kamal haasan

06:58 - June 5, 2018

చెన్నై : తమిళ నటుడు, మక్కల్‌ నీది మయ్యం పార్టీ అధినేత కమల్‌ హసన్‌- కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామితో భేటి అయ్యారు. కావేరి నదీ జలాల వివాదంపై సిఎంతో చర్చించారు. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న రైతుల సమస్యలపై చర్చించామని సిఎం కుమారస్వామి చెప్పారు. కావేరీ జలాలపై చర్చలు జరిపేందుకు తమిళనాడు సిద్ధంగా ఉంటే తాను అందుకు సుముఖమేనని కుమారస్వామి తెలిపారు. కావేరి జల వివాదం పరిష్కారానికి రెండు రాష్ట్రాల మధ్య వారధిగా నిలిచేందుకు తాను సిద్ధమేనని కమల్‌హసన్‌ అన్నారు. కర్ణాటకలో రజనీకాంత్‌ 'కాలా' సినిమా విడుదలపై తాను సిఎంతో మాట్లాడలేదని కమల్‌ స్పష్టం చేశారు.

21:35 - November 8, 2017
21:56 - November 7, 2017

తమిళనాడు : ప్రముఖ తమిళ నటుడు కమల్‌హసన్‌ రాజకీయాల్లోకి రావడం దాదాపు ఖరారైంది. పార్టీ పేరును ఇంకా ప్రకటించలేదు కానీ... దానిపై ఓ స్పష్టత ఇచ్చారు....జనవరి తర్వాత మరో వంద రోజుల్లో పార్టీని ప్రకటిస్తానని కమల్‌హసన్ చెప్పారు. 'మయ్యం విజిల్‌ ' పేరిట యాప్‌ను ప్రారంభించడం ద్వారా ప్రజా ఉద్యమ వేదికకు శ్రీకారం చుట్టారు. 

తన 63వ పుట్టినరోజు సందర్భంగా కమల్‌హసన్‌ చెన్నైలోని ఓ స్టార్‌ హోటల్‌లో తన అభిమానులతో సమావేశమయ్యారు. తన పుట్టిన రోజున కమల్‌హసన్‌ రాజకీయ పార్టీని ప్రకటిస్తారని అభిమానులు ఊహించారు. కానీ...కమల్‌ పార్టీని ప్రకటించకున్నా... దానిపై ఓ స్పష్టత నిచ్చారు. ఇప్పటికిప్పుడు పార్టీ ప్రకటించడం సాధ్యం కాదని...అందుకే ముందస్తు కార్యాచరణకు సిద్ధమవుతున్నామని కమల్‌ చెప్పారు. 2018 జనవరి తర్వాత పార్టీ పేరు...విధి విధానాలు, ప్రణాళికలు, సిద్ధాంతాలను ప్రకటిస్తానని కమల్‌ హసన్‌ స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా 'మయ్యం విజిల్‌' యాప్‌ను కమల్‌హసన్ ప్రారంభించారు.  ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు ఈ యాప్‌ను ప్రారంభించినట్లు కమల్‌ చెప్పారు. ప్రజా సమస్యలేవైనా ఉంటే యాప్‌ ద్వారా తెలియజేయాలని అభిమానులకు సూచించారు. ప్రజలకు దగ్గరయ్యేందుకే ఈ యాప్‌ను రూపకల్పన చేసినట్లు  పేర్కొన్నారు. తాను రాజకీయాల్లోకి వచ్చేసినట్లేనని...పార్టీని ప్రకటించడమే మిగిలిందని... కమల్‌ వెల్లడించారు.
బైట్‌ కమల్‌హసన్, ప్రముఖ నటుడు

తనపై వస్తున్న హిందూ వ్యతిరేక ముద్రను తొలగించుకునే ప్రయత్నం చేశారు. తాను కూడా హిందువునేనని, హిందువుల మనోభావాలను గాయపరిచే ఉద్దేశం తనకు లేదని కమల్ అన్నారు. తాను 'అతివాదం'  పదాన్నే వాడానని, 'ఉగ్రవాదం' అని వాడలేదని వివరణ ఇచ్చారు.  హింస ఏ రూపంలో ఉన్న తాను సహించబోనని కమల్‌ తెలిపారు.

తమిళనాడు ప్రజలు రాజకీయాల్లో బలమైన మార్పును కోరుకుంటున్నారని కమల్‌ చెప్పారు. అందుకే వాళ్లు తన ఆరంగ్రేటాన్ని ఆసక్తిగా గమనిస్తున్నారని పేర్కొన్నారు. పార్టీ పెట్టేందుకు ప్రజలు తనకు పూర్తిగా సహకరిస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

