jaggery

10:25 - October 11, 2018

హైదరాబాద్ : బెల్లం ముక్క రోజు తింటే ఏమవుతుంది ? తీపి ఎక్కువగా ఉంటుందని..ఇది తింటే షుగర్ వచ్చే అవకాశం ఉందని..బరువు పెరుగుతారని..ఇలా ఏవో ఏవో ఊహించుకుంటుంటారు. కానీ అనారోగ్య సమస్యలను తగ్గించడంలో బెల్లం సహాయ పడుతుందని వైద్యులే చెబుతుంటారు. చ‌లికాలంలో బెల్లం తిన‌డం ఆరోగ్యానికి ఎంతో మంచిద‌ట‌. ముఖ్యంగా దీంతో శ‌రీరానికి కావాలసిన వేడి అందుతుంద‌ని చెబుతారు. అంతేకాదు ఎన్నోర‌కాల రోగాల‌ను నిరోధించే శ‌క్తి బెల్లానికి ఉంది. ముఖ్యంగా గ‌ర్భ‌వ‌తి అయిన స్త్రీలు బెల్లాన్ని సేవిస్తే ఎంతో మంచిద‌ని పెద్దలు చెబుతుంటారు. 

 • నెయ్యి తో బెల్లం వేడిచేసి నొప్పి ఉన్న చోట వేస్తె భాధ నివారణ అవుతుంది .
 • ముక్కు కారడముతో బాధపడుతున్న వారికి ... పెరుగు, బెల్లం కలిపి రోజుకు రెండు పూటలు తింటే తగ్గుతుంది .
 • బెల్లం, నెయ్యి .. సమపాళ్ళలో కలిపి తింటే 5 -6 రోజులలో మైగ్రిన్ తల నొప్పి తగ్గుతుంది.
 • బెల్లంలో పొటాసియం సమృద్ధిగా ఉంటుంది. ఇది కణాల్లో ఆమ్లాలు, అసిటోన్లపై దాడి చేసి ఆమ్ల సమతౌల్యాన్ని కాపాడుతుంది. 
 • భోజనం చేసిన తర్వాత ప్రతిసారీ చిన్న బెల్లం ముక్క తినటం ద్వారా అసిడిటీని తగ్గించుకోవచ్చు. 
 • లివర్‌ను శుభ్ర పరిచేందుకు బెల్లం చక్కగా ఉపయోగపడుతుంది. 
 • బెల్లంను తింటే లివర్‌లో ఉండే హానికర వ్యర్థాలు, విష పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి.
 • బెల్లంలో ఉండే ఔషధ గుణాలు జీర్ణాశయంలోని పలు డైజెస్టివ్ ఎంజైమ్‌లను యాక్టివేట్ చేస్తాయి. 
 • ఒంట్లో అధికంగా ఉండే నీరు బయటకు వెళ్లిపోతుంది. అధిక బరువు తగ్గుతారు. గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.
 • ఇలాంటి ప్రయోజనాలు ఉండటం వల్లే బెల్లాన్ని 'మెడిసినల్‌ షుగర్‌'గా వ్యవహరిస్తారు.
18:41 - June 6, 2017

పశ్చిమగోదావరి : ఇప్పటివరకు కల్తీపాటు, కల్తీకారం, పసుపు, ఆవాలనే మాత్రమే మనం చూశాం. కానీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ప్లాస్టిక్‌ బియ్యం, నకిలీ కోడిగుడ్లు హల్‌చల్‌ చేస్తున్నాయి. అంతేకాదు. తాజాగా ఈ లిస్ట్‌లోకి నకిలీ బెల్లం కూడా వచ్చి చేరింది. పశ్చిమగోదావరి జిల్లాలో నకిలీ బెల్లం తయారీ ముఠా గుట్టురట్టు అయింది. నిడదవోలు మండలం కోరుమామిడి, కాటకోటేశ్వరం, పెండ్యాల, కోరుపల్లి, పురుషోత్తపల్లి, జీడిగుంట ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నకిలీ బెల్లాన్ని తయారు చేస్తున్నారు. పాడైన బెల్లానికి కొన్ని హానికర రసాయనాలు కలిపి వందల కేజీల నకిలీ బెల్లాన్ని తయారీ చేస్తున్నారు మాయగాళ్లు. పాడైపోయిన బెల్లానికి హైడ్రోస్‌ డీఏసీ అమ్మోనియం ఫాస్పేట్‌ను అలాగే బెల్లానికి రంగు రావడం కోసం రసాయనాలను వాడుతున్నారు. ఇక ఈ నకిలీ బెల్లం తయారీని చూస్తే కళ్లు తిరిగి పడిపోవాల్సిందే. అపరిశుభ్ర వాతావరణంలో ఈగలు, దోమలు, పురుగులు, చెత్తాచెదారం మధ్య బెల్లం నకిలీ బెల్లాన్ని తయారు చేస్తున్నారు. బెల్లాన్ని ఉడికించేందుకు మంటకు ప్లాస్టిక్‌ వస్తువులు, చెప్పులు, ప్లాస్టిక్‌ డబ్బాలు, సెలైన్‌ బాటిళ్లను వాడుతున్నారు. దీంతో హానికర విషవాయువులు, రసాయనాలు బెల్లంతో కలిసిపోతున్నాయి. దీంతో ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. ఇంత జరుగుతున్నా..అధికార యంత్రాంగం మాత్రం అటువైపు కన్నెత్తికూడా చూడడంలేదు. 

