indonesia

16:27 - November 8, 2018

జావా (ఇండోనేషియా) : ప్రాధమిక పాఠశాలలో చదువుతున్న పిల్లలచేత సిగరెట్ తాగించాడు ఓ ప్రధాన ఉపాధ్యాయుడు. పదకొండు మంది విద్యార్థులకు శిక్ష వేసేందుకు వారిచేత బలవంతంగా సిగరెట్ తాగించాలని నిర్ణయించాడు. ఆటస్థలంలో 11 మంది విద్యార్థులను లైన్‌గా నుంచోబెట్టారు. ఆ తర్వాత వారిని హెడ్‌మాస్టర్ గదికి లాక్కెళ్లారు. అక్కడ పనిష్మెంటుగా వారిని సిగరెట్ తాగమన్నారు. వారు సిగరెట్ తాగుతుంటే వారిని చూసి పక్కనేఉన్న కొంతమంది ఇతర విద్యార్థులు నవ్వుతున్నారు. ఈ సంఘటన ఇండోనేషియాలోని ఉత్తర జావ ప్రాంతంలోని ఓ పాఠశాలలో చోటుచేసుకొంది. ఆ హెడ్ మాస్టర్ పేరు తాటి మాలేటీగా గుర్తించారు. పిల్లలు సిగరెట్ తాగుతూ గుప్పుగుప్పున పొగవదులుతుంటే అక్కడే ఉన్న ఒక టీచర్ వీడియో చిత్రీకరించాడు. ఈ వింత శిక్షకు సంబంధించన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పిల్లల తల్లిదండ్రులు హెడ్‌మాస్టర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.  
 

12:30 - October 30, 2018

ఢిల్లీ : దూర తీరాలలో గగన విహారంలో ఉద్యోగం చేసే కొడుకు పండగకు వస్తాడనుకుని వేయి కళ్లతో ఎదురు చూసే తల్లికి కడుపుశోకం మిగిల్చి వెళ్లిపోయాడు. ప్రతీ సంవత్సరం అందరూ కలిసి దీపావళి పండుగను వేడుగగా చేసుకుని మురిసిపోయే ఆ కుటుంబంలో శాశ్వతంగా చీకటిని మిగిల్చి వెళ్లిపోయాడు. ఆనవాయితీయికి చరమగీతం పాడి ఆ ఇంట విషాద గీతం వినిపించేలా చేసి వెళ్లిపోయిన కుమారుడ్ని తలచుకుని ఆ తల్లి హృదయం పుట్టెడు శోకంతో అంగలార్చుకుపోతోంది. నవంబర్ 7వ తేదీన వచ్చే దీపావళి పండుగకు వస్తాడని గంపెడంత ఆశతో కుమారుడు  భవ్వే సునేజా కోసం సంగీతా సునేజా ఒళ్లంతా కళ్లు చేసుకుని ఎదురు చూస్తున్న వేళ ఆ ఇంట్లో పిడుగులాంటి వార్త వినిపించింది. అంతే కుటుంబం అంతా కుదేలైపోయింది. కలా? నిజమా? అనే మీమాంసలో పడిన ఆ కుటుంబానికి కల కాదు నిజమే అనే చేదు వార్త నమ్మటానికి ఎంతో సమయం పట్టలేదు. 

Image result for pilot SUNEJA BHAVE FAMILYభవ్యే సునేజా తో కలిసి ఆ ఇంట ఎన్నో ఏళ్లుగా వస్తున్న ఆనవాయితీ. కానీ.... ఓ పిడుగులాంటి వార్త ఆ కుటుంబం ఆశలను ఆనందాలను చిదిమేసింది. ఇక ఎప్పటికీ భవ్యే రారని... ఆయన ఇక లేరని తెలిసి అంతా శోక సంద్రంలో ముగినిపోయారు. 31 ఏళ్ల అతి చిన్నవయసులోనే ఇండోనేషియాలో సముద్రంలో కూలిపోయిన విమానం పైలట్‌ భవ్వే సునేజా. ఈ ప్రమాద వార్తను టీవీల్లో చూసిన ఆయన కుటుంబ సభ్యులు నమ్మలేకపోయారు. కన్నీరుమున్నీరైన ఆయన తల్లి సంగీతా సునేజాను ఓదార్చడం ఎవరి వల్లా కాలేదు.  

