ibrahimpatnam

10:51 - September 10, 2018

విజయవాడ:  వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుడు హోమ్ శాఖ మాజీ మంత్రి వసంత నాగేశ్వర రావుపై కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. గుంటుపల్లి పంచాయితీ కార్యదర్శి ఎన్ వెంకటేశ్వరరావు పోన్ లో తనను వసంత నాగేశ్వరరావు బెదిరించారని ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. సంభాషణలను రికార్డ్ చేసి ఆయన పోలీసులకు అందజేశారు.

గ్రామంలో ఫ్లెక్సీలు తొలగిస్తుండగా తనకు వసంత నాగేశ్వరరావు ఫోన్ చేసి దూషించారని, తనను తెలుగుదేశం ఏజంటుగా పనిచేస్తున్నావని తిట్టారని వెంకటేశ్వరరావు ఫిర్యాదులో ఆరోపించారు. తన కుటుంబ సభ్యుల వివరాలు అడిగ తనను భయపెట్టారని.. తనకు ప్రాణహాని ఉందంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫోన్ సంభాషణను ఫోరెన్సిక్ ల్యాబ్ పంపుతున్నట్టు పోలీసులు చెప్పారు.

06:35 - August 29, 2018

హైదరాబాద్ : అధికార పార్టీ నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభతో ఆ రెండు మూడు గ్రామాల రూపురేఖలు మారిపోతున్నాయి. పెండింగ్‌లో ఉన్న పనులకు ప్రభుత్వం ఆమోద ముద్ర వేయడంతో.. ఊహించని విధంగా అభివృద్ధి పనులు ఊపందుకున్నాయి. ప్రగతినివేదన సభతో ఇటు గులాబీ నేతల్లోనూ.. అటు రియల్టర్లలోనూ జోష్‌ కనిపిస్తోంది. భవిష్యత్తులో ఈ ప్రాంతం మరింతగా అభివృద్ధి చెందుతుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో నిర్వహిస్తున్న ప్రగతి నివేదన సభ.. సమీప గ్రామస్తుల్లో సంతోషం నింపుతోంది. పెద్దగా గుర్తింపు లేని ప్రాంతం.. ఈ సభతో రాష్ర్ట వ్యాప్తంగా ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. అభివృద్ధి ఊసే లేని గ్రామాల్లో భారీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన మొదలయ్యాయి. నాలుగైదు రోజులుగా జరుగుతున్న అభివృద్ధి పనులతో ఆయా గ్రామస్థుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.

ఔటర్‌ రింగురోడ్డుకు కేవలం 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొంగర కలాన్‌కు.. వెళ్ళేందుకు 20 అడుగుల రోడ్డు మాత్రమే ఉండేది.. కానీ ఇప్పుడు దాని దశ తిరిగి.. వంద అడుగుల రహదారిగా మారింది. యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్న పనులతో.. ఓఆర్‌ఆర్‌ను తలపిస్తోంది.. ఇండ్రస్టీయల్ పార్కు కూడా ఉండడంతో భవిష్యత్ అవసరాల దృష్ట్యా రోడ్లు నిర్మిస్తున్నారు. అంతర్గతరోడ్లు, డ్రైనేజీ అభివృద్ధికి కూడా నిధులు కేటాయించారని మాజీ సర్పంచ్ అశోక్ అంటున్నారు.

ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రగతినివేదన సభను విజయవంతం చేయాలని చూస్తోంది అధికార టీఆర్ఎస్. పార్టీ క్యాడర్‌లో ఉత్సాహం నింపడంతో పాటు... తమ బలాన్ని నిరూపించుకోవాలని భావిస్తోంది. సభకు భారీగా ప్రచారం కల్పించే వ్యూహాన్ని అధికార పార్టీ అమలు చేస్తోంది. దీంతో పెద్దగా గుర్తింపులేని కొంగరకలాన్ ప్రాంతం అందరి నోళ్లలో నానుతోంది. ప్రగతినివేదన సభ టీఆర్ఎస్‌ నేతలతోపాటు.. రియల్టర్లలోను జోష్‌ పెంచింది. ఆదిబట్లలో పారిశ్రామిక అభివృద్ధితో ఇప్పటికే జోరుమీదున్న రియల్ ఎస్టేట్‌ వ్యాపారం.. ఈ సభతో మరింత ఊపందుకుంటుదన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు రియల్టర్లు. ఇప్పటికే ఇక్కడ ప్రారంభించిన వెంచర్లకు భారీగా డిమాండ్ పెరిగే అవకాశం ఉందంటున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారులు. మొత్తానికి అధికార పార్టీ నిర్వహిస్తున్న సభ పుణ్యమా గ్రామాల అభివృద్ధితోపాటు.. రియల్ బూమ్‌కు బాటలు పడ్డాయన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. 

