Janasena pawan kalyan

08:40 - February 6, 2018

హైదరాబాద్ : మత్స్యకారులను ఎస్టీల్లో చేర్చాలన్న డిమాండ్‌ న్యాయమైనేదే అన్నారు జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌. మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానన్న పవన్‌.. ఈనెల 21న శ్రీకాకుళంలో మత్స్యకారులతో సమావేశమవుతానన్నారు. 
పవన్ కళ్యాణ్, మత్స్యకారుల సంఘం నేతలు భేటీ 
మత్స్యకారులను ఎస్టీల్లో చేర్చాలన్న డిమాండ్ న్యాయబద్ధమైనదేనని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ అన్నారు. పవన్‌ను ఆయన నివాసంలో పుదుచ్చేరి మంత్రి మల్లాడి కృష్ణారావు, మత్స్యకారుల సంఘం నేతలు కలిశారు. ఈ సందర్భంగా తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసికెళ్లాలని వారు పవన్‌ను కోరారు. 
మత్స్యకారుల పోరాటానికి అండగా ఉంటా : పవన్‌
మత్స్యకారుల సమస్యలు తనకు తెలుసన్న పవన్‌.. వారి పోరాటానికి జనసేన అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. పశ్చిమగోదావరి జిల్లా ఆక్వాఫుడ్‌ పార్క్‌ కాలుష్యంతో మత్స్యకారుల జీవనోపాధి దెబ్బతింటుందన్నారు. అటు ఉద్ధానంలోనూ మత్య్సకారుల జీవితాలు నలిగిపోతున్నాయని పవన్‌ అన్నారు. మత్స్యకారులను ఎస్టీల్లో చేర్చడంపై టీడీపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శ్రీకాకుళంలో మత్స్యకారులు శాంతియుతంగా చేస్తున్న దీక్షను భగ్నం చేయడాన్ని పవన్‌ తప్పుబట్టారు.
ఈనెల 21న శ్రీకాకుళంలో పర్యటన
అలాగే ఈనెల 21న శ్రీకాకుళంలో పర్యటించి..మత్స్యకారుల సమస్యలపై బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు పవన్‌ ప్రకటించారు. ప్రభుత్వం మ్యానిఫెస్టోలో పెట్టిన హామీలను నిలబెట్టుకోవాలని పవన్‌ డిమాండ్‌ చేశారు. ఏపీ ప్రభుత్వం మత్స్యకారుల కోసం బడ్జెట్‌లో పెట్టే 380 కోట్ల రూపాయలలో 30 నుంచి 35 కోట్లు కూడా మత్స్యకారులకు చేరడం లేదని పుదుచ్చేరి ఫిషరీస్‌ మినిష్టర్‌ మల్లాడి కృష్ణారావు ఆరోపించారు. అసలైన మత్స్యకారులకు లబ్దిచేకూరేలా ప్రభుత్వాలు పనిచేయాలన్నారు. కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి జరుగుతున్న అన్యాయంపై పవన్‌ను ప్రశ్నించగా.. సమయం వచ్చినప్పుడు దానిపై మాట్లాడుతానని పవన్‌ అన్నారు. 

 

16:14 - January 28, 2018

అనంతపురం : ఇంటి నుండి బయటకెళ్లిన మహిళ క్షేమంగా మరలా ఇంటికి చేరుకొనే సమాజం కావాలని సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ పేర్కొన్నారు. అనంతపురంలో ఆయన పర్యటన కొనసాగుతోంది. ఆదివారం మధ్యాహ్నం కదిరి కరవు సమస్యలపై మహిళలతో ఇష్టాగోష్టి నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ...అక్కల బాధ..తల్లి బాధ..అడపడుచుల బాధేంటో తనకు తెలుసని, తనకు ఇద్దరు కూతుళ్లున్నారని తెలిపారు. అడపడుచుల సమస్యల పరిష్కారానికి ఎల్లవేళలా కృషి చేస్తానని, అక్కచెల్లెళ్లందరికీ జనసేన పార్టీ అండగా ఉంటుందన్నారు. తనకు అండగా నిలబడాలని..జనసేనకు ఓట్లు వేయాలని రాలేదన్నారు. అనంత కరువు పారదోలడానికి పోరాటం చేయడానికి మాత్రమే వచ్చానని పవన్ తెలిపారు. 

