JDS

11:51 - November 10, 2018

అమరావతి: 2019ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాకుండా, దేశంలోని బీజేపీ వ్యతిరేక శక్తులను కూడగట్టే ప్రయత్నంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల జేడీఎస్,డీఎంకే  అధ్యక్షులతో సమావేశం అయ్యారు. అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజస్ధాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ శనివారం  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తో అమరావతిలో భేటీ అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దూతగా  ఆయన చంద్రబాబుతో  చర్చలు జరపనున్నారు.  ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఢిల్లీలో  రాహుల్‌గాంధీ, శరద్‌పవార్‌, ఫరూక్‌ అబ్దుల్లా, కేజ్రీవాల్  తదితర ఉత్తారిది నాయకులతో సమావేశమై ప్రస్తుతం దక్షిణాది పార్టీల నాయకులను సంఘటితం చేసే పనిలో ఉన్నారు. ఈ నేపధ్యంలో శనివారం కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు అశోక్‌ గెహ్లాట్ అమరావతిలో చంద్రబాబుతో సమావేశంకావడం మరో ముందడుగుగా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

19:21 - November 8, 2018

బెంగుళూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశంపార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు గురువారం బెంగుళూరులో జేడీఎస్ అధినేత, కర్ణాటక మాజీ సీఎం దేవెగౌడతో, కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామితోనూ సమావేశం అయ్యారు. దేశంలో బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటులో భాగంగా చంద్రబాబునాయుడు వీరిని కలిశారు. సుమారు 40 నిమిషాలపాటు సమావేశమైన అనంతరం ముగ్గురు నేతలు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 
రాజ్యాంగ బధ్దంగా ఏర్పాటైన సంస్ధలను మోడీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని దేవెగౌడ అన్నారు. కేంద్రలోని బీజేపీని గద్దె దించాలంటే దేశంలోని లౌకికవాద పార్టీలన్నీ ఏకం కావాలని అందులో భాగంగా చంద్రబాబుతో చర్చలు జరిపామని దేవెగౌడ చెప్పారు. కూటమి బలోపేతం కోసం మిగతా పార్టీలతో కూడా చర్చలు జరపాలని చంద్రబాబుని కోరినట్లు ఆయన తెలిపారు. 
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడుతూ.... దేశంలోని రాజ్యంగ బధ్దంగా ఏర్పడ్డ సంస్ధలను అడ్డంపెట్టుకుని మోడీ ప్రభుత్వం దేశంలోని చాలా రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీలను వేధింపులకు గురిచేస్తోందని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని, వ్యవస్థలను, దేశాన్ని కాపాడాలన్నలక్ష్యంతో బెంగళూరు వచ్చానని చంద్రబాబు అన్నారు. పెట్రోల్,డీజిల్ ధరలు దేశంలో పెరిగిపోతున్నాయని,  ఆర్ధిక వ్యవస్ధ దెబ్బతిందని, రెగ్యులేటరీ బాడీ అయిన రిజర్వుబ్యాంకు ప్రస్తుతం మోడీ ప్రభుత్వ ఒత్తిడిలో ఉందని చంద్రబాబు చెప్పారు. ఈడీ, ఆదాయపుపన్ను శాఖలద్వారా గుజరాత్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లలో వేధింపులకు పాల్పడుతూ సంస్ధలను దుర్వినియోగం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. వ్యవసాయం సంక్షోభంలో పడిందని, మైనారిటీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని  చంద్రబాబు పేర్కొన్నారు.
టీడీపీ, జేడీఎస్‌ పాతమిత్రులేనని, లౌకికవాద శక్తులను ఏకం చేసే విషయంపై తాము చర్చించినట్లు కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి చెప్పారు. కూటమి ఏర్పాటులో దేవెగౌడ, చంద్రబాబు వ్యూహాలు బాగున్నాయని కుమారస్వామి అంటూ...2019 లోక్‌సభ ఎన్నికల్లో 1996నాటి పరిస్థితులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీ వ్యతిరేక శక్తులు  ఏకం చేయంటంలో భాగంగా చంద్రబాబు నాయుడు ఈవారంలోనే చెన్నై వెళ్లి డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ తోనూ సమావేశం అవుతారు. 

