judgement

18:24 - September 14, 2018

న్యూఢిల్లీ: ఆయన ఓ సాంకేతిక విజయాన్ని దేశానికి అందించిన అత్యంత ప్రతిభావంతుడు. రాకెట్ల ప్రయోగంలో ఓ కీలక ప్రయోగానికి నాంది పలికిన విజ్ఞాని. అప్పటివరకూ ద్రవ ఇంధనాన్ని రాకెట్ ప్రయోగంలో వినియోగించలేదు. 70వ దశకంలోనే అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఘనుడు కేరళకు చెందిన నంబి నారాయణన్. ఇస్రోలో పనిచేసిన సమయంలో మెదటిసారిగా ద్రవ ఇంధనాన్ని రాకెట్ ప్రయోగంలో ఉపయోగించిన గొప్ప శాస్త్రవేత్త. అటువంటి శాస్త్రజ్ఞుడిని మిలిటరీ రహస్యాలను మాల్దీవుల సీక్రెట్ ఏజెంట్లకు అమ్మివేశాడని ఆరోపిస్తూ 1994లో కేరళ పోలీసులు అరెస్టు చేశారు.

50 రోజుల పాటు జైలులో ఉంచారు.  ఈయనతోపాటు డి.శశికుమారన్ అనే మరోక శాస్త్రవేత్తను కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ప్లైట్ టెస్ట్ డాటాను రహస్యంగా అమ్మివేశారన్న ఆరోపణలతో ఆయనను ముగ్గురు పోలీసులు సిబీ మాథ్యూ, కెకె జోషువా, ఎస్ విజయన్ లాకప్ లో చిత్రహింసలకు గురిచేశారు.

ఆ తర్వాత ఆ కేసును సీబీఐ తీసుకోవడంతో నారాయణన్ ను నిర్దోషి అని తేల్చి వదిలేశారు. తనకు జరిగిన అన్యాయాన్ని, అవమానాన్ని వివరిస్తూ కేరళ హైకోర్టులో పిటీషన్ వేశారు. దీనిపై స్పందించిన కోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని రూ.1 లక్ష రూపాయల నష్టపరిహారాన్ని ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. దీంతో మరింత కృంగిపోయిన 70 ఏళ్ల నారాయణన్ సుప్రీంకోర్టులో తిరిగి పోరాటం ప్రారంభించారు. దీనిపై తీర్పును శుక్రావారంనాడు వెలువరిస్తూ నారాయణన్ కు రూ. 50 లక్షల నష్టపరిహారాన్ని ఇవ్వాల్సిందిగా ఆదేశించింది.

‘‘ దోషిగా..దేశద్రోహిగా ఇక నన్ను ఎవరూ పిలవలేరు. నన్ను ఈ కేసులో ఇరికించిన పోలీసలు వాళ్లు ఎంత తప్పు చేశారో అర్థమయితే చాలు. సుప్రీంకోర్టు తీర్పు నాకు ప్రశాంతతను ఇచ్చింది. నేను ఇప్పుడు నా కుటుంబంతో సంతోషంగా జీవించగలను..‘‘  అంటూ నారాయణన్ కోర్టు తీర్పు అనంతరం ఎన్డీటీవీతో తన ఆవేదనను పంచుకున్నారు.

 

18:47 - September 10, 2018

హైదరాబాద్ : 2007 నాటి జంట పేలుళ్ల కేసులో ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు తీర్పును వెల్లడించింది. ప్రధాన నిందితులైన అనీక్ సయీద్, ఇస్మాయిల్ చౌధురీలకు సోమవారం నాడు మరణ శిక్షను ఖరారు చేసింది. మూడో నిందితుడు తారిక్ అన్జుమ్ కు జీవిత ఖైదును విధించింది. న్యాయమూర్తి స్వయంగా చర్లపల్లి జైలును సందర్శించి అక్కడే తీర్పును విడుదల చేశారు.

2007 ఆగస్టు 25 న కోఠిలోని గోకుల్ చాట్, లుంబినీ పార్కులలో బాంబులను అమర్చి 40 మంది మృతికి, 75 మందికి పైగా గాయపడేందుకు నిందితులు కారణమయ్యారు. నిందితులకు కఠిన శిక్షలు విధించడం పట్ల బాధితులు హర్షం వ్యక్తం చేశారు.