16:55 - January 24, 2018

ఖమ్మం : జనసేన అధినేత పవన్ కాన్వాయ్ పై గుర్తుతెలియని దుండగుడు చెప్పు విసిరాడు. ఖమ్మం పట్టణంలోకి కాన్వాయ్ ప్రవేశిస్తుండగా ఓ వ్యక్తి చెప్పుతో దాడి చేశాడు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

13:06 - January 24, 2018
12:34 - January 24, 2018

ఖమ్మం : జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ కాసేపట్లో ఖమ్మం పట్టణం చేరుకోనున్నారు. ఖమ్మంలో ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, వరంగల్‌ జిల్లాలకు చెందిన జనసేన కార్యకర్తలతో సమావేశం అవుతారు. కొత్తగూడెంలో బయలుదేరే ముందు పవన్‌ అక్కడి ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల సమస్యలను అధ్యయనం చేసుకోవడానికే తాను యాత్ర చేపట్టినట్టు తెలిపారు. తనకు అద్భుత ఆథిత్యం ఇచ్చిన కొత్తగూడెం ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల సమస్యలు తెలుసుకోవడానికే కొత్తగూడెం వచ్చానని చెప్పారు. శ్రీజ ఆరోగ్యంగా ఉండడం సంతోషం కలిగించిందన్నారు. 

 

11:47 - January 24, 2018

ఖమ్మం : పవన్ కళ్యాణ్ ను కలిసేందుకు వెళ్తే బాడీగార్డ్స్ నెట్టేశారని పవన్ అభిమాని గుబ్బల సతీష్ ఆవేదన వ్యక్తం చేశారు. అత్తారింటికిదారేది సినిమా సందర్భంగా సినిమా ఫ్లెక్సీని కట్టేక్రమంలో గొడమీది నుంచి జారి కింద పడడంతో సతీష్  తీవ్రంగా గాయడడంతో కాళ్లు విరిగి పోయాయి. ఘటన తర్వాత కనీస పవన్ కళ్యాణ్ సతీష్ ను పరామర్శించలేదు. ఖమ్మం జిల్లాలో పర్యటన సందర్భంగా కూడా పవన్ అతన్ని పరామర్శించకపోవడం గమనార్హం. 
పవన్ ను కలిసేందుకు సతీష్ ను స్ట్రెచర్ నలుగురు వ్యక్తులు మోసుకొచ్చారు. సతీష్ ను పవన్ ఆదుకోవాలని, అతనికి చికిత్స చేయించాలని పలువురు కోరుతున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

 

11:36 - January 24, 2018

భద్రాద్రికొత్తగూడెం : జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ కొత్తగూడెం నుంచి ఖమ్మం బయలుదేరారు. కాసేపట్లో ఖమ్మం పట్టణం ఆయన చేరుకోనున్నారు. ఖమ్మంలో ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, వరంగల్‌ జిల్లాలకు చెందిన జనసేన కార్యకర్తలో సమావేశం అవుతారు. కొత్తగూడెంలో బయలుదేరే ముందు పవన్‌ అక్కడి ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల సమస్యలను అధ్యయనం చేసుకోవడానికే తాను యాత్ర చేపట్టినట్టు తెలిపారు. తనకు అద్భుత ఆథిత్యం ఇచ్చిన కొత్తగూడెం ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారాయన.  

20:34 - January 23, 2018
17:40 - January 23, 2018

కరీంనగర్ : పవన్‌ రాజకీయ ప్రస్థానం మరోసారి ఊపందుకుంది. న్నిటిదాకా ప్రజాసమస్యలపై స్పందిస్తూ వస్తున్న పవన్‌.. ప్రస్తుతం తెలంగాణలో యాత్రను కొనసాగిస్తూ మరోసారి రాజకీయాలను ఆసక్తికరంగా మార్చారు. జగిత్యాలజిల్లా కొండగట్టులో పూజలు చేసిన పవన్‌..కరీంనగర్‌ జిల్లాతో తన అనుబంధాన్ని కొనసాగించారు. మొదటిసారిగా 2009లో కరీంనగర్‌ జిల్లాలో పర్యటించిన పవన్‌.. అప్పట్లో పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు. అప్పటి ప్రజారాజ్యం పార్టీకి అనుబంధ విభాగంగా ఏర్పడిన యువరాజ్యం అధ్యక్షుడిగా పవన్‌ కళ్యాణ్‌ ప్రచారాన్ని నిర్వహించారు. ఆ సందర్భంలో ఆయన పలు అవాంతరాలు ఎదుర్కొన్నారు. తన పర్యటనకు ఉపయోగించిన వాహనం మొరాయించడంతోపాటు చివరికి విద్యుత్‌షాక్‌కు గురై ప్రాణాలతో బయటపడటం లాంటి సంఘటనలు జరిగాయి, పవన్‌ కరీంనగర్‌జిల్లాతోపాటు కొండగట్టు క్షేత్రంతో తన అనుబంధాన్ని కొనసాగించడం అభిమానుల్లో ఉత్సాహం నింపింది.