13:29 - November 6, 2018

కర్ణాటక : రాష్ట్రంలో మూడు లోక్ సభ, రెండు శాసనసభ స్థానాలకు జరిగిన ఉపఎన్నిలలో బీజేపీకి బేజారు పుట్టిస్తుంటే కాంగ్రెస్-జేడీఎస్ కూటమి సత్తా చాటుతోంది. ఇప్పటికే  రెండు శాసనసభ స్థానాలను కూటమి తన ఖాతాలో వేసుకుంది మహాకూటమి.  ఈ నేపథ్యంలో  ముఖ్యమంత్రి కుమారస్వామి భార్య, జేడీఎస్ అభ్యర్థి అనితా కుమారస్వామి రామనగరం నియోకవర్గం నుంచి ఏకంగా 1,09,137 ఓట్ల ఆధిక్యంతో ఘన విజయం సాధించారు. జామ్ ఖండీ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి న్యామగౌడ 39,480 ఓట్ల మెజార్టీతో జయకేతనం ఎగురవేశారు. బళ్లారి, శివమొగ్గ, మండ్య లోక్ సభ స్థానాలకు సంబంధించి ఓట్లు లెక్కింపు కొనసాగుతోంది. బళ్లారిలో కాంగ్రెస్ అభ్యర్థి ఉగ్రప్ప, మండ్యలో జేడీఎస్ అభ్యర్థి శివరామేగౌడలు పూర్తి ఆధిక్యతలో ఉన్నారు. శివమొగ్గలో బీజేపీ అభ్యర్థి రాఘవేంద్ర స్వల్ప మెజార్టీలో ఉన్నారు.
 

19:02 - September 21, 2018

కర్ణాటక : కన్నడలో రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. కుమారస్వామి ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం ముంచుకొచ్చినట్లుగా వాతావరణం వేడెక్కింది. ప్రభుత్వం ఏర్పాటుకు నానా కష్టాలు పడి ఎట్టకేలకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కుమారస్వామి ప్రభుత్వం కూలిపోనుందా? సంకీర్ణప్రభుత్వాన్ని కూల్చివేసే దిశగా బీజేపీ పావులు కదుపుతున్నట్లుగా సమాచారం. బీజేపీ నేతలు గవర్ణర్ ను కలిసేందుకు సన్నద్ధం అవతున్న నేపథ్యంలో వీటికి బలం చేకూర్చేలా వాతావరణ వేడెక్కింది. కాంగ్రెస్, జేడీఎస్ నుండి దాదాపు 20మంది ఎమ్మెల్యేలు అసమ్మతి రాగం ఆలపిస్తున్నారు. తమ డిమాండ్లకు కుమారస్వామి ఒప్పుకోవాలని ముంబై నుండి కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెలే్యలు కథను నడిపిస్తున్నారు.  దీనికోసము కాచుకుని కూర్చున్న బీజేపీ వారిని తమవైపు లాక్కుని ప్రభుత్వం ఏర్పాటుచేసే దిశగా పావులు కదుపుతోంది. దీనిపై స్పందించి ముఖ్యమంత్రి కుమార స్వామి ఒక్కో ఎమ్మెల్యేకు బీజేపీ రూ.15 కోట్లు ఎరవేసి తమవైపు లాక్కునేందుకు బీజేపీ బేరసారాలు నడుపుతోందని ఆరోపించారు. ఈ హాట్ హాట్ వాతావరణం చూస్తుంటే కుమారస్వామి సీెఎం పదవి ప్రమాదంలో పడినట్లుగా అనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

 

