jagga reddy

21:42 - December 6, 2018

హైదరాబాద్: ఎన్నికల వేళ ఎలక్షన్ కమిషన్ కొరడా ఝళిపించింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన నాయకులు, అభ్యర్థులపై కేసులు నమోదు చేసింది. కొడంగల్ కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి, టీడీపీ నేత జూపూడి ప్రభాకర్, శేరిలింగంపల్లి టీడీపీ అభ్యర్థి భవ్య ఆనంద్ ప్రసాద్, సంగారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి జగ్గారెడ్డి, మేడ్చల్ టీఆర్ఎస్ అభ్యర్థి మల్లారెడ్డి, కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణలపై సెక్షన్ 171(ఈ) కింద కేసులు నమోదు చేశారు. నామినేషన్ల ప్రక్రియ మొదలు ఇప్పటివరకు 7వేల 852 కేసులు నమోదు చేసినట్టు ఈసీ తెలిపింది. ఇక పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని ఈసీ పిలుపునిచ్చింది.

 

13:35 - May 30, 2018

సంగారెడ్డి : కాంగ్రెస్‌ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి దీక్ష మూడో రోజుకు చేరుకుంది. సంగారెడ్డిలో మొన్న జగ్గారెడ్డి దీక్షకు దిగారు. జిల్లా కేంద్రంలో మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

 

13:58 - May 29, 2018

సంగారెడ్డి : కాంగ్రెస్ మాజీ ఎమ్మేల్యే జగ్గారెడ్డి దీక్షకు దిగారు. మూడు రోజులపాటు దీక్ష చేయనున్నారు. మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేస్తేనే దీక్ష విరమిస్తానని చెప్పారు. గీతారెడ్డి మాట్లాడుతూ సంగారెడ్డిలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని ..అందుకు పోరాటం చేస్తామని తెలిపారు. 

16:57 - May 28, 2018

సంగారెడ్డి : సంగారెడ్డికి మెడికల్ కాలేజీ ఇవ్వడంలో తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత దామోదర రాజనర్సింహ్మా అన్నారు. జగ్గారెడ్డి దీక్షకు ఆయన సంఘీభావం తెలపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సిద్దిపేటలో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయడంలో అభ్యంతరం లేదన్నారు. కానీ సంగారెడ్డికి రావాల్సిన మెడికల్ కాలేజీని సిద్దిపేటకు తీసుకపోవడం బాధాకరమన్నారు. సంగారెడ్డిని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని విమర్శించారు. సంగారెడ్డికి మెడికల్ కాలేజీ ఇవ్వడంలో సీఎం కేసీఆర్ జాప్యం చేస్తున్నారని అన్నారు. సంగారెడ్డికి మెడికల్ కాలేజీ సాధిస్తామని చెప్పారు. తాము అధికారంలోకి వస్తే మొదటి ప్రయారిటీ సంగారెడ్డికి మెడికల్ కాలేజీ ఉంటుందన్నారు.

 

12:32 - May 28, 2018

సంగారెడ్డి : జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని జిల్లా మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన నిరహార దీక్షకు కూర్చొన్నారు. దీక్ష ప్రాంగణానికి భారీగా కార్యకర్తలు..తరలి వచ్చారు. మూడు రోజుల పాటు రిలే నిరహార దీక్ష చేయనున్నారు. గతంలో తాను మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని కోరడం జరిగిందని, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం వెంటనే ఈ విషయంలో స్పందించాలని పేర్కొన్నారు. మూడు రోజుల పాటు దీక్ష అనంతరం నాలుగో రోజు సంగారెడ్డి జిల్లా బంద్ కు పిలుపునిస్తామన్నారు. తమ ప్రభుత్వం వచ్చిన తరువాత మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తామని, భవిష్యత్ లో మంత్రులను నిలదీస్తామని హెచ్చరించారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

17:40 - January 19, 2018
14:37 - January 19, 2018

సంగారెడ్డి : నగరంలో కాంగ్రెస్ పార్టీ రైతు మహాధర్నా జరిగింది. రైతు మహాధర్నాకు రైతులు భారీగా తరలి వచ్చారు. కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ రైతు మహాధర్నా నిర్వహించారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

