indian cricket

21:08 - January 27, 2018

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న చివరి టెస్టు మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది. టీమిండియా 63 పరుగుల తేడాతో విజయ దుందుభి మోగించింది. విజయం దిశగా దూసుకెళుతున్న సౌతాఫ్రికా బ్యాట్స్ మెన్స్ ను భారత బౌలర్లు అడ్డుకున్నారు. రెండో ఇన్నింగ్స్ లో భారత బౌలర్లు అదరగొట్టారని చెప్పవచ్చు. 241 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా బ్యాట్స్ మెన్స్ బ్యాటింగ్‌ ఆరంభించారు. హషీమ్ ఆమ్లా (52) రాణించగా ఓపెనర్ ఎల్గర్ మాత్రం క్రీజులో పాతుకుపోయి 86 (నాటౌట్) పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు. కానీ వీరి పోరాటం నెరవేరలేదు. భారత బౌలర్లు రెచ్చిపోయారు. టీమిండియా బౌలర్లలో షమీ 5 వికెట్లు తీయగా, బుమ్రా, ఇషాంత్ శర్మలకి రెండేసి వికెట్లు, భువనేశ్వర్ కుమార్‌కి ఒక వికెట్ దక్కాయి. దక్షిణాఫ్రికా ఇతర బ్యాట్స్‌మెన్‌లో మార్క్‌రం 4, ఆమ్లా 52, డివిల్లియర్స్ 6, డుప్లెసిస్ 2, డికాక్ 0, ఫిలెండర్ 10, ఆండిలె 0, రబాడా 0, మార్కెల్ 0, ఎన్గిడీ 4 పరుగులు చేశారు.
మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 187 పరుగులు.. దక్షిణాఫ్రికా 194 పరుగులకి ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా 247 పరుగులు చేయగా, దక్షిణాఫ్రికా 177 పరుగులకి ఆలౌట్ అయింది. కాగా, మూడు టెస్టుల సిరీస్‌లో మొదటి రెండు టెస్టులను దక్షిణాఫ్రికా గెలుచుకున్న విషయం తెలిసిందే. దీంతో ఈ సిరీస్‌ను దక్షిణాఫ్రికా 2-1 తేడాతో కైవసం చేసుకుంది. 

06:48 - December 23, 2017

ఢిల్లీ : ఇండోర్‌ టీ -20 మ్యాచ్‌లోనూ టీమ్‌ ఇండియా జోరు కొనసాగింది. హోల్కార్‌ స్టేడియం వేదికగా జరిగిన రెండో టీ -20లో భారత్‌ శ్రీలంకను చిత్తు చేసింది. 88 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మూడు టీ -20ల సిరీస్‌ను 2-0తో టీమ్‌ ఇండియా కైవసం చేసుకుంది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమ్‌ ఇండియా మొదటి నుంచీ దూకుడు ప్రదర్శించింది. ఓపెనర్లు రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌ టీమ్‌ ఇండియాకు శుభారంభం అందించారు. రోహిత్‌ శర్మ 118 రన్స్‌తో చెలరేగగా.... రాహుల్‌ 89 రన్స్‌తో ఆదుకున్నాడు. దీంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. తొలుత 23 బందుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో హాఫ్‌ సెంచరీ సాధించిన రోహిత్‌.. ఆ తర్వాత మరో 12 బాల్స్‌లోనే మిగతా యాభై పరుగులు పూర్తి చేశాడు. 35 బంతుల్లో 11బౌండరీలు, 8 సిక్సర్లతో సెంచరీ సాధించి అంతర్జాతీయ టీ -20ల్లో ఫాస్టెస్ట్‌ సెంచరీ సాధించిన రికార్డు సమం చేశాడు. 108 రన్స్‌ను రోహిత్‌ కేవలం ఫోర్లు, సిక్సర్ల రూపంలోనే రాబట్టాడు.

