illegal assets

11:58 - December 1, 2017

హైదరాబాద్‌ : అత్తాపూర్‌ నలందనగర్‌లో ఆర్టీఏ  అధికారి రవీందర్‌ ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఆరోపణలతో అధికారులు సోదా చేస్తున్నారు. 


 

19:35 - September 24, 2017

ప్రకాశం : ప్రకాశం జిల్లా సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌ సీబీఐ కేసులో చిక్కుకున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆయన భార్య విజయలక్ష్మితోపాటు... సురేష్‌ పేరునూ సీబీఐ నమోదు చేసింది. 2010 ఏప్రిల్‌ 1 నుంచి 2016 ఫిబ్రవరి 29 మధ్యలో వీరు ఆదాయానికి మించి ఆస్తులు కొనుగోళ్లు చేయడంతో చెన్నైలోని సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. సురేష్‌ భార్య విజయలక్ష్మి చెన్నైలోని పాండిచ్చేరి ఆదాయపన్నుశాఖ కమిషనర్‌గా పనిచేస్తున్నారు. సురేష్‌ కూడా గతంలో కర్నాటక, తమిళనాడు, హైదరాబాద్‌, వెస్ట్‌ బెంగాల్‌తోపాటు పంచాయతీరాజ్‌శాఖలో జేఈవోగా విధులు నిర్వర్తించారు. ఇలా రాష్ట్రాల్లో వివిధ హోదాల్లో నిర్వహించి స్వచ్చంద పదవీ విరమణ చేశారు. ఎమ్మెల్యే సురేష్‌....కొనుగోలు చేసిన వాహనాలు, ఇళ్లు , స్థలాలు అన్ని వివరాలతో సమగ్రంగా సీబీఐ అధికారులు ఎఫ్‌ఐఆర్‌ సిద్ధం చేశారు. ఏ సమయంలోనైనా సురేష్‌ను, ఆయన భార్య విజయలక్ష్మిని అరెస్ట్‌ చేసే అవకాశమున్నట్టు అధికారిక వర్గాలు తెలిపాయి.

ఏడాది నుంచే నిఘా పెట్టినట్టు
సురేష్‌ ఆస్తులు, వ్యాపార వ్యవహారాలపై సీబీఐ ఏడాది నుంచే నిఘా పెట్టినట్టు తెలుస్తోంది. గత ఏడాది నవంబర్‌లో మర్కాపురంలోని ఆయనకు చెందిన విద్యాసంస్థల్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. అంతేకాదు.. వారికి ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయో తెలుసుకుని అన్నిచోట్ల తనిఖీలు నిర్వహించారు. సురేష్‌కు మార్కాపురం, యర్రగొండపాలెంలో స్థిరాస్తులు ఉన్నాయి. కర్నూలు జిల్లా కల్లూరు మండలం, మర్కాపురంలోనూ కొంత వ్యవసాయ భూమి ఉంది. ఆయన భార్య విజయలక్ష్మి పేరిటి పశ్చిమ గోదావరి, నల్లగొండ జిల్లాల్లో వ్యవసాయభూమి ఉంది. 2014 ఎన్నికల అఫిడవిట్‌లో ఎమ్మెల్యే తనకు 11.54 కోట్ల స్థిరాస్తులు, 2.27 కోట్ల విలువైన చరాస్తులు ఉన్నట్టు చూపారు. కేవలం 2010 ఏప్రిల్‌ నుంచి 2016 ఫిబ్రవరి మధ్య ఇరువరి సంపాదన, వ్యయం, ఆస్తుల కొనుగోళ్లపైనే సీబీఐ దృష్టి పెట్టింది. దీంతో అదనపు ఆస్తులను గుర్తించి కేసు నమోదు చేసింది. తనపై సీబీఐ కేసు నమోదు చేయడం పెద్ద విషయమేమీ కాదని ఎమ్మెల్యే సురేష్‌ తెలిపారు. తమకు వారసత్వంగా ఆస్తులు వచ్చాయని.. వ్యాపారం ద్వారా సంక్రమించినట్లు చెప్పారు. సీబీఐ తనపై కేసు నమోదు చేయడాన్ని న్యాయపరంగా ఎదుర్కొంటామన్నారు.

