Katam Rayudu

16:13 - March 31, 2017

హైదరాబాద్ : ఆనంద ఆక్వా ఫుడ్‌ ప్రమాద ఘటనపై జనసేన నేత పవన్‌ కల్యాణ్‌ తనదైన శైలిలో స్పందించారు. ఐదుగురు మరణానికి కారణమైన కంపెనీపై చర్యలు తీసుకోవాలని ట్విట్టర్‌ ద్వారా డిమాండ్ చేశారు. 2012లోనూ ఈ కంపెనీలో ఇలాంటి ప్రమాదం జరిగిందని.. అయినా ఇప్పటి వరకూ వాళ్లపై చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. అలాగే ఇలాంటి ఫుడ్‌ పార్క్‌ల వల్ల కాలుష్యం పెరుగుతుందని.. పర్యావరణం కాపాడడం కోసం పర్యావరణ వేత్తలతో కలసి జనసేన పోరాటం చేస్తుందని అన్నారు. 

 

08:02 - March 20, 2017

తాజా చిత్రం 'కాటమరాయుడు' చిత్రంలో పవర్ స్టార్ 'పవన కళ్యాణ్' పై విధంగా డైలాగ్స్ పలికారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్ లో అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు. పవన్ మరింతగా గ్లామర్ గా కనిపిస్తుండడం అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. "అమ్మాయిలు చాలా డేంజర్ రోయ్ .. చాలా చాలా డేంజర్ రోయ్" అనే డైలాగ్..."కోపాన్ని .. ఆయుధాన్ని ఎక్కడ వాడాలో తెలుసుకో" అంటూ పవన్ చెప్పిన డైలాగ్ బాగా ఆకట్టుకొంటోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమాను ఏప్రిల్ 24వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. సినిమాకు సంబంధించిన సాంగ్స్ యూ ట్యూబ్ లో రెండు రోజుల కొకసారి విడుదల చేసిన సంగతి తెలిసిందే. నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై శరత్‌మరార్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రుతిహాసన్‌ కథానాయికగా నటిస్తున్నారు. శివ బాలాజీ, అజయ్‌, కమల్‌ కామరాజు, అలీ తదితరులు చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

15:13 - March 15, 2017

పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' తాజా చిత్రం 'కాటమరాయుడు' విడుదలకు సిద్ధమౌతోంది. ఈనెల 24న సినిమా విడుదల కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్స్..టీజర్..ట్రైలర్ లు ఇప్పటికే విడుదలయ్యాయి. చిత్ర సాంగ్స్ కూడా రెండు రోజులకు ఒకటి విడుదల చేస్తున్నారు. ఇవి యూ ట్యూబ్ లలో రికార్డ్స్ సృష్టిస్తున్నాయి. తాజాగా 'పవన్' నెక్ట్స్ సినిమాల పై అప్పుడే వార్తలు వెలువడుతున్నాయి. వాస్తవానికి త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా..తమిళ దర్శకుడు నేసన్ దర్శకత్వంలో సినిమాలు చేయనున్నారు. అయితే ఈ రెండింటిలో త్రివిక్రమ్ దర్శకత్వంలో మొదట పట్టాలెక్కనున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తున్నారని టాక్. ఈ సినిమాను ఈనెల 25వ తేదీన ప్రారంభిస్తారని వార్తలు వెలువడుతున్నాయి. ఈ చిత్రానికి 'దేవుడే దిగి వచ్చినా' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇందులో పవన్ సరసన క్తీరి సురేష్, అను ఇమ్మాన్యుయెల్ కథానాయికలుగా నటించనున్నారు. ముచ్చటగా మూడోసారి వస్తున్న ఈ కాంబినేషన్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

07:28 - February 21, 2017

పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' తాజా చిత్రం 'కాటమరాయుడు' షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదలై రికార్డులు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. డాలీ దర్శకత్వంలో శరత్ మరార్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో 'పవన్' సరసన 'శృతి హాసన్' హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ చిత్రానికి సంబంధించిన స్టిల్స్ సోషల్ మాధ్యమాల్లో విడుదల చేస్తున్నారు. ఈ ఫొటోలకు అభిమానుల నుండి భారీ స్పందన వ్యక్తమౌతోంది. ‘పవన్' ఈ చిత్రంలో స్టైలిష్ గా కనిస్తున్నారు. తమ్ముళ్ల కోసం అన్నయ్య చేసిన త్యాగమే 'కాటమరాయుడు' కథ అని తెలుస్తోంది. దీనికి రాయలసీమ ఫ్యాక్షన్ జోడించారని తెలుస్తోంది. పవన్‌కి నలుగురు తమ్ముళ్లుగా కమల్ కామరాజు, విజయ్ దేవరకొండ, శివబాలాజీ, అజయ్‌లు నటించారు. తమ్ముళ్ళు తమ పెళ్లిళ్ల కోసం అన్నయ్యని ప్రేమలోకి దించే ప్రయత్నాలు చేస్తారని టాక్. మరి ఈ చిత్రం ఎలా ఉంటుందో విడుదలయ్యే వరకు వేచి చూడాల్సిందే.

