indian army

11:37 - October 16, 2017

విశాఖ : నేడు ఐఎన్ఎస్ కిల్టన్‌ను జాతికి అంకితం చేయనున్నారు రక్షణశాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌.భారత నౌకాదళంలో ప్రవేశానికి ముందుగానే నౌకా సామర్థ్యాలను పరిశీలించిన మొట్టమొదటి నౌకగా ఐఎన్ఎస్ కిల్టన్‌ రికార్డ్‌ పొందింది. కమోర్ట్‌ తరగతి యుద్ధ నౌకలలో ప్రాజెక్టు 28 కింద ఈ నౌకను రూపకల్పన చేశారు. అణు, జీవ రసాయన ఆయుధాలతో పోరాడే సత్తా ఈ నౌకకు ఉంది. విశాఖలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి నౌకాదళాధిపతి అడ్మిరల్‌ సునీల్‌ లాంబ, తూర్పు నౌకా దళాధిపతి హెచ్ సీఎస్ బిస్త్‌ ఇతర ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.  

09:25 - October 16, 2017

ఇస్లామాబాద్ : జమాతుద్దవా చీఫ్ హఫీజ్ సయీద్‌పై ఉన్న ఉగ్రవాద ఆరోపణలను ఉపసంహరించుకుంది పాకిస్థాన్. ఉగ్రవాద ఆరోపణలు వెనక్కి తీసుకోవడంతో ఇన్నాళ్లూ హౌజ్ అరెస్ట్‌లో ఉన్న సయీద్‌ను ఇక విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. యాంటీ టెర్రరిజం యాక్ట్ కిందే గతంలో సయీద్‌ను అదుపులోకి తీసుకున్నారు పాక్ అధికారులు. అయితే ఇప్పుడు సయీద్‌తోపాటు అతని నలుగురు అనుచరులు ఈ చట్టం కిందికి రాకపోవడంతో వాళ్లను రిలీజ్ చేయాలని సయీద్ తరఫు లాయర్ ఏకే డోగార్ వాదించారు. అయితే సయీద్‌తోపాటు జేయూడీపై అన్ని ఆధారాలను తాము సమర్పిస్తామని లాహోర్ హైకోర్టుకు పాక్ ప్రభుత్వం తెలిపింది. సయీద్‌పై ఇప్పటికే యూఎన్, యూఎస్ నిషేధం విధించారు. అతన్ని అరెస్ట్ చేస్తే కోటి డాలర్లు కూడా ఇస్తామని ప్రకటించాయి. 2008 ముంబై పేలుళ్ల ప్రధాన సూత్రధారి అయిన సయీద్‌ను ఈ ఏడాది జనవరిలో అరెస్ట్ చేశారు. అప్పటి నుంచీ అతను గృహ నిర్బంధంలోనే ఉన్నాడు.

15:01 - October 9, 2017

హిమచల్ ప్రదేశ్ : ఆర్మీ అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. అరుణాచల్‌ ప్రదేశ్‌లోలోని తవాంగ్‌లో హెలికాఫ్టర్‌ కూలిన ప్రమాదంలో నిన్న 7గురు సైనికులు మృతి చెందారు. అయితే వారి మృతదేహాల తరలింపు ఇపుడు వివాదాస్పదంగా మారింది. సైనికుల మృత దేహాలు ప్లాస్టికవర్లలో మూటలుగా కట్టేసి తరలించారు. దీనిపై మాజీ సైనికులు, ప్రజల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. మాతృదేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరుల పట్ల కనీసం మర్యాద పాటించరా అని.. పలువురు ప్రశ్నిస్తున్నారు. దీనిపై స్పందించిన ఆర్మీ అధికారులు.. సైనికుల మృతదేహాలు తరలించడానికి ఇక నుంచి పెట్టెలు వాడాలని నిర్ణయించామన్నారు. 

