Kadapa Steel Plant

19:29 - July 22, 2018

చిత్తూరు : వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ ఒక్క సీటు గెలిచినా తాను రాజకీయాల నుండి తప్పుకుంటానని డిప్యూటి సీఎం కేఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో సబ్ రిజిష్ట్రార్ల కార్యాలయాల్లో పనిచేస్తున్న జూ.అసిస్టెంట్ లకు పదోన్నతి కల్పించడంలో అవకాశం కల్పించిన కేఈ కృష్ణమూర్తి సబ్ రిజిష్ట్రార్ల సంఘం సన్మానించింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఇటు అసెంబ్లీ..అటు పార్లమెంట్ లలో పారిపోయిన వైసీపీని ప్రజలు నమ్మరని తెలిపారు. చట్టసభల్లో డిమాండ్ చేయకుండా బజార్లలోకి వచ్చి బంద్ కు పిలుపునివ్వడం సరికాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. 

17:27 - July 21, 2018

కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాసం తీర్మానంపై లోక్ సభలో నిన్న చర్చ జరిగింది. అవిశ్వాసం వీగిపోయింది. ఏపీలో రాజకీయాలు హీటెక్కాయి. పైచేయి మాదంటే మాదని పార్టీలు పోటీపడుతున్నాయి. కేంద్రం మళ్లీ పాత పాటే పాడిందని సీఎం చంద్రబాబు అన్నారు. నాలుగేళ్లుగా హామీల కోసం ప్రధాని మోదీని విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదన్నారు. మంగళవారం ఏపీ బంద్ కు వైసీపీ అధినేత జగన్ పిలుపు ఇచ్చారు. అవిశ్వాసంపై చర్చలో ఏ ఒక్కరూ ప్రత్యేకహోదాపై, విభజన హామీలపై మాట్లాడలేదన్నారు. ప్రత్యేకహోదా ఇచ్చే శక్తి కాంగ్రెస్ కు మాత్రమే ఉందని కాంగ్రెస్ ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి అన్నారు. బీజేపీ, టీడీపీ, వైసీపీలు మోసాకారి పార్టీలని విమర్శించారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో రాజకీయ విశ్లేషకులు లక్ష్మీనారాయణ, బీజేపీ ఏపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీవిష్ణు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి గంగాధర్, జనసేన అధికార ప్రతినిధి అద్దెపల్లి శ్రీధర్, టీడీపీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్, వైసీపీ అధికార ప్రతినిధి మధన్ మోహన్ రెడ్డి పాల్గొని, మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియలో చూద్దాం.. 

19:51 - July 17, 2018

ఢిల్లీ : పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో అన్నీ పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఇప్పటికే కేంద్రంపై టీడీపీ అవిశ్వాస తీర్మాన నోటీసు ఇచ్చింది. అయితే... టీడీపీ పెట్టిన అవిశ్వాసాన్ని ఎదుర్కొనేందుకు తాము సిద్దంగా ఉన్నామని బీజేపీ అంటోంది. అయితే దీనిని ఎదుర్కొనేందుకు బీజేపీ ఎలాంటి పథక రచనతో ముందుకెళ్తుందనే దానిపై ఎంపీ జీవీఎల్‌ నర్సింహారావుతో టెన్ టివి ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

19:01 - July 17, 2018

ఢిల్లీ : టీడీపీ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు ఫైర్ అయ్యారు. కడప స్టీల్ ప్లాంట్ విషయంలో ఏడు నెలలుగా కేంద్రానికి సమాచారం ఇవ్వకుండా చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారని అన్నారు. ఎంపీల చేత దొంగ దీక్షలు చేయించారని మండిపడ్డారు. నాటకీయ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. అవినీతి, ప్రచారం మీకు కావలి అని చంద్రబాబు ఉద్ధేశించి మాట్లాడారు. చంద్రబాబు.. దగా రాజకీయాలకు వెనుకాడరని అన్నారు. టీడీపీ పాలన....ప్లాప్ అయిన సినిమా ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలన్నీ కేంద్ర ప్రభుత్వ సహాయం చేసినవేనని తెలిపారు. రాష్ట్ర నిధులతో పోలవరం ప్రాజెక్టుకు చంద్రబాబు ఏం చేయలేదన్నారు. టీడీపీ ఎంపీలు ఢిల్లీలో డ్రామాకు తెరతీస్తున్నారని విమర్శించారు. తక్కువ పరిజ్ఞానం కలిగినవారు పార్లమెంట్ లో చర్చకు వస్తే పూర్తిగా ఎండగడతామన్నారు. కుటుంబరావు అబద్ధాలు చెబుతున్నారని పేర్కొన్నారు.