Image result for pilot SUNEJA BHAVE FAMILY2009లో ఆయనకు పైలట్‌ లైసెన్సు వచ్చిన భవ్వే మయూర్‌ విహార్‌లోని పబ్లిక్‌ స్కూల్‌లో భవ్యే చదువుకున్నారు. తండ్రి గుల్షన్‌ సుఖేజా చార్టెర్డ్‌ అకౌంటెంట్‌ గా పనిచేసే తండ్రి, తల్లి సంగీతా సునేజా ఎయిర్‌ ఇండియాలో పనిచేసేవారు. ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌లో మేనేజర్‌గా పనిచేసిన గరిమా సేథీతో 2016లో భవ్యేకు  వివాహమైంది. 2011లో లయన్‌ ఎయిర్‌లో చేరిన భవ్వేకు పైలట్‌గా 6,000 ఫ్లైట్‌ అవర్స్‌ అనుభవం ఉన్న ఈ భారతీయుడు అనుభవం తన ప్రాణమేకాదు..తనతో పాటు ఎంతోమందిని జలసమాధి చేయటం విచారించదగిన విషయం. కళ్లల్లో దీపాల ఒత్తులు వేసుకుని ఆశగా ఎదురు చూస్తున్న జీవన సహచరి జీవితాంతం ఎదురు చూసినా రాని భాగస్వామి కోసం గుండెలవిసేలా రోదిస్తుంటే ఓదార్చేందుకు ఎవ్వరి తరం కావటంలేదు. 

 
12:17 - October 30, 2018

జకార్తా : ఇండోనేషియాలో జరిగిన విమాన ప్రమాదంలో 189 మంది జలసమాధి అయ్యారు. వీరిలో శిశువు, ఇద్దరు చిన్నారులు, ఇద్దరు పైలట్లు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. 'లయన్‌ ఎయిర్‌' విమానం జావా సముద్రంలో కూలిపోయింది. 

జకార్తా విమానాశ్రయం నుంచి పంగ్‌కల్‌ పినాంగ్‌ నగరానికి బయలుదేరిన 'లయన్‌ ఎయిర్‌' విమానం గల్లంతైంది. ఉదయం 7.20కి పంగ్‌కల్ చేరుకోవాల్సిన విమానం బయలుదేరిన రెండు నిమిషాలకే గల్లంతైంది. ఇండోనేసియాకు చెందిన 'లయన్‌ ఎయిర్‌' విమానం టేక్ ఆఫ్ అయిన 2 నిమిషాల్లో జావా సముద్రంలో కూలిపోయింది. ప్రమాద విషయం తెలియగానే అధికారులు హుటాహుటిన సహాయ బృందాలను రంగంలోకి దించారు. ప్రయాణికుల్లో ఎవరైనా సజీవంగా బయటపడ్డారేమోనని గాలింపులు చేశారు. ఎక్కడా వారి జాడ కనపడలేదు. సమయం గడిచేకొద్దీ ఆశలు సన్నగిల్లాయి. ఈలోగా కొన్ని మృతదేహాలు, అవయవాలను సహాయ బృందాలు గుర్తించాయి. విమానానికి సంబంధించిన ప్రధాన శకలాన్ని ఇంకా కనుగొనాల్సి ఉందని సహాయ చర్యల విభాగం ఉన్నతాధికారి తెలిపారు.

విమానం కూలిన ప్రాంతంలో వాతావరణం సాధారణంగానే ఉంది. విమానంలోని కాక్‌పిట్‌ వాయిస్‌ రికార్డర్‌ 'బ్లాక్‌ బాక్స్‌' దొరికితేనే ప్రమాదానికి కారణం తెలుస్తుందని అధికారులు అంటున్నారు. ''ఈ విమానం చాలా ఆధునికమైంది.. అది ఎప్పటికప్పుడు డేటాను బట్వాడా చేస్తుంది. దాన్ని కూడా సమీక్షిస్తాం'' అని అధికారులు తెలిపారు. అయితే సముద్రంలో శకలాలను గుర్తించి, బ్లాక్‌ బాక్స్‌ను వెలికి తీయడం సవాల్‌తో కూడుకున్నదంటున్నారు. 