జట్టు స్కోరు 165 పరుగుల వద్ద రోహిత్‌ ఔటయ్యాడు. ఆ తర్వాత రాహుల్‌ హాఫ్‌ సెంచరీ చేశాడు. జట్టు స్కోరు 243 రన్స్‌ దగ్గర రాహుల్‌ పెవిలియన్‌ చేరాడు. ధోనీ కూడా సొగసైన షాట్లతో అలరించాడు. 20 ఓవర్లలో టీమ్‌ ఇండియా 5 వికెట్లు కోల్పోయి 260 పరుగులు చేసింది.

భారత్‌ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో శ్రీలంక అత్యంత దూకుడుగా ఆడింది. తొలి వికెట్‌ను 36రన్స్‌ దగ్గర కోల్పోయిన లంక... ఆపై విజృంభించింది. తరంగా, కుశాల్‌ పెరీరా బౌండరీల మోత మోగించారు. ఈ జోడీకి జట్టు స్కోరు 145 రన్స్‌ దగ్గర చాహల్‌ బ్రేక్‌ ఇచ్చాడు. తరంగాను అవుట్‌ చేసి టీమ్‌ ఇండియా శిబిరంలో జోష్‌ నింపాడు. ఆ తర్వాత కుల్దీప్‌ వేసిన 15 ఓవర్‌లో లంక మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ ఓవర్‌ తొలి బంతికి కెప్టెన్‌ తిషాల్‌ పెరీరా, ఆ తర్వాత బంతికి కుశాల్‌ పెరీరా ఔటయ్యాడు. ఇక ఐదో బంతికి గుణరత్నేను కూడా పెవిలియన్‌కు పంపాడు. దీంతో 161 పరుగులకు లంక 5 కీలక వికెట్లు చేజార్చుకుంది.

తర్వాతి ఓవర్‌ను వేసిన చాహల్‌ వరుస బంతుల్లో చతురగ డిసిల్వా, సమరవిక్రమను అవుట్‌ చేశాడు. ఆ ఓవర్‌ ఐదో బంతికి అకిల ధనంజయను పెవిలియన్‌ పంపాడు. ఈ రెండు ఓవర్లలో శ్రీలంక ఆరు వికెట్లు కోల్పోయింది. అప్పటి వరకు ఉత్కంఠను రేపిన మ్యాచ్‌ కాస్తా ఏకపక్షంగా మారిపోయింది. దీంతో 172 పరుగులకు శ్రీలంక ఆలౌట్‌ అయ్యింది. భారత బౌలర్లలో చాహల్‌ 4 వికెట్లు తీయగా.. కుల్దీప్‌ మూడు వికెట్లు పడగొట్టాడు. హార్థిక్‌, ఉనద్కట్‌ చెరో వికెట్‌ తీశారు. 118రన్స్‌ చేసి టీమ్‌ ఇండియా విక్టరీలో కీలకపాత్ర పోషించిన రోహిత్‌శర్మకు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది. ఇండోర్‌ విజయంతో మూడు టీ-20ల సిరీస్‌ను భారత్‌ 2-0 తేడాతో కైవసం చేసుకుంది.

22:13 - December 22, 2017

బెంగుళూరు : ఇండోర్‌లో శ్రీలంకకు భారత్ చుక్కలు చూపించింది. కెప్టెన్ రోహిత్ శర్మ చెలరేగడంతో... భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 261 పరుగులు చేసింది. టీమిండియా సారథి రోహిత్‌ శర్మ 43 బంతుల్లో 118 రన్స్ చేశాడు. ఓ దశలో 35 బంతుల్లోనే చరిత్రలో వేగవంతమైన సెంచరీ బాదేసి.. డేవిడ్‌ మిల్లర్‌ రికార్డును సమం చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో 12 బౌండరీలు.. 10 సిక్సర్లు ఉండటం విశేషం. తరువాత రాహుల్ కూడా విజృంబించాడు. 49 బంతుల్లో 89 పరుగులు చేశాడు. చివర్లో ధోనీ 28 రన్స్ చేయడంతో స్కోర్ 260కి చేరింది. మొత్తం మ్యాచ్‌లో 21 ఫోర్లు, 21 సిక్సులు ఉండటం విశేషం. 

