Jammu and Kashmir

19:26 - April 24, 2018

జమ్ముకశ్మీర్‌ : నియంత్రణ రేఖ వద్ద కాల్పుల ఉల్లంఘనకు పాల్పడ్డ పాకిస్తాన్‌కు భారత బలగాలు దీటైన జవాబు చెబుతున్నాయి. సోమవారం పాకిస్తాన్‌ సైన్యం పూంఛ్‌ జిల్లాలోని కృష్ణ ఘాటి సెక్టార్‌లో భారత పోస్టులే లక్ష్యంగా కాల్పులు జరిపాయి. దీనికి బదులుగా భారత సైనికులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు పాకిస్తాన్‌ రేంజర్లు హతమయ్యారు. పాకిస్తాన్‌ పోస్టులు, బంకర్లకు భారీగా నష్టం సంభవించింది. ఓవైపు కాల్పుల జరుపుతూ మరోవైపు సరిహద్దు నుంచి ఉగ్రవాదులను భారత్‌లోకి పంపేందుకు పాక్‌ చేసిన పన్నాగాన్ని ఆర్మీ భగ్నం చేసింది. 

20:43 - April 16, 2018

రంగారెడ్డి : జిల్లాలోని మంచాల మండలంలోని  అరుట్ల గ్రామంలో.. జమ్మూకశ్మీర్‌లోని ఎనిమిదేళ్ల బాలికపై జరిగిన దారుణాన్ని ఖండిస్తు ర్యాలీ నిర్వహించారు. కథువా హంతకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అమ్మాయిలపై జరుగుతోన్న దాడులను నియంత్రించేలా చర్యలు తీసుకోవలని వారు ప్రభుత్వాన్ని కోరారు.  ఈ నిరసన కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రజాసంఘాల నేతలు పాల్గోన్నారు. 

 

19:58 - April 16, 2018

ఢిల్లీ : జమ్ముకశ్మీర్‌లోని కథువాలో ఎనిమిదేళ్ల బాలికపై జరిగిన అత్యాచారం హత్య కేసులో సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఆసిఫా కుటుంబానికి, ఆమె తరపు వాదిస్తున్న లాయర్‌కు రక్షణ కల్పించాలని జమ్ముకశ్మీర్‌ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కేసు విచారణను జమ్ముకశ్మీర్‌ నుంచి చండీగఢ్‌కు తరలించాలని కోరుతూ ఆసిఫా తండ్రి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అంతకుముందు జమ్ముకశ్మీర్‌ ట్రయల్‌ కోర్టులో విచారణ జరిగింది. 8 మంది నిందితులు తమని తాము నిర్దోషులుగా కోర్టుకు తెలిపారు. ఈ కేసులో తమకు నార్కో పరీక్ష నిర్వహించాలని కూడా వారు న్యాయమూర్తిని కోరారు. కేసుకు సంబంధించి ఛార్జ్‌షీట్‌ కాపీలను నిందితులకు అందజేయాల్సిందిగా న్యాయమూర్తి రాష్ట్ర క్రైం బ్రాంచిని ఆదేశించారు. దీనిపై తదుపరి విచారణ ఏప్రిల్‌ 28కి వాయిదా వేశారు. ఈ ఏడాది జనవరిలో కథువాలో 8 ఏళ్ల బాలికను అపహరించి మత్తు మందిచ్చి వారం రోజుల పాటు అత్యాచారానికి పాల్పడి ఆపై హత్య చేసిన విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనలో 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  

 

22:08 - April 1, 2018

శ్రీనగర్ : జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాదులకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. దక్షిణ కశ్మీర్‌లోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన మూడు ఎన్‌కౌంటర్లలో 11 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిలో టాప్‌ కమాండర్లు కూడా ఉన్నారు.  ముగ్గురు జవాన్లు వీరమరణం పొందారు. ఎన్‌కౌంటర్లలో ఇద్దరు పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయారు. 
ఉగ్రవాదలు ఏరివేత 
జమ్ము-కశ్మీర్‌లో వరుస ఎన్‌కౌంటర్లు చోటుచేసుకున్నాయి. వేర్వేరు ప్రాంతాల్లో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. షోపియాన్, అనంతనాగ్‌ జిల్లాల్లో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. షోపియాన్‌ జిల్లాలో రెండు ప్రాంతాల్లో భద్రతాదళాలు ఉగ్రవాదలు ఏరివేత చేట్టాయి. డ్రగద్‌, కచ్‌దూర గ్రామాల్లో సోదాలు నిర్వహిస్తున్న భద్రతాదళాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. భద్రతాదళాలు జరిపిన ఎదురుకాల్పుల్లో పది మంది ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిని స్థానికులుగా గుర్తించారు. గత ఏడాది మేలో ఆర్మీ లెఫ్టినెంట్‌ ఉమర్‌ ఫయాజ్‌ను కిడ్నాప్‌చేసి హతమార్చిన ఉగ్రవాదులను కూడా ఈ ఎన్‌కౌంటర్‌లో భద్రతాదళాలు మట్టుపెట్టాయి.   డ్రగద్‌, కచ్‌దూరలో ఇద్దరు పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ముగ్గురు ఆర్మీ జవాన్లు వీరమరణం పొందారు. ఘటనా స్థలాల నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్ధాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఎన్‌కౌంటర్‌కు నిరసనగా పౌరులు పెద్ద ఎత్తున అల్లర్లకు దిగడంతో వీరిని అదుపు చేసేందుకు భద్రతాదళాలు చేసిన పెల్లెట్ ప్రయోగంలో 25 మంది, బుల్లెట్ల ప్రయోగంలో ఆరుగురు గాయపడ్డారు. 
ఉగ్రవాది హతం
అనంతనాగ్‌ జిల్లా దియాల్గమ్‌లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. మరో ఉగ్రవాదిని భద్రతాదళాలు పట్టుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్ల నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా శ్రీనగర్‌-బనిహల్‌ మధ్య రైలు సర్వీసులను నిలిపివేశారు. దక్షిణ కశ్మీర్‌లోని సున్నితమైన ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. 