14:47 - July 7, 2017

హైదరాబాద్ : వైఎస్‌ జగన్‌పై సీబీఐ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈరోజు విచారణకు హాజరు కాకుండా.. పిటిషన్‌ దాఖలు చేయడంపై ఫైర్‌ అయ్యింది. పార్టీ ప్లీనరీ సమావేశం నేపథ్యంలో.. జగన్‌ కోర్టుకు హాజరుకాలేకపోతున్నారని ఆయన తరపు న్యాయవాది పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే.. రాజకీయ కారణాలతో కోర్టు విచారణకు హాజరుకాకపోవడం సరికాదని.. మరోసారి ఇది పునరావృతమైతే వారెంట్‌ జారీ చేయాల్సి వస్తుందని సీబీఐ కోర్టు హెచ్చరించింది. తదుపరి విచారణ ఈనెల 21కి వాయిదా వేసింది. 

 

10:53 - May 16, 2017
20:11 - February 17, 2017

నెల్లూరు : 20 ఏళ్లుగా ఒకే జిల్లాలో పాతుకుపోయారు...వివిధ హోదాల్లో పనిచేశారు...పదోన్నతులు వచ్చినకొద్దీ అధికారం పెరిగింది..అందులో ధనదాహం కూడా...సింహపురిలో ఉన్నతాధికారిగా ఉంటూ కోట్లాది రూపాయల ఆస్తులు కూడబెట్టిన రాంరెడ్డి అక్రమ సంపాదన బయపడింది...ఏసీబీ తవ్వినకొద్దీ బయటపడుతున్న వాటిని చూసి కళ్లు బైర్లు కమ్మాల్సిందే.. అధికారాన్ని అడ్డుపెట్టుకున్నాడు..తనకున్న పరిచయాలను క్యాష్ చేసుకున్నాడు...ఎక్కడ పనిచేసినా అక్కడ దొరికింది దోచేశాడు...ఒకటి కాదు..రెండు కాదు కోట్లాది రూపాయల ఆస్తులు కూడబెట్టాడు ఆఫీసర్....అధికారి అవినీతిపై నజర్ పెట్టిన ఏసీబీ ఒక్కసారిగా దాడులు నిర్వహించింది..అయితే ఏసీబీ ఊహించినదాని కంటే ఎక్కువనే ఆస్తులు బయటపడ్డంతో షాక్‌ తినడం ఆఫీసర్ల వంతు అయింది...ఆ ఆఫీసర్ ఎవరో కాదు..సింహపురిలో జిల్లా పరిషత్‌ సీఇఓ, నగరపాలక సంస్థ ఇన్‌చార్జిగా ఉన్న రామిరెడ్డి...
హైదరాబాద్‌లోనూ భారీగా ఆస్తులు...
నెల్లూరు జిల్లాలో సుదీర్ఘం కాలం పని చేస్తున్న జిల్లా పరిషత్‌ సీఈవో, నగర పాలక సంస్థ ఇన్‌చార్జి కమిషనర్‌ బి.రామిరెడ్డి నివాసాల పై ఏసీబీ దాడులు నిర్వహించింది...నాలుగు ప్రాంతాలలో ఏక కాలంలో 14 చోట్ల రామిరెడ్డి ఆస్తుల పై ఏసీబీ తనిఖీలు నిర్వహిస్తోంది. ఉదయం 6 గంటల నుంచి రామిరెడ్డి ఆయన బంధువులు, కుటుంబ సభ్యులు, కొందరు అనుచరులు, మరికొందరు బినామీల ఇళ్లల్లో హైదరాబాద్‌, గుంటూరు, నెల్లూరు, తిరుపతి పట్టణాలలోని 14 చోట్ల ఈ దాడులు చేపట్టారు.
పదోన్నతులతో పాటే పెరిగిన ఆదాయం..