 

12:37 - November 30, 2017

క్రికెట్ దేవుడు సచిన టెండూల్కర్ ధరించిన 10 నెంబర్ జేర్సీని ఇక చరిత్రలోకి వెళ్లిపోనుందా అంటే బీసీసీఐ ప్రతినిధులు అవును అంటున్నారు. సచిన్ 24 ఏళ్ల కేరీర్ మొత్తం ఈ జేర్సీ ధరించి క్రికెట్ ఆడాడు. 2012 లో సచిన్ రిటైర్ అయిన తర్వాత ఈ నెంబర్ జేర్సీ ఎవరు ధరించలేదు. అయితే ఇటివల బౌలర్ శార్దూల్ ఠాకూర్ 10 జేర్సీ వేసుకరావడంతో అభిమానులు అతని మండిపడ్డారు. దీనిపై బీసీసీఐ ఓ నిర్ణయం తీసుకొనున్నట్టు తెలుస్తోంది. 10 నెంబర్ జేర్సీకి రిటైర్మెంట్ ఇవ్వాలని నిర్ణయించింది.

07:05 - November 28, 2017

నాగ్ పూర్ : టెస్ట్‌ టాప్‌ ర్యాంకర్‌ టీమిండియా అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా అదరగొడుతోంది. తొలి టెస్ట్‌లో డ్రాతోనే సరిపెట్టుకున్న కొహ్లీ అండ్‌ కో...నాగ్‌పూర్‌ టెస్ట్‌లో మాత్రం ఆల్‌రౌండ్‌ షోతో ఆధిపత్యం ప్రదర్శించి ఇన్నింగ్స్‌ విజయం టీమిండియా స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ పోటీలు పడి సెంచరీల మోత మోగించడంతో పాటు అశ్విన్‌ స్పిన్‌ మ్యాజిక్‌ ముందు లంక బ్యాట్స్‌మెన్‌ తేలిపోవడంతో భారత్‌కు పోటీనే లేకుండా పోయింది.405 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన లంక జట్టు భారత బౌలర్లు సమిష్టిగా చెలరేగడంతో తేలిపోయింది. అశ్విన్‌,జడేజా, ఇషాంత్‌ శర్మ,ఉమేష్‌ యాదవ్‌ పోటీలు పడి మరీ వికెట్లు తీయడంతో లంక 166 పరుగులకే కుప్పకూలింది.

అతిపెద్ద విజయం...
ఇన్నింగ్స్‌ 239 పరుగులతో నెగ్గిన భారత జట్టు 3 మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది.నాగ్‌పూర్‌ టెస్ట్‌లో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన విరాట్‌ కొహ్లీ మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా నిలిచాడు.భారత్‌కు టెస్టుల్లో ఇదే అతి పెద్ద ఇన్నింగ్స్‌ విజయం కావడం విశేషం.2007లో భారత్‌ బంగ్లాదేశ్‌పై ఇన్నింగ్స్‌ 239 పరుగుల తేడాతో నెగ్గింది.ఇదే జోరు కొనసాగిస్తే 3వ టెస్ట్‌తో పాటు సిరీస్‌ నెగ్గడం టీమిండియాకు పెద్ద కష్టమేమీ కాదు.