 

08:42 - February 3, 2017

పాలు..బెల్లం అనేది గొప్ప కలయిక. రుచికరమైన మరియు కెలరీలు..ఐరన్..సోడియం, పొటాషియం తదితర విటమిన్స్ ఇందులో ఉంటాయి.

 •  
 • బెల్లంకు అనీమియా ఎదుర్కొనే శక్తి వుంది. మహిళలు ఐరన్ ట్యాబ్లెట్స్ బదులుగా బెల్లం కలిపిన పాలను వాడవచ్చు.
 • మహిళలకు రుతుక్రమంలో వచ్చే నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
 • ఎముకలను గట్టి పరిచి, ఎముకల నొప్పిని తగ్గిస్తుంది.
 • జీర్ణక్రియను, మెటాబలిజమ్ ను మెరుగుపరుస్తుంది.
 • అనారోగ్యాల‌ను క‌లిగించే వైర‌స్‌లు, బాక్టీరియాలను దరి చేరనీయదు. ప‌లు ఇన్‌ఫెక్ష‌న్లు త‌గ్గుతాయి. శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది.
 • పంచదారతో పోలిస్తే బెల్లం కలిపిన పాలు తాగడం వల్ల బరువు తగ్గుతారు.
 • రోజూ వేడి పాల‌లో బెల్లం క‌లుపుకుని తాగితే నొప్పుల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. అంతేకాదు, కీళ్లు దృఢంగా మారుతాయి.
 • బెల్లం క‌లిపిన వేడి పాల‌ను తాగడం వ‌ల్ల వాటిలో ఉండే పోష‌కాలు అంది జుట్టు కాంతివంతంగా మారుతుంది. వెంట్రుక‌లు రాల‌డం త‌గ్గుతుంది. చుండ్రు పోతుంది.
15:40 - January 12, 2017

వనపర్తి : సంక్రాంతి పండగ పేరింటేనే.. నోట్లో బెల్లంముక్క వేసుకున్నట్టు తియ్యగా నవ్వుతారందరు. పండగపూట బెల్లంతోచేసిన పాయసం , అరిసెల్ని కమ్మగా లాగిస్తూ.. చుట్టపక్కాలతో సరదాకా గడిపేస్తుంటారు. కాని ..ఈసారి పండగపూట తేనెలరుచులు పంచే బెల్లం చేదెక్కింది. అధికారుల ఆంక్షలతో తీయ్యందనాల సంక్రాంతి కాస్తా.. చప్పగా మారుతోంది.

పండగ రోజుల్లో బెల్లంకష్టాలు ....

కొత్తజిల్లా వనపర్తిలో జనానికి బెల్లం కష్టాలు వచ్చిపడ్డాయి. అధికారుల ఆంక్షలతో పిండివటలు తీపిరుచులను కోల్పేయేపరిస్థితి వచ్చింది. జిల్లావ్యాప్తంగా ఏరులైపారుతున్న గుడుంబాను అడ్డకుకేనేందుకు ఎక్సైజ్‌ శాఖ బెల్లం అమ్మకాలపై ఆంక్షలు పెట్టింది. ఈ ఆంక్షలు ఇపుడు ప్రజలందరికీ ఇబ్బందిగా మారాయి. పండగపేరుతో అమ్ముతున్న బెల్లం మళ్లీ సారాతయారీకి వెళ్లుతుందని ఎక్సైజ్‌ అధికారులు అనుమానిస్తున్నారు. అందుకే బెల్లం కొనుగోళ్లపై నజర్‌ పెట్టారు. ఒకటి రెండు కిలోలు కొనుక్కోవాలన్నా ఆధార్‌కార్డు తప్పని సరి చేశారు. అధికారుల ఆదేశాలతోనే ఆధార్‌ కార్డు నకలు కాపీ ఇస్తేనే బెల్లం అందిస్తున్నట్టు వ్యాపారులు చెబుతున్నారు.