16:42 - December 26, 2017

హైదరాబాద్ : 2017లో కాంగ్రెస్‌ జోరు బాగానే పెరిగింది. నిన్న మొన్నటి వరకు వలసలతో ఉక్కిరి బిక్కిరి అయిన హస్తం పార్టీ... గులాబీ ఆపరేషన్‌ ఆకర్ష్‌కు దీటుగా దూకుడు పెంచింది. మరోవైపు సర్కార్‌పై ఏ మాత్రం స్పీడ్‌ తగ్గకుండా పోరు కొనసాగిస్తూ ప్రజల్లోకి వెళ్లింది. ఇక తెలంగాణ కాంగ్రెస్‌లోకి రేవంత్‌రెడ్డి రావడం... మరోవైపు పార్టీ దేశ అధ్యక్ష పగ్గాలు రాహుల్‌ అందుకోవడంతో.. ఇటు గల్లీ నుంచి ఢిల్లీ వరకు కార్యకర్తల్లో జోష్‌ కనిపిస్తోంది. 
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు త‌రువాత కాంగ్రెస్‌కు కష్టాలు 
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు త‌రువాత కాంగ్రెస్‌కు కష్టాలే ఎదురయ్యాయి. 2014 ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షానికే పరిమితమైన కాంగ్రెస్‌కు.. ఆ తరువాత వచ్చిన ఏ ఉప ఎన్నిక కూడా కలిసిరాలేదు. వాటికితోడు గులాబీ ఆపరేషన్‌ ఆకర్ష్‌తో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చాలామంది కారెక్కడంతో కాంగ్రెస్‌ను ఉక్కిరిబిక్కిరి చేసింది. మరోవైపు నేతల మధ్య అంతర్గత పోరుతో 2016 వరకు అనేక ఇబ్బందులు పడింది. ఆ తర్వాత 2017లో పక్కా ప్రణాళికలు అమలు చేసి.. గ్రాఫ్‌ పెంచుకుంది. డీలాపడ్డ నేతలు, కేడర్‌ను ఏకం చేస్తూ అధికార పార్టీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్సేనని చాటి చెప్పింది. 
అధికార పార్టీపై దూకుడు పెంచిన కాంగ్రెస్‌... 
అధికార పార్టీపై దూకుడు పెంచిన కాంగ్రెస్‌... అందివచ్చిన ప్రతి ప్రజాసమస్యను వాడుకుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను తమ ఎజెండాగా మార్చుకుని ముందుకెళ్లింది. ఇందులోభాగంగా ఈ ఏడాది జనవరిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై ఆందోళనలు చేపట్టింది. అన్ని కలెక్టరేట్ల ముందు ధర్నాలతో పాటు.. హైదరాబాద్‌లో చార్మినార్‌ నుండి గాంధీభవన్‌ వరకు భారీ ర్యాలీతో సమరశంఖం పూరించారు. హైదరాబాద్‌లో ఇందిరాపార్క్‌ దగ్గర ధర్నా చౌక్‌ ఎత్తివేయకుండా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టి ఇటు రాష్ట్రంలో గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లడంతో పాటు... రాష్ట్రపతి గడప తొక్కి జాతీయస్థాయిలో కేసీఆర్‌ వ్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టారు. 
ప్రజా సమస్యలను ఎత్తిచూపిన హస్తం పార్టీ 
ముఖ్యంగా నోట్ల రద్దుతో నిరసనలకు పరిమితం కాకుండా.. ఆ నిర్ణయంతో ప్రజలు ఎదుర్కొన్న సమస్యలను ఎత్తిచూపింది హస్తం పార్టీ. తెలంగాణవ్యాప్తంగా సభలు పెట్టి.. నోట్ల రద్దుతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఫోకస్‌ చేశారు కాంగ్రెస్‌ నేతలు. ఇక మార్చి నెలలో మరోసారి ధర్నా చౌక్‌ తొలగింపు అంశంపై.. నిరసన కార్యక్రమాలు చేపట్టి.. కేసీఆర్‌ది నిరంకుశ పాలనంటూ ఎండగట్టే ప్రయత్నం చేశారు. ధర్నాచౌక్‌పై టీడీపీ, బీజేపీ, వామపక్షాలు, జేఏసీలను అందరినీ ఏకం చేసింది కాంగ్రెస్‌. 
మిర్చి రైతుల ఇష్యూ కాంగ్రెస్‌కు రాజకీయంగా ప్లస్‌ 
