IT attacks

09:27 - April 7, 2017

చెన్నై : తమిళనాడు రాష్ట్రంలో ఐటీ దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. నాలుగు రోజుల్లో ఆర్కే నగర్ ఉప ఎన్నిక ఉండగా ఈ దాడులు కొనసాగించడం రాజకీయ వర్గాల్లో ప్రకంపనాలు సృష్టిస్తోంది. శుక్రవారం తెల్లవారుజామున ఏకంగా మంత్రి విజయ్ భాస్కర్ నివాసంపై ఐటీ అధికారులు దాడులు చేశారు. మంత్రి ఇళ్లు..కార్యాలయాలపై సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో భారీగా నగదు..వివిధ పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఆర్కే నగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో విజయ్ భాస్కర్ భారీగా డబ్బులు ఖర్చు చేస్తున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపించాయి. పుదుకొట్టాయ్ తో సహా 30 ప్రాంతాల్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. కొట్టివొక్కమ్ లో నటుడు శరత్ కుమార్ ఇంట్లో కూడా ఐటీ సోదాలు జరపడం గమనార్హం. పలువురు పారిశ్రామిక వేత్తల నివాసాలపై దాడులు కొనసాగుతున్నాయి. ఈ దాడులకు సంబంధించిన పూర్తి వివరాలు ఐటీ శాఖ మధ్యాహ్నం వెల్లడించే అవకాశం ఉంది.