21:54 - February 16, 2017

హైదరాబాద్ : పవన్‌కల్యాణ్‌ హీరోగా నటిస్తున్న కాటమరాయుడు సినిమా విదేశీ హక్కులు పెద్ద మొత్తంలో అమ్ముడు పోయాయి. డిస్ట్రీబ్యూటర్లు సినిమా విదేశీ హక్కులను రూ.11.5 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌ కేవలం 24గంటల్లో 5 మిలియన్ల వ్యూస్‌తో రికార్డు సృష్టించింది. దీంతో చిత్రంపై ఉన్న అంచనాలు మరింత పెరిగాయి. మార్చి 10 నాటికి సినిమా పూర్తవుతుందని చిత్ర బృందం తెలిపింది.

 

13:01 - February 12, 2017

పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' చిత్రం కోసం అభిమానులు వేచి చూస్తున్నారు. తమ అభిమాన నటుడిని చూడాలని వారు తహతహలాడుతున్నారు. ఇటీవలే చిత్ర టీజర్ విడుదలై యూ ట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తోంది. ‘సర్దార్ గబ్బర్ సింగ్' డిజాస్టర్ అనంతరం 'పవన్ కళ్యాణ్' 'కాటమరాయుడు' చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. డాలీ దర్శకత్వంలో శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో 'పవన్' సరసన 'శృతి హాసన్' హీరోయిన్ గా నటిస్తోంది. చిత్ర షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఉగాది పండుగ సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఇదిలా ఉంటే 'పవన్' కు చాలా మందే అభిమానులు ఉంటారు. అందులో టాలీవుడ్ నటులు కూడా ఉన్నారు. వర్ధమాన నటుడు 'నితిన్' కూడా పవన్ వీరాభిమాని. ఈ విషయాన్ని పలు సందర్భాల్లో పేర్కొన్నాడు కూడా. 'నితిన్' కి సంబంధించిన సినిమా ఫంక్షన్స్ కి కూడా 'పవన్' వెళ్లారు. తాజాగా 'కాటమరాయుడు' చిత్ర డిస్ట్రిబ్యూషన్ హక్కులు 'నితిన్' పొందినట్లు సోషల్ మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. పవన్ సినిమాలు సెట్స్ పై ఉండగానే బిజినెస్ జరిగిపోతూ ఉంటుందనే సంగతి తెలిసిందే. ముఖ్యంగా నైజాం ఏరియాలో 'పవన్' కి మంచి పట్టు ఉంది. అక్కడ రైట్స్ ను దక్కించుకోవడానికి చాలామంది పోటీపడుతుంటారు. అక్కడి సినిమా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ను 'నితిన్' దక్కించుకున్నాడంట.

12:28 - February 10, 2017

ఒక హీరో చిత్రంలో మరో హీరో నటించడం సర్వసాధారణం. అంతేగాకుండా ఆ హీరో సినిమాకు మరో హీరో డబ్బింగ్ కూడా చెబుతుంటుంటారు. ఇలా టాలీవుడ్..బాలీవుడ్ ..ఇతర వుడ్ లలో జరుగుతూ ఉంటుంది. కానీ టాలీవుడ్ లో మాత్రం కొందరు స్టార్స్ చిత్రంలో ఇతర హీరోలు కనిపించడం జరగదు. కానీ అలా వస్తే మాత్రం ఇరు హీరోల అభిమానుల సంతోషానికి అవధులు ఉండవు. తాజాగా పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' నటిస్తున్న 'కాటమరాయుడు' చిత్రంలో ప్రిన్స్ 'మహేష్ బాబు' నటించాడని సోషల్ మాధ్యమాల్లో వార్తలు వెలువడుతున్నాయి. ఇటీవలే 'కాటమరాయుడు' చిత్ర టీజర్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ టీజర్ లోని ఓ ఫైట్ సన్నివేశంలో రైలు డోర్ పగలగొట్టుకుని ఓ వ్యక్తి ఫ్లాట్ ఫాం పైన పడిపోతాడు. అతనితో ఫైట్ చేసిన వ్యక్తి..డోర్ దగ్గర నిలబడిన వ్యక్తి 'మహేష్ బాబు' అని పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇక టీజర్ విషయానికి వస్తే విడుదలైన 57 గంటలలో 5 మిలియన్ వ్యూస్ సాధించి అందరికి షాక్ ఇచ్చింది. డాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కాటమరాయుడు చిత్రాన్ని శరత్ మరార్ నిర్మిస్తోండగా ఇందులో శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది.