14:37 - December 27, 2017

ప్రస్తుతం ఉన్న ఆధునిక సమాజంలో డైవర్స్ కేసులు పెరిగాయని, భార్య, భర్తలు వీడిపోయిన తర్వాత పిల్లలు ఎవరికి చెందుతారో తెలపాడానికి, న్యాయ సలహాల గురించి వివరించడానికి ప్రముఖ అడ్వకేట్ పార్వతి గారు మావని మై రైట్ వచ్చారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

22:13 - September 7, 2017

గోవా : లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న తెహల్కా ఎడిటర్‌ తరుణ్‌ తేజ్‌పాల్‌కు గోవా కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తరుణ్‌పై అభియోగాలు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 28కి వాయిదా వేసింది. 2013 నవంబర్‌లో గోవాలోని ఓ ఫైఫ్ స్టార్ హోటల్‌లో తేజ్‌పాల్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డారంటూ మహిళా జర్నలిస్టు ఆరోపణలు చేశారు. హోటల్‌లోని ఓ లిఫ్టులోకి లాగి తేజ్‌పాల్ తనను వేధించారంటూ బాధితురాలు తెహెల్కా మేనేజింగ్ ఎడిటర్ షోమా చౌధురీకి ఫిర్యాదు చేశారు. తేజ్‌పాల్‌పై ఐపిసి 341, 342, 376 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసు ఫైనల్‌ ఛార్జ్‌షీటులో 376 సెక్షన్‌ తొలగించారని తేజ్‌పాల్‌ తరపు న్యాయవాది ప్రమోద్‌ దూబె అన్నారు. అదనంగా 354-బి సెక్షన్‌ పొందుపరచినట్లు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ తవోరా తెలిపారు.  

 

16:45 - August 30, 2017

హైదరాబాద్ : 2012లో మౌలాలీ వద్ద తెలంగాణ ఉద్యమకారులు రైల్ రోకో నిర్వహించిన కేసులో సికింద్రాబాద్ రైల్వే కోర్టు తుది తీర్పు వెలువరించింది. ఈ కేసులో 11 మంది ఉద్యమకారులతో పాటు ఇప్పుడు మంత్రులుగా ఉన్న కేటీఆర్, నాయిని నర్సింహారెడ్డి, కత్తి పద్మారావులు ఉన్నారు. అయితే వీరిలో ముగ్గురు మంత్రులతో పాటు మరొకరిపై ఎటువంటి సాక్ష్యాధారాలు లేనందున కేసును కొట్టివేస్తూ తుది తీర్పు ప్రకటించింది. 5 సంవత్సరాల సుదీర్ఘ విచారణ అనంతరం కేసును కొట్టివేసినట్లు పిటిషనర్ల తరపు న్యాయవాది విద్యాకర్ చెప్పారు. 

 

11:20 - May 5, 2017

ఢిల్లీ : నిర్భయ కేసులో సుప్రీంకోర్టు నేడు కీలక తీర్పు ఇవ్వనుంది. త్రిసభ్య ధర్మాసనం ఈ తీర్పు వెల్లడించనుంది. ఈ కేసులో ప్రత్యేక కోర్టు నలుగురు నిందితులకు ఉరిశిక్ష విధించింది. వీరు ఆ తీర్పును హైకోర్టులో సవాల్ చేశారు. హైకోర్టు కూడా క్రింది కోర్టు తీర్పును సమర్ధించింది. దీంతో వారు సుప్రీం కోర్టుకు వెళ్లారు. ఈ మధ్యలో నిందుతుల్లో రామ్ సింగ్ 2013 మార్చిలో తీహర్ జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. మరో నిందితుడు, మైనర్ మూడేళ్ల శిక్షను అనుభవించాడు. 2012లో ఢిల్లీలో యువతిని అత్యంత పాశవికంగా అత్యచారం, హత్య చేసిన విషయం తెలిసిందే.