20:11 - February 17, 2017

నెల్లూరు : 20 ఏళ్లుగా ఒకే జిల్లాలో పాతుకుపోయారు...వివిధ హోదాల్లో పనిచేశారు...పదోన్నతులు వచ్చినకొద్దీ అధికారం పెరిగింది..అందులో ధనదాహం కూడా...సింహపురిలో ఉన్నతాధికారిగా ఉంటూ కోట్లాది రూపాయల ఆస్తులు కూడబెట్టిన రాంరెడ్డి అక్రమ సంపాదన బయపడింది...ఏసీబీ తవ్వినకొద్దీ బయటపడుతున్న వాటిని చూసి కళ్లు బైర్లు కమ్మాల్సిందే.. అధికారాన్ని అడ్డుపెట్టుకున్నాడు..తనకున్న పరిచయాలను క్యాష్ చేసుకున్నాడు...ఎక్కడ పనిచేసినా అక్కడ దొరికింది దోచేశాడు...ఒకటి కాదు..రెండు కాదు కోట్లాది రూపాయల ఆస్తులు కూడబెట్టాడు ఆఫీసర్....అధికారి అవినీతిపై నజర్ పెట్టిన ఏసీబీ ఒక్కసారిగా దాడులు నిర్వహించింది..అయితే ఏసీబీ ఊహించినదాని కంటే ఎక్కువనే ఆస్తులు బయటపడ్డంతో షాక్‌ తినడం ఆఫీసర్ల వంతు అయింది...ఆ ఆఫీసర్ ఎవరో కాదు..సింహపురిలో జిల్లా పరిషత్‌ సీఇఓ, నగరపాలక సంస్థ ఇన్‌చార్జిగా ఉన్న రామిరెడ్డి...
హైదరాబాద్‌లోనూ భారీగా ఆస్తులు...
నెల్లూరు జిల్లాలో సుదీర్ఘం కాలం పని చేస్తున్న జిల్లా పరిషత్‌ సీఈవో, నగర పాలక సంస్థ ఇన్‌చార్జి కమిషనర్‌ బి.రామిరెడ్డి నివాసాల పై ఏసీబీ దాడులు నిర్వహించింది...నాలుగు ప్రాంతాలలో ఏక కాలంలో 14 చోట్ల రామిరెడ్డి ఆస్తుల పై ఏసీబీ తనిఖీలు నిర్వహిస్తోంది. ఉదయం 6 గంటల నుంచి రామిరెడ్డి ఆయన బంధువులు, కుటుంబ సభ్యులు, కొందరు అనుచరులు, మరికొందరు బినామీల ఇళ్లల్లో హైదరాబాద్‌, గుంటూరు, నెల్లూరు, తిరుపతి పట్టణాలలోని 14 చోట్ల ఈ దాడులు చేపట్టారు.
పదోన్నతులతో పాటే పెరిగిన ఆదాయం..
నెల్లూరు జిల్లాలో తాహసీల్దారు నుంచి ఆర్డీవో, డీఆర్వో, జడ్పీ సీఈవో వరకు 20 ఏళ్లకు పైగా రామిరెడ్డి వివిధ హోదాలలో పని చేశారు...ప్రస్తుతం ఉన్నతాధికారిగా పనిచేస్తున్న రామిరెడ్డిపై వచ్చిన ఆరోపణలతో ఏసీబీ రంగంలోకి దిగింది...నగరంలోని చిల్డడ్రన్స్‌ పార్కు, బి.వి.నగర్‌, మాగుంట లేఅవుట్‌, సరస్వతీ నగర్‌ ప్రాంతాలలో సోదాలు నిర్వహించింది. ఆయనతో పాటు ఒకరిద్దరు ఉపాధ్యాయులు, అదే శాఖలో పనిచేసే మరో దిగువ స్థాయి ఉద్యోగి ఇళ్లలో సోదాలు నిర్వహించిన ఏసీబీ భారీగా అక్రమాస్తులున్నట్లు గుర్తించింది. 
ఇప్పటికే బయటపడ్డ మూడు కోట్ల ఆస్తులు..
నెల్లూరు, గుంటూరు, తిరుపతి పట్టణాలలో రామిరెడ్డి, ఆయన అనుయాయుల పేరుతో ప్లాట్లు, స్థలాలు, బహుళ అంతస్తుల భవనాలు ఉన్నట్లు గుర్తించింది. నెల్లూరు నగరంలోని చిల్డ్రన్స్‌ పార్కు వద్ద రామిరెడ్డి ఉన్న డూప్లేక్స్‌ ఇళ్లు అందులో పలు కీలక రికార్డులు ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు...రామిరెడ్డి నివాసాల పై చేసిన తనిఖీలలో ఇప్పటి వరకు రెండున్నర కోట్లకు పైగా అక్రమాస్తులు ఉన్నట్లు గుర్తించామని బహిరంగ మార్కెట్‌లో దీని విలువ పదిరెట్లు వుంటుందని అధికారులు చెబుతున్నారు..బ్యాంకు లాకర్లను ఓపెన్‌ చేయాల్సి వుంది. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన రామిరెడ్డి లాంటి అధికారులు ఎందరో తమ అధికారాన్ని అడ్డుపెట్టుకున్నవారే..వారికి కొందరు రాజకీయుల సహకారం ఉండడంతో తిలాపాపం తలాపిడికెడు అన్నట్లు దోచేశారు...
హైదరాబాద్‌లో కూడా ఆస్తులు 
నెల్లూరు జడ్పీ సీఇఓ రాంరెడ్డి ఆస్తులు హైదరాబాద్‌లో కూడా ఉన్నాయి...వీటిని గుర్తించిన ఏసీబీ అధికారులు తెలంగాణా ఏసీబీకి సమాచారం అందించారు..వెంటనే హైదరాబాద్‌ టీం కూకట్‌పల్లిలో సోదాలు చేసింది.. ఈ దాడుల్లో నెల్లూరు,కావలి ప్రాంతాల్లోని ఇళ్ల స్థలాల డాక్యుమెంట్లు దొరికాయి...
హైదరాబాద్‌ లోనూ దాడులు 
నెల్లూరు జిల్లా పరిషత్‌ సీఇఓ రాంరెడ్డి అక్రమాస్తులపై హైదరాబాద్‌ నగరంలోనూ దాడులు జరిగాయి...ఈ తనిఖీల్లో ఎన్నో ఆస్తులు బయటపడ్డాయి.. ఇంకా కొన్ని డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు..దాదాపు 5 గంటలపాటు కొనసాగిన దాడుల్లో రాంరెడ్డి ఆస్తులను బయటకు తీశారు...
కూకట్‌పల్లిలో దాడులు..
ఏసీబీ దాడులు 
కూకట్‌పల్లిలోని ఆఫీసర్ రాంరెడ్డికి చెందిన ఇంట్లో ఏసీబీ ఇన్‌స్పెక్టర్ ఖాదర్‌బాషా బృందం దాడులు చేసింది... ఆ ఇంట్లో సోదాలు చేయగా నెల్లూరు, కావలి ప్రాంతాల్లోని ఇంటి స్థలాల డాక్యుమెంట్లు దొరికాయి..దాదాపు ఐదు స్థలాల విలువ మార్కెట్లో లక్షల్లోనే ఉంటుందని అంచనా... ఇంకా ఎక్కడైనా ఆస్తులున్నాయా..? బ్యాంకు లాకర్లున్నాయన్నదానిపై ఏసీబీ శోధిస్తుంది.