14:32 - October 29, 2018

ఢిల్లీ: ఇండోనేషియాలోని జకార్తాలో సోమవారం ఉదయం జరిగిన ఘోర విమాన ప్రమాదంలో, విమానం నడిపిన పైలట్ ఢిల్లీకి చెందిన భవ్య సునేజా అనే 31 ఏళ్ల వ్యక్తి. లయన్ఎయిర్ వేస్ లో మార్చి 2011 నుంచి పనిచేస్తున్న సునేజా కేరీర్ లో ఎటువంటి రిమార్క్స్ లేవని లయన్ ఎయిర్ అధికారులుతెలిపారు. గత జులైలో ఢిల్లీకి బదిలీ చేయమని అడిగాడని, ఏడాది తర్వాత పోస్టింగ్ ఇస్తామని చెప్పినట్లు లయన్ ఎయిర్ వేస్ అధికారులు తెలిపారు.  సునేజా ఢిల్లీలో విద్యాభ్యాసం పూర్తి చేసారు. అతని కుటుంబ సభ్యులు ఢిల్లీలోని మయూర్ విహార్ ప్రాంతంలో నివసిస్తున్నారు. సునేజా అనుభవంరీత్యా తనసర్వీసులో ఎక్కువగా బోయింగ్737 విమానాలనే నడిపారు. ప్రమాదానికి సరిగ్గా కొద్ది క్షణాల ముందు విమానం వెనక్కి తిరిగి వచ్చేందుకు అనుమతి అడిగినట్లు  తెలుస్తోంది. ఆతర్వాత కొద్దిసేపటికే రాడార్‌తో సంబంధాలు తెగిపోవడం.... 188 మంది ప్రయాణికులు గల్లంతవ్వడం జరిగిపోయింది. లయన్ ఎయిర్‌కి చెందిన జేటీ610 విమానం రాజధాని జకర్తా నుంచి స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 6:20కు బయల్దేరింది. అనంతరం 13 నిమిషాలకు అంటే సరిగ్గా 6:33కి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌తో సంబంధాలు తెగిపోయాయి.విమానంలో  మొత్తం 178 ప్రయాణికులు, ఓ చిన్నారి, ఇద్దరు పసికందులు, ఇద్దరు పైలట్లు, ఐదుగురు సిబ్బంది ఉన్నట్టు ఇండోనేషియా పౌర విమానాయాన శాఖ డైరెక్టర్ జనరల్ సిందు రహయు ప్రకటించారు. 

09:08 - October 29, 2018

జకర్తా: ఇండోనేషియాలో సోమవారం ఉదయం ఘోర విమాన ప్రమాదం జరిగింది. జకార్తా నుంచి పంగకల్ పినాంగ్‌కు బయలు దేరిన లయన్ లయన్ ఎయిర్‌కు చెందిన బోయింగ్ 737 మాక్స్ 8 మోడల్‌ విమానం జేటీ 610  విమానం టేకాఫ్ అయిన 13 నిమిషాలకే  కనిపించకుండా పోయింది. ఉదయం గం.6-33 నిమిషాలకు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ తో సంబంధాలు తెగిపోయినట్లు అధికారులు చెపుతున్నారు. విమానంలో 188 మంది ప్రయాణికులున్నారని,  విమానం కోసం గాలింపు, రక్షణ  చర్యలు  చేపట్టినట్లు అధికారులు తెలిపారు. 

 

10:27 - October 2, 2018

ఇండోనేషియా : అందమైన ప్రకృతితో అలరారే సుంబాదీవి అతలాకుతలంగా మారిపోయింది. పచ్చని చెట్లు, అందమైన జలపాతాలతో ఆకట్టుకునే సుంబాదీని ప్రకృతి విలయానికి అల్లాడిపోయింది. ఈ తెల్లవారుజామున 5.9 తీవ్రతతో భూకంపం రాగా, వందలాది భవనాలు నేలమట్టం అయ్యాయి. నాలుగు రోజుల నాడు సంభవించిన భూకంపం, ఆపై వచ్చి సునామీ నుంచి ఇండోనేషియా పూర్తిగా తేరుకోకముందే మరో భూకంపం ఆ దేశాన్ని అతలాకుతలం చేసింది. సులవేసి దీవి ఇప్పటికే నామరూపాలు లేకుండా పోగా, తాజాగా వచ్చిన భూకంపం సుంబాదీవిని అల్లాడించింది. 
సుంబాదీవిలో ఇప్పటివరకూ 32 మంది మరణించినట్టు వార్తలు అందుతుండగా, మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంటున్నారు. పలు ప్రాంతాల్లో రోడ్లు రెండుగా చీలిపోయాయని, భవంతుల కింద వందలాది మంది చిక్కుకుపోయి ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. సహాయక చర్యల నిమిత్తం సిబ్బందిని సుంబాదీవికి పంపుతున్నామని తెలిపారు.