07:05 - November 27, 2017

నాగ్ పూర్ : టెస్ట్‌లో భారత్‌ పట్టుబిగిస్తోంది. మూడోరోజు కోహ్లీసేనదే పైచేయిగా నిలిచింది. కోహ్లీ డబుల్‌ సెంచరీ, రోహిత్‌ సెంచరీలతో చెలరేగడంలో భారత్‌ భారీ స్కోర్‌ చేసింది. 610 పరుగుల వద్ద భారత్‌ డిక్లేర్‌ చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన లంక 21 పరుగులకే ఒక వికెట్‌ కోల్పోయింది. మూడో రోజూ ఆట ముగిసేసమయానికి రెండో ఇన్నింగ్స్‌లో శ్రీలంక వికెట్‌ నష్టానికి 21 పరుగులు చేసింది. దీంతో లంక ఇంకా 384 పరుగులు వెనకబడి ఉంది. కరుణరత్నె, తిరుమానె క్రీజులో ఉన్నారు. మురళీ విజయ్‌, పుజారా, రోహిత్‌ సెంచరీలు చేస్తే.. కోహ్లీ డబుల్‌ సెంచరీతో విరుచుకుపడ్డాడు. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు రెండు వికెట్లకు 312 పరుగులతో పుజారా, కోహ్లీ మూడో రోజు ఆటను ఆరంభించారు. ఉదయం సెషన్‌లో పుజారా నెమ్మదిగా ఆడినప్పటికీ.. విరాట్‌ మాత్రం దూకుడు కొనసాగించాడు. లంక బౌలర్లను చీల్చి చెండాడి.. 130 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. తన విశ్వరూపం ముందు లంక బౌలర్లు నిలవలేకపోయారు.

పుజారా ఔటైన తర్వాత వచ్చిన రహానె ఎంతో సేపు నిలవలేదు. అనంతరం క్రీజులోకి వచ్చిన రోహిత్‌ శర్మతో కలిసిన విరాట్‌ స్కోరు బోర్డును పరుగులెత్తించాడు. వేగంగా ఆడుతూ చూడచక్కని షాట్లతో టెస్టు కెరీర్‌లో ఐదో డబుల్‌సెంచరీ నమోదు చేశాడు. కోహ్లీ 267 బంతుల్లో 213 పరుగులు చేసి భారీ స్కోరుకు బాటలు వేశాడు.

దిల్రువాన్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి కోహ్లీ వెనుదిరిగాడు. స్వల్ప వ్యవధిలోనే రోహిత్‌ శతకం పూర్తి చేసుకోవడంతో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ను 610 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది. రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన లంకకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. సమరవిక్రమను ఇషాంత్‌ శర్మ డకౌట్‌గా పెవీలియన్‌ పంపాడు. బౌలర్లు చెరరేగితే భారత్‌ విజయం తథ్యంగా మారనుంది.

21:18 - October 25, 2017

మహారాష్ట్ర : పుణే వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. కీలక పోరులో కోహ్లి సేన గెలిచింది. భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ పై భారత్ గెలుపొందింది. మూడు వన్డేల సీరిస్ 1..1 తో సమం చేశారు. మొదట బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 50 వోవర్లలో 230 పరుగులు చేసింది. తదనంతరం బ్యాటింగ్ కు దిగిన భారత్ నాలుగు వికెట్ల నష్టానికి 234 పరుగులు చేశారు. దినేష్ కార్తీక్, శిఖర్ ధావన్ లు హాఫ్ సెంచరీ చేశారు.

 

13:53 - July 14, 2017

మానవి   న్యూస్  మహిళా వార్తల సమాహారం మానవి న్యూస్ కు స్వాగతం... మహిళలకు సంబంధించిన వివిధ రకాల వార్తలతో ఇవాళ్టి మానవి   న్యూస్ మీ ముందుకు వచ్చింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

12:23 - June 3, 2017

టీమిండియా...భారత్ క్రికెట్ జట్టు కోచ్ ఎవరు ? చాంఫియన్స్ ట్రోఫితో ప్రస్తుత కోచ్ అనీల్ కుంబ్లే పదవీ కాలం ముగుస్తున్న సంగతి తెలిసిందే. మరలా కోచ్ పదవి తీసుకోవడానికి కుంబ్లే విముఖత వ్యక్తం చేస్తున్నట్లు ప్రచారం జరుతోంది. తాజాగా..బీసీసీ..టీమిండియాకు సంబంధించిన వార్తలు సోషల్ మాధ్యమాల్లో హల్ చల్ చేస్తున్నాయి. సెహ్వాగ్ కోచ్ పదవి రేసులో ఉన్నాడని ఇటీవలే ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా కోచ్ పదవికి 'సెహ్వాగ్' దరఖాస్తు చేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. తొలుత కుంబ్లే పదవీ కాలాన్ని పొడిగిస్తారని వార్తలు వచ్చాయి. కానీ కెప్టెన్ కోహ్లీ..కోచ్ కుంబ్లే మధ్య విబేధాలు ఉన్నాయని పుకార్లు షికారు చేశాయి. ఓ అధికారి సూచన మేరకు సెహ్వాగ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్నాడని తెలుస్తోంది. సెహ్వాగ్ కు కోచింగ్ లో పెద్దగా అనుభవం లేనప్పటికీ...ఐపీఎల్ లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మెంటార్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే.

