indian constitution

15:05 - October 22, 2017

ప్రముఖ నవలా రచయిత యండమూరి రచించిన 'తులసిదళం’ లో ఏమీ లేదని ప్రముఖ రచయిత్రి రంగనాయకమ్మ తెలిపారు. రంగనాయకమ్మతో టెన్ టివి ముఖాముఖి నిర్వహించింది. ఈ సందర్భంగా యండమూరి రచించిన ‘తులసిదళం’ నవలపై స్పందించారు. సీరియల్ గా వస్తున్న సమయంలో తనకు కొంతమంది చెప్పారని..గొప్ప నవల అని చెప్పడం జరిగిందన్నారు. తనకు ఇష్టం లేకపోవడంతో అంతగా దృష్టి సారించలేదన్నారు. కానీ జ్యోతి అనే అమ్మాయి ఎందుకు చనిపోయింది..ఎందుకిలా జరిగిందనే ఆసక్తి తనలో నెలకొందన్నారు. పెళ్లి సాధ్యం కాదు..ఎంజాయ్ చేద్దాం అనే ఉత్తరంలో ఉందని..అమ్మాయి షాక్ అయి ఆత్మహత్య చేసుకుందన్నారు. అనంతరం పుస్తకం చదివానని..కానీ అందులో ఏమీ లేదన్నారు. ఎంత తుక్కు కథ..అంటే అంత తుక్కు కథ అని విమర్శించారు. ఓ డాక్టర్ ముందుమాటలో నవలను మెచ్చుకోవడం జరిగిందన్నారు. దీనిపై తాను ‘గంజాయి దమ్ము’ అని పుస్తకం రాసి..డాక్టర్ పై కూడా తాను విమర్శ చేయడం జరిగిందన్నారు. యండమూరి వీరేంద్ర నాథ్ తనపై కేసు పెట్టలేదని..ముందుమాట రాసిన వ్యక్తి కేసు పెట్టడం జరిగిందని..క్షమాపణ చెప్పాలని ఉత్తరంలో ఆ వ్యక్తి డిమాండ్ చేశారని పేర్కొన్నారు. జైల్లో పెట్టాలి..లేదా రూ. వెయ్యి జరిమాన కట్టాలని జడ్జి పేర్కొనడంతో జరిమాన కట్టేసి వచ్చామన్నారు. కానీ ఈ కేసు ఇంకా హైకోర్టులో ఉందన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి...