16:04 - November 7, 2017

తమిళనాడు : తాను రాజకీయాల్లోకి వచ్చేశానని...కొన్ని పనులు మాత్రం పెండింగ్‌లో ఉన్నాయన్నారు ప్రముఖ నటుడు కమల్‌హాసన్‌. తాను కూడా హిందువే అని, హిందువుల సెంటిమెంట్‌ను గాయపరిచే ఉద్దేశం తనకు లేదని కమల్‌ స్పష్టంచేశారు. తాను అతివాదం  పదాన్నే వాడానని, ఉగ్రవాదం అని వాడలేదని వివరణ ఇచ్చారు.  హింస ఏ రూపంలో ఉన్నా తాను సహించబోనని కమల్‌ తేల్చి చెప్పారు. కమల్‌ తన పుట్టినరోజు సందర్భంగా 'మయ్యం విజిల్‌' యాప్‌ను ప్రారంభించారు.  ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు ఈ యాప్‌ను ప్రారంభించనట్లు కమల్‌ చెప్పారు. ఎక్కడ ఏ తప్పు జరిగినా ఈ యాప్ ద్వారా తన అభిమానులు దానిని వెలుగులోకి తీసుకురావాలని, న్యాయం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. పార్టీ నిర్మాణం, కార్యకలాపాల కోసం అభిమానుల నుంచే విరాళాలు సేకరిస్తానని, ఆ వివరాలన్నీ ఈ యాప్‌లో ఉంటాయని ఈ సందర్భంగా కమల్ ప్రకటించారు.

 

21:31 - October 18, 2017

చెన్నై : ప్రముఖ నటుడు కమల్‌ హాసన్‌ క్షమాపణలు ప్రజలకు చెప్పారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి తొందరపడి మద్దతు తెలిపినందుకు తనని క్షమించాలని కోరారు. ఈ విషయాన్ని ఆయన ఓ తమిళ మ్యాగజైన్‌కి రాసిన ఆర్టికల్‌లో పేర్కొన్నారు. పెద్ద నోట్లు రద్దు చేసిన సమయంలో కమల్‌ హాసన్‌ ఈ నిర్ణయాన్ని ప్రశంసించారు. మోదీకి సెల్యూట్‌ అంటూ ట్వీట్‌ చేశారు. అయితే పెద్ద నోట్ల రద్దుతో సమాజంలో నెలకొన్న సమస్యలు ఇప్పుడిప్పుడే అర్థమవుతున్నాయని ఈ నిర్ణయానికి మద్దతిచ్చినందుకు క్షమించండి అని ఆర్టికల్‌లో పేర్కొన్నారు. నోట్ల రద్దుతో నల్లధనం తొలగిపోతుందని అనుకున్నాను కానీ ధనవంతుల కోసమే ఈ నిర్ణయం వచ్చిందని అభిప్రాయపడ్డారు. నోట్ల రద్దుతో రాజకీయ నేతలే లబ్ధిపొందారని... సామాన్యులకు ఎలాంటి లాభం చేకూరలేదన్నారు. ఈ విషయంలో తప్పు జరిగిందని మోదీ ఒప్పుకుంటే మరోసారి సలాం కొడతానని పేర్కొన్నారు. కమల్‌ కొత్త పార్టీ పెడుతున్న నేపథ్యంలో ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం గమనార్హం. నవంబర్‌లో తన కొత్త పార్టీ పేరును ప్రకటిస్తానని ఆయన గతంలో వెల్లడించారు.

22:07 - October 4, 2017

చెన్నై : ప్రముఖ నటుడు కమల్‌హాసన్ రాజకీయ ప్రవేశానికి రంగం సిద్ధమైంది. వచ్చే నెల నవంబర్ 7న తన 63వ పుట్టిన రోజును పురస్కరించుకుని రాజకీయ పార్టీని ప్రకటిస్తారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. కమల్‌హసన్‌ ఇవాళ చెన్నైలో అభిమానులతో సమావేశమై కొత్త రాజకీయ పార్టీపై చర్చించారు. ఈ సందర్భంగా  ఓ ప్రణాళికను రూపొందిస్తున్నట్లు కమల్‌ అభిమానులకు సంకేతలిచ్చినట్లు సమాచారం. వాస్తవానికి వచ్చే ఏడాది జనవరిలో రాజకీయ ప్రవేశం చేస్తానని గతంలో కమల్ చెప్పారు. అభిమానులతో సమావేశం అనంతరం కొత్త పార్టీని త్వరగా పెట్టాలని కమల్‌ ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. తమిళనాడులో రాజకీయ పార్టీలు అవినీతిలో మునిగిపోయాయని... రాష్ర్టాన్ని అవినీతి రహితంగా మార్చేందుకు రాజకీయాల్లోకి రానున్నట్లు కమల్‌హసన్‌ ఇదివరకే ప్రకటించారు.