22:06 - March 5, 2017

బెంగళూరు : భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా ఆధిక్యం దిశగా సాగుతోంది. ఆసీస్ తన తొలి ఇన్నింగ్స్‌లో భాగంగా ఆదివారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది. దాంతో ఆసీస్‌కు 48 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. తొలి రోజు ఆటలో తొలుత ఆసీస్ తడబడినట్లు కనిపించినప్పటికీ..తిరిగి గాడిలో పడింది. భారత్‌ మాత్రం.. వికెట్లు తీయడంలో ఘోరంగా విఫలమైంది.
మరింత దూకుడుగా ఆసీస్ 
బెంగళూరులో జరుగుతున్న భారత్‌, ఆస్ర్టేలియా రెండో టెస్టులో..ఆస్ట్రేలియా ఆధిక్యం దిశగా సాగుతోంది. 40/0 ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు ఇన్నింగ్స్ కొనసాగించిన ఆసీస్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలినా.. ఆ తర్వాత పుంజుకొని మరింత దూకుడును ప్రదర్శించింది. ఓవర్‌నైట్‌ స్కోరు ఆరంభంలో ఆసీస్ ఓపెనర్ వార్నర్‌ను అశ్విన్ అద్భుతమైన బంతితో పెవిలియన్ పంపించాడు. బంతిని అంచనా వేయడంలో విఫలమైన వార్నర్ బౌల్డ్ అయ్యాడు. ఆ తరువాత కాసేపటికి కెప్టెన్ స్మిత్ కూడా అవుట్ కావడంతో లంచ్ సమయానికి ఆసీస్ రెండు వికెట్లను నష్టపోయింది. అయితే ఓపెనర్ రెన్ షా- షాన్ మార్ష్ల జోడి ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లింది. వీరిద్దరూ ఆచితూచి ఆడుతూ ఆసీస్ స్కోరు బోర్డును నడపించారు.  
రెండో సెషన్‌లో కష్టాల్లో పడిన ఆసీస్ 
తొలి సెషన్‌లో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయిన ఆసీస్.. రెండో సెషన్‌లో మాత్రం మరో మూడు కీలక వికెట్లను చేజార్చుకుని కష్టాల్లో పడింది. ఆస్ట్రేలియా ఆటగాళ్లు డేవిడ్ వార్నర్ 33, కెప్టెన్‌ స్టీవ్ స్మిత్ 8, రెన్‌షా 60, హ్యాండ్ స్కాంబ్ 16, మిచెల్ మార్ష్ 0 పరుగులు చేయకుండానే స్వల్ప వ్యవధిలో వెనుదిరిగారు. ఆ తర్వాత షాన్ మార్ష్ 66 పరుగులకు ఆరో వికెట్‌గా అవుటయ్యాడు. ఆసీస్ కోల్పోయిన ఆరు వికెట్లలో జడేజా మూడు వికెట్లు సాధించగా... అశ్విన్, ఉమేశ్ యాదవ్, అశ్విన్లకు తలో వికెట్ లభించింది. 
రెండో రోజు...ఆసీస్ 237/6
ఆసీస్ తన తొలి ఇన్నింగ్స్‌లో భాగంగా ఆదివారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది. దాంతో ఆసీస్‌కు 48 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. 

Pages

Don't Miss

Subscribe to RSS - indian cricket