ఒక్కో ఆధార్‌ కార్డుపై 1కేజీ బెల్లం మాత్రమే....

ఒక్కో ఆధార్‌ కార్డుపై 1కేజీ మాత్రమే ఇస్తుండంతో బెల్లం షాపుల ముందు జనం బారులు తీరుతున్నారు. మరోవైపు ధరను కూడా ఆకాశానికెత్తేశారు వ్యాపారులు. కేజీ 60రూపాయలు చేసి అమ్ముతున్నారు. దీంతో పండగపూట బెల్లాన్ని చూస్తే బంగారం ధరలే గుర్తుకువస్తున్నాయని ఆదేవన చెందుతున్నారు ప్రజలు.

కేజీ బెల్లంతో పండగ ఎట్లా చేసుకోవాలి..?

పండక్కి కూతురు- అల్లుడు వచ్చారు.. రేషన్‌ ప్రకారం ఇస్తున్న ఒక కేజీ బెల్లాన్ని ఏం జేసుకోవాల అంటున్నారు వనపర్తి జిల్లా ప్రజలు. కిలో బెల్లంతో ఎన్నిరకాల పిండివంటలు చేసుకోవొచ్చో కూడా చెబితే బాగుంటుందని అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఎక్సైజ్‌ శాఖ తీరుపై జనం మండిపడుతున్నారు. నాటుసారా తయారీదారులను కంట్రోల్‌ చేయలేక ఇలా పండక్కికూడా బెల్లం అందకుండా చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి.. కావాల్సినంత బెల్లం అందించాలని..వనపర్తి జిల్లా ప్రజలు కోరుతున్నారు.