07:30 - February 3, 2017

పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' చిత్రం టీజర్ ఎప్పుడు విడుదలవుతుందా ? పవర్ స్టార్ ను ఎప్పుడు చూద్దామా అని అభిమానుల ఎదురుచూపులకు తొందరలోనే తెరపడనున్నాయి. 'సర్దార్ గబ్బర్ సింగ్' డిజాస్టర్ అనంతరం 'పవన్' నటిస్తున్న 'కాటమరాయుడు'పై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. కిషోర్ పార్థసాని (డాలీ) దర్శకత్వంలో..శరత్ మరార్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. మార్చి 29న చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొన్న సంగతి తెలిసిందే. కానీ నిర్ణయించిన తేదీ కంటే ముందుగానే చిత్రం విడదలయ్యే అవకాశాలున్నట్లు టాక్. ఇదిలా ఉంటే టీజర్ మాత్రం ఇప్పటి వరకు విడుదల కాకపోవడం పట్ల అభిమానులు కొంత నిరుత్సాహానికి గురయ్యారు. టీజర్ త్వరలోనే విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. ఫిబ్రవరి 4వ తేదీన 4 గంటలకు 'కాటమరాయుడు' చిత్ర టీజర్ ను విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ట్విట్టర్ ద్వారా తెలియచేసింది. ‘పవన్' సరసన 'శృతి హాసన్' హీరోయిన్ గా నటిస్తోంది.

12:42 - February 2, 2017

పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' నటిస్తున్న 'కాటమరాయుడు' చిత్రం ఎప్పుడు విడుదలవుతుందా ? అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. విడుదల తేదీ కంటే ముందుగానే చిత్రం విడుదలవుతోందని టాక్ తో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కిషోర్ పార్థసాని (డాలీ) దర్శకత్వంలో..శరత్ మరార్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. హైదరాబాద్ లో ప్రస్తుతం షూటింగ్ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. మార్చి 29న చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొన్న సంగతి తెలిసిందే. కానీ నిర్ణయించిన తేదీ కంటే ముందుగానే చిత్రం విడదలయ్యే అవకాశాలున్నట్లు టాక్. రెండు పాటలను విదేశాల్లో చిత్రీకరణకు ప్లాన్ చేస్తున్నట్లు, దీనితో షూటింగ్ పూర్తయినట్లేనని తెలుస్తోంది. సంక్రాంతి సందర్భంగా 'కాటమరాయుడు' ప్రచార చిత్రాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. కానీ చిత్ర టీజర్ మాత్రం ఇంతవరకు రిలీజ్ కాలేదు. త్వరలోనే టీజర్ ను విడుదల చేస్తామని చిత్ర యూనిట్ పేర్కొంటోంది. 

11:53 - December 25, 2016

పవన్ కళ్యాణ్ 'ఉగాది' బరిలో నిలుస్తున్నాడు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం 'కాటమరాయుడు' షూటింగ్ శరవేగంగా కంప్లీట్ చేసుకొంటోంది. ఉగాది పండుగను పురస్కరించుకుని సినిమాను విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. కిషోర్ పార్థాసాని(డాలీ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో 'శృతిహాసన్' మరోసారి 'పవన్' సరసన జత కడుతోంది. 'పవన్‌ కళ్యాణ్' సినిమా అంటే ప్రేక్షకులు ఏం అశిస్తారో ఆ అంశాలన్నీ ఈ చిత్రంలో ఉంటాయని నిర్మాత పేర్కొన్నారు. తాజా షెడ్యూల్ ఇటీవల పొల్లాచ్చీలో పూర్తయిందని, చిత్రీకరణ దాదాపు పూర్తికావచ్చిందన్నారు. 'గబ్బర్‌సింగ్' ఘనవిజయం తరువాత 'పవన్‌ కళ్యాణ్', 'శృతి హసన్‌'ల కలయిక ఈ చిత్రంలో కనువిందు చేయబోతుందని పేర్కొన్నారు. మిగిలిన చిత్రీకరణ అంతా జనవరి, ఫిబ్రవరిల్లో పూర్తిచేసి చిత్రాన్ని వచ్చే ఏడాది ఉగాదికి విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నామన్నారు.

Pages

Don't Miss

Subscribe to RSS - Katam Rayudu