 

 

12:23 - November 21, 2016

హైదరాబాద్ : దిల్ సుక్ నగర్ జంటపేలుళ్ళ కేసు వాయిదా పడింది. దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన జంటపేలుళ్ళ కేసును డిసెంబర్ 13కు వాయిదా ఎన్ ఐఏ ప్రత్యేక కోర్టు వాయిదా వేసింది. నిందితులకు ఎటువంటి శిక్ష పడుతుందని ఎదురు చూసిన వారికి నిరాశ ఎక్కువైంది. ఇప్పటికే ఈ ఘటన జరిగి మూడున్నర సంవత్సరాలు అయిన విషయం తెలిసిందే. 2013 ఫిబ్రవరి 21 సాయంత్రం అత్యంత రద్దీగా ఉండే హైదరాబాద్‌ దిల్‌సుఖ్‌నగర్‌ ప్రాంతంలోని ఏ వన్‌ మిర్చి సెంటర్‌ వద్ద... నాలుగు నిమిషాల వ్యవధిలో కోణార్క్‌ థియేటర్‌ వద్దగల ఆనంద్‌ టిఫిన్‌ సెంటర్‌ దగ్గర బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ జంటపేలుళ్లలో 18 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. మరో 138 మంది గాయపడిన విషయం తెలిసిందే. 

10:25 - November 21, 2016

హైదరాబాద్ : దిల్ సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసులో నేడు ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు తుది తీర్పు వెలువరించనుంది. ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు నిందితులకు శిక్ష ఖరారు చేయనుంది. కాగా వీరికి న్యాయస్థానం ఎటువంటి శిక్షను విధించనుందో అనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 2013 ఫిబ్రవరి 21 సాయంత్రం అత్యంత రద్దీగా ఉండే హైదరాబాద్‌ దిల్‌సుఖ్‌నగర్‌ ప్రాంతంలోని ఏ వన్‌ మిర్చి సెంటర్‌ వద్ద... నాలుగు నిమిషాల వ్యవధిలో కోణార్క్‌ థియేటర్‌ వద్దగల ఆనంద్‌ టిఫిన్‌ సెంటర్‌ దగ్గర బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ జంటపేలుళ్లలో 18 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. మరో 138 మంది గాయపడిన విషయం తెలిసిందే.రియాజ్ బక్తల్, అసదుల్లా అక్తల్, అక్తర్ అలియాస్ మెల్, హర్, యాసిన్ బక్తల్, యజాజ్ లు ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకోగా, రియాజ్ బక్తల్ పరారీలో ఉన్నారు. నిందితులపై దేశద్రోహం, హత్యానేరం, పేలుడు పదార్ధాల యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, ఈ కేసులో 157మంది సాక్షులను విచారించిన కోర్టు.. ఇందుకు సంబంధించిన 502 డాక్యుమెంట్లను పరిశీలించింది.మొత్తం 157 మంది సాక్షులను విచారించిన న్యాయస్థానం
ఎన్‌ఐఏ దాఖలు చేసిన చార్జిషీటు ఆధారంగా ప్రత్యేక కోర్టు కేసు విచారణ పూర్తి చేసింది. మొత్తం 157 మంది సాక్షులను విచారించింది. ఎన్‌ఐఏ అందజేసిన 502 డాక్యుమెంట్లను, ఘటనా స్థలంలో సేకరించిన 201 మెటీరియల్స్‌ను కోర్టు పరిశీలించింది. నిందితుల తరఫు న్యాయవాదుల వాదనలనూ విన్న న్యాయస్థానం సోమవారం కీలక తీర్పు వెలువరించనుంది. ఈ నేపథ్యంలో ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు పరిసరాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. 

07:04 - November 21, 2016

హైదరాబాద్‌: నగరంతోపాటుతో పాటు.. యావద్దేశాన్నీ ఉలికిపడేలా చేసిన దిల్‌షుక్‌నగర్‌ బాంబు పేలుళ్ల కేసు తుదిదశకు చేరింది. ఎన్ ఐఏ న్యాయస్థానం ఈ కేసులో దోషులను నిర్ధరించడంతో పాటు శిక్ష ఖరారు చేయనుంది.