19:06 - November 19, 2016

విశాఖ : పెద్ద నోట్ల రద్దు అనేక రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. చిల్లర నోట్ల కొరత సామాన్యులకు కొరకరాని కొయ్యగా మారింది. చిల్లర నోట్లు దొరక్క..వేలమంది కార్మికులకు అన్నంపెట్టే బెల్లం మార్కెట్‌ మూతపడింది. దీంతో కార్మికుల కుటుంబాలు పస్తులుండాల్సిన దుస్థితి దాపురించింది. నోట్ల కష్టాల నేపథ్యంలో..అనకాపల్లి బెల్లం మార్కెట్‌పై 10 టీవీ ప్రత్యేకs కథనం.
చిన్న నోట్లు దొరక్క బెల్లం కొనడం మానేసిన వ్యాపారులు
అనేక మందికి అన్నంపెట్టే బెల్లం మార్కెట్‌...దేశంలోనే రెండో అతిపెద్ద బెల్లం మార్కెట్‌గా అనకాపల్లి...చిల్లర సమస్యతో మార్కెట్‌ను మూసేసిన వ్యాపారులు..దిక్కుతోచని స్థితిలో వేలాది మంది రైతులు. ఇదీ.. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన విశాఖ జిల్లా అనకాపల్లి బెల్లం మార్కెట్ దుస్థితి. గతంలో సమ్మెల ప్రభావంతో అతలాకుతలమైన ఈ మార్కెట్‌ తాజాగా చిల్లర నోట్లు దొరక్క మూతపడింది. దీంతో మార్కెట్‌పై ఆధారపడి జీవనం సాగిస్తున్న అనేక మంది కార్మికులు ఇప్పుడు రోడ్డున పడాల్సి వచ్చింది.
దేశంలోనే రెండో అతిపెద్ద బెల్లం మార్కెట్‌గా అనకాపల్లి...
అనకాపల్లి బెల్లం మార్కెట్‌ దేశంలోనే రెండో అతిపెద్ద మార్కెట్‌. ఇక్కడి నుంచి పలు రాష్ట్రాలకు బెల్లం ఎగుమతులు జరుగుతాయి. మార్కెట్లో సుమారు 200 మంది కూలీలు, 150 మంది కళాసీలు, 200 మంది కలగార్లతో పాటు మరో 200 మంది ఇతర కూలీలు పని చేస్తుంటారు. బెల్లం దిమ్మెలను విక్రయించే రైతులతో పాటు కొనుగోలు చేసే వ్యాపారస్తులు, ఎగుమతి చేసే వ్యాపారులు .. బెల్లం దిమ్మెలకు ఇచ్చే కమీషన్‌ ద్వారా వీరంతా లావాదేవీలు కొనసాగిస్తారు.
అనకాపల్లి మార్కెట్‌ నుంచి పలు రాష్ట్రాలకు బెల్లం ఎగుమతులు
జిల్లాలో 3 వేలకు పైగా చెరకు క్రషింగ్ బెల్లం పట్టీలున్నాయి. ఒక్కో పట్టి నుంచి రోజుకు 90 దిమ్మల బెల్లం తయారు చేస్తారు. అనకాపల్లీ, యలమంచిలి, చోడవరం, మాడుగుల నియోజక వర్గాల్లో చెరకే ప్రధాన పంట. ప్రతిరోజు ఇక్కడి నుంచే ఇతర రాష్ట్రాలకు బెల్లం దిమ్మెల రవాణా జరుగుతుంది. ప్రతిరోజు 60 లక్షల రూపాయల విలువైన బెల్లం ఇతర ప్రాంతాలకు ఎగుమతి కావడం, రవాణా ఖర్చులే లక్షల్లో ఉండటం వల్ల నగదు లావాదేవీలు తప్పనిసరి. అయితే.. ఇప్పుడు పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో వ్యాపారులు కొనుగోళ్లు మానేశారు. బెల్లానికి మంచి మార్కెట్ ఉన్న సమయంలో మార్కెట్‌ మూతపడటంతో అన్నదాతలకు ఆశనిపాతంగా మారింది.
బెల్లం మార్కెట్‌ మూసివేతతో రైతులు, వ్యాపారుల్లో తీవ్ర ఆందోళన
ఇపుడిపుడే మార్కెట్‌ పుంజుకుంటున్న తరుణంలో.. కేంద్రం పెద్ద నోట్లు రద్దు చేయడంతో వ్యాపారులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. కనీసం రైతులకు ఇవ్వడానికి కూడా డబ్బులు లేకపోవడంతో.. బెల్లం మార్కెట్‌ మూసివేయాల్సి వచ్చిందని వర్తకులు చెబుతున్నారు. అటు కమీషన్ ఏజంట్లు కూడా రైతులకు ఎలాంటి చెల్లింపులు చేయడం లేదు. డబ్బులున్నా.. వ్యాపారం చేసుకోలేని పరిస్థితి ఏర్పడిందని, ఈ విషయంలో బ్యాంకులు కూడా స్పందించడం లేదని వ్యాపారులు చెబుతున్నారు.
ప్రత్యామ్నాయ మార్గాలు చూపాలని రైతులు, వ్యాపారుల డిమాండ్‌
అటు.. రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఓ వైపు.. బెల్లం ఎక్కువ రోజులు నిల్వ ఉంచే పరిస్థితి లేకపోడం, మరోవైపు చెరకు పంట కోతకొచ్చి సిద్ధంగా ఉండటం రైతుల్ని తీవ్రంగా కలచివేస్తోంది. ఇదే సమయంలో వ్యాపారులు చెరకు కొనుగోళ్లు నిలిపివేయడంతో క్రషింగ్ ఆగిపోయింది. చేతికి వచ్చిన పంట కోయకపోతే పంట పాడై పోతుందని, అదే జరిగితే తామంతా రోడ్డున పడతామని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ప్రత్యామ్నాయ మార్గాలు చూపి ఆదుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.   

09:59 - February 10, 2016

పిండివంటల్లో విరివిగా వాడే బెల్లం నిజానికి ఒక గొప్ప ఔషధం. ఇందులో ఉన్న ఔషధ గుణాలు తెలుసుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది. దీన్ని అప్పుడప్పుడు కాకుండా తరచుగా ఆహారంలో భాగంగా తీసుకోవడం అత్యవసరమని కూడా అనిపిస్తుంది. ఇందులో ఉన్న మంచి లక్షణాలు..

