juice

19:28 - March 15, 2017

ఎండాకాలం వచ్చేసింది. దీనితో ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదురుకానున్నాయి. ఎండల వల్ల డీ హైడ్రేషన్ తో పాటు చర్మ సంబంధిత రోగాలు వచ్చే అవకాశాలున్నాయి. దీనితో ఎండకాలం నుండి తప్పించుకోవడానికి పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అందులో ప్రధానమైంది తాజా పండ్ల రసాలను తీసుకోవడం. క్యారెట్..బీట్ రూట్..దానిమ్మ..సంత్రా..ఇలా పండ్ల రసాలను తీసుకోవడం వల్ల ఆరోగ్యం మేలుగా ఉంటుంది. ఆరెంజ్ జ్యూస్ లో విటమిన్ సి ఎక్కువగా ఉండడం వల్ల ఇది సూర్యుని నుండి వచ్చే కిరణాల ప్రభావం చర్మంపై పడకుండా చేస్తుంది. క్యారెట్ జ్యూస్ లో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలోని ఫ్రీ రాడికల్స్ ను తొలగిస్తుంది. దానిమ్మ జ్యూస్‌ను రెగ్యులర్‌గా తాగడం వల్ల గ్లోయింగ్‌ స్కిన్‌ పొందవచ్చు. ఇది అన్ని రకాల చర్మ సమస్యలను నివారిస్తుంది. ద్రాక్ష జ్యూస్‌ను తీసుకోవడం ద్వారా వేసవిలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది.

14:45 - February 4, 2016

మన శరీరంలో చేరిన టాక్సిన్స్ (వ్యర్థాలను)బయటకు నెట్టివేయడానికి, శరీరం రోజంతా తేమగా, ఆరోగ్యంగా ఉండటానికి నీరు చాలా అవసరం. ఆరోగ్యానికి మాత్రమే కాదు, యవ్వనంగా గ్లోయింగ్‌ స్కిన్‌తో చర్మం ప్రకాశవంతంగా మెరుస్తుండాలంటే నీరు అత్యంత అవసరం. అయితే, ప్లెయిన్‌ వాటర్‌ మాత్రమే ఎందుకు జ్యూసులెందుకు తాగకూడదు. జ్యూసులు మన శరీరానికి అవసరమయ్యే యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, మినిరల్స్ ను పుష్కలంగా అందిస్తాయి.
క్యారెట్‌ జ్యూస్‌: క్యారెట్‌ జ్యూస్‌లో విటమిన్‌ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలోని ఫ్రీరాడికల్స్ ను తొలగిస్తుంది. దాంతో చర్మం ప్రకాశవంతంగా మెరుస్తుంటుంది. అలాగే స్కిన్‌ పిగ్మెంటేషన్‌నివారిస్తుంది.
దానిమ్మ జ్యూస్‌: ఇది చర్మాన్ని మరమత్తు చేయడం మాత్రమే కాదు, కొత్తగా చర్మ కణాలు ఏర్పడుటకు కూడా సహాయపడుతుంది. దానిమ్మ జ్యూస్‌ను రెగ్యులర్‌గా తాగడం వల్ల గ్లోయింగ్‌ స్కిన్‌ పొందవచ్చు. ఇది అన్ని రకాల చర్మ సమస్యలను నివారిస్తుంది.
ద్రాక్ష జ్యూస్‌: ఈ జ్యూస్‌లో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. ప్రతి రోజూ గ్రేప్‌ జ్యూస్‌ను తాగడం వల్ల మీ చర్మం తాజాగా ఉంటుంది. అలాగే చర్మంలో రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది.
టమోటో జ్యూస్‌: టమోటాల్లో లైకోపిన్‌ అధికంగా ఉంటుంది. ఇది బాడీలో యాంటీఆక్సిడెంట్స్ ను తొలగించి చర్మం కాంతివంతం చేస్తుంది. జిడ్డు చర్మాన్ని నివారిస్తుంది. టమాటాలను జ్యూస్‌లా చేసుకుని కొద్దిగా ఉప్పు లేదా చక్కెర వేసుకుని తీసుకుంటే చర్మానికి నిగారింపు వస్తుంది. అలాగే ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుంది.
కీర జ్యూస్‌: కుకుంబర్‌ జ్యూస్‌ స్కిన్‌ పిగ్మెంటేషన్‌ తగ్గిస్తుంది. దాంతో చర్మంలో ఎలాంటి స్కార్స్, మార్క్స్ కనబడవు. ఇందులో వాటర్‌ కంటెంట్‌ అధికంగా ఉండటం వల్ల శరీరంలోని టాక్సిన్స్‌ను ఎఫెక్టివ్‌ గా తొలగిస్తుంది. కిడ్నీలను శుభ్రపరిచి అధికంగా ఉండే రక్తపీడనాన్ని తగ్గిస్తుంది. కీళ్ళ వ్యాధులను తగ్గించడంలో బాగా పనిచేస్తుంది.
ఆరెంజ్‌ జ్యూస్‌: దీనిలో విటమిన్‌ సి ఎక్కువగా ఉంటుంది. ఇది సూర్యుని నుంచి వచ్చే అల్ట్రావయోలెట్‌ కిరణాల ప్రభావం చర్మంపై పడకుండా చేస్తుంది. చర్మం ముడుతలు పడకుండా, టైట్‌గా ఉంచే కొలాజిన్‌ను ఉత్పత్తి చెయ్యడంలో సహాయపడుతుంది. 

Don't Miss

Subscribe to RSS - juice