21:10 - February 12, 2018

ఢిల్లీ : జమ్ముకశ్మీర్‌లోని సంజ్వాన్‌లో ఆర్మీ ఆపరేషన్‌ ముగిసిందని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ఆర్మీ ఆపరేషన్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారని మంత్రి వెల్లడించారు. ఉగ్రవాద దాడుల వెనక పాకిస్తాన్‌కు చెందిన జైష్‌ -ఎ-మహ్మద్‌ హస్తం ఉందని మంత్రి పేర్కొన్నారు. పాకిస్తాన్‌ ప్రోత్సాహంతోనే ఉగ్రదాడులు జరుగుతున్నాయని... ఉగ్రవాద నేత మసూద్‌ అజహర్‌ కశ్మీర్‌కు టెర్రరిస్టులను స్పాన్సర్‌ చేస్తున్నారని సీతారామన్‌ స్పష్టం చేశారు. త్వరలో ఎన్‌ఐఏ ఆధారాలను సేకరిస్తోందని మంత్రి చెప్పారు. ఉగ్రవాదుల దాడులను భద్రతా బలగాలు సమర్థవంతంగా తిప్పి కొడుతున్నాయన్నారు. ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో రక్షణమంత్రి జమ్ముకశ్మీర్‌లో పర్యటిస్తున్నారు. 

21:03 - February 10, 2018

జమ్మూ కాశ్మీర్ : జమ్మూలోని సున్‌జ్వాన్ ఆర్మీ క్యాంపుపై ఉగ్రవాదులు పంజా విసిరారు. ఉగ్రవాదుల దాడిలో ఇద్దరు సైనికులు అమరులయ్యారు. మరో ఆరుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిలో ఓ సైనికుడి కుమార్తె కూడా ఉంది. ఉగ్రవాదులకు, భద్రతాదళాలకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. శనివారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో సుంజ్‌వాన్‌ఆర్మీ క్యాంపులోకి ప్రవేశించిన ఉగ్రవాదులు విచక్షణా రహితంగా కాల్పులు జరుపుతూ గ్రనేడ్స్ విసిరారు. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు అమరులు కాగా...మరో ఆరుగురు సైనికులు గాయపడ్డారు. గాయపడిన వారిలో కల్నల్‌ ర్యాంక్‌ అధికారితో పాటు ఓ జవాను కుమార్తె కూడా ఉంది. సుబేదార్‌ మగన్‌లాల్‌, సుబేదార్‌ మొహమ్మద్‌ అష్రఫ్‌ ఉగ్రదాడిలో అమరులైనట్లు జమ్ముకశ్మీర్‌ మంత్రి అబ్దుల్‌ రెహమాన్‌ వెల్లడించారు.

ఉగ్రవాదులు తొలుత ఓ ఫ్యామిలీ క్వార్టర్‌లోకి చొరబడ్డారు. క్యాంపులో ఏ కుటుంబాన్ని ఉగ్రవాదులు బంధించలేదని అధికారులు స్పష్టం చేశారు. ఉగ్రవాదులను భద్రతబలగాలు చుట్టుముట్టాయి. ఆపరేషన్‌ కొనసాగుతోంది. మహిళలను, పిల్లలను రక్షించేందుకు జెసిఓ ఎమ్‌ అష్రఫ్ మీర్‌ తన ప్రాణాలను అర్పించినట్లు అధికారులు తెలిపారు. ఈ దాడిలో నలుగురైదుగురు ఉగ్రవాదులు పాల్గొని ఉంటారని భావిస్తున్నారు..