కోణార్క్‌ థియేటర్‌ వద్దగల ఆనంద్‌ టిఫిన్‌ సెంటర్‌ దగ్గర బాంబు పేలుళ్లు
2013 ఫిబ్రవరి 21 సాయంత్రం అత్యంత రద్దీగా ఉండే హైదరాబాద్‌ దిల్‌సుఖ్‌నగర్‌ ప్రాంతంలోని ఏ వన్‌ మిర్చి సెంటర్‌ వద్ద... నాలుగు నిమిషాల వ్యవధిలో కోణార్క్‌ థియేటర్‌ వద్దగల ఆనంద్‌ టిఫిన్‌ సెంటర్‌ దగ్గర బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ జంటపేలుళ్లలో 18 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. మరో 138 మంది గాయపడ్డారు.

సాక్ష్యాధారాలతో ప్రత్యేక కోర్టులో ఎన్ ఐఏ చార్జిషీటు
జంటపేలుళ్లపై విచారణ ప్రారంభించిన ఎన్ ఐఏ ఇండియన్‌ ముజాహిదీన్‌ సంస్థ సభ్యులే ఈ ఘటనకు పాల్పడినట్లు తేల్చింది. తగిన సాక్ష్యాధారాలతో ప్రత్యేక కోర్టులో ఎన్ ఐఏ చార్జిషీటు దాఖలు చేసింది. ఆరుగుర్నిప్రధాన నిందితులుగా చేర్చింది. ఏ-1గా రియాజ్‌ భత్కల్‌, ఏ-2గా అసదుల్లా భత్కల్‌, ఏ-3గా అక్తర్‌ అలియాస్‌ మోను, ఏ-4గా వకాస్‌, ఏ-5గా యాసిన్‌ భత్కల్‌, ఏ-6గా ఇజాజ్‌లను చార్జిషీట్‌లో చేర్చింది. వీరిలో ప్రధాన నిందితుడు యాసిన్‌ భత్కల్‌ మినహా మిగిలిన అందరూ జైల్లో ఉన్నారు. యాసిన్‌ భత్కల్‌ పాకిస్థాన్‌లో ఉన్నట్టు ఎన్‌ఐఏ అధికారులు కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ కేసులో ఏ-6గా ఇజాజ్‌ పేలుళ్లకు అవసరమైన ఆర్థిక సహాయం అందించాడన్న సాక్ష్యాధారాలను ఎన్‌ఐఏ కోర్టుకు సమర్పించారు. నిందితులపై ఐపీసీలోని వివిధ సెక్షన్లతో పాటు, 1967 దేశద్రోహ చట్టంలోని సెక్షన్ల కిందా కేసు పెట్టారు.

మొత్తం 157 మంది సాక్షులను విచారించిన న్యాయస్థానం
ఎన్‌ఐఏ దాఖలు చేసిన చార్జిషీటు ఆధారంగా ప్రత్యేక కోర్టు కేసు విచారణ పూర్తి చేసింది. మొత్తం 157 మంది సాక్షులను విచారించింది. ఎన్‌ఐఏ అందజేసిన 502 డాక్యుమెంట్లను, ఘటనా స్థలంలో సేకరించిన 201 మెటీరియల్స్‌ను కోర్టు పరిశీలించింది. నిందితుల తరఫు న్యాయవాదుల వాదనలనూ విన్న న్యాయస్థానం సోమవారం కీలక తీర్పు వెలువరించనుంది. ఈ నేపథ్యంలో ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు పరిసరాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. 

19:55 - November 8, 2016

హైదరాబాద్ : అమరావతి నిర్మాణాలకు పర్యావరణ అనుమతుల మంజూరును సవాల్‌ చేస్తూ... గ్రీన్‌ ట్రిబ్యునల్‌లో వాదనలు వినిపించారు సీనియర్‌ న్యాయవాది రిత్విక్‌ దత్తా. ఇంతపెద్ద ప్రాజెక్టు ఏ కేటగరి కింద పరిగణించబడుతుందని, రాష్ర్టస్థాయి పర్యావరణ సంస్థకు అనుమతులు జారీచేసే పరిధి ఉండదన్నారు. 500 హెక్టార్లకు పైబడితే కేంద్రమంత్రి స్థాయి పర్యావరణ అధ్యయనం బృందం పర్యవేక్షించాల్సి ఉంటుందన్నారు. తదుపరి వాదనలను గ్రీన్‌ ట్రిబ్యునల్‌ రేపటికి వాయిదా వేసింది. 

 

Pages

Don't Miss

Subscribe to RSS - judgement