నెల్లూరు జిల్లాలో తాహసీల్దారు నుంచి ఆర్డీవో, డీఆర్వో, జడ్పీ సీఈవో వరకు 20 ఏళ్లకు పైగా రామిరెడ్డి వివిధ హోదాలలో పని చేశారు...ప్రస్తుతం ఉన్నతాధికారిగా పనిచేస్తున్న రామిరెడ్డిపై వచ్చిన ఆరోపణలతో ఏసీబీ రంగంలోకి దిగింది...నగరంలోని చిల్డడ్రన్స్‌ పార్కు, బి.వి.నగర్‌, మాగుంట లేఅవుట్‌, సరస్వతీ నగర్‌ ప్రాంతాలలో సోదాలు నిర్వహించింది. ఆయనతో పాటు ఒకరిద్దరు ఉపాధ్యాయులు, అదే శాఖలో పనిచేసే మరో దిగువ స్థాయి ఉద్యోగి ఇళ్లలో సోదాలు నిర్వహించిన ఏసీబీ భారీగా అక్రమాస్తులున్నట్లు గుర్తించింది. 
ఇప్పటికే బయటపడ్డ మూడు కోట్ల ఆస్తులు..
నెల్లూరు, గుంటూరు, తిరుపతి పట్టణాలలో రామిరెడ్డి, ఆయన అనుయాయుల పేరుతో ప్లాట్లు, స్థలాలు, బహుళ అంతస్తుల భవనాలు ఉన్నట్లు గుర్తించింది. నెల్లూరు నగరంలోని చిల్డ్రన్స్‌ పార్కు వద్ద రామిరెడ్డి ఉన్న డూప్లేక్స్‌ ఇళ్లు అందులో పలు కీలక రికార్డులు ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు...రామిరెడ్డి నివాసాల పై చేసిన తనిఖీలలో ఇప్పటి వరకు రెండున్నర కోట్లకు పైగా అక్రమాస్తులు ఉన్నట్లు గుర్తించామని బహిరంగ మార్కెట్‌లో దీని విలువ పదిరెట్లు వుంటుందని అధికారులు చెబుతున్నారు..బ్యాంకు లాకర్లను ఓపెన్‌ చేయాల్సి వుంది. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన రామిరెడ్డి లాంటి అధికారులు ఎందరో తమ అధికారాన్ని అడ్డుపెట్టుకున్నవారే..వారికి కొందరు రాజకీయుల సహకారం ఉండడంతో తిలాపాపం తలాపిడికెడు అన్నట్లు దోచేశారు...
హైదరాబాద్‌లో కూడా ఆస్తులు 
నెల్లూరు జడ్పీ సీఇఓ రాంరెడ్డి ఆస్తులు హైదరాబాద్‌లో కూడా ఉన్నాయి...వీటిని గుర్తించిన ఏసీబీ అధికారులు తెలంగాణా ఏసీబీకి సమాచారం అందించారు..వెంటనే హైదరాబాద్‌ టీం కూకట్‌పల్లిలో సోదాలు చేసింది.. ఈ దాడుల్లో నెల్లూరు,కావలి ప్రాంతాల్లోని ఇళ్ల స్థలాల డాక్యుమెంట్లు దొరికాయి...
హైదరాబాద్‌ లోనూ దాడులు 
నెల్లూరు జిల్లా పరిషత్‌ సీఇఓ రాంరెడ్డి అక్రమాస్తులపై హైదరాబాద్‌ నగరంలోనూ దాడులు జరిగాయి...ఈ తనిఖీల్లో ఎన్నో ఆస్తులు బయటపడ్డాయి.. ఇంకా కొన్ని డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు..దాదాపు 5 గంటలపాటు కొనసాగిన దాడుల్లో రాంరెడ్డి ఆస్తులను బయటకు తీశారు...
కూకట్‌పల్లిలో దాడులు..
ఏసీబీ దాడులు 
కూకట్‌పల్లిలోని ఆఫీసర్ రాంరెడ్డికి చెందిన ఇంట్లో ఏసీబీ ఇన్‌స్పెక్టర్ ఖాదర్‌బాషా బృందం దాడులు చేసింది... ఆ ఇంట్లో సోదాలు చేయగా నెల్లూరు, కావలి ప్రాంతాల్లోని ఇంటి స్థలాల డాక్యుమెంట్లు దొరికాయి..దాదాపు ఐదు స్థలాల విలువ మార్కెట్లో లక్షల్లోనే ఉంటుందని అంచనా... ఇంకా ఎక్కడైనా ఆస్తులున్నాయా..? బ్యాంకు లాకర్లున్నాయన్నదానిపై ఏసీబీ శోధిస్తుంది.