ముందు జాగ్రత్త చర్యగా జమ్ము నగరంలోని సుంజ్‌వాన్‌ ప్రాంతంలో క్యాంపునకు దాదాపు 500మీటర్ల దూరంలోని అన్ని పాఠశాలలను మూసివేయాలని అధికారులు ఆదేశించారు. ఈ ఘటనపై తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ జమ్ముకశ్మీర్‌ డీజీపీకి ఆదేశించారు. ఈ ఘటన నేపథ్యంలో జమ్ము నగరంలో భద్రతను మరింత పెంచారు. 

08:57 - January 27, 2018

శ్రీనగర్ : జమ్ముకశ్మీర్‌లో మహిళా ఆత్మాహుతి దాడి యత్నాన్ని పోలీసులు భగ్నం చేశారు. శ్రీనగర్‌లో మహిళా సుసైడ్‌ బాంబర్‌తో పాటు ఆమె సన్నిహితురాలిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. మహిళా ఉగ్రవాదిని పుణెకు చెందిన 18 ఏళ్ల సదియా అన్వర్‌ షేక్‌గా గుర్తించారు. గురువారం అర్ధరాత్రి దాటాకా అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆమెను విచారిస్తున్నారు. శ్రీనగర్‌లో సుసైడ్‌ బాంబర్‌ సంచరిస్తున్నట్లు ఇంటిలిజెన్స్‌ వర్గాల సమాచారం మేరకు పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు.

 

19:56 - January 11, 2018

ఢిల్లీ : పార్లమెంట్‌పై దాడి కేసులో మరణశిక్షకు గురైన అఫ్జల్‌గురు తనయుడు గాలిబ్ గురు చదువులో రాణిస్తున్నాడు. బోర్డ్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ నిర్వహించిన 12వ తరగతి పరీక్షల్లో డిస్టింక్షన్‌లో పాసయ్యాడు. ఈ ఏడాది నవంబర్‌లో నిర్వహించిన 12వ తరగతి పరీక్షల్లో గాలిబ్‌ 88 శాతంతో 441 మార్కులు సాధించాడు. 2001లో పార్లమెంట్‌పై దాడి చేసిన కేసులో దోషిగా తేలిన అఫ్జల్ గురుకు 2013లో ఉరిశిక్ష విధించిన విషయం తెలిసిందే. గాలిబ్ గురు పదో తరగతిలో కూడా 95 శాతం మార్కులు సాధించాడు. సోషల్ మీడియాలో గాలిబ్ గురుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. బారాముల్లా జిల్లాలోని సోపూర్ పట్టణంలోని గల వీరి నివాసం సందడిగా మారింది. స్నేహితులు, కుటుంబ సభ్యులు గాలిబ్‌ గురుకు అభినందనలు తెలిపారు. 

12:33 - January 6, 2018

శ్రీనగర్ : జమ్ముకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. సోపోర్‌లోని గోల్‌ మార్కెట్‌ ప్రాంతంలో శక్తివంతమైన ఐఈడీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో నలుగురు పోలీసులు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. పేలుడు దాటికి దుకాణాలు ధ్వంసమయ్యాయి. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

20:27 - January 4, 2018

ఇస్లామాబాద్ : కూల్‌భూషన్ జాదవ్‌కు చెందిన ఓ వీడియోను పాకిస్థాన్ విడుదల చేసింది. ఈ వీడియోలో జాదవ్‌ పాకిస్తాన్‌ను పొగుడుతున్నట్లుగా ఉంది. పాకిస్తాన్‌ అధికారులు తనకు ఎలాంటి నష్టం కలిగించలేదని జాదవ్‌ చెప్పారు. తల్లి, భార్యను కలుసుకునే అవకాశం కల్పించిన పాకిస్థాన్‌కు జాదవ్ ఆ వీడియోలో థ్యాంక్స్ చెబుతున్నట్లుగా ఉంది. తనను కలుసుకోవడం వల్ల తన భార్య, తల్లి సంతోషంగా ఫీలయ్యారని.... తన ఆరోగ్యం పట్ల తన తల్లి ఆనందం వ్యక్తం చేసిందని, తనకు ఎటువంటి హాని జరగదని జాదవ్ ఆ వీడియోలో అన్నట్లుగా ఉంది. డిసెంబర్ 25వ తేదీన ఇస్లామాబాద్‌లో జాదవ్‌ను ఆయన తల్లి, భార్య కలుసుకున్నారు. జాదవ్ కుటుంబాన్ని పాక్ అవమానించిందని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ వీడియోను విడుదల చేయడం పలు సందేహాలకు దారి తీసింది. పాకిస్థాన్ జాదవ్‌పై వత్తిడి చేసి ప్రకటన ఇప్పించినట్లుగా అనుమానిస్తున్నారు. గూఢచర్యం కేసులో పాకిస్తాన్‌ ఆర్మీ కోర్టు జాదవ్‌కు మరణశిక్ష విధించిన విషయం తెలిసిందే.

Pages

Don't Miss

Subscribe to RSS - Jammu and Kashmir