 

21:05 - July 11, 2018

అనంతపురం : ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేసిన మోదీకి రోజులు దగ్గర పడ్డాయని రాష్ట్ర మంత్రులు, టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు హెచ్చరించారు. 2019 ఎన్నికల్లో రాష్ట్రంలోని 25 లోక్‌సభ స్థానాల్లో టీడీపీని గెలిపిస్తే చంద్రబాబు సూచించిన నేత ప్రధాని అవుతారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కరవు నేలపై కేంద్ర వివక్ష పేరుతో అనంతపురంలో టీడీపీ నిర్వహించిన నిరసన దీక్షలో ప్రసంగించిన ఎంపీలు, మంత్రులు... బీజేపీ, వైసీపీ, జనసేనను టార్గెట్‌ చేశారు. రాయలసీమ జిల్లాలకు కేంద్ర ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని నిరసిస్తూ టీడీపీ ప్రజాప్రతినిధులు అనంతపురంలో దీక్ష చేశారు. బుధవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆందోళన నిర్వహించారు. దీక్షా వేదికపై ఏర్పాటు చేసిన ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నిరసన ప్రారంభించారు.
నిరసన దీక్షలో ప్రసంగించిన సమాచార శాఖ మంత్రి కాల్వ శ్రీనివాసులు... ప్రధాని మోదీని టార్గెట్‌ చేశారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర ఓటర్లు 25 మంది టీడీపీ ఎంపీలను గెలిపిస్తే... అన్ని హక్కులు సాధించుకోవచ్చన్నారు. 2019 ఎన్నికల తర్వాత కేంద్రంలో చక్రం తప్పేది చంద్రబాబేనని టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్‌, కేశినేని నాని చెప్పారు.

రాయలసీమ.. ముఖ్యంగా అనంతపురం ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబును మరోసారి ముఖ్యమంత్రిగా చూడాల్సిన అవసరం ఉందని ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి చెప్పారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఇచ్చిన 350 కోట్ల రూపాయల నిధులను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోడాన్ని ఎంపీ తోట నరసింహం తప్పుపట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్‌పై ఆరోపణలు చేస్తున్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై ఎంపీ నిమ్మల కిష్టప్ప మండ్డిపడ్డారు. కరువు సీమపై కేంద్ర వివక్షకు నిరసనగా టీడీపీ నిర్వహించిన నిరసన దీక్షకు పార్టీ శ్రేణులు, ప్రజలు భారీగా తరలివచ్చారు.

16:29 - July 11, 2018

హైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అభివృద్ధికి కృషి చేస్తుంటే భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సహకరించడం లేదని టిడిపి ఎంపీ కింజారపు రామ్మోహన్‌నాయుడు పేర్కొన్నారు. వెనుకబడిన ప్రాంతాలకు కేంద్రం చేసిన అన్యాయంపై నిరసన వ్యక్తం చేస్తూ టిడిపి మంత్రులు, ఎంపీలు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...కేంద్రం కల్లబొల్లి మాటలు చెబుతోందని, ఈ గడ్డపై ఎంతో మంది వీరులు పుట్టారని..వారి ఉద్యమ స్పూర్తిని తీసుకొని పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాలని పేర్కొన్నారు. అభివృద్ధికి మోడీ సహకరించాలని..కానీ అలా చేయడం లేదన్నారు. కరవు జిల్లా..ఎడారిగా మారుతున్న జిల్లాలో సంకల్పం పూనుకుని కాల్వలు..చెరువులు..నీళ్లతో నింపిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడికి దక్కుతుందన్నారు. అనంతపురం జిల్లాలో స్వచ్చమైన నీరు తాండవం చేస్తోందని, ఉద్యోగాలు..ఉపాధి కోసం..కడుపు మంటతో వలసలు వెళ్లిన కుటుంబాలను చూసి ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటుకు కృషి చేయడం జరుగుతోందని తెలిపారు. కియో పరిశ్రమ ఏర్పాటు చేసి వలసల నివారణకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఏపీ రాష్ట్రం..జాతిపై చిన్న చూపు చూస్తున్నారని తెలిపారు. 

16:25 - July 11, 2018

అనంతపురం : టిడిపి మంత్రులు..ఎంపీలు జనసేన అధ్యక్షుడు పవన్ ను టార్గెట్ చేశారు. వెనుకబడిన ప్రాంతాలకు కేంద్రం చేసిన అన్యాయంపై నిరసన వ్యక్తం చేస్తూ టిడిపి మంత్రులు, ఎంపీలు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మంత్రులు, ఎంపీలు మాట్లాడారు. ఈ సందర్భంగా పవన్ పై తీవ్ర ఆరోపణలు..విమర్శలు గుప్పించారు. బాబు..లోకేష్ లపై పవన్ చేస్తున్న ఆరోపణలను ఎంపీలు తిప్పికొట్టారు.

పవన్ ను చూస్తే బాధేస్తోందని..ప్రజారాజ్యాన్ని ప్రజలు నమ్మారని..కానీ వారు మాత్రం కోట్ల రూపాయల కొల్లగొట్టారని ఆరోపించారు. పవన్ అవినీతి గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. కోట్ల రూపాయలు తీసుకెళ్లి బీఫారాలు తీసుకున్నారని..ఇది వాస్తవం కాదా ? అని ప్రశ్నించారు. ఇవన్నీ పవన్ కు తెలియదా ? అని నిలదీశారు. ప్రజల్లో మమేకమవుతే రాజకీయాలు తెలుస్తాయని, కేంద్రంతో డబ్బులు తీసుకుని బీజేపీ ఏది చెబితే అదే చేస్తున్నాడని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. 