12:48 - May 29, 2018

కర్నాటక : కాంగ్రెస్‌ పార్టీ దయ వల్లే తాను సిఎం అయినట్లు కుమారస్వామి తెలిపారు. కాంగ్రెస్‌ అనుమతి లేకుండా తాను ఏమి చేయలేనని చెప్పారు. కర్ణాటక రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం తన బాధ్యతగా పేర్కొన్నారు. కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణ స్వీకారం చేసి 4 రోజులు గడుస్తున్నా ఇంతవరకు తన క్యాబినెట్‌ను విస్తరించలేదు. మంత్రివర్గ విస్తరణపై కర్ణాటక కాంగ్రెస్‌ నేతలు శని, ఆదివారం ఢిల్లీలో తమ అధిష్టానంతో సమావేశమైనప్పటికీ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తల్లి సోనియాతో కలిసి విదేశీ పర్యటనకు వెళ్లడంతో మంత్రివర్గ విస్తరణకు మరో నాలుగైదు రోజులు జాప్యం అయ్యే అవకాశం కనిపిస్తోంది. రాహుల్‌, సోనియా వచ్చాకే పోర్ట్‌ ఫోలియోల కేటాయింపుపై ఓ క్లారిటీ రానుందని సిద్ధరామయ్య తెలిపారు. ఆర్థిక శాఖపై కాంగ్రెస్‌-జెడిఎస్‌ల మధ్య విభేదాలు నెలకొన్నాయి. మొత్తం 34 మంత్రి పదవులకు గాను కాంగ్రెస్‌కు 22 బెర్త్‌లు దక్కనున్నాయి.

13:48 - May 18, 2018

బెంగళూరు : కర్నాటక రాజకీయాలు మరో మలుపు తిరిగాయి. కర్నాటక రాజకీయాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రేపే కర్నాటక అసెంబ్లీలో బలపరీక్ష జరుగనుంది. యడ్యూరప్ప ప్రభుత్వం బల నిరూపణకు సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎట్టిపరిస్థితుల్లో రేపు సాయంత్రం 4 గంటలకు యడ్యూరప్ప బలనిరూపణ చేసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికిప్పుడు బలపరీక్షకు సిద్ధంగా లేమని..గడువు ఇవ్వాలని బీజేపీ లాయర్ ముకుల్ రోహత్గీ కోరారు. అయితే బీజేపీ తరపు లాయర్ కోరిన గడువును కోర్టు తిరస్కరించింది. ప్రొటెం స్పీకర్ బల పరీక్ష వ్యవహారాన్ని నిర్వహిస్తారని కోర్టు తెలిపింది. ఎటువంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకోవద్దని యడ్యూరప్పను ఆదేశించింది. ఎమ్మెల్యేల భద్రతను డీజీపీ పర్యవేక్షించాలని సూచించింది. ఆంగ్లో..ఇండియన్ సభ్యుడి ఎన్నికచేపట్టవద్దని తెలిపింది. రహస్య బ్యాలెట్ కు సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రొటెం స్పీకర్ గా కాంగ్రెస్ ఆర్ వి. దేశ్ పాండే వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. అంతకముందు యడ్యూరప్ప ప్రమాణస్వీకారంపై సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. త్రిసభ్య ధర్మాసనం ముందు వాదనలు వినిపించారు. జస్టిస్ సిక్రీ నేతృత్వంలోని ధర్మాసనం ముందు వాదనలు వినిపించారు. కేంద్ర ప్రభుత్వం తరపున ఏజీ వేణుగోపాల్, కాంగ్రెస్, జేడీఎస్ తరపున అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపించారు. యడ్యూరప్ప గవర్నర్ కు ఇచ్చిన లేఖలను ఏజీ వేణగోపాల్ ధర్మాసనానికి సమర్పించారు. 