08:34 - October 1, 2018

ఇండోనేషియా :  సునామీ ఇండోనేసియాని అతలాకుతలం చేసేసింది. వెయ్యికి పైబడే ప్రాణాలను హరించేసింది. పాలూ నగరాన్ని శవాలదిబ్బగా మార్చేసింది. సముద్ర తీరాన ఉన్న పాపానికి ఈ నగరం.. సునామీ ధాటికి తన స్వరూపాన్నే కోల్పోయింది. ఇక్కడ నివసిస్తున్న వారిని సముద్రపు అలలు.. సుమారు 20 కిలోమీటర్ల వరకూ లాక్కు వెళ్లాయంటే.. పరిస్థితి తీవ్రత ఏమేరకు ఉందో అర్థమవుతోంది. ఇప్పటి వరకూ అధికారికంగా.. 832 మృతదేహాలను గుర్తించారు. మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఊళ్లు మరుభూములను తలపిస్తున్నాయి.    .

సునామీ దెబ్బకు ఇండోనేసియాలో ప్రాణాలో కోల్పోయిన వారు పోగా.. ప్రాణాలతో మిగిలిన వారి పరిస్థితి మరింత దుర్భరంగా ఉంది. క్షతగాత్రులకు వైద్య సహాయం అందడం లేదు.. ఇక సునామీ కారణంగా సర్వం తుడిచిపెట్టుకు పోయిన ప్రజలు.. ఆహారం కోసం.. మంచినీటి కోసం అల్లాడుతున్నారు. మొన్నటిదాకా గౌరవంగా, దర్జాగా బతికిన ఇండోనేసియా వాసులు.. ఇప్పుడు ఆకలిదప్పులను తాళలేక లూటీలకు దిగుతున్నారు మరోవైపు సునామీ ప్రభావిత ప్రాంతాల్లో అంటువ్యాధులూ విజృంభిస్తున్నాయి. దీంతో జీవచ్ఛవాల్లా మిగిలిపోయారు. ఇక భూకంపం తాకిడికి కూలిన శిథిలాలు అలాగే ఉన్నాయి. వీటిని తొలగించే ప్రయత్నాలు నెమ్మదిగా సాగుతున్నాయి. సహాయ చర్యలకు భారీ యంత్రాలు కూడా లేకపోవడంతో ఎక్కడి శిథిలాలు అక్కడే ఉన్నాయి. శిథిలాల కింద మరింత మంది ఉండొచ్చన్న ఆందోళనా వ్యక్తమవుతోంది. ఇండోనేషియా ప్రభుత్వం సునామీని జాతీయ విపత్తుగా ప్రకటించింది. 

08:40 - September 30, 2018

ఇండోనేషియా : ప్రకృతి విపత్తులకు నిలయమైన ఇండోనేసియాను రాకాసి అలలు ముంచెత్తాయి. తీవ్రమైన భూకంపం, దాని పర్యవసానంగా వెంటనే సంభవించిన సునామీ పెను విషాదాన్ని నింపింది. సులవేసి దీవిలోని పాలూ నగరంలో  స్థానికులు బీచ్‌ ఫెస్టివల్‌ నిర్వహణలో తలమునకలయిన సమయంలో సునామీ ముంచెత్తింది. పాలూ నగరంలో భవనాలకు భవనాలే కొట్టుకుపోయాయి. కొన్నిచోట్ల 20 అడుగుల ఎత్తులో అలలు విరుచుకుపడ్డాయి. సునామీలో చిక్కుకొని దాదాపు 400 మంది ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.  మరో 540 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీధుల్లో ఎక్కడికక్కడ మృతదేహాలు కనిపిస్తున్నాయి. దీంతో అక్కడ విషాదం నెలకొంది.

దక్షిణ సులవేసి రాజధానిగా ఉన్న పాలూ నగరవాసుల జీవనం అస్తవ్యస్థమయింది. సముద్రం నీరు ప్రవేశిస్తుండడం, భవనాలు కూలిపోతుండడంతో దిక్కుతోచని ప్రజానీకం రోడ్లపై పరుగులు తీశారు. ప్రాణాలు రక్షించుకోవడానికి 20 అడుగుల పొడవు ఉన్న చెట్లను కూడా ఎక్కారు. వందలాది మంది ఆచూకీ తెలియక సన్నిహితులు ఆందోళన చెందుతున్నారు. క్షతగాత్రులతో ఆసుపత్రులు కిక్కిరిసిపోయాయి. కొంతమందికి ఆరుబయటే చికిత్స చేయాల్సి వస్తోంది. ఇళ్లలోకి వెళ్లడానికి భయపడుతూ చాలా మంది బయటే తలదాచుకుంటున్నారు. అధికారులు దాదాపు 17 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