 

11:53 - February 17, 2017

నెల్లూరు : జిల్లా పరిషత్‌ సీఈవో బొబ్బా రామిరెడ్డి ఇంటిపై ఏసీబీ అధికారులు మెరుపుదాడులు చేశారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయని ఆరోపణలతో ఏసీబీ అధికారులు హైదరాబాద్‌, తిరుపతి, ఒంగోలు, నెల్లూరులో ఏకకాలంలో దాడులు చేశారు. నెల్లూరు సహా మొత్తం 15 చోట్ల రామిరెడ్డి బంధువుల ఇళ్లలో ఏకకాలంలో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఈ తనిఖీల్లో ఇప్పటివరకు 3 కోట్ల రూపాయల అక్రమాస్తులు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇంకా ఏసీబీ తనిఖీలు కొనసాగుతున్నాయి. కావలిలో రామిరెడ్డి మిత్రుడు మండవ జయరామయ్య ఇంట్లోనూ ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.

18:50 - December 15, 2016

చిత్తూరు : జిల్లా పెద్దపంజాని జడ్పీటీసీ సులోచన ఇంట్లో ఐటీ అధికారులు తనిఖీలు జరుపుతున్నారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత భారీగా ఆర్థిక లావాదేవీలు జరిగాయన్న ఆరోపణలపై సోదాలు నిర్వహిస్తున్నారు. పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. కాగా పాత పెద్దనోట్ల ను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అతిపెద్ద సంచలనాత్మక నిర్ణయం అనంతరం కొత్త కరెన్సీ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో భారీగా ఆర్థిక లావాదేవీలపై పలువురు అక్రమ లావాదేవీలకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే జిల్లా పెద్దపంజాని జడ్పీటీసీ సులోచన ఇంట్లో ఐటీ అధికారులు తనిఖీలు జరుపుతున్నారు. 

17:27 - December 14, 2016

ఢిల్లీ : ఐటీ అధికారులదాడుల్లో దేశ వ్యాప్తంగా భారీగా డబ్బు పట్టుబడుతోంది.. తాజాగా ఢిల్లీ కరోల్‌బాగ్‌ హోటల్‌లో 3కోట్ల 25లక్షల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.. ఛండీగఢ్‌లో 2కోట్ల 18 లక్షల కొత్తనోట్లు... పనాజీలో 68 లక్షలు... కలంగుట్‌లో 24 లక్షల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.. ముగ్గురిని అరెస్ట్‌కూడా చేశారు.. అలాగే బెంగళూరులో 2కోట్ల 25 లక్షల కొత్తనోట్లు... జైపూర్‌లో 16లక్షల 94వేల నగదును పట్టుకున్నారు.. ఈ కేసులో ఐదుగురిని అరెస్ట్‌ చేశారు.. రాయ్‌గఢ్‌లోకూడా 13 లక్షల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.. ఇద్దరిని అరెస్ట్‌ చేశారు.. పుణేలో 15లక్షల నగదును సీజ్‌ చేశారు.. ఐదుగురిని అరెస్ట్‌ చేశారు..