 • జీర్ణక్రియకు పనికొచ్చే ఎంజైములు చురుగ్గా పనిచేసేలా చేస్తుంది. పేగుల పనితీరుని మరింత ఉత్తేజపరుస్తుంది. అందుకే బెల్లం మలబద్దకానికి మంచి మందులా పనిచేస్తుంది.
 • లివర్‌లోని హానికరమైన విషాలను బయటకు తోసేందుకు తోడ్పడుతుంది. శరీరంలోని వ్యర్థాలను సమర్ధవంతంగా బయటకు నెడుతుంది.
 • దగ్గు, జలుబు లాంటి వాటికి బెల్లం మంచి ఔషధం. ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు బెల్లంను వేడి నీటితో కానీ, టీలో వేసుకుని కానీ తాగితే మంచిది.
 • రక్తాన్ని శుద్ధి చేసే లక్షణాలు బెల్లంలో ఉన్నాయి.
 • ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు పుష్కలంగా ఉండటం వలన రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇన్‌ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడుతుంది. రక్తంలో హిమోగ్లోబిన్‌ శాతాన్ని పెంచుతుంది.
 • శ్వాసనాళం, ఊపిరితిత్తులు, పేగులు, పొట్ట, అన్నవాహిక.. వీటన్నింటినీ శుభ్రం చేసే శక్తి బెల్లంకి ఉంది. గనులు, ఫ్యాక్టరీలు, సిమెంటు పనులు, ఇంకా కాలుష్యంతో కూడిన ప్రాంతాల్లో పనిచేసేవారికి ఇది మంచి ఔషధంలా పనిచేస్తుంది.
 • ప్రి మెన్‌స్ట్రువల్‌ సిండ్రోమ్‌ కారణంగా నెలసరికి ముందు ఇబ్బందులు పడేవారు, ఆ సమయంలో నొప్పులను అనుభవించేవారు దీన్ని తీసుకుంటే సమస్యలు తగ్గుముఖం పడతాయి.
 • బెల్లంలో ఐరన్‌, ఫోలిక్‌ యాసిడ్‌ ఉండటం వలన రక్తలేమిని నివారిస్తుంది. ఎర్రరక్త కణాలు తగ్గకుండా కాపాడుతుంది. ముఖ్యంగా గర్భిణులకు మరింత మేలు చేస్తుంది.
 • ఇందులో మెగ్నీషియం ఎక్కువ మోతాదులో ఉండటం వలన పేగులకు బలం చేకూరుస్తుంది. ప్రతి పది గ్రాముల బెల్లంలో 16 మిల్లీ గ్రాముల మెగ్నీషియం లభిస్తుంది. అంటే ఇది మనకు ఒకరోజుకి కావాల్సిన మెగ్నీషియంలో నాలుగోవంతుని అందిస్తున్నట్టు లెక్క.
 • బెల్లం శరీర ఉష్ణోగ్రతని క్రమబద్ధీకరిస్తుంది. దీని వలన శరీరం చల్లబడుతుంది. అందుకే ఎండాకాలంలో చల్లని నీళ్లలో బెల్లం కలుపుకుని తాగమని ఆరోగ్యనిపుణులు చెబుతుంటారు.
 • పొటాషియం, సోడియం ఉండటం వలన శరీరంలో యాసిడ్స్‌ లెవల్స్‌ను సక్రమంగా ఉంచేశక్తి దీనికి ఉంది. రక్తపోటుని సైతం క్రమబద్ధీకరిస్తుంది కూడా.
 • శ్వాసక్రియ సమర్ధవంతంగా ఉంచడంలో బెల్లం శక్తివంతంగా పనిచేస్తుంది. ఆస్తమా, బ్రాంకైటిస్‌ లాంటి సమస్యలను దూరం చేస్తుంది. నువ్వులతో కలిపి దీన్ని తీసుకుంటే శ్వాసకోశ వ్యవస్థకు అద్భుతమైన మేలు చేస్తుంది.
 • జాయింట్‌ నొప్పులతో బాధపడుతున్న వారికి బెల్లం మంచి ఔషధమని వైద్య నిపుణులు చెబుతున్నారు. కాస్తం బెల్లం ముక్కని అల్లంతో కలిపి తీసుకుంటే నొప్పులకు ఉపశమనంగా ఉంటుంది. అలాగే పాలల్లో బెల్లం కలుపుకుని తాగినా ఎముకలకు మంచిది.
 • బెల్లం బరువు తగ్గడానికి దోహదపడుతుంది. ఇందులో ఉన్న పొటాషియం, కండరాల నిర్మాణంలో మెటబాలిజంని పెంచడంలో శరీరంలో నీటిని తగ్గించడంలో తోడ్పడి బరువుని అదుపులో ఉంచుతుంది.
 • పంచదార కంటే శరీరానికి శక్తిని ఇవ్వడంలో బెల్లం మరింత సమర్ధవంతంగా పనిచేస్తుంది. పంచదారలా ఒక్కసారిగా కాకుండా శరీరానికి ఎక్కువ సమయం కార్బోహైడ్రేట్‌లను ఇవ్వగలుగుతుంది. అందువల్ల రక్తంలో ఒక్కసారిగా షుగర్‌ స్థాయి పెరగదు.
 • అలాగే బెల్లం శరీరంలో అలసటని, బలహీనతని పోగొడుతుంది. బెల్లంలో ఇన్ని అద్భుత గుణాలుండటం విశేషమే. అయితే ఇందులో కేలరీలు ఎక్కువగా ఉండటం వలన తగిన మోతాదులో మాత్రమే తీసుకుంటే మంచిది.
12:10 - January 20, 2016