ఇక ప్రధానంగా ఖమ్మం జిల్లాలో మిర్చి రైతుల ఇష్యూ కాంగ్రెస్‌కు రాజకీయంగా ప్లస్‌ అయింది. దీన్ని అవకాశంగా మలుచుకున్న ఆ పార్టీ నేతలు ఖమ్మంలో పర్యటించి బాధిత రైతులను పరామర్శించారు. మిర్చి రైతులకు పోలీసులు బేడీలు వేయడంపై సర్కార్‌పై విరుచుకుపడ్డారు. అలాగే వరంగల్‌ జిల్లా మిర్చి రైతుల కష్టాలపై పోరుబాట చేపట్టిన హస్తం నేతలు... మిర్చి యార్డుల్లో ఆందోళనలు చేపట్టారు. అలాగే గండ్ర వెంకటరమణారెడ్డి మౌనదీక్షలతో సర్కార్‌ ద్వంద్వ నీతిని ఎండగట్టడంలో సక్సెస్‌ సాధించారు. ఇక కేడర్‌లో జోష్‌ నింపేందుకు పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌.. సునీతాలక్ష్మారెడ్డితో కలిసి పాదయాత్ర చేశారు. మే నెలలో గల్ఫ్‌ బాధితుల సమస్యలపై దృష్టి సారించిన నేతలు... వారి సమస్యలపై కేసీఆర్‌ అనుసరిస్తున్న నిర్లక్ష్యంపై ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో సదస్సు నిర్వహించారు. 
జూన్‌లో మరింత దూసుకుపోయిన కాంగ్రెస్‌ 
ప్రభుత్వంపై ఆందోళనలు, విమర్శలతో ముందుకెళ్తున్న కాంగ్రెస్‌ పార్టీ.. జూన్‌లో మరింత దూసుకుపోయింది. సంగారెడ్డిలో నిర్వహించిన ప్రజాగర్జనకు రాహుల్‌గాంధీ హాజరయ్యారు. ఆ సభ పార్టీ ఊహించిన దానికంటే సక్సెస్‌ కావడంతో... పార్టీకి కొత్త ఉత్సాహం వచ్చింది. ఇక ఇదే నెలలో వెలుగుచూసిన మియాపూర్‌ భూకుంభకోణాన్ని ఆయుధంగా మలచుకుని టీఆర్‌ఎస్‌పై మరింత దూకుడు పెంచింది. ఈ స్కామ్‌పై ప్రభుత్వంపై పోరుకు అన్ని పార్టీలను ఏకం చేసింది హస్తం పార్టీ. ఇక స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు శిక్షణా తర్వగతులు నిర్వహించి.. ఓ భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 
ప్రజాసమస్యలపై కాంగ్రెస్‌ మరింత జోష్‌
జులై నెలలో ప్రజాసమస్యలపై కాంగ్రెస్‌ మరింత జోష్‌ పెంచింది. ప్రజాగర్జనలతో హోరెత్తించారు. దీనికితోడు సిరిసిల్ల జిల్లా నేరెళ్లలో దళితులపై పోలీసుల దాడి కాంగ్రెస్‌కు బాగా కలిసివచ్చింది. సిరిసిల్లలో ఇసుక మాఫియా పేరుతో గులాబీ సర్కార్‌ను ఇరుకున పెట్టిన హస్తం నాయకులు.. దళితులపై కేసీఆర్‌ సర్కార్‌ అణిచివేత ధోరణి అవలంబిస్తుందంటూ పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. ఇక కరీంనగర్‌ జిల్లాలో మెడికల్‌ కాలేజీ ఏర్పాటుపై మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ చేపట్టిన నిరాహారదీక్ష జిల్లాలో పార్టీకి బాగా కలిసివచ్చింది. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లలో విద్యార్థుల అవస్థలపై ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరు వెంకట్‌ చేపట్టిన పాదయాత్ర విద్యార్థుల్లో కదలిక తీసుకువచ్చింది. 
టీ.కాంగ్రెస్‌లో భారీ మార్పులు 
ఇక ఆగస్టు నెలలో తెలంగాణ కాంగ్రెస్‌లో భారీ మార్పులు జరిగాయి. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జీగా ఉన్న దిగ్విజయ్‌సింగ్‌ను తప్పించి.. ఆయన స్థానంలో రామచంద్ర కుంతియాకు అధిష్టానం బాధ్యతలు అప్పగించింది. ఆయనతో పాటు... మరోనేత సతీష్‌కు అదనపు బాధ్యతలు ఇచ్చారు. ఇక కుంతియా రాకతో.. రాష్ట్ర కాంగ్రెస్‌ మరింత దూకుడు పెంచింది. కుంతియా నియామకంపై పెదవి విరిచిన నేతలు సైతం... ఆయన చేపడుతున్న ఆపరేషన్‌ సక్సెస్‌పై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పార్టీలోకి వలసలపై కుంతియా తీసుకున్న యాక్షన్‌ ప్లాన్‌ పార్టీగా బాగా ప్లస్‌ అయ్యింది. 
నీటి విడుదలకు సీఎం సిద్దరామయ్యను ఒప్పించిన కాంగ్రెస్ నేతలు  