16:38 - October 12, 2017

హైదరాబాద్ : సామాన్యుడికి అదో బ్రహ్మాస్త్రం. అవినీతి జలగల పాలిట అదో పాశుపతాస్త్రం. గోప్యత లేని సమాజం కోసం రూపుదిద్దుకున్న ఆ చట్టానికి నేటితో పన్నేండేళ్లు నిండాయి.   ఎన్నెన్నో విజయాలతో   మరెన్నో ఒడిదుడుకలతో... ముందుకెళుతన్న సమాచార హక్కు చట్టంపై 10టీవీ స్పెషల్ స్టోరీ.
అవినీతి, కుంభకోణాలను బయటకు తీసిన ఆర్టీఐ
కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలోని యూపీఏ ప్రభుత్వం... ఉపాధిహామీ చట్టం, అటవీ హక్కుల చట్టంతోపాటు సమాచారహక్కు చట్టం తీసుకొచ్చింది. ఇవన్నీ ప్రజలు పోరాడి సాధించికున్నవే.  సమాచార హక్కు చట్టం ఎన్నోఏళ్లుగా పెండింగ్‌లో ఉంది. కేంద్ర ప్రభుత్వంపై వామపక్షాల ఒత్తిడి కారణంగా 2005లో అది చట్టరూపం దాల్చింది. అదే సంవత్సరం అక్టోబర్‌ 12న సమాచార హక్కుచట్టం కార్యరూపం దాల్చింది. ఈ చట్టం వచ్చి నేటికి సరిగ్గా 12ఏళ్లు పూర్తయ్యాయి.  ఈ 12ఏళ్లలో ప్రభుత్వంలో జవాబుదారీతనాన్ని పెంచడానికి ఈ చట్టం తనదైన ముద్రవేసింది. అంతేకాదు అనేక అవినీతి చర్యలను, కుంభకోణాలను బయటకు తీసిందనడంలో ఎలాంటి సందేహం లేదు.
104 దేశాల్లో అమల్లో ఉన్న సమాచార హక్కుచట్టం
సమాచార హక్కుచట్టం ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 104 దేశాల్లో అమల్లో ఉంది. అధికార యంత్రాంగంలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని తీసుకురావడం, అధికార యంత్రాంగాల అదుపులో ఉన్న సమాచారాన్ని ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావడం ఈ చట్టం ముఖ్యోద్దేశం. ప్రజాస్వామ్యం సవ్యంగా పనిచేయాలన్నా, ప్రభుత్వాలు, వాటి అంగాలు ప్రజలకు జవాబుదారీగా ఉండాలన్నా, తద్వారా అవినీతి అరికట్టబడాలన్నా ఆయా అంశాలపై ప్రజలకు విషయ పరిజ్ఞానం ఎంతో అవసరం. ప్రభుత్వాలు, ప్రభుత్వాంగాలు ఎలాంటి గోప్యత లేకుండా తాము చేస్తున్న  పనులు, వాటి వివరాలు, ఆయా సంస్థల విధులు, వివరాలు ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయాలన్నదే ఈ చట్టం లక్ష్యం. 
సమాచార హక్కుచట్టంతో బయటపడ్డ పాలకుల అవినీతి
సమాచార హక్కు చట్టం అమల్లోకి వచ్చినప్పటినుండి అనేక అవినీతి విషయాలు బయటికి వచ్చాయి. దేశవ్యాప్తంగా వివిధ కుంభకోణాలు వెలుగుచూశాయి. అంతేకాదు.. సంస్థలు, ప్రభుత్వ శాఖలు, అధికారులు పారదర్శకంగా నడుచుకోవడానికి ఈ చట్టం ఎంతగానో ఉపయోగపడింది. సమాచారాన్ని తెలుసుకోవడం, దానిని ప్రజలందరికీ తెలియజేయడం, ప్రభుత్వాలను , అధికారులను ప్రశ్నించే గొంతుకగా సమాచార హక్కుచట్టం నిలుస్తోంది. అప్పటికీ స్పందనరాకుంటే కోర్టులను ఆశ్రయించి , ఫలితాలు పొందేలా ప్రయత్నాలు చేస్తున్నారు సమాచార హక్కు కార్యకర్తలు. ఈ చట్టాన్ని అస్త్రంగా చేసుకున్న చాలామంది పలు కీలక అంశాలను వెలికితీసి ... పాలకులు, అధికారుల తీరును ఎండగడుతున్నారు. అక్కడక్కడ సమాచార హక్కు చట్టాన్ని పాలకులు, అధికారులు తొక్కిపట్టే ప్రయత్నాలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. సమాచారాన్ని అడిగినప్పుడు ఇవ్వకుండా,  లేదా తప్పుడు సమాచారాన్ని లేదా పాక్షిక సమాచారాన్ని ఇస్తున్నారు. కీలకమైన సమాచారాన్ని ఇవ్వకుండా కాలయాపన చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీ నిత్యం ప్రజలకు అందించాల్సిన సమాచారంలో అలసత్వం వహిస్తున్నాయన్న ఆరోపణలున్నాయి.
ఆర్టీఐ వినియోగిస్తున్న జర్నలిస్టులపై దాడులు
సమాచార హక్కుచట్టంలో అతిముఖ్యమైనది 4(1)(బి). ఈ సెక్షన్‌ ప్రకారం అన్ని ప్రభుత్వ శాఖలు, కార్యాలయాలు, తమకు వస్తున్న నిధులు, వారు చేస్తోన్న ఖర్చులు, పథకాల అమలు , వాటి లబ్దిదారులవంటి వివరాలు స్వచ్ఛందంగా వెల్లడించాలి. మొత్తంగా ఓ 17 అంశాలను ఎవరు అడిగినా, అడగకపోయినా స్వచ్చందంగా వెల్లడించాలి. అలా చేస్తే ప్రభుత్వ  కార్యాలయాల చుట్టూ ప్రజలు తిరగకుండా అవసరమైన సమాచారాన్ని తీసుకోవడానికి వీలవుతుంది. దీంతో దరఖాస్తులు కూడా తగ్గిపోతాయి. ఈ విషయాలు ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చెయ్యడం ద్వారా పాలనలో పారదర్శకత పెరగడానికి ఉపయోగపడుతుంది. సమాచార హక్కుచట్టం పలు అవినీతి అక్రమాలను బయటకు తీసిందనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ సమాచార హక్కు కార్యకర్తలపైన, ఈ హక్కును బాగా వినియోగిస్తున్న జర్నలిస్టులపైనా దాడులు పెరుగుతున్నాయి.  దీనిని నిలువరించడంలో ప్రభుత్వాలు తగిన శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది.
ఆర్టీఐపై అవగాహన కల్పించాలి..
సమాచార హక్కుచట్టం వచ్చి 12ఏళ్లు పూర్తైనా ఇప్పటికీ ప్రజల్లో దీనిపై పూర్తి అవగాహనలే లేదు. ప్రభుత్వాలు, సమాచార కమిషన్లు ఈ చట్టంపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించినప్పుడు మాత్రమే ఈ చట్టాన్ని ప్రజలు ఉపయోగించుకోగలుగుతారు. అప్పుడే అధికారుల్లో బాధ్యత, అవినీతిపరుల్లో భయం పెరుగుతుంది.