13:50 - August 27, 2018

రంగారెడ్డి : జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలం బోంగుళూరు గేట్‌ సమీపంలో దారుణం చోటు చేసుకుంది. సాహితీ స్కూల్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా రెండేళ్ల చిన్నారి ప్రతిక బస్సు కింద పడి మృతి చెందింది. మంచాలకు చెందిన బోయిని వెంకటేష్‌-చందనలు వారి కొడుకుని, కూతురిని తీసుకుని రాఖీ పండుగ సందర్భంగా అమ్మమ్మ వాళ్ల ఇంటికి వచ్చారు. ఈ రోజు ఉదయం పాప బయట ఆడుకుంటుండగా.. స్కూల్ బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ.. పాపను ఢీకొట్టాడు. దీంతో పాప బస్సు కింద పడి అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని పాప బంధువులు డిమాండ్‌ చేస్తున్నారు. 

 

22:04 - August 25, 2018

హైదరాబాద్ : కొంగరకలాన్‌లో ప్రగతి నివేదన సభ ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. 5వందల మంది కూర్చునే విధంగా స్టేజీ ఏర్పాటు చేస్తున్నారు. సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. కొంగరకలాన్‌లో సభ ఏర్పాట్లపై మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం.. 

18:40 - August 25, 2018

హైదరాబాద్ : కనీవినీ ఎరుగని రీతిలో టీఆర్‌ఎస్‌ ప్రగతి నివేదన సభ ఏర్పాట్లు చేస్తున్నామని ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి అన్నారు. తెలంగాణలో మళ్లీ టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సెప్టెంబర్‌ 2 న జరగబోయే సభను జయప్రదం చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. 

18:38 - August 25, 2018

హైదరాబాద్ : ప్రగతి నివేదన సభకు ఏర్పాట్లు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. ఇప్పటికే సీఎం కేసీఆర్‌ సభాస్థలాన్ని పరిశీలించి జరుగుతున్న ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. సభకు వచ్చేవారు ఇబ్బంది పడకుండా ఏర్పాట్లు చేయాలని పార్టీ నేతలకు సూచించారు. అన్నివైపులా 15 నుంచి 20 రోడ్లు నిర్మించాలని ఆదేశించారు. 480 ఎకరాల్లో ప్రగతి నివేదన సభ జరగనుంది. దాదాపు 25 లక్షల మందిని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సభా వేదికపై 500 మంది కూర్చునేనా ఏర్పాట్లు చేస్తున్నారు. వేదిక సమీపంలో సీఎం కోసం హెలిపాడ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు లక్ష వాహనాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. పార్కింగ్‌కోసం 16 స్థలాలను గుర్తించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బారికేడింగ్, రోడ్డు పొడవునా మంచినీటి సౌకర్యం కల్పించడంతోపాటు మైక్, ఎల్‌ఈడీ స్క్రీన్లు సిద్ధంచేస్తున్నారు. 