 

11:53 - February 17, 2017

నెల్లూరు : జిల్లా పరిషత్‌ సీఈవో బొబ్బా రామిరెడ్డి ఇంటిపై ఏసీబీ అధికారులు మెరుపుదాడులు చేశారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయని ఆరోపణలతో ఏసీబీ అధికారులు హైదరాబాద్‌, తిరుపతి, ఒంగోలు, నెల్లూరులో ఏకకాలంలో దాడులు చేశారు. నెల్లూరు సహా మొత్తం 15 చోట్ల రామిరెడ్డి బంధువుల ఇళ్లలో ఏకకాలంలో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఈ తనిఖీల్లో ఇప్పటివరకు 3 కోట్ల రూపాయల అక్రమాస్తులు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇంకా ఏసీబీ తనిఖీలు కొనసాగుతున్నాయి. కావలిలో రామిరెడ్డి మిత్రుడు మండవ జయరామయ్య ఇంట్లోనూ ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.

06:49 - February 17, 2017

హైదరాబాద్: తమిళనాడు సెగలు ఏపీనీ తాకుతున్నాయి. శశికళ ఎపిసోడ్‌ను ఎవరికి వారు తమ వ్యతిరేకులపై విమర్శలకు వాడుకుంటున్నారు. శశికళ కంటే పెద్ద అవినీతి పరులంటూ టీడీపీ , వైసీపీలు అధినేతలు ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు.

జగన్ కు ఎన్నాళ్లు శిక్షపడాలో...

66కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిన శశికళకు నాలుగేళ్ల జైలు, పది కోట్ల జరిమానా, పదేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేదం విధిస్తే.. 40 వేల కోట్లకు పైగా అవినీతికి పాల్పడ్డాడంటూ స్వయంగా సీబీఐ యే లెక్క తేల్చిన జగన్ కు ఎన్నాళ్లు శిక్షపడాలో అంటూ చంద్రబాబు.. విమర్శలకు దిగుతతూ వైసీపీని ఇరుకునపెట్టే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు.

సీఎం చంద్రబాబు వ్యాఖ్యలకు ఘాటుగా కౌంటర్‌ ...

సీఎం చంద్రబాబు వ్యాఖ్యలకు ఘాటుగా కౌంటర్‌ ఇస్తున్నారు వైసీపీ నేతలు. 18 కేసుల్లో స్టేలు తెప్పించుకొని.. ఓటు కు నోటు కేసులో పబ్లిక్ గా దొరికిపోయిన చంద్రబాబు .. ఈ రోజు నీతిసూత్రాలు వల్లిస్తున్నారని జగన్ విమర్శిస్తున్నారు. గుంటూరు జిల్లాలో జరిగిన సభలో జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై నిప్పులు చెరిగారు.

అటు వామపక్షాలు కూడా చంద్రబాబు ప్రభుత్వంపై...

అటు వామపక్షాలు కూడా చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలతో విరుచుకుపడుతున్నాయి. ఇసుక కాంట్రాక్టుల నుంచి ప్రాజెక్టుల నిర్మాణాల్లో కమిషన్ల దాకా చంద్రబాబు ప్రభుత్వం.. అవినీతికి తలుపులు బార్లా తెరిచిందని.. సీపీఎం నేతలు అంటున్నారు. ఏది ఎలా ఉన్నా.. శశికళ పై సుప్రీం తీర్పు, తమిళనాడు వ్యవహారాల నేపథ్యంలో అవినీతి అనేది ఇప్పుడు ఏపీ పాలిటిక్స్‌లో హాట్ టాఫిగ్గా మారింది. అధికార ప్రతిక్షనేతలు శశికళ ఎపిసోడ్‌ను గుర్తుచేసుకుంటూ రాజకీయాలను రంజుగా మారుస్తున్నారు.

06:55 - February 15, 2017

చెన్నై: తమిళనాడులో కొత్త సమీకరణాలు మొదలవుతున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళకు శిక్ష పడడంతో.. అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా పళనిస్వామిని ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. అనంతరం పళనిస్వామి.. పది మంది మంత్రులతో గవర్నర్‌ విద్యాసాగర్‌రావును కలుసుకున్నారు. తనకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన జాబితాను అందజేశారు. తనను ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించాలని కోరారు.

ఎత్తుకు పై ఎత్తులో ఇరువర్గాలు...

ఇక శశికళ వర్గం తాజా వ్యూహాలకు అనుగుణంగా పన్నీర్‌ సెల్వం కూడా దూసుకెళ్తున్నారు. మరోవైపు శశికళకు కోర్టు శిక్ష విధించడంతో పన్నీరు శిబిరంలో సంబరాలు జరుపుకున్నారు. ఇక శశికళ వర్గంలోని మరో ఇద్దరు ఎమ్మెల్యేలు పన్నీర్‌ గూటికి చేరారు. మరికొంత మంది కూడా వస్తారని పన్నీర్‌ వర్గం ధీమా వ్యక్తం చేస్తోంది. ఇక పన్నీర్‌సెల్వం వర్గీయులు మైత్రేయన్‌, పాండ్యన్‌ గవర్నర్‌ను కలిసి అసెంబ్లీలో బలపరీక్షకు ఆహ్వానించాలని కోరారు.

పన్నీరుకు దీప మద్దతు...

ఇక మొదటినుంచి శశికళపై గుర్రుగా ఉన్న జయలలిత మేనకోడలు దీప తాజాగా పన్నీర్‌ వర్గంలో చేరారు. జయ సమాధి వద్దకు పన్నీర్‌ సెల్వంతో కలిసి వచ్చి నివాళులర్పించారు. తాను రాజకీయాల్లోకి వస్తున్నానని.. పన్నీర్‌ సెల్వంతో కలిసి పార్టీ కోసం పని చేస్తానని ఆమె ప్రకటించారు. అనంతరం పన్నీర్‌ సెల్వం ఇంటికి వెళ్లిన దీప.. ప్రస్తుత పరిస్థితులపై చర్చించినట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో.. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ ఎవరికి అవకాశమిస్తారోనన్న టెన్షన్‌ నెలకొంది.

