంగా వ్యతిరేతలు వెల్లువెత్తుతున్నాయి. 30ఏళ్లుగా నివాసం వుంటున్న తమకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఇలా హఠాత్తుగా కూల్చివేయటం సరికాదంటు స్థానికులు వ్యతిరేకిస్తు ఆందోళన చేపట్టారు.
కూల్చివేతలను అడ్డుకుంటున్న  స్థానికులు..
గత ప్రభుత్వం హయాంలోనే ఓ మోడ్రన్ కాలనీలు నిర్మించాలనుకున్నా అది అమలు కాలేదు..డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మిస్తామంటున్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంత వరకూ తమకు ఎటువంటి హామీ ఇవ్వలేదనీ వారి వాపోతున్నారు. కాగా నగరంలో పలు బడా బాబుల నిర్మాణాల్లో పలు భవనాలు ఎటువంటి అనుమతులను పాటించకుండా నిబంధనలను పట్టించుకోకుండి నిర్మించిన భవనాలను వదిలివేసి చిరువ్యాపారులు..పేద మధ్యతరగతి వారిపై ప్రభుత్వం ప్రతాపం చూపిస్తోందంటు స్థానికుల నుండి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కుకట్ పల్లిలోని ఆరు అంతస్తుల భవనం అక్రమంగా నిర్మిస్తే పట్టించుకోని అధికారులు పేదవారి ఇళ్లను మాత్రమే కూల్చివేయటాన్ని స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇలా నిబంధనలకు విరుద్ధం నిర్మించిన భవనాలకు నగరంలో కొదవలేదు. పెద్దవారికి పలు నోటీసులిచ్చి కోర్టుకు వెళ్లే అవకాశాన్ని కల్పిస్తున్న ప్రభుత్వం తమవంటి పేద, మధ్య తరగతివారిపై ఇలా ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా వున్న పళాన ఇళ్లను కూల్చివేటయం ఏమిటని స్థానికులు ఆవేదనతో ప్రశ్నిస్తున్నారు. కాగా గౌలిదొడ్డిలోని కేశవనగర్ లో స్థానికులకు బీజేపీ, కాంగ్రెస్ నేతలు స్థానికులకు మద్దతు తెలిపారు.

 

13:07 - July 30, 2018

హైదరాబాద్ : బరాత్‌‌..ఇది వెరీవెరీ స్పెషల్‌...ముఖ్యంగా ఓ వర్గానికి చెందిన వివాహ వేడుకల్లో తుపాకీతో గాల్లో కాల్పులు జరుపుతూ..తల్వార్లను తిప్పుతూ హల్‌చల్‌ చేస్తుంటారు. ఈ ప్రమాదకరమైన విన్యాసాలపై గతంలో కేసులు నమోదైన సంగతి తెలిసిందే. అంతేగాకుండా మరణాలు సంభవిస్తుండగా కొంతమందికి గాయాలయ్యాయి. తాజాగా బండ్లగూడలో ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. బండ్లగూడలో ఓ వివాహ వేడుకలో తల్వార్ లతో డ్యాన్సులు నిర్వహించారు. కొంతమంది కత్తులు పట్టుకుని అర్ధరాత్రి కత్తులతో డ్యాన్సులు చేస్తుండడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. రెండు రోజుల క్రితం జరిగిన ఘటనగా తెలుస్తోంది. ఘటన జరిగి 48 గంటలు జరుగుతున్నా పోలీసులు కేసులు నమోదు చేయలేదు. మరి కేసులు నమోదు చేస్తారా ? లేదా ? అనేది చూడాలి. 

13:47 - July 24, 2018

హైదరాబాద్‌ : సోమాజిగూడ విద్యుత్‌సౌధ వద్ద ఉద్రిక్తత నెలకొంది. విద్యుత్‌ సౌధను ముట్టడించేందుకు కాంట్రాక్ట్‌ ఉద్యోగులు ప్రయత్నించడంతో ఉద్రిక్తత ఏర్పడింది. దీంతో ఎక్కడికక్కడ కాంట్రాక్ట్‌ ఉద్యోగులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. 

