indian

19:53 - January 12, 2018

స్వతంత్ర భారత న్యాయవ్యవస్థ చరిత్రలో శుక్రవారం ఒక సంచలనం. సాధారణంగా సామాన్యుడు న్యాయవ్యవస్థను విమర్శించాలంటే భయపడాల్సిన పరిస్థితి...ఉన్నటు వంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులైన నలుగురు సుప్రీంకోర్టు పనితీరును ప్రశ్నించడం హాట్ టాపిక్ అయ్యింది. చీఫ్ జస్టిస్ పై తీవ్రమైన అభియోగాలతో కూడిన విమర్శలు గుప్పించారు. వీరు లేవనెత్తిన అంశాలపై పారదర్శకత ఏర్పడుతుందా ? సుప్రీం పనితీరు ఎలా ఉంది ? తదితర అంశాలపై టెన్ టివి ప్రత్యేక చర్చ చేపట్టింది. ఈ చర్చలో 40 సంవత్సరాలు పాటు న్యాయసేవలందించిన న్యాయ శాస్త్ర నిపుణులు జస్టిస్ చంద్రకుమార్, సీనియర్ న్యాయవాది సురేష్ లు పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి...

19:49 - January 12, 2018

తిరుగుబాటు సరియైంది కాదని, న్యాయవ్యవస్థలో ప్రక్షాళన చేయడంలో వీరు ముందుకొచ్చారని తెలిపారు. న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యల అనంతరం జరుగుతున్న రూమర్స్ పెద్ద ప్రమాదమన్నారు. అన్యాయాలు..అక్రమాలు..తదితర విషయాలపై సరియైన విధంగా అనుసరించడం లేదన్నప్పుడు సరి చేయాలన్నారు. అనేక కుంభకోణాలను న్యాయవ్యవస్థ బయటపెట్టిందని..ఆయా కుంభకోణాల్లో చాలా మందికి శిక్షలను జడ్జి విధించారని గుర్తు చేశారు. కోట్లాను కోట్లు సంపాదించిన వారు కూడా జైలు శిక్ష అనుభవించారని తెలిపారు. న్యాయవ్యవస్థను ప్రతిష్టను పెంచుతూ వచ్చాయని, ఎక్కడో చిన్న లోపాలు జరుగుతున్నాయంటే..లోపాలను..సరిదిద్దలేదని అనుకోవచ్చా అని ప్రశ్నించారు. న్యాయవాదులు ఎన్నో ప్రయత్నాలు..చేసిన తరువాత బహిరంగంగా వచ్చే పరిస్థితి ఏర్పడిందన్నారు. అందులో భాగంగా చీఫ్ జస్టిస్ కు ఒక లేఖ రాయడం జరిగిందని, ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు. 

12:14 - December 4, 2017

ఢిల్లీ : కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి రాహుల్‌ గాంధీ నామినేషన్‌ వేశారు. రాహుల్‌ అభ్యర్థిత్వాన్ని సోనియా, మన్మోహన్‌ సింగ్‌ ప్రతిపాదించారు. నాలుగు సెట్ల నామినేషన్‌ పత్రాలపై 40 మంది నేతల సంతకాలు చేశారు. ఇవాళే రాహుల్‌ను పార్టీ అధ్యక్షుడిగా ప్రకటించే అవకాశం ఉంది. 

20:52 - October 30, 2017
19:37 - October 30, 2017

హైదరాబాద్‌ : మాజీ రంజీ కెప్టెన్‌ ఎంవీ శ్రీధర్‌ గుండె పోటుతో మరణించారు. శ్రీధర్‌ గతంలో హైదరాబాద్‌ రంజీ జట్టుకు ప్రాతనిధ్యం వహించడంతో పాటు..భారత క్రికెట్‌ జట్టుకు మేనేజర్‌గా,బీసిసిఐలో కీలక పదవుల్లో బాధ్యతలు నిర్వర్తించారు.  దేశవాళీ క్రికెట్‌లో శ్రీధర్‌ 48.91 సగటుతో 21 సెంచరీలతో 6701 పరుగులు చేశారు. 