10:23 - October 9, 2017

అరుణాచల్‌ ప్రదేశ్‌ : ఆర్మీ  అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. అరుణాచల్‌ ప్రదేశ్‌లోలోని తవాంగ్‌లో హెలికాఫ్టర్‌ కూలిన ప్రమాదంలో నిన్న 7గురు సైనికులు మృతి చెందారు. అయితే వారి మృతదేహాల తరలింపు ఇపుడు వివాదాస్పదంగా మారింది. సైనికుల మృత దేహాలు ప్లాస్టికవర్లలో మూటలుగా కట్టేసి తరలించారు. దీనిపై మాజీ సైనికులు, ప్రజల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. మాతృదేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరుల పట్ల కనీసం మర్యాద పాటించరా అని.. పలువురు ప్రశ్నిస్తున్నారు. దీనిపై స్పందించిన ఆర్మీ అధికారులు.. సైనికుల మృతదేహాలు తరలించడానికి ఇక నుంచి పెట్టెలు వాడాలని నిర్ణయించామన్నారు. 

 

12:38 - October 6, 2017

ఇటానగర్ : అరుణాచల్‌ప్రదేశ్‌లో ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన చాపర్‌ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అధికారులతో సహా ఏడుగురు మృతి చెందారు. అధికారులు సహాయకచర్యలు చేపట్టారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

21:33 - October 3, 2017

శ్రీనగర్ : జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌ ఎయిర్‌పోర్ట్‌ సమీపంలోని బిఎస్‌ఎఫ్‌ క్యాంపుపై మంగళవారం తెల్లవారు జామున ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. ఉదయం 3.45 గంటలకు BSF 182వ బెటాలియన్‌ను లక్ష్యంగా చేసుకుని ముగ్గురు టెర్రరిస్టులు చొరబాటుకు యత్నించారు. ఇద్దరు ఉగ్రవాదులు చీకటిని ఆసరాగా చేసుకుని కాల్పులు జరుపుతూ గ్రెనేడ్లు విసరగా... మరో ఉగ్రవాది అడ్మిన్‌ భవనంలో దాక్కున్నాడు. వెంటనే అప్రమత్తమైన జవాన్లు ఉగ్రదాడిని దీటుగా ఎదుర్కొన్నారు. ఇరువర్గాల మధ్య హోరాహోరిగా కాల్పులు జరిగాయి. సుమారు 10 గంటలపాటు జరిగిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.

బిఎస్‌ఎఫ్‌కు చెందిన ఎఎస్‌ఐ మృతి
ఉగ్రవాదుల కాల్పుల్లో బిఎస్‌ఎఫ్‌కు చెందిన ఎఎస్‌ఐ అమరుడు కాగా.... మరో ముగ్గురు జవాన్లు గాయపడ్డట్లు అధికారులు తెలిపారు. భద్రతాదళాలు ఉగ్రదాడిని సమర్థవంతంగా తిప్పికొట్టాయని, ఆపరేషన్‌ త్వరితగతిన ముగిసిందని వారు పేర్కొన్నారు. శ్రీనగర్‌ విమానాశ్రయంపై దాడి జరగలేదని అధికారులు స్పష్టం చేశారు. ఎయిర్‌పోర్టు సమీపంలో కాల్పులు జరగడంతో విమానాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ జైష్‌-ఎ మహ్మద్‌లోని 'అఫ్జల్‌ గురు స్క్వాడ్‌' ఈ దాడికి పాల్పడినట్లు నిఘా వర్గాల సమాచారం. శ్రీనగర్‌ బిఎస్‌ఎఫ్‌ క్యాంపు నలువైపులా భద్రత కలిగి ఉంటుంది. ఓవైపు శ్రీనగర్‌ ఎయిర్‌పోర్టులో నిరంతరం వాయుసేన అప్రమత్తంగా ఉంటుంది. మరోవైపు బిఎస్‌ఎఫ్‌, సిఆర్‌పిఎఫ్‌ శిక్షణా కేంద్రాలు కూడా ఇక్కడే ఉన్నాయి. ఇంతటి చక్రవ్యూహాన్ని ఛేదించి ఉగ్రవాదులు క్యాంపులోకి ఎలా చొరబడ్డారన్నది ప్రశ్నార్థకంగా మారింది.