20:02 - July 3, 2018

గుంటూరు : విశాఖ రైల్వేజోన్‌, కడప ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించి ఇప్పటికే కేంద్రం నిర్ణయం తీసుకుందని... టీడీపీ అనవసర రాద్ధాంతం చేస్తోందని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు అన్నారు. ఎంపీ సీఎం రమేశ్‌ దీక్ష బూటకపు దీక్ష అని, ఆయన దీక్షకు గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో ఎక్కించాలన్నారు. ఎన్నికల కోసమే టీడీపీ ఇలాంటి దీక్షలు చేస్తుందంటున్న విష్ణుకుమార్‌ రాజుతో టెన్ టివి ఫేస్‌ టు ఫేస్‌ నిర్వహించింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

07:46 - July 1, 2018

కడప ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని వక్తలు అన్నారు. రాష్ట్ర విభజన హామీలను అమలు చేయడంలో కేంద్రానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో కాంగ్రెస్ నేత గంగాధర్, బీజేపీ నేత బాజీ, టీడీపీ నేత నాగుల్ మీరా పాల్గొని, మాట్లాడారు. ఎంపీ సీఎం రమేష్ దీక్ష ఎన్నికల స్టంట్ అని బీజేపీ, కాంగ్రెస్ నేతలు విమర్శించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

21:02 - June 30, 2018

కడప : కేంద్రం సహకరించినా సహకరించకపోయినా ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఈ మేరకు కడపలో ఉక్కు పరిశ్రమ కోసం దీక్ష చేస్తున్న ఎంపీ సీఎం రమేశ్‌ దీక్షను చంద్రబాబు నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. సీఎం రమేశ్‌, బీటెక్‌ రవిల దీక్ష జిల్లాకే పరిమితం కాలేదని....కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఇదే సంకల్పంతో ముందుకు సాగుదామన్నారు. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆమరణ దీక్ష చేస్తున్న టీడీపీ ఎంపీ సీఎం రమేశ్‌ దీక్ష విరమించారు. సీఎం రమేశ్‌ను పరామర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.... రమేశ్‌కు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. ఉక్కు పరిశ్రమ కోసం సీఎం రమేశ్‌, ఎమ్మెల్సీ బీటెక్‌ రవిలు జూన్‌ 19న ఆమరణ దీక్ష చేపట్టారు. ఏడు రోజులు దీక్ష అనంతరం బీటెక్‌ రవి ఆరోగ్యం క్షీణించగా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. 11 రోజులు దీక్ష అనంతరం రమేశ్‌, రవిల దీక్షను సీఎం చంద్రబాబు విరమింపజేశారు.

ఆమరణ దీక్షతో ఇద్దరి ఆరోగ్య పరిస్థితి చాలా వరకు దెబ్బతినే పరిస్థితి వచ్చిందన్నారు సీఎం. పవిత్రమైన భావం, చిత్తశుద్ధితో రమేశ్‌ దీక్ష చేశారన్నారు. దీక్షలపై ప్రతిపక్ష నేతలు అనవసర విమర్శలు మానుకోవాలని చంద్రబాబు సూచించారు. విభజన చట్టం ప్రకారం ఆరు నెలల్లో పరిశ్రమ ఏర్పాటు చేయాల్సి ఉందని... ఏపీకి అన్యాయం చేస్తే వదిలే ప్రసక్తే లేదని చంద్రబాబు అన్నారు.

రెండు నెలల్లోపు ఉక్కు పరిశ్రమపై కేంద్రం నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు. కేంద్రం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తే సగం ఖర్చు భరిస్తామన్నారు. కేంద్రం ముందుకు రాకపోతే రాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఏదేమైనా ఓ కమిటీ వేస్తామని.. పార్లమెంట్‌లో పోరాడతామని చంద్రబాబు అన్నారు. కడపలో ఉక్కు పరిశ్రమ నెలకొల్పి తీరుతామని.....ప్రజలు అధైర్యపడవద్దని సూచించారు. వ్యక్తిగత ప్రయోజనం కోసం దీక్ష చేయలేదన్నారు ఎంపీ సీఎం రమేశ్‌. చంద్రబాబు ఇచ్చిన హామీల మేరకే దీక్ష విరమించామని స్పష్టం చేశారు. తన దీక్షకు సహకరించిన వారందరికీ సీఎం రమేష్‌ ధన్యవాదాలు తెలిపారు. ఎంపీ సీఎం రమేశ్, బీటెక్‌ రవిలు దీక్ష విరమించి సంఘటితంగా పోరాటానికి సిద్ధమవుతున్నారని సీఎం తెలిపారు. ఉక్కు సంకల్పం కోసం పోరాటాన్ని మరింత ముందుకు తీసుకుపోతామన్నారు.

Pages

Don't Miss

Subscribe to RSS - Kadapa Steel Plant