08:23 - November 12, 2016

ఢిల్లీ : నల్ల కుబేరులపై సర్జికల్ దాడులు జరుపుతూ 500, వెయ్యినోట్లను రద్దు చేసిన కేంద్రం..నల్లధనం నిరోధకానికి మరిన్ని కఠిన చర్యలు చేపడుతోంది. దేశవ్యాప్తంగా బంగారం అమ్మకాలు, కొనుగోళ్లపై కేంద్రం నిఘాపెట్టింది. జ్యూయలరీ షాపులపై ఎక్సైజ్‌శాఖ ఒక్కసారిగా మెరుపు దాడులు చేసి బ్లాక్‌మనీకి అడ్డుకట్టవేసే ప్రయత్నం చేశౄరు. ఇదిలా ఉండగా మరోవైపు చిల్లరకు సంబంధించి ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతుండటంతో... ఆసుపత్రులు, పెట్రోల్ పంపులు, రైల్వే కౌంటర్లు, విమానాశ్రయాల్లో పాత 500, వెయ్యినోట్లు మరో మూడు రోజుల పాటు పనిచేస్తాయని కేంద్రం ప్రకటించింది. ఈ నెల 14 అర్థరాత్రి వరకూ ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది.

నోట్లు మార్చుకునే తేదీని ఈనెల 14 వరకూ పొడిగింపు
కేంద్ర నిర్ణయంతో సతమతమవుతున్న సామాన్యులను ఆదుకునేందుకు..మోదీ సర్కారు నోట్లు మార్చుకునే తేదీని ఈనెల 14 వరకూ పొడిగిస్తూనే..మరోవైపు నల్లధనం నిరోధానికి మరిన్ని కఠిన చర్యలకు పూనుకుంది. తాజాగా బంగారం వ్యాపారుల నుంచి అమ్మకాల వివరాలను కేంద్రం కోరింది. దేశవ్యాప్తంగా 25 నగరాల్లోని 600 దుకాణాల నుంచి అమ్మకాలు, కొనుగోళ్ల వివరాలు కావాలని ఆదేశించింది.

హైదరాబాద్‌లో జ్యూవెల్లరీ షాపులపై సెంట్రల్‌ ఎక్సైజ్‌ శాఖ అధికారుల దాడులు
హైదరాబాద్‌లో జ్యూవెల్లరీ షాపులపై సెంట్రల్‌ ఎక్సైజ్‌ శాఖ అధికారులు దాడులు చేశారు. నిబంధనలను అతిక్రమించిన 15 జ్యువెల్లరీ షాపులకు నోటీసులు అందజేశారు. అమ్మకాలకు సంబంధించిన పూర్తి వివరాలను 24 గంటల్లోగా ఇవ్వకపోతే చర్యలు తప్పవని హెచ్చరిక జారీచేశారు.

25 నగరాల్లో 600 బంగారం షాపుల సేల్స్ పరిశీలిస్తున్న కస్టమ్స్‌, ఎక్సైజ్‌
రెండున్నర లక్షలకు పైగా జరిగిన లావాదేవీల వివరాలపై బ్యాంకులకు ఆదేశాలు.మరోవైపు దేశవ్యాప్తంగా 67 ఫారెక్స్ డీలర్ల లావాదేవిలపై ఈడీ దాడులు జరిగాయి. 25 నగరాల్లో 600 బంగారం షాపుల సేల్స్ లావాదేవిలను కస్టమ్స్‌, ఎక్సైజ్‌ అధికారులు పరిశీలిస్తున్నారు. రెండున్నర లక్షలకు పైగా జరిగిన లావాదేవీల వివరాలను తెలపాలని అన్ని బ్యాంకులకు ఐటీశాఖ ఆదేశాలు జారీచేసింది.

సాధ్యమైనంతగా నగదును అందుబాటులో ఉంచేలా యత్నాలు
పెద్ద నోట్ల నిషేధంతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు రెండు వారాల్లో సమసి పోతాయని నగదు నిల్వల సేవల సంస్థలు భరోసా ఇచ్చాయి. సాధ్యమైనంత తక్కువ సమయంలో నగదును అందుబాటులో ఉంచేలా శ్రమిస్తున్నామని తెలిపాయి. మరోవైపు ఆసుపత్రులు, పెట్రోల్ పంపులు, రైల్వే కౌంటర్లు, విమానాశ్రయాల్లో పాత 500, వెయ్యినోట్లు చెలామణిని మరో మూడు రోజుల పాటు అంటే ఈనెల 14 అర్థరాత్రి వరకు పొడిగించినట్లు కేంద్రం తెలిపింది. 

Don't Miss

Subscribe to RSS - IT attacks