10:41 - September 22, 2017

జమ్మూకాశ్మీర్ : పాకిస్తాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందవాఇన్ని ఉల్లఘించింది. జమ్మూకాశ్మీర్ లో ఆర్నియా సెక్టార్ లో పాకిస్తాన్ సైన్యం కాల్పులకు పాల్పడింది. ఈ ఘటనలో నలుగురు పౌరులు మృతి చెందారు. దీంతో అక్కడి ఉద్రిక్తల నెలకొంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

08:08 - September 7, 2017

శ్రీనగర్ : జమ్ముకశ్మీర్‌ ఉగ్రవాదులకు నిధులు అందిస్తున్న కేసులో శ్రీనగర్‌, ఢిల్లీలో NIA దాడులు జరిపింది. శ్రీనగర్‌లో 11 చోట్ల, ఢిల్లీలో 5 చోట్ల ఈ సోదాలు నిర్వహించింది. క‌శ్మీర్ వ్యాలీలో అల్లర్లు సృష్టించేందుకు ఉగ్ర సంస్థలు ఫండింగ్ చేస్తున్నాయ‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఈ కేసులో ఇప్పటికే ఎన్ఐఏ ఏడుగురు వేర్పాటువాద నేత‌ల‌ను అరెస్టు చేసి విచారణ జరిపింది. ఇంతకు ముందు హంద్వాడా, బారాముల్లాల్లో ఎన్‌ఐఏ 12 చోట్ల దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. హవాలా వ్యాపారుల ఇళ్లల్లోనూ ఎన్‌ఐఏ సోదాలు చేసింది. మరోవైపు కశ్మీర్‌ వేర్పాటువాద నేత షబ్బీర్‌షాకు ఢిల్లీ కోర్టు బెయిలు తిరస్కరించింది. పాకిస్థాన్‌తో పాటు కొన్ని మిలిటెంట్ సంస్థలు క‌శ్మీర్ అల్లర్లకు ఆర్థిక స‌హ‌కారం అందిస్తున్నాయ‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. వేర్పాటువాద నేత‌ల‌కు, ఉగ్ర మూక‌ల‌కు డ‌బ్బు చేరుతున్నట్లు ఎన్ఐఏ ద‌ర్యాప్తులో తేలింది.

15:41 - September 4, 2017

శ్రీనగర్ : జమ్ముకశ్మీర్‌ బారాముల్లా జిల్లా సోపోర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. సోపోర్‌లోని చెక్‌-ఎ-బ్రాత్‌లో ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న నిఘావర్గాల సమాచారం మేరకు భద్రతాదళాలు అప్రమత్తమయ్యాయి. ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహిస్తుండగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. భద్రతాదళాలు జరిపిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు టెర్రరిస్టులు హతమైనట్లు అధికారులు తెలిపారు. మృతి చెందిన ఉగ్రవాదులు ఏ సంస్థకు చెందిన వారన్నది గుర్తించాల్సి ఉంది. 

15:56 - August 16, 2017

శ్రీనగర్ : ఉగ్రవాదులకు నిధులు ఆపేందుకు గాను జమ్ముకశ్మీర్‌లో 12 చోట్ల ఎన్‌ఐఏ దాడులు నిర్వహించింది. కశ్మీర్‌ లోయలో ఉగ్రవాదులకు, రాళ్లు విసిరే అల్లరి మూకలకు నిధులు సమాకూర్చుతున్నారన్న ఆరోపణల మేరకు జాతీయ దర్యాప్తు సంస్థ ఈ దాడులు చేసింది. శ్రీనగర్‌, హంద్వాడా, బారాముల్లా లోని 12 చోట్ల ఎన్‌ఐఏ బృందం సోదాలు నిర్వహించింది. ఎన్‌ఐఏ నిర్వహించిన సోదాల్లో వేర్పాటువాద నేతల బంధువులు, హవాలా వ్యాపారుల ఇళ్లు కూడా ఉన్నాయి. ఎన్‌ఐఏ హురియత్‌ నేత గిలానీని టార్గెట్‌ చేస్తోంది. హవాలా వ్యాపారులకు వేర్పాటువాద నేతలతో సంబంధాలున్నాయని అధికారులు తెలిపారు. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చకుండా విచారణ జరపాలన్న కేంద్రం ఆదేశాల మేరకు ఎన్‌ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. గిలానీ పాత్రపై ఆయన కుమారులు నయీం, నసీంలను ఎన్‌ఐఏ విచారిస్తోంది. త్వరలోనే గిలానీని కూడా విచారించే అవకాశం ఉంది. ఉగ్రవాదుల నిధులకు సంబంధించి ఎన్‌ఐఏ ఇప్పటికే చాలామందిని విచారించింది. ఏడుగురు వేర్పాటువాద నేతలను అరెస్ట్‌ చేసింది.

 

Pages

Don't Miss

Subscribe to RSS - indian army