2009 జనవరి 20న కొండగట్టులో
ప్రజారాజ్యంపార్టీ ఆవిర్భావం తర్వాత 2009 జనవరి 20న కొండగట్టులో పవన్‌కల్యాణ్‌ పూజలు నిర్వహించి ప్రచారాన్ని మొదలు పెట్టారు. ప్రచారం జోరుగా సాగుతున్న తరుణంలో తన ప్రచార రథం మొరాయించడంతో పవన్‌ నానాఅవస్థలు పడ్డారు. చివరికి తన ప్రచార రథాన్ని తాడుతోకట్టి లాగించుకుంటూ మెకానిక్‌ షెడ్‌కు చేరుకోవాల్సివచ్చింది. వాహనం రిపేర్‌ అయ్యేంతవరకు దాదాపు 4గంటల పాటు వేచి ఉండాల్సి వచ్చింది. ఆ తర్వాత తిరిగి ప్రాచారం ప్రారంభించిన పవన్‌.. హుస్నాబాద్‌ పట్టణంలో తన ప్రచారరథం టాప్‌లో నిలుచుని ప్రచారం నిర్వహిస్తుండా 11కేవీ విద్యుత్‌ వైర్లు తగిలి షాక్‌కు గురయ్యారు. తీవ్ర అస్వస్థతకు గురైన పవన్‌ను అప్పట్లో ఆయన కుటుంబసభ్యులు కూడా వచ్చి పరామర్శించారు. అయితే అప్పట్లో ఆయన వెంట ఉన్న వైద్య బృందం సకాలంలో స్పందించి చికిత్స అందించడంతో అప్పటి యువరాజ్యం అధ్యక్షుడు, ఇప్పటి జనసేనాని ప్రాణాలతో బయటపడ్డారు.

దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత..
దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత పవన్‌..మరోసారి ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్‌ అభిమానులు ఆనాటి సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటున్నారు. తనకు కొండగట్టు అంజన్న అంటే చాలా భక్తి భావం ఉందని పవన్‌ మరోసారి చాటారని అభిమానులు చెప్పుకుంటున్నారు. 2009నాటి పర్యటనలో కూడా కొండగట్టులో పూజలు నిర్వహించిన ప్రచారం నిర్వహించిన పవన్‌కళ్యాణ్‌కు అనేక అవాంతరాలు ఎదురయ్యాయి. అయినా మరోసారి కొండగట్టులో పూజలు నిర్వహించి.. ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈసారైనా పవన్‌కు అన్నీ కలిసిరావాలని జనసేనపార్టీ కార్యకర్తలు, పవర్‌స్టార్‌ అభిమానులు కోరుకుంటున్నారు.

16:36 - January 23, 2018

చెన్నై : నాగబాబు కూతరు నిహారిక తెలంగాణలో పర్యటిస్తున్న బాబాయ్ పవన్ కల్యాణ్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ప్రస్తుతం ఆమె ఒరు నల్ల నాల్ పొత్తు సాల్రేవ్ తమిళ చ్రితంలో నటిస్తోంది.. ఈ చిత్రానికి అర్మిగ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో నిహరిక విభిన్న పాత్రల్లో నటిస్తున్నారు. ఫిబ్రవరి 2న ఈ చిత్రం విడుదల చేస్తామని చెబుతున్నారు. తమిళంఓ నటించడం చాలా ఆనందంగా ఉందని ఆమె అన్నారు. ఈ సందర్భంగా బాబాయ్ కి ఆమె ఆల్ ది బెస్ట్ చెప్పారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - Janasena pawan kalyan