 

19:58 - October 18, 2017

హైదరాబాద్ : నిరుద్యోగ సమస్య పరిష్కారానికి మేధావులు, యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు టీజాక్ చైర్మన్ ప్రొ.కోదండరామ్. నిరుద్యోగ సమస్యతో యువత ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆయన అన్నారు. భవిష్యత్‌లో ఎవరూ ఇలాంటి ఘటనలకు పూనుకోవద్దని కోదండరామ్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో నాణ్యమైన విద్య లభించడం లేదని సామాజిక వేత్త ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. నాణ్యమైన విద్యను అందిస్తే ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయని హరగోపాల్ అన్నారు. 

21:56 - October 4, 2017

ఢిల్లీ : దేశ ఆర్థిక వ్యవస్థ స్థితిపై కొందరు నిరాశను వ్యాపింపజేయడం ద్వారా ఆనందపడుతున్నారని ప్రధానమంత్రి నరేంద్రమోది అన్నారు. ఐసీఎస్ ఐ గోల్డెన్‌ జుబ్లీ సమావేశంలో మోది ప్రసంగిస్తూ...దేశ ఆర్థిక పరిస్థితిపై వస్తున్న విమర్శలపై స్పందించారు. నోట్ల రద్దు తమ ప్రభుత్వం తీసుకున్న అత్యంత సాహసోపేత నిర్ణయమని మోది తెలిపారు. నల్లధనానికి వ్యతిరేకంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని ఆయన వెల్లడించారు. దేశ ఆర్థిక వ్యవస్థలో ఇపుడు 'నిజాయితీ' శకం ఆరంభమైందని... బ్లాక్‌మనీతో లావాదేవీలు జరిపేందుకు ప్రజలు  ఒకటికి 50 సార్లు ఆలోచిస్తున్నారని మోది చెప్పారు. జిడిపి తగ్గడం ఇపుడు కొత్తేమి కాదన్నారు. విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని వెలికితీసేందుకు కఠినమైన చట్టాలు రూపొందించామని ప్రధాని పేర్కొన్నారు.

 

20:34 - July 14, 2017

ఉన్నంత కాలం బాగానే ఉంది.. పొమ్మనేటప్పుడే అడ్డా మీద కూలీలకంటే దారుణంగా ఉంది పరిస్థితి. ఐటి రంగం భవితేమిటి? మెడపై లే ఆఫ్ కత్తి వేలాడుతుంటే అంతులేని ఒత్తిడితో టెకీలు ఏం కాబోతున్నారు? తెల్లారితో ఉద్యోగం ఉంటుందో లేదో, ఏ నిమిషం హెచ్చార్ నుండి మెయిల్ వస్తుందో అర్ధం కాని అయోమయం ఒక్కసారిగా లక్షలాది సాఫ్ట్ వేర్ ఉద్యోగులను తీవ్రమైన అభద్రతలో పడేస్తోంది. ఈ పరిస్తితికి కారణం ఎవరు? దీనికి పరిష్కారం ఏమిటి? లేబర్ లాస్ ఉండవు..గొడ్డు చాకిరీ చేయాలి. రాత్రింబవళ్లు కష్టపడాలి.. అవసరమైతే వీకెండ్ కూడా త్యాగం చేయాలి. కంపెనీకి ఆదాయం ఎప్పటికప్పుడు పెంచాలి. కానీ, అలాంటి ఉద్యోగి రేపటి గురించి భయంలో పడితే, ఈఎమ్మైలు ఎలా కట్టాలి, అసలు ఇంకో ఉద్యోగం దొరుకుతుందా అనే ప్రశ్నలో పడితే... అంతకంటే నరకం ఉంటుందా? లాభాలు తగ్గకుండా చూసుకోటానికి కాస్ట్ కంట్రోలింగ్ అంటూ కంపెనీలు ఆడే గేమ్ లో బలవుతున్నారు ఐటి ఉద్యోగులు.. కారణాలేంటి? సాఫ్ట్ వేర్ రంగం ఎందుకు సంక్షోభంలో పడుతోంది? అమెరికాలో ట్రంప్‌ గెలవటమే కారణమా? ఆటోమేషన్‌ పెరగటమా? ఐటీ రంగంలో మాంద్యం మొదలైందా? వీటిలో ఏది నిజం? ఏది కారణం? కోటి కలల యువతను నిరాశకు గురిచేస్తున్న అంశాలేమిటి? అభద్ర జీవితంలోకి కంపెనీలకు ఎందుకు నెడుతున్నాయి. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