 

13:23 - May 18, 2018

బెంగళూరు : కర్నాటక రాజకీయం రసవత్తరంగా మారింది. కర్నాటక రాజకీయం హైదరాబాద్ కు చేరింది. కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేల క్యాంపు హైదరాబాద్ కు మారాయి. ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి కాంగ్రెస్, జేడీఎస్ నానా తంటాలు పడుతున్నాయి. ఎమ్మెల్యేలను హైదరాబాద్ కు తరలిస్తున్నారు. మూడు బస్సుల్లో కర్నాటక కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మేల్యేలు హైదరాబాద్ కు చేరుకున్నారు. తాజ్ కృష్ణ, గోల్కొండ హోటల్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నోవా హోటల్ లో జేడీఎస్ ఎమ్మెల్యేలు మకాం వేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డితోపాటు మరికొంతమంది కాంగ్రెస్ సీనియర్ నేతలు తాజ్ కృష్ణ హోటల్ కు చేరుకున్నారు. 

 

13:12 - May 18, 2018

ఢిల్లీ : యడ్యూరప్ప బలనిరూపణకు సుప్రీంకోర్టు ఆదేశించింది. రేపు సాయంత్రం 4 గంటలకు ఎట్టిపరిస్థితుల్లో బలనిరూపణ చేసుకోవాలని తేల్చిచెప్పింది. రేపు బలపరీక్షకు తాము సిద్ధమని యడ్యూరప్ప తెలిపారు. మ్యాజిక్ ఫిగర్ కు కావాల్సిన ఎమ్మెల్యేల బలం తమకు ఉందన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను పాటిస్తామని చెప్పారు. రేపు అసెంబ్లీ అత్యవసర సమావేశానికి గవర్నర్ ఆదేశించారు.

 

13:08 - May 18, 2018
13:02 - May 18, 2018

ఢిల్లీ : రేపే కర్నాటక అసెంబ్లీలో బలపరీక్ష జరుగనుంది. యడ్యూరప్ప బలనిరూపణకు సుప్రీంకోర్టు ఆదేశించింది. యడ్యూరప్ప బలనిరూపణ చేసుకోవాలని కోర్టు తుదితీర్పు వెలువరించింది. రేపు సాయంత్రం 4 గంటలకు ఎట్టిపరిస్థితుల్లో బలనిరూపణ చేసుకోవాలని తేల్చిచెప్పింది. ప్రొటెం స్పీకర్ బల పరీక్ష వ్యవహారాన్ని నిర్వహిస్తారని కోర్టు తెలిపింది. ఎటువంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకోవద్దని యడ్యూరప్పను ఆదేశించింది. ఎమ్మెల్యేల భద్రతను డీజీపీ పర్యవేక్షించాలని సూచించింది. ఆంగ్లో..ఇండియన్ సభ్యుడి ఎన్నికచేపట్టవద్దని తెలిపింది. రహస్య బ్యాలెట్ కు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇప్పటికిప్పుడు బలపరీక్షకు సిద్ధంగా లేమని..గడువు ఇవ్వాలని బీజేపీ లాయర్ ముకుల్ రోహత్గీ కోరారు. అయితే బీజేపీ తరపు లాయర్ కోరిన గడువును కోర్టు తిరస్కరించింది. అంతకముందు యడ్యూరప్ప ప్రమాణస్వీకారంపై సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. త్రిసభ్య ధర్మాసనం ముందు వాదనలు వినిపించారు. జస్టిస్ సిక్రీ నేతృత్వంలోని ధర్మాసనం ముందు వాదనలు వినిపించారు. కేంద్ర ప్రభుత్వం తరపున ఏజీ వేణుగోపాల్, కాంగ్రెస్, జేడీఎస్ తరపున అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపించారు. యడ్యూరప్ప గవర్నర్ కు ఇచ్చిన లేఖలను ఏజీ వేణగోపాల్ ధర్మాసనానికి సమర్పించారు. 

 

Pages

Don't Miss

Subscribe to RSS - JDS