11:03 - July 23, 2018

హైదరాబాద్ : పోలీసుల విచారణలో ఒకొక్కసారి వింత వింత వాస్తవాలు బైటపడుతుంటాయి. హైదరాబాద్ నగరంలో దాదాపు ప్రతీ రోజు నేరాలు జరుగతుండటం పరిపాటిగా మారిపోయింది. హత్యలు, ఆత్మహత్యలు..అనుమానాస్పద మృతి కేసులు ఎక్కడో ఒకచోటు బైటపడుతునే వుంటాయి. ఈ నేపథ్యంలో ఓ ఆత్మహత్య కేసును నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టిన నేపథ్యంలో మృతుడి భార్య హత్య కేసు వెలుగులోకి రావటం విస్మయాన్ని కలుగజేసింది.
ఆత్మహత్యకు పాల్పడ్డ మాధవ్..
రైలుకింద పడి ఆత్మహత్యలు పరిపాటిగా మారిపోయాయి. ఈ క్రమంలో రైలు కిందపడి ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కేసును ఛేదిస్తున్న క్రమంలో పోలీసులు, ఆ వ్యక్తి భార్య హత్యకు గురైన ఘటన వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ పరిధిలోని నల్లకుంటలో ఈ ఘటన చోటుచేసుకుంది. నల్లగొండ జిల్లాకు చెందిన నల్లకుంట సిండికేట్ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేసే మాధవ్ కు అదే జిల్లాకు చెందిన సుమలత అనే యువతిని 2017లో వివాహం చేసుకున్నాడు. వివాహం జరిగిన ఏడాదిలోపు నుండే వారిద్దరి మధ్య అభిప్రాయబేదాలతో విభేదాలు ఏర్పడ్డాయి. దీంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. భార్యపై అనుమానాన్ని పెంచుకున్న మాధవ్ జులై 21న విద్యానగర్ సమీపంలో ఎంఎంటీఎస్ రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మాధవ్ మృతి తరువాత సుమలత అదృశ్యం అయ్యింది. దీంతో మాధవ్ హత్యకు భార్య సుమలత ఉందా? అన్న కోణంలో పోలీసులు విచారణ ప్రారంభించారు.
కుమార్తె హత్య బైటపడిన వైనం..
ఈ క్రమంలో కుమార్తె సుమలత ఆచూకీ తెలియని ఆమె తల్లిదండ్రులు నల్లకుంటలోని ఇంటికి వచ్చారు. తాళం వేసున్న ఇంటిని పగులగొట్టేందుకు యత్నించారు. కానీ ఇంటి యజమానికి ఒప్పుకోలేదు. దీంతో వారు, ఇంటి యజమానితో కలిసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు వచ్చిన అనంతరం మాధవ్ అద్దెకుండే ఇంటి తాళం పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా, మంచంపై సుమలత మృతదేహం కనిపించింది. గొంతుకు చున్నీతో ఉరేసి, ఆపై దిండు ముఖంపై అదిమి ఊపిరాడకుండా చేసి చంపినట్టుగా పోలీసులు నిర్ధారించారు. అనుమానంతో ఆమెను హత్య చేసిన భర్త, ఇంటికి తాళం వేసి వెళ్లి, ఆత్మహత్య చేసుకున్నాడని భావిస్తున్న పోలీసులు, కేసును సమగ్రంగా దర్యాఫ్తు చేస్తామని తెలిపారు.

16:44 - July 16, 2018

హైదరాబాద్ : రామంతాపూర్ లోని ప్రేమ్ నివాసం వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. తోటి స్నేహితుడు సాగర్ సెల్ ఫోన్ కోసం దారుణంగా చంపేసిన సంగతి తెలిసిందే. ప్రేమ మృతదేహానికి గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి రామాంతాపూర్ నివాసానికి తరలించారు. దీనితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ సందర్భంగా పలువురితో టెన్ టివి ముచ్చటించింది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

Pages

Don't Miss

Subscribe to RSS - hyderabad police