 

16:03 - September 22, 2017

చెన్నై : తాను రాజకీయాల్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నానని...ఒకవేళ తమిళనాడు ముఖ్యమంత్రి పదవి చేపట్టాల్సి వస్తే అందుకు సిద్ధమేనని ప్రముఖ నటుడు కమల్ హాసన్ చెప్పారు. ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కమల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ నిజాయతీ కలిగిన వ్యక్తి అత్యుత్తమ స్థానంలో ఉండాలని ప్రజలు కోరుకుంటే అందుకు తాను సిద్ధమేనని తెలిపారు. ముందు ఓటర్లు నిజాయతీగా ఉండాలని కమల్ అభిప్రాయపడ్డారు. తాను పార్టీ ఎప్పుడు ప్రారంభించబోతున్నది మాత్రం ఆయన చెప్పలేదు. మా పార్టీ ఎలా ఉంటుందో చెప్పలేను. కానీ కచ్చితంగా పార్టీని లాంచ్ చేస్తానని పేర్కొన్నారు. ముందు తాను ప్రజలను కలుసుకుని...ఆ తర్వాత రోడ్‌ మ్యాప్‌ తయారు చేస్తానని కమల్ తెలిపారు. 

21:49 - September 21, 2017

చెన్నై : తమిళనాడులో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. అధికార అన్నాడీఎంకేలో దినకరన్‌, పళని-పన్నీర్‌ వర్గాల మధ్య పోరు కొనసాగుతుండగా...మరోవైపు సినీతారలు రాజకీయ సందడి చేస్తున్నారు. తాజాగా కొత్త రాజకీయ సమీకరణ కోసం కసరత్తు చేస్తున్న లోక నాయకుడు కమల్‌హసన్‌తో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ భేటి అయ్యారు. ఢిల్లీ నుంచి చెన్నై విమానాశ్రయానికి చేరుకున్న కేజ్రీవాల్‌ను కమల్‌ చిన్న కుమార్తె అక్షర స్వయంగా ఎయిర్‌పోర్టుకు వెళ్లి స్వాగతించారు.సుమారు గంటకు పైగా చర్చలు జరిపిన అనంతరం ఇద్దరు కలిసి భోజనం చేశారు. తరువాత కమల్‌ మీడియాతో మాట్లాడుతూ... తనని కలవడం కోసం ఢిల్లీ నుంచి కేజ్రీవాల్‌ చెన్నైకి రావడం గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు.

అవినీతి రహిత సమాజం కోసం
కేజ్రీవాల్‌ అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నారని...అవినీతి రహిత సమాజం కోసం ఆయన ఆరాటపడడం తనకెంతో నచ్చిందని కమల్‌ హసన్‌ అన్నారు. మా ఇద్దరి ఆలోచనలు, లక్ష్యాలు ఒక్కటేనని...కేజ్రీవాల్‌ సలహాలు, సూచనలు తనకు అవసరమని చెప్పారు. అవినీతికి వ్యతిరేకంగా తాము పోరాడుతున్నామని, తమతో కలిసి వచ్చే వారందరిని కలుపుకుపోతామని కేజ్రీవాల్‌ అన్నారు. తమిళనాడులోని రాజకీయ పరిస్థితులు, తమ భావాలను ఒకరినొకరం పంచుకున్నామని సిఎం అన్నారు. ఇక ముందు కూడా తామ మధ్య చర్చలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. కమల్‌ త్వరలోనే రాజకీయాల్లోకి వస్తారన్నా ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. వీవో3ఇంతకుముందు 2015లో కమల్‌హసన్‌ సినిమా షూటింగ్‌ పర్మిషన్‌ కోసం కేజ్రీవాల్‌ను ఢిల్లీలో కలిశారు. త్వరలోనే రాజకీయాల్లోకి రానున్నట్లు కమల్ ప్రకటించిన కొద్ది రోజులకే కేజ్రీవాల్‌తో కలవడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. దక్షిణాది రాజకీయాల్లో ఆప్‌ను విస్తరించేందుకు కేజ్రీవాల్‌ ఈ భేటిని అవకాశంగా మలచుకోనున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 

16:05 - September 21, 2017

చెన్నై : ఆప్ అధినేత కేజ్రీవాల్, సినీనటుడు కమల్ హాసన్ భేటీ ప్రారంభమైంది. నలుగురు ఎమ్మెల్యేలతో కేజ్రీవాల్ కమల్ హాసన్ ను కలిశారు. వారి మధ్య తాజా రాజకీయాలు చర్చకు వచ్చినుట్టు తెలుస్తోంది. కమల్ రాజకీయాల్లోకి రావాలని కేజ్రీ ఆకాక్షించినట్లు తెలుస్తోంది. అవినీతికి వ్యతికేకంగా పోరాడుతున్న కేజ్రీవాల్ కు నా మద్దతు ఎప్పుడు ఉంటుందని కమల్ ప్రకటించారు. పూర్తి వివరాలకువ వీడియో చూడండి.

14:45 - September 21, 2017

చెన్నై : కాసేపట్లో కమల్ హాసన్ తో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ సమావేశం కానున్నారు. కేజ్రీ నలుగురు ఆప్ నేతలతో కలిసి కమల్ ను కలవనున్నారు. వారు తమిళనాడులో నెలకొన్న తాజా రాజకీయా పరిణామాలపై చర్చించే అవకాశం ఉంది. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

Pages

Don't Miss

Subscribe to RSS - kamal haasan