ఓ వ్యక్తి బురదలో కూరుకుపోయిన ఓ పసిబిడ్డ శవాన్ని వెలికితీసిన సంఘటన అక్కడి వారిని కలచివేసింది. ఓ షాపింగ్‌ మాల్‌లోని ఒక అంతస్తు భూమిలో కుంగిపోయింది. పలు చోట్ల భూమి చీలడంతో ప్రయాణించడం కష్టంగా మారింది. నగరానికి తలమానికంలా ఉండే వంతెన కూలిపోయింది. విద్యుత్తు, కమ్యూనికేషన్‌ వ్యవస్థలు నిలిచిపోవడంతో సమస్యలు అధికమయ్యాయి. మలేషియా మీదుగా వెళ్లే ఇతర దేశాల ఉపగ్రహాల సహాయంతో చిత్రాలు తీయించి వాటి ఆధారంగా సహాయ చర్యలు చేపట్టనున్నట్టు విపత్తు విభాగం ప్రకటించింది.

సునామీకి ముందు సులవేసి దీవిలో సంభవించిన భూకంపం అక్కడ తీవ్రమైన నష్టాన్ని నింపింది. భూమికి 10 కిలోమీటర్ల లోపల 7.5 తీవ్రతతో భారీ భూకంపం వచ్చింది. అనంతరం పాలూ నగరంతో పాటు సమీప ప్రాంతాల్లో దాదాపు వందసార్లు భూమి కంపించింది. ఇలాంటి చిన్న ప్రకంపనల వల్ల కూడా నష్టం అధికంగా ఉంటుంది. చాలా ప్రాంతాల్లో ఇళ్లు నేలమట్టమయ్యాయి. భూకంపం, సునామీ కారణంగా నష్టపోయిన మలేషియాకు భారత్‌ తరఫున సహాయం అందిస్తామని విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ తెలిపారు. ఐరాస సమావేశాల్లో ప్రసంగిస్తూ ఆమె ఈ మేరకు ఓ  ప్రకటన చేశారు.

17:26 - September 28, 2018

జకార్త : మధ్య ఇండోనేషియాలో భారీ భూంకంపం సంభవించింది. శుక్రవారం ఓ ప్రాంతంలో సంభవించిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 7.7గా నమోదైంది. సులవేశి పట్టణంలోని ఓ ప్రాంతంలో భూంకంప తీవ్రత గుర్తించినట్లు, ఒకే రోజు రెండుసార్లు భూంకంప తీవ్రత వచ్చినట్లు యుఎస్ జియోలజికల్ సర్వే పేర్కొంది. ప్రస్తతం సంభవించిన ఈ భూంకంపం వల్ల ఎలాంటి ప్రమాదం జరిగిందనేది తెలియరావడం లేదు.శుక్రవారం ఉదయం సంభవించిన భూంకంప తీవ్రత రిక్టర్ స్కేల్ 6.1గా నమోదైందని, ఒకరు చనిపోగా మరో పది మందికి గాయాలయ్యాయని తెలుస్తోంది. డజన్ల సంఖ్యలో భవనాలు కుప్పకూలిపోయాయని సమాచారం. జులై, ఆగస్టు నెలలో భూంకంపాలు సంభవించడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

 

18:00 - May 30, 2018

ఇండోనేషియా : భారత్‌-ఇండోనేషియా దేశాల మధ్య 15 అంశాలపై ఒప్పందం కుదిరింది. రక్షణ, సైన్స్‌, టెక్నాలజీ రంగాల్లో పరస్పర సహకారం, తదితర అంశాలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విదోదోను కలుసుకున్న మోది- సముద్రమార్గం, టూరిజం, పెట్టుబడులు తదితర ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపారి. అనంతరం ఇరుదేశాల నేతలు సంయుక్త మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఇండోనేషియాలో ఉగ్రదాడిని ఖండించిన మోది- ఉగ్రవాదంపై పోరుకు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న ప్రయత్నాలను మరింత వేగవంతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వ్యాపారాన్ని 2025 నాటికి ద్విగుణీకృతం చేయనున్నట్లు మోది పేర్కొన్నారు అంతకుముందు ఐదు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ఇండోనేషియా చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదికి మరడెకా ప్యాలెస్‌లో ఘనస్వాగతం లభించింది. ఇండోనేషియాలో స్వతంత్ర పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరులకు మోది శ్రద్ధాంజలి ఘటించారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - indonesia