ఇంటి నుంచి బ‌య‌లుదేరే ముందు కాస్త బెల్లం తిని వెళ్తే మంచి శ‌కునమ‌ని పెద్ద‌వాళ్లు కూడా చెబుతుంటారు. భారతీయ వంటలలో బెల్లం ఒక ముఖ్యమైన భాగం. బెల్లం (Jaggery)ఒక తియ్యటి ఆహార పదార్థం.. అంతే ఔషధాల గని అని కూడా చెప్పవచ్చు. బెల్లం తినాలంటే ఎక్కువ ప్ర‌యాస ప‌డాల్సిన అవ‌స‌రం లేదు. బెల్లం కోసం ఎక్కువ డ‌బ్బు ఖ‌ర్చుపెట్టాల్సిన అవ‌స‌రం కూడా ఉండ‌దు. మార్కెట్లో ఇత‌ర ధ‌ర‌ల‌తో పోలిస్తే బెల్లం రేటు కాస్తంత త‌క్కువే. ఏదో పండ‌గ సంద‌ర్భంలో త‌ప్ప బెల్లం జోలికి వెళ్ల‌డం చాలా త‌క్కువ‌. ఆ బెల్ల‌మే క‌దా అని తీసి పారేయ‌కండి. బెల్లంతో ఎన్నో ప్ర‌యోజ‌నాలున్నాయి. ముఖ్యంగా చ‌లికాలంలో బెల్లం తిన‌డం ఆరోగ్యానికి ఎంతో మంచిద‌ట‌. ముఖ్యంగా దీంతో శ‌రీరానికి కావాలసిన వేడి అందుతుంద‌ని చెబుతారు. అంతేకాదు ఎన్నోర‌కాల రోగాల‌ను నిరోధించే శ‌క్తి బెల్లానికి ఉంది. ముఖ్యంగా గ‌ర్భ‌వ‌తి అయిన స్త్రీలు బెల్లాన్ని సేవిస్తే ఎంతో మంచిద‌ట‌.ఆయుర్వేదంలోనూ బెల్లానికి ఎంతో ప్రాధాన్య‌త ఉంది. చ‌లికాలంలో ద‌గ్గు, జలుబు లాంటి ఎన్నో రోగాల‌ను నిరోధించే శ‌క్తి బెల్లానికి ఉంది. చిటికెడు బెల్లం ముక్క నోట్లో వేసుకుంటే చాలు... ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ బాగా జ‌రుగుతుంద‌ట‌. రోజంతా ఆఫీసుల్లో టెన్ష‌న్ టెన్ష‌న్ గా గ‌డిపేవాళ్ల‌కు ఇది ఎంతో మంచిద‌ట‌.

చెరకు నుండి...