 

20:40 - August 26, 2017

వ్యక్తిగత గోప్యత హక్కు అనేది భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల కిందకు వస్తుందని సుప్రీం కోర్టు విస్పష్టమైన తీర్పు ఇచ్చింది. దీని పై దేశంలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ప్రాథమిక హక్కుల కిందకు వచ్చినప్పటికీ దానికి కొన్ని పరిమితులున్నాయని ప్రభుత్వం వాదిస్తోంది. ఈ సందర్భంలో ఆధార్ తప్పని సరి తప్పని సరేనా అనే చర్చ కూడా జరుగుతోంది. ఈ అంశం పై పద్మశ్రీ, రామన్ మెగసెసే అవార్డు గ్రహీత డాక్టర్ శాంత సిన్హా వన్ టూవన్... ఆధారకార్డు తప్పని సరి కాదు అని శాంతా సిన్హా గారు సుప్రీంలో పిటిషన్ వేశారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి....

21:26 - April 9, 2017

రంగారెడ్డి : దళితులకు రాజ్యాంగం ప్రసాదించిన రిజర్వేషన్లు ఇప్పుడు ప్రమాదం పడ్డాయని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు.  రిజర్వేషన్లు వద్దంటూ అగ్రకులాలు భిన్న వాదనలు తెరపైకి తీసుకొస్తున్నాయని మండిపడ్డారు. దళితులు ఎంతోకొంత అభివృద్ధి సాధించారంటే అందుకు రిజర్వేషన్లే కారణమన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో దళిత బహుజనుల ఆత్మగౌరవ సభ జరిగింది. ఇందులో పాల్గొన్న తమ్మినేని..  దళితులకు, అగ్రవర్ణాలకు సమానమైన విద్యనందిస్తే ఎవరి టాలెంట్‌ ఏంటో తెలుస్తుందన్నారు.  కార్పొరేట్‌ కాలేజీల్లో చదువుకున్న వారికి, ప్రభుత్వ కాలేజీల్లో చదువుకున్న వారికి పోటీ ఎలా పెడతారని ప్రశ్నించారు.  అంబేద్కర్‌ కల్పించిన రిజర్వేషన్లు రక్షించుకునేందుకు ఐక్యంగా ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. 

 

16:31 - March 12, 2017
15:34 - March 12, 2017

హైదరాబాద్ : 'శరణం గచ్చామి' ఆడియో ఫంక్షన్ వేడుకలు జరిగాయి. ఈ వేడుక కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ ఇతరులు హాజరయ్యారు. సెన్సార్ బోర్డు బ్యాన్ చేసే పద్ధతిలో చేయడం జరిగిందని, విద్యార్థులు ఒక ఉద్యమంలా తీసుకొచ్చారో అప్పటి నుండి ఒక కదలిక ప్రారంభమైందని ఒక వక్త పేర్కొన్నారు. పోరాటం ద్వారానే సాధ్యమైందన్నారు. తెలంగాణ రిలవెన్స్..కులం యొక్క రిలవెన్స్ ఉందని, ప్రేమ్ కుమార్ రెడ్డి దర్శకత్వం వహించి సందేశంతో కూడుకున్న సినిమా రూపొందించడం అభినందనీయమన్నారు. రిజర్వేషన్ విషయాన్ని ఇందులో ప్రస్తావించారని తెలిపారు. మరింత విశేషాల కోసం వీడియో క్లిక్ చేయండి.