ఇక సెప్టెంబర్‌లో పాలమూరు జిల్లా సాగు, తాగునీటి అవసరాల కోసం ఉత్తమ్‌ నేతృత్వంలో జిల్లా నేతల బృందం కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యను కలిసి జిల్లాకు నీటి విడుదలకు ఒప్పించారు. ఇది పార్టీకి పెద్ద విజయంగా చెప్పుకోవచ్చు. ఓవైపు ప్రభుత్వాన్ని నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతూ.. తామే ఆ ఘనత సాధించినట్లు ఫోకస్‌ చేసుకున్నారు. ఇక పార్టీ చేపట్టిన ఇందిరమ్మ బాట కార్యక్రమం ద్వారా కేడర్‌లో ఉత్సాహం తీసుకువచ్చారు. అలాగే మెట్రోరైలు పనుల జాప్యంపై ప్రభుత్వం నిర్లక్షాన్ని నిరసిస్తూ హైదరాబాద్‌లో భారీ ఎత్తున ర్యాలీ చేపట్టారు. 
ఆపరేషన్‌ ఆకర్ష్‌కు తెరలేపిన కాంగ్రెస్‌   
ఇక కాంగ్రెస్‌ తెరలేపిన ఆపరేషన్‌ ఆకర్ష్‌కు అక్టోబర్‌ నెల వేదికైంది. వలసలతో ఉడికిపోయిన కాంగ్రెస్‌... టీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డిని పార్టీలో చేర్చుకుని రాష్ట్ర రాజకీయాల్లో ఆకర్ష్‌ సెగలు పెంచింది. అప్పటిదాకా టీఆర్‌ఎస్‌ ఆకర్ష్‌తో ఉక్కిరిబిక్కిరి అయిన హస్తంకు... రేవంత్‌తో మొదలైన కాంగ్రెస్‌ మార్క్‌ పాలిటిక్స్‌తో టీఆర్‌ఎస్‌కు ధీటుగా సమాధానమిచ్చింది. టీఆర్‌ఎస్‌, టీడీపీ, బీజేపీ, వైసీపీల నుంచి కాంగ్రెస్‌కు వలసలు మొదలయ్యాయి. అంతేకాకుండా పలు ప్రజాసంఘాల నతేలు, ఓయూ విద్యార్థులు భారీగా కాంగ్రెస్‌ గూటికి చేరారు. దీనికితోడు రాహుల్‌ ఏఐసీసీ పగ్గాలు చేపట్టడం... గుజరాత్‌ ఫలితాలతో రాహుల్‌ గ్రాఫ్‌ ఒక్కసారిగా పెరగడం... కాంగ్రెస్‌కు పాజిటివ్‌ వేవ్‌ ప్రారంభమైందని రాజకీయ విశ్లేషకులంటున్నారు. దీంతో అంతరంగ పోరుతో రగిలిపోయిన నైతలు సైతం సైలెంట్‌ అయ్యారు. 
క్యాడర్‌ నుండి లీడర్స్‌ వరకు కొత్త జోష్‌ 
ఇక అచ్చంపేట, కోస్గి, జడ్చర్లలో పార్టీ నిర్వహించిన ప్రజాగర్జనలు, సభలు సూపర్‌ సక్సెస్‌ కావడంతో... క్యాడర్‌ నుండి లీడర్స్‌ వరకు కొత్త జోష్‌ నిండింది. మొత్తానికి 2016లో ఓటమి నైరాశ్యం...  వలసలతో ఉక్కిరిబిక్కిరి అయిన కాంగ్రెస్‌.. 2017లో అన్నింటిని అధిగమించించి. ప్రజల సమస్యలను ఎజెండాగా చేసుకుని.. అధికార పార్టీపై దూకుడు పెంచింది. అధికార పార్టీకి తామే ప్రత్యామ్నాయమనే స్థాయికి చేరింది. మొత్తానికి 2017 ఓవరాల్‌గా కాంగ్రెస్‌కు బాగానే కలిసివచ్చింది. మరి... కొత్తగా సారధ్య బాధ్యతలు స్వీకరించిన రాహుల్‌ సారధ్యంలో 2018 ఎలా ఉంటుందో చూడాలి. 

 

17:27 - December 16, 2017
17:26 - December 16, 2017

సంగారెడ్డి : ఏఐసీసీ అధ్యక్షునిగా రాహుల్‌గాంధీ బాధ్యతలు స్వీకరించడంతో.. సంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఆనందోత్సహాలు వెల్లువిరుస్తున్నాయి. సంగారెడ్టి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్టి ఆధ్వర్యంలో కార్యకర్తలు బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. రాహుల్‌ గాంధీ నాయకత్వంలో పార్టీ బలోపేతమౌతుందని జగ్గారెడ్డి అన్నారు. ఈమేరకు ఆయన టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. 2019లో రాహుల్‌గాంధీ నాయకత్వంలో... కేంద్రం, రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పారు. సోనియా కుటుంబం ప్రజాసేవకు అంకితమైందన్నారు. గతంలో ప్రధాని పదవి చేపట్టే అవకాశం వచ్చినా వద్దన్నారని గుర్తు చేశారు. 

 

Pages

Don't Miss

Subscribe to RSS - jagga reddy