దీనిని సాధారణంగా చెరకు నుండి తయారు చేస్తారు. సాధారణంగా చెరకు రసము నుంచి కొలాసిస్ ను వెలికితీసి బెల్లము తయారు చేస్తారు. తాటికల్లు, ఈతకల్లు, ఖర్జూరము నుంచి బెల్లం తయారుచేస్తారు . బెల్లం తయారిలో వివిధ రాకలు ఉన్నాయి. చెరకు బెల్లం, ఖర్జూర బెల్లం, తాటి బెల్లం, ఈతబెల్లం, కొబ్బరి బెల్లం ఇలా వివిధ రకాలుగా తయారు చేస్తారు. అయితే ఇళ్ళలో వాడేరకం చెరకు బెల్లం. ఇది భారతీయ వంటలలో బెల్లం ఒక ముఖ్యమైన పదార్థం. చెరకు బెల్లము గోల్డ్ బ్రౌన్‌ కలర్ నుంచి డార్క్ బ్రౌన్ కలర్ లో ఉంటుంది . ఈ బెల్లంను చెరకు రసాన్నిబాగా కాయడం ద్వారా తయారుచేస్తారు. ఈ బెల్లం నేల రకాన్ని బట్టి, నీటి పారుదల సౌకర్యాన్ని బట్టి తెల్లగాను, లేదా నల్లగాను, మెత్తగాను లేదా గట్టిగాను వుంటుంది. దాన్ని బట్టి దానికి ధర వస్తుంది. పంచదార లేదా చక్కెర కంటే బెల్లం ఆరోగ్యపరంగా శ్రేష్టం ఎందుకంటే బెల్లంలో ఇనుము మొదలైన మూలకాలు ఉంటాయి.

బెల్లంలో ఎలాంటి రసాయ‌న ప‌దార్థాల వాడ‌కం ఉండ‌దు. చూశారా బెల్లానికి ఎంత ప్రాధాన్య‌త ఉందో.. ఇక నుంచి ఆ బెల్ల‌మే క‌దా అని లైట్ తీసుకోకండి.. కాస్త అప్పుడ‌ప్పుడు చిటికెడు బెల్లాన్ని నోట్లో వేసుకుందాం...

ఉపయోగాలు..

ఆయుర్వేద వైద్యశాస్త్రంలో కూడా బెల్లాన్ని చాలా రకాల మందులలో వాడతారు.

పొడి దగ్గు ఇబ్బంది పెడుతుంటే .. గ్లాసు బెల్లం పానకం లో కొద్దిగా తులసి ఆకులు వేసి రోజుకు మూడు సార్లు తీసుకుంటే ఉపసయనం కలుగుతుంది .

అజీర్తి సమస్యతో విసిగిపోయిన వారు భోజనం చేశాక చిన్న బెల్లం ముక్క నోట్లో వేసుకుంటే జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది . అజీర్తి సమస్యలుండవు .జీవ క్రియ ను వేగవంతం చేస్తుంది .

కాకర ఆకులు , నాలుగు వెల్లుల్లి రెబ్బలు (రెక్కలు) , మూడు మిరియాల గింజలు , చిన్న బెల్లం ముక్క వేసి గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని రోజు రెండుపుతల వారం రోజులు తీసుకున్నా , లేదా గ్లాసు పాలలో పంచధరకి బదులు బెల్లం వేసి రోజు త్రాగిన ... నెలసరి సమస్యలు ఉండవు.

నేయ్యి తో బెల్లం వేడిచేసి నొప్పి ఉన్నా చోట పట్టు వేస్తె భాధ నివారణ అవుతుంది .

ముక్కు కారడము తో బాధపడుతున్న వారికి ... పెరుగు , బెల్లం కలిపి రోజుకు రెండు పూటలు తింటే తగ్గుతుంది .

బెల్లం , నెయ్యి .. సమపాళ్ళలో కలిపి తింటే 5 -6 రోజులలో మైగ్రిన్ తల నొప్పి తగ్గుతుంది .

కడుపులో మంటగా ఉన్నప్పుడు బెల్లం చిట్కాను ప్రయోగించవచ్చని పోషణ నిపుణులు సూచిస్తున్నారు. బెల్లంలో పొటాసియం సమృద్ధిగా ఉంటుంది. ఇది కణాల్లో ఆమ్లాలు, అసిటోన్లపై దాడి చేసి ఆమ్ల సమతౌల్యాన్ని కాపాడుతుంది. భోజనం చేసిన తర్వాత ప్రతిసారీ చిన్న బెల్లం ముక్క తినటం ద్వారా అసిడిటీని తగ్గించుకోవచ్చు. ఇలాంటి ప్రయోజనాలు ఉండటం వల్లే బెల్లాన్ని 'మెడిసినల్‌ సుగర్‌'గా వ్యవహరిస్తారు.

Don't Miss

Subscribe to RSS - jaggery