20:05 - February 13, 2017

ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ సజావుగా సాగుతుందా ? లక్ష్యం ఏంటీ ? జరుగుతున్నది ఏంటీ ? అనే దానిపై దళిత్ శోషణ్ మంచ్ జాతీయ కన్వీనర్ వి.శ్రీనివాసరావుతో టెన్ టివి ముచ్చటించింది. ఈ సందర్భంగా విస్తుగొలిపే వాస్తవాలు ఆయన తెలియచేశారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ లక్ష్యం కేవలం 27 శాతం మాత్రమే ఉంటుందని, జనరల్ పేరిట మిగతా వాటికి మళ్లిస్తున్నారని తెలిపారు. ఇందులోనూ మహిళలకు ఉద్ధేశించబడుతోంది 1 శాతం మాత్రమేనన్నారు. తాజా కేంద్ర బడ్జెట్ లో ఎస్సీ, ఎస్టీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, ప్రణాళిక..ప్రణాళికేతర వ్యయం..రెండు కలిపేయడంలో నష్టం జరుగుతోందన్నారు. ఇప్పటి వరకు ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ ప్రణాళిక వ్యయం కింద వచ్చేదని, అయినా నిధుల ఖర్చు తక్కువే ఉండేదన్నారు. ఇప్పుడు మొత్తం బడ్జెట్ లో కలిపేయడంతో సబ్ ప్లాన్ కు తూట్లు పొడిచారని తెలిపారు. మొన్నటి బడ్జెట్ లో కేటాయించింది రూ. 52వేల కోట్లు అని ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ ప్రకారం కేటాయించాల్సింది ఎస్సీలకు 16.6 శాతం, ఎస్టీలకు 8.6 శాతం..కానీ మొన్న కేటాయించిన మొత్తం కేవలం 2.4 శాతం మాత్రమేనని తెలిపారు. గతంలో ఎస్సీ, ఎస్టీ సబ్ పాలన్ అమలును ప్రణాళిక సంఘం చూసేదని, అమలులో లోపాలుంటే ఎత్తి చూపేది..హెచ్చరించేది కానీ ఇక నుండి నీతి ఆయోగ్ సబ్ ప్లాన్ అమలును పర్యవేక్షిస్తుందన్నారు. నీతి ఆయోగ్ అనేది ఒక అధ్యయన కమిటీ మాత్రమేనని, ప్రణాళిక సంఘం లా ప్రశ్నించే అధికారాలు లేవన్నారు. మొత్తం బడ్జెట్ లో కలిపేయడం వల్ల ఇక ఎవ్వరూ ప్రశ్నించలేమని స్పష్టం చేశారు. ఇక కేంద్రం దయా దాక్షిణ్యాలపైనే ఆధారపడాలని ఎంత ఇస్తే అంతే తీసుకోవాలన్నారు. మొన్నటి వరకు ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అనేది హక్కు ఇక నుండి హక్కు కాదన్నారు. ఈ విషయంపై పార్టీలు కలిసి రావాలని కేంద్రం ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ పేరే మార్చేసిందని, క నుండి వెల్ఫేర్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ అంటారని పేర్కొన్నారు. 1974, 1979లో ఎస్సీ, ఎస్టీ కాపోనెంట్ ప్లాన్ లక్ష్యానికే తూట్లు పొడిచారని, కేంద్రాన్ని రాష్ట్రాలు ఫాలో అవుతున్నాయన్నారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో చట్టం ఉన్నా అమలు విషయంలో నిర్లక్ష్యం ఉందని ఇక్కడ కూడా పేరు మారుస్తారని తెలుస్తోందన్నారు. ఏపీలో పరిస్థితి ఆశాజనకంగా లేదని తేల్చిచెప్పారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

13:38 - February 8, 2017

హైదరాబాద్: మెయిటెన్స్ యాక్ట్ అంటే ఏమిటి? ఈ చట్టం ఎప్పుడు వచ్చింది. మహిళలు ఏ విధంగా అప్లై చేసుకోవచ్చు? అంశాలపై న్యాయ సలహాలు, సందేహాలపై మానవి 'వేదిక'లో ప్రముఖ న్యాయవాది పార్వతి వివరణ ఇచ్చారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

14:25 - January 26, 2017
11:33 - November 25, 2016

Pages

Don't Miss

Subscribe to RSS - indian constitution