Indian supreme court

21:24 - January 12, 2018

ఢిల్లీ : సుప్రీంకోర్టుకు చెందిన నలుగురు న్యాయమూర్తుల మీడియా సమావేశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రాజకీయపార్టీలు ఈ అంశంపై దృష్టిసారించాయి. జరుగుతున్న పరిణామాలపై కాంగ్రెస్ స్పందించింది.

జడ్జిలు పేర్కొన్న అంశాలను తేలిగ్గా తీసుకోవద్దని...వాటిని శ్రద్ధాగ పరిశీలించాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. జస్టిస్‌ లోయా మృతిపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని రాహుల్‌ డిమాండ్‌ చేశారు. అత్యున్నత న్యాయవ్యవస్థపై అందరికీ నమ్మకం ఉందన్నారు. న్యాయమూర్తుల వివాదంలో బిజెపి ఎందుకు మౌనం వహిస్తోందని కాంగ్రెస్‌ ప్రశ్నించింది.

సీపీఎం స్పందన..
అటు సిపిఎం పొలిట్‌ బ్యూరో కూడా ఈ వ్యవహారంపై స్పందించింది. సుప్రీంకోర్టు వ్యవస్థపై తీవ్ర పరిణామాలు చూపే కీలక అంశాలను.. నలుగురు న్యాయమూర్తులు లేవనెత్తారని తెలిపింది. జడ్జిలకు కేసుల కేటాయింపుల్లో నిబంధనలను పాటించడం లేదన్న అంశాలు ప్రస్తావనకు వచ్చాయని పేర్కొంది. దేశంలోని అత్యున్నత న్యాయవ్యవస్థలో పారదర్శకత, ప్రజాస్వామ్యయుత నిర్వహణను దృష్టిలో ఉంచుకుని న్యాయమూర్తుల మధ్య వివాదాలు సమిసిపోతాయని భావిస్తున్నట్లు సిపిఎం ప్రకటించింది.

19:53 - January 12, 2018

స్వతంత్ర భారత న్యాయవ్యవస్థ చరిత్రలో శుక్రవారం ఒక సంచలనం. సాధారణంగా సామాన్యుడు న్యాయవ్యవస్థను విమర్శించాలంటే భయపడాల్సిన పరిస్థితి...ఉన్నటు వంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులైన నలుగురు సుప్రీంకోర్టు పనితీరును ప్రశ్నించడం హాట్ టాపిక్ అయ్యింది. చీఫ్ జస్టిస్ పై తీవ్రమైన అభియోగాలతో కూడిన విమర్శలు గుప్పించారు. వీరు లేవనెత్తిన అంశాలపై పారదర్శకత ఏర్పడుతుందా ? సుప్రీం పనితీరు ఎలా ఉంది ? తదితర అంశాలపై టెన్ టివి ప్రత్యేక చర్చ చేపట్టింది. ఈ చర్చలో 40 సంవత్సరాలు పాటు న్యాయసేవలందించిన న్యాయ శాస్త్ర నిపుణులు జస్టిస్ చంద్రకుమార్, సీనియర్ న్యాయవాది సురేష్ లు పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి...

19:49 - January 12, 2018

తిరుగుబాటు సరియైంది కాదని, న్యాయవ్యవస్థలో ప్రక్షాళన చేయడంలో వీరు ముందుకొచ్చారని తెలిపారు. న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యల అనంతరం జరుగుతున్న రూమర్స్ పెద్ద ప్రమాదమన్నారు. అన్యాయాలు..అక్రమాలు..తదితర విషయాలపై సరియైన విధంగా అనుసరించడం లేదన్నప్పుడు సరి చేయాలన్నారు. అనేక కుంభకోణాలను న్యాయవ్యవస్థ బయటపెట్టిందని..ఆయా కుంభకోణాల్లో చాలా మందికి శిక్షలను జడ్జి విధించారని గుర్తు చేశారు. కోట్లాను కోట్లు సంపాదించిన వారు కూడా జైలు శిక్ష అనుభవించారని తెలిపారు. న్యాయవ్యవస్థను ప్రతిష్టను పెంచుతూ వచ్చాయని, ఎక్కడో చిన్న లోపాలు జరుగుతున్నాయంటే..లోపాలను..సరిదిద్దలేదని అనుకోవచ్చా అని ప్రశ్నించారు. న్యాయవాదులు ఎన్నో ప్రయత్నాలు..చేసిన తరువాత బహిరంగంగా వచ్చే పరిస్థితి ఏర్పడిందన్నారు. అందులో భాగంగా చీఫ్ జస్టిస్ కు ఒక లేఖ రాయడం జరిగిందని, ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు. 

21:56 - October 13, 2017

ఢిల్లీ : రోహింగ్యా ముస్లిం శరణార్థుల విషయంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమను దేశం నుంచి పంపించొద్దన్న పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.... రోహింగ్యాల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని కేంద్రానికి సూచించింది. ఈ కేసు విషయంలో దేశ భద్రతను రెండో ప్రాధాన్యత కింద తీసుకోలేమని... అలాగని రోహింగ్యాలలో చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు ఉన్నారని వారిపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించలేమని కోర్టు పేర్కొంది. కేసు తదుపరి విచారణను నవంబర్‌ 21కి వాయిదా వేసింది. అప్పటివరకు రోహింగ్యాలను దేశం నుంచి పంపించే ప్రయత్నాలు చేయొద్దని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. రోహింగ్యాలు దేశ భద్రతకు ముప్పుగా పరిణమించారని, శరణార్థుల్లో కొందరికి ఐసిస్‌ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నందున..వాళ్లని దేశం నుంచి పంపించి వేస్తున్నట్లు కేంద్రం గతంలో కోర్టుకు తెలియజేసింది. ఈ నేపథ్యంలో రోహింగ్యాలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అవసరమైతే ఇక్కడే చనిపోతాం కానీ దేశం నుంచి వెళ్లబోమని పిటిషన్‌లో పేర్కొన్నారు.

15:03 - January 16, 2017

ఢిల్లీ : అబార్షన్ పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం వెలువడించింది. కొన్ని కండీషన్లతో సుప్రీంకోర్టు ఒప్పుకుంది. 24 వారాల కంటే ముందు అబార్షన్ చేయించుకోవచ్చని కోర్టు పేర్కొంది. పుర్రె ఏర్పడకపోతే అబార్షన్ చేయించుకోవచ్చని సుప్రీం అనుమతినిచ్చింది. 22 ఏళ్ల యువతి వేసిన పిటిషన్ పై సుప్రీం స్పందించింది. పుణెకు చెందిన ఓ యువతి సుప్రీంను ఆశ్రయించింది. అబార్షన్ కావాలని అభ్యర్థించింది. దీనిపై సుప్రీం సోమవారం సంచలానత్మక తీర్పును వెలువడించింది. వైద్యపరమైన కారణాలతో గర్భంలో శిశువు పుర్రె ఏర్పడకపోతే అబార్షన్ తొలగించుకోవచ్చని పేర్కొంది. గర్భం తొలగించుకోవడం చట్టపరమైన నేరమనే విషయం తెలిసిందే. దీనిపట్ల మానవ హక్కుల సంఘం తీవ్రంగా స్పందిస్తోంది. ఇది సరియైన చర్య కాదని, దీనిని పునరాలోచించుకోవాలని కోరుతోంది. అనారోగ్య సమస్యలు ఉంటేనే గర్భం తొలగించుకోవచ్చని సుప్రీం తెలిపింది.

Don't Miss

Subscribe to RSS - Indian supreme court