 

17:43 - August 25, 2018

హైదరాబాద్ : టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రగతి నివేదన సభకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. జాతరలా ప్రగతి నివేదన సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కొంగరకలాన్‌లో టీఆర్‌ఎస్‌ శ్రేణులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. బహిరంగ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. నిన్న సభాస్థలిని పరిశీలించిన సీఎం కేసీఆర్‌ ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. సభను సక్సెస్ చేయాలని పిలుపునిచ్చారు. సభకు ఓయూ జేఏసీ, అంబేద్కర్ యువజన సంఘం మద్దతు తెలిపాయి. సభాస్థలి దగ్గర భద్రత ఏర్పాట్లను రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ పరిశీలించారు. 
శేఖర్ రెడ్డి..
'సభకు 25 లక్షల మంది హాజరవుతారు. ప్రతి నియోజకవర్గం నుంచి 30 వేల మందిని సమీకరించాలని సీఎం చెప్పారు. కానీ 40 వేల మంది వచ్చే అవకాశం ఉంది. రోడ్డు, మంచినీరు, వైద్య సదుపాయాలు కల్పిస్తున్నాము' అని చెప్పారు.
వెంకటేష్.....
'3 వేల మంది వాలంటీర్లు ఉంటారు. 20 గేట్లు ఏర్పాటు చేస్తున్నాం. సభకు 7వేలకు పైగా వాహనాల్లో ప్రజలు వస్తారని అంచనా వేస్తున్నాం. ప్రత్యేకంగా పార్కింగ్ స్థలం  ఉంటుంది. పార్కింగ్ కు వెయ్యి ఎకరాలను కేటాయించాం. విద్యుత్ సౌకర్యం కల్పించాము' అని అన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

17:09 - August 25, 2018

హైదరాబాద్ : టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రగతి నివేదన సభకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. జాతరలా ప్రగతి నివేదన సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కొంగరకలాన్‌లో టీఆర్‌ఎస్‌ శ్రేణులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. సభాస్థలి దగ్గర భద్రత ఏర్పాట్లను రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ పరిశీలించారు. 

 

16:15 - August 25, 2018

హైదరాబాద్ : టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రగతి నివేదన సభకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. జాతరలా ప్రగతి నివేదన సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కొంగరకలాన్‌లో టీఆర్‌ఎస్‌ శ్రేణులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. నిన్న సభాస్థలిని పరిశీలించిన సీఎం కేసీఆర్‌ ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. సభాస్థలి దగ్గర భద్రత ఏర్పాట్లను రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ పరిశీలించారు. సభకు 7వేలకు పైగా వాహనాల్లో ప్రజలు వస్తారని అంచనా వేస్తున్నారు. విద్యుత్ సౌకర్యం కల్పించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

 

08:14 - June 25, 2018

రంగారెడ్డి : తెలంగాణ రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు అధికమౌతున్నాయి. నిర్లక్ష్యంగా డ్రైవింగ్..అతివేగంగా ప్రయాణిస్తూ మృత్యులోకాలకు వెళుతున్నారు. ఆదివారం యాదాద్రి వేములకొండ వద్ద జరిగిన ప్రమాదంలో 15 మంది దుర్మరణం చెందిన సంగతి మరిచిపోకముందే రంగారెడ్డి జిల్లాలో మరో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు - ఆటో ఢీకొన్న ఘటనలో ఐదుగురు మహిళలు మృతి చెందారు. ఈ విషాద ఘటనతో కుటుంబాలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాయి. మంచాల మండలానికి చెందిన పలువురు మహిళలు హైదరాబాద్ లో కూరగాయాలు అమ్మేందుకు వస్తుంటారు. ఎప్పటిలాగానే సోమవారం ఉదయం మహిళలు ఆటోలో బయలుదేరారు. లింగంపల్లి వద్దకు రాగానే వేగంగా వస్తున్న కారు ఢీకొంది. దీనితో నలుగురు మహిళలు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. కారు రోడ్డుపై పల్టీలు కొట్టడంతో నుజ్జునజ్జైంది. కారులో ఉన్న వారికి ఎలాంటి ప్రమాదం లేదని తెలుస్తోంది. తమవారు మృతి చెందారన్న వార్త తెలుసుకుని కుటుంబసభ్యులు ఘటనాస్థలికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. రోడ్డు కూరగాయాలు..మృతదేహాలు..రక్తపు మడుగులతో భీతావహంగా మారిపోయింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా ప్రదేశానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - ibrahimpatnam