09:28 - October 21, 2016

హైదరాబాద్‌ : కూకట్‌పల్లిలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. అబిడ్స్‌ జీహెచ్‌ఎంసీ బిల్లు కలెక్టర్‌ నర్సింహారెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించారు. ఇప్పటివరకు కోటికి పైగా అక్రమాస్తులు గుర్తించారు. సిద్ధిపేట జిల్లా నంగునూరి గ్రామంలో నర్సింహారెడ్డికి 11 ఎకరాల వ్యవసాయ భూమి, హైదరాబాద్ లో 3 ఇళ్లు, 3 ప్లాట్లు ఉన్నట్లు గుర్తించారు. కూకట్ పల్లిలోని ఆయన నివాసంలో ఉన్న 90 తులాల బంగారు ఆభరణాలు, భారీగా వెండీ అభరణాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వివిధ బ్యాంకుల్లో డిపాజిట్లు, లాకర్లు గుర్తించారు. ఇంకా తనిఖీలు కొనసాగుతున్నాయి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

17:31 - April 7, 2016

హైదరాబాద్ : కేంద్ర మంత్రి సుజనా చౌదరిపై నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ అయ్యింది. మారిషస్ బ్యాంకును మోసం చేసిన కేసులో మూడు సార్లు కోర్టుకు హాజరు కాకపోవడంపై నాంపల్లి కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తదుపరి విచారణను ఈనెల 26కు వాయిదా వేసింది. ఆ తేదీలో కోర్టు ఎదుట సుజనా హాజరు కావాలని, లేనిపక్షంలో అరెస్టు చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.                                                                              

గతంలో...
కేంద్ర మంత్రి సుజనా చౌదరికి సంబంధించిన సుజనా యూనివర్శల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంస్థ హేస్టియా హోల్డింగ్స్ లిమిటెడ్ సూనేతె మారిషస్ దేశంలో ఒక అనుబంధ కంపెనీ ఏర్పాటుచేసింది. సుజనా చౌదరికి చెందిన కంపెనీ హేస్టియా పేరుతో మారిషస్‌ బ్యాంకు నుంచి 92 కోట్ల రూపాయల రుణం తీసుకోగా వడ్డీలతో కలిపి 106 కోట్లకు చేరింది. కాగా 2012 నుంచి హేస్టియా రుణాల చెల్లింపును నిలిపివేసింది. హేస్టియా జాప్యంపై హైకోర్టులో ఎంసిబి పిటిషన్ దాఖలు చేసింది. ఈ క్రమంలో కేసు విచారణ జరుగుతోంది. ఈ లావాదేవీలో సుజనా యూనివర్శల్ ఇండస్ట్రీస్ హామీదారుగా ఉంది. రుణానికి సంబంధించి ఎంసీబీకి, హేస్టియాకు మధ్య రాతపూర్వక ఒప్పందం కూడా జరిగినట్లు సమాచారం. అయితే 2012 నుంచి ఎంసీబీకి హేస్టియా కంపెనీ బకాయిలు చెల్లించడం మానేసినట్లు, బకాయిల విషయంలో స్పందించాలంటూ హేస్టియాకు ఎంసీబీ లేఖలు రాసినా ఫలితం దక్కలేదని తెలుస్తోంది. ఎంసీబీ అధికారులు హేస్టియా డెరైక్టర్‌గా ఉన్న సుజనా చౌదరితో సంప్రదింపులు జరిపినా బకాయిలు మాత్రం చెల్లించలేదని సమాచారం. అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో ఎంసీబీ హైదరాబాద్‌లోని సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించి లండన్ కోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని కోరింది. సిటీ సివిల్ కోర్టులోఎంసీబీకి అనుకూలంగా తీర్పు వెలువడింది. హైకోర్టులో కూడా ఇదే తీర్పు వెలువడింది. సుప్రీం కోర్టులో హేస్టియా సంస్థ హైకోర్టు తీర్పు అమలుచేయరాదని కోరుతూ స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయగా సుప్రీంకోర్టు కొట్టివేసింది. ప్రస్తుతం నాంపల్లి కోర్టు తీర్పుపై కేంద్ర మంత్రి సుజనా చౌదరి ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. 

Pages

Don't Miss

Subscribe to RSS - illegal assets