it raids

21:07 - February 10, 2018

చెన్నై : తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు దీపా జయకుమార్‌ నివాసంలో నకిలీ ఐటి అధికారి కలకలం సృష్టించాడు. ఉదయం టినగర్‌లోని దీప నివాసానికి వచ్చిన ఓ వ్యక్తి తాను ఆదాయపు పన్నుశాఖ అధికారినని...సోదాలు చేయాలని బెదిరించాడు. దీపా ఆయనకు సంబంధించి ఐడి వివరాలు అడిగారు. ఇంతలోనే పోలీసులు అక్కడికి చేరుకోవడంతో నకిలీ అధికారి అక్కడి నుంచి ఉడాయించాడు. దీప అతని ఐడి కార్డు ఫొటో తీయగా...దానిపై మితేష్‌ కుమార్‌ అని ఉంది. పోలీసులు అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

21:32 - January 17, 2018

హైదరాబాద్ : టాలీవుడ్‌పై ఐటీ అధికారులు విరుచుకుపడ్డారు. తెలుగు నిర్మాతల కార్యాలయాలపై మెరుపు దాడులు నిర్వహించారు. ఆదాయ పన్నులు కట్టడంలో తేడాలు చూపిస్తున్నారనే అనుమానాలు రావడంతో... ఐటీ అధికారులు తనీఖీలు చేపట్టారు. భవ్య క్రియేషన్స్, సురేష్ ప్రొడక్షన్స్, హారీక హాసిని, డీవీవీ క్రియేషన్స్, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్, సీకే ఎంటర్టైన్మెంట్ లకు చెందిన నిర్మాతల కార్యాలయాలపై దాడులు చేశారు.

ఈ దాడుల్లో కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఒకేసారి ఎనిమిది మంది నిర్మాతల కార్యాలయాలపై దాడులు చేయడంతో టాలివుడ్ చిత్ర పరిశ్రమ ఉలిక్కిపడింది. 

సి.కల్యాణ్ కార్యాలయంలో
ఇటీవల రిలీజ్ అయిన నందమూరి బాలకృష్ణ చిత్రం జై సింహాను నిర్మించిన సి.కల్యాణ్ కార్యాలయంలో కూడా తనిఖీలు జరిగాయి. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా మంచి వసూళ్లను రాబడుతుండటంతో ఆ చిత్ర నిర్మాత సి.కళ్యాణ్‌పై ఐటీ శాఖ దృష్టి సారించిందని సమాచారం. ఆయన నివాసంలో కూడా సోదాలు జరిపినట్లు తెలుస్తోంది. అలాగే ఇటీవల విడుదలైన పవన్ అజ్ఞాత వాసి నిర్మాణ రాధాకృష్ణకు చెందిన హారికా, హానిని కార్యాలయంలో కూడా తనిఖీలు జరిగాయి. గత మూడేళ్లుగా వీరి టీడీఎస్‌లో తేడాలు రావడంతోనే ఈ సోదాలు జరిగాయని తెలుస్తోంది. గత మూడు నాలుగు నెలలుగా నోటీసులు ఇచ్చిన స్పందించకపోవడంతోనే ఈ ఆకస్మిక తనీఖీలు చేశారు.

దాడుల్లో కీలక డాక్యుమెంట్లు స్వాధీనం
మరోవైపు తమ కార్యాలయంలో ఐటీ సోదాలపై సినీ నిర్మాత సి. కళ్యాణ్‌ స్పందించారు. ప్రస్తుతం తాను హైదరాబాద్‌లో లేనని చెప్పారు. తన కార్యాలయంలో ఐటీ సోదాలు నిర్వహించిన మాట వాస్తమేనని వెల్లడించారు. కొత్త సినిమా విడుదలైన ప్రతీసారి ఐటీ అధికారులు వస్తారని వ్యాఖ్యానించారు. అయితే సోదాలకు సంబందించిన పూర్తి వివరాలు మాత్రం ఐటి అధికారులు చాలా గోప్యంగా ఉంచుతున్నారు. దాడుల్లో కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్న అధికారులు.. వాటిని విశ్లేషిస్తున్నారు. మొత్తానికి ఈ వ్యవహారంపై గురువారం వరకు ఒక క్లారిటీ వస్తుందని సమాచారం. 

17:06 - January 17, 2018
15:23 - January 17, 2018

హైదరాబాద్ : టాలీవుడ్ కు సంబంధించి 8 మంది బడా నిర్మాతల ఇళ్లు, ఆఫీసుల్లో ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులు సోదాలు నిర్వాహిస్తున్నారు. గత మూడేళ్లుగా పన్ను కట్టని కొంత మంది నిర్మాతలకు ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. భవ్య క్రియేషన్స్, సురేష్ ప్రొడక్షన్స్, హారిక హాసిని, డీవీవీ క్రియేషన్స్, డీవీవీ దానయ్య, నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్, సీకే ఎంటర్ టైన్ మెంట్ పై ఐటీ దాడులు చేస్తోంది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

11:42 - November 22, 2017

రంగారెడ్డి : జిల్లాలోని ఇబ్రహీంపట్నం గురునానక్ ఇంజనీరింగ్ కాలేజ్‌లో ఐటీ అధికారులు దాడులు చేశారు. దాదాపు 8 కోట్ల రూపాయల ఆస్తులు సీజ్‌ చేశారు. కాలేజ్‌ యాజమాన్యం మీడియాను లోపలికి అనుమతించలేదు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