21:47 - July 8, 2017

శ్రీనగర్ : జమ్ముకశ్మీర్‌లోని పూంఛ్‌ జిల్లాలో పాకిస్తాన్‌ మరోసారి కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనకు పాల్పడింది. గుల్పురా ప్రాంతంలోని నియంత్రణ రేఖ వద్ద పాక్‌ రేంజర్లు జరిపిన కాల్పుల్లో భార్యాభర్తలు మృతి చెందారు. వారి ఇద్దరు పిల్లలు గాయపడ్డారు. పాకిస్తాన్‌ సైన్యం ఉదయం 6 గంటల సమయంలో ఆటోమెటిక్‌ ఆయుధాలతో కాల్పులు జరిపింది. దీనికి దీటుగా భారతీయ భద్రతాదళాలు ఎదురుదాడికి దిగాయి. మరోవైపు బాందిపురాలో జిల్లాలో ఈ తెల్లవారుజామున మూడున్నర ప్రాంతంలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. హాజిన్‌ ప్రాంతంలో పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్న బలగాలపై కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. ఈ దాడుల తర్వాత భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఉగ్రవాదుల కోసం సెర్చ్‌ ఆపరేషన్‌ ప్రారంభించాయి.

21:46 - July 8, 2017

శ్రీనగర్ : హిజ్బుల్‌ ముజాహిదీన్‌ కమాండర్‌ బుర్హాన్‌ వాని తొలి వర్థంతి సందర్భంగా కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో మళ్లీ అల్లర్లు చోటుచేసుకున్నాయి. బుర్హాన్‌ వాని హోంటౌన్‌ త్రాల్‌లో భద్రతాదళాలు, ఆందోళన కారులకు మధ్య ఘర్షణ జరిగింది. బుర్హాన్‌ వానికి నివాళులర్పించేందుకు ఆందోళనకారులు త్రాల్‌లో ర్యాలీ నిర్వహించే ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. వేలాది ద్విచక్రవాహనాలను పోలీసులు సీజ్‌ చేశారు. పోలీసులు భాష్పవాయువు ప్రయోగించగా...ఆందోళనకారులు భద్రతా బలగాలపై రాళ్లు రువ్వడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమ ఇంటి చుట్టూ పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారని బుర్హాన్‌ వాని తండ్రి ముజఫర్‌ అహ్మద్‌ చెప్పారు. తన కొడుకు నివాళి అర్పించేందుకు కూడా వెళ్లలేక పోయానని పేర్కొన్నారు. కశ్మీర్‌లో శాంతిని కాపాడాలని ఆందోళనకారులకు విజ్ఞప్తి చేశారు. బుర్హన్‌ వాని ప్రథమ వర్థంతి నేపథ్యంలో కశ్మీర్‌ లోయలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. త్రాల్‌లో కర్ఫ్యూ విధించారు. గత ఏడాది జులై 8న అనంత్‌నాగ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో బుర్హాన్‌ వాని హతమయ్యాడు.

Pages

Don't Miss

Subscribe to RSS - indian