10:29 - November 9, 2017

చెన్నై: దినకరన్‌, శిశికళ వర్గానికి షాక్ తగిలింది. శశికళ, దినకరన్‌ ఇళ్లల్లో ఐటీ శాఖ దాడులు నిర్వహించింది. జయ టీవీ, నమదు ఎంజీఆర్‌, మక్కల్‌ కురల్‌ కార్యాలయాలయాల్లో ఐటీ తనిఖీలు చేస్తోంది. బెంగళూరులోని శశికళ సన్నిహితుడు,అన్నాడీఎంకే కార్యదర్శి పుగళేంది నివాసంలోనూ అధికారులు తనిఖీలు చేశారు. ఐస్‌ సినిమాస్‌ వివేక్ నివాసంలో దాడులు నిర్వహించారు.  190 చోట్ల దాడులు ఏకకాలంలో దాడులు చేస్తున్నారు.

08:34 - November 9, 2017

చెన్నై : తమిళనాడు రాష్ట్రంలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని జయ కుటుంబీకులు నిర్వహిస్తున్న జయ టివి, జార్జ్ సినిమా హాల్..నమ్మదు పత్రికా కార్యాలయంపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. మొత్తంగా 160 చోట్ల ఐటీ సోదాలు పెద్ద ఎత్తున్న తనిఖీలు నిర్వహిస్తుండడం చర్చనీయాంశమైంది. పన్ను ఎగవేత ఆరోపణలపై ఈ తనిఖీలు నిర్వహించినట్లు తెలుస్తోంది.

ఇటీవలే జయ మృతి అనంతరం రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం తలెత్తిన సంగతి తెలిసిందే. పలు నాటకీయ పరిణామాలతో సీఎంగా పళనీ స్వామి ప్రమాణ స్వీకారం చేశారు. డిప్యూటి సీఎంగా పన్నీర్ సెల్వం ప్రమాణం చేశారు. తాజాగా సినీ నటుడు కమల్ హాసన్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటన చేయడంతో రాజకీయాలు రసకందాయంలో పడిపోయాయి. ఇదిలా ఉంటే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ డీఎంకే చీఫ్ కరుణా నిధిని పరామర్శించడం రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. ప్రస్తుతం జరుగుతున్న ఐటీ దాడులతో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి. 

15:36 - September 21, 2017

బెంగళూరు : కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్.ఎం.కృష్ణ అల్లుడు...కాఫీ డే కంపెనీ యజమాని వీజీ సిద్ధార్థ ఇళ్లపై ఐటి దాడులు నిర్వహించింది. బెంగళూరు విఠల్‌ మాల్యా రోడ్డులోని కేఫ్‌ చైన్‌ కేఫ్‌ కాఫీ డే ప్రధాన కార్యాలయంలో కూడా ఐటి సోదాలు చేస్తోంది. బెంగళూరుతో పాటు ముంబై, చెన్నై, చిక్‌మంగళూరులోని సిద్ధార్థకు సంబంధించిన 20 చోట్ల ఏకకాలంలో ఐటి తనిఖీలు చేపట్టింది. చెన్నైలో కృష్ణ కుటుంబానికి సంబంధించిన కంపెనీ సికల్‌ లాజిస్టిక్ ప్రయివేట్‌ లిమిటెడ్‌లో కూడా సోదాలు నిర్వహించింది. 46 ఏళ్ల పాటు కాంగ్రెస్‌లో కొనసాగిన ఎస్‌ఎమ్‌ కృష్ణ ఇటీవలే బిజెపిలో చేరారు. ఆయన గతంలో కర్ణాటక ముఖ్యమంత్రిగా, విదేశాంగ శాఖ మంత్రిగా, మహారాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు

20:40 - August 31, 2017

గుంటూరు : పట్టణంలోని ఆర్ అండ్‌ బీ సూపరిండెంట్ కారంపూడి రాఘవరావు ఇంటిపై ఏసీబీ దాడి చేసింది.... మచిలీపట్నం, మంగళగిరిలో పదకొండుచోట్ల పది బృందాలు సోదాలు జరుపుతున్నాయి.. ఏసీబీ డీఎస్పీ దేవానంద్‌ ఆధ్వర్యంలో ఈ సోదాలు జరుగుతున్నాయి.. రాఘవరావు కుటుంబసభ్యులు, బినామీల పేరుతో పొలాలు, ఇళ్ల స్థలాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.. అలాగే ముప్పై లక్షల రూపాయల విలువైన బంగారం, వజ్రాలను స్వాధీనం చేసుకున్నారు.. ఈ అక్రమాస్తుల విలువ 20 కోట్లు ఉంటుందని అధికారులు అంచనావేశారు.. 

 

18:31 - July 5, 2017

హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో ఏపీ సీఎం చంద్రబాబు ముమ్మాటికి ధోషి అని... జైల్లో ఊసలు లెక్కబెడతారని వైసీపీ నేత రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. తనకు బ్లాక్ మనీ, వైట్ మనీకి తేడా తెలుసని.... జయంతికి, వర్థంతికి తేడా ఎంటో నారా లోకేష్ తెలుసుకోవాలని హితవుపలికారు. 'ధైర్య ఉంటే నా ఆస్తులు, నీ ఆస్తులపై సీబీఐ విచారణ చేయండి' అని సవాల్ విసిరారు. న్యాయస్థానం తీర్పుకు కట్టుబడి ఉన్నానని తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

 

Pages

Don't Miss

Subscribe to RSS - it raids