Kathi mahesh

16:49 - January 27, 2018

ముంబై : పద్మావత్ సినిమాను వ్యతిరేకించడం వెనుక రాజకీయ శక్తులున్నాయని ప్రముఖ దర్శకుడు శ్యామ్ బెనగల్ వ్యాఖ్యానించారు. సినిమాకు..హింసాత్మక నిరసనలకు...ఎలాంటి పొంతన లేదన్నారు. రాజ్ పుథ్ ఓటు బ్యాంకును తమకు అనుకూలంగా మలుచుకోవడానికి జరుగుతున్న ప్రయాసే అని విమర్శించారు. సినిమాను వ్యతిరేకిస్తున్న వారు బహిరంగ బెదిరింపులకు పాల్పడుతున్నా ప్రభుత్వం మాత్రం చర్యలు తీసుకోవడం లేదని పేర్కొన్నారు. 1988లో దూరదర్శన్ లో ప్రసారమయిన సీరియల్ 'భారత్ ఏక్ కోజ్' లో పద్మావత్ ను రూపొందించడం జరిగిందని అప్పుడు ఎలాంటి వ్యతిరేకత రాలేదన్నారు. భన్సాలీ..దీపికాలను బెదిరించడాన్ని ఆయన ఖండించారు. 

10:16 - January 19, 2018

హైదరాబాద్ : సినీ క్రిటిక్ 'కత్తి మహేష్' పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కనున్నారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్..కత్తి మహేష్ కు మధ్య గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా వార్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కానీ గురువారం రాత్రి ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. ఓ ఛానెల్ లో చర్చలో పాల్గొని వెళుతున్న 'కత్తి మహేష్'పై గుర్తు తెలియని వ్యక్తులు కోడిగుడ్లతో దాడికి పాల్పడ్డారు. దీనితో ఆయన పీఎస్ లో ఫిర్యాదు చేయనున్నారు. దాడి ఘటనప ఓయూ జీఏసీ స్పందించింది. దాడిని ఖండించింది. శుక్రవారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మలను దగ్ధం చేయాలని పిలుపునిచ్చింది.

ఈ సందర్భంగా 'కత్తి మహేష్' తో టెన్ టివి మాట్లాడింది. తనపై ఎవరు దాడి చేసినా వారు పవన్ ఫ్యాన్స్ అని అనుకుంటానని..అందుకనే పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. దాడి ఎవరు చేశారో పోలీసుల దర్యాప్తులో తేలుతుందని, చట్టాన్ని నమ్ముతానని తెలిపారు. దళితుడి కాబట్టే ఇంతస్థాయిలో దాడి జరుగుతుందని తేటతెల్లమయిన తరువాతే ఈ విషయాలు చర్చలోకి వచ్చాయని, దళిత సంఘాల మద్దతు తనకు ఉంటుందని తెలిపారు. వ్యూహం గురించి చర్చించలేదని, పవన్ దిష్టిబొమ్మలు దగ్ధం చేయాలని ఓయూ జేఏసీ నిర్ణయించిందన్నారు. పవన్ మెడలు వంచే కార్యక్రమం బృహత్తర కార్యక్రమమని, దీనిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

09:09 - January 19, 2018
06:29 - January 19, 2018

హైదరాబాద్ : కత్తి వర్సెస్‌ పవన్‌ అభిమానులు వివాదం మరింత ముదురుతోంది. సినీక్రిటిక్‌ కత్తిమహేశ్‌పై హైదరాబాద్‌ కొండాపూర్‌లో గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేయడాన్ని ఓయూ జేఏసీ ఖండించింది. తెలంగాణ వ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళనకు దిగుతామని జేఏసీ నేతలు హెచ్చరించారు. దాడికి నిరసనగా ఇవాళ పవన్‌ దిష్టిబొమ్మలను దగ్ధం చేయాలని పలుపునిచ్చారు.  

17:32 - January 17, 2018

హైదరాబాద్ : సినీ విమర్శకుడు కత్తి మహేశ్ చంచల్‌గూడ జైల్లో మందకృష్ణ మాదిగను కలిశారు. గుజరాత్‌ దళిత ఎమ్మెల్యే జిగ్నేష్‌ మేవానితో కలిసి ఆయన మందకృష్ణ మాదిగను కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. అప్రజాస్వామిక శక్తులు రాష్ట్రంలో రాజ్యమేలుతున్నాయని, కేసీఆర్‌పై తిరుగుబాటు తప్పదని కత్తి మహేష్‌ వ్యాఖ్యానించారు. ఎమ్మార్పీఎస్‌కు తన సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు కత్తి మహేష్‌ తెలిపారు. పవన్‌ కళ్యాణ్‌పై మరోసారి మండిపడ్డ కత్తి మహేష్‌ అసలు జనసేనలో జనమే లేరన్నారు. 

20:22 - January 12, 2018

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. కత్తి స్టార్ కత్తి మహేష్.. ఇద్దరి పంచాదిలకు ఉస్మానియా యూనివర్సిటీ ఎంటరైపోయింది.. నీది పవనిజం అయితే మాది కత్తిజం అంటున్నరు.. మా దళిత బిడ్డ కత్తి తెర్వొస్తె కారం బెడ్తం అని హెచ్చరిస్తున్నది ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ.. నిన్న ఓయూకు వొయ్యిన కత్తి మహేస్కు ఖతర్నాక్ వెల్కం జెప్పిండ్రు..గీ ముచ్చట చూడాలంటే వీడియో క్లిక్ చేయండి...

19:51 - January 11, 2018

హైదరాబాద్ : సినీ పరిశ్రమలో సినీ క్రిటిక్ కత్తి మహేష్...సినీ నటుడు పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య విమర్శల యుద్ధానికి ముగింపు పలకాల్సి ఉందని ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ పేర్కొన్నారు. సాగదీస్తే ఎంతదూరమైనా సాగే అవకాశం ఉందని టెన్ టివి ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఇద్దరూ సంయమనం పాటించాలని, విమర్శలు కొనసాగిస్తే ఎంతదూరమైనా పోవచ్చన్నారు. 

15:19 - January 10, 2018

పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'..మాటల మాంత్రికుడు 'త్రివిక్రమ్' కాంబినేషన్ లో రూపొందిన 'అజ్ఞాత వాసి'.. చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమాను చూడటానికి అభిమానులు థియేటర్లకు పోటెత్తారు. మరి

సినిమా ఎలా ఉంది ? ప్రేక్షకులను మెప్పించిందా ? అనే దానిపై టెన్ టివి ప్రత్యేక చర్చ చేపట్టింది. ఈ చర్చలో కత్తి మహేష్ (సినీ క్రిటిక్), కృష్ణ సాయిరాం (టెన్ టివి ఇన్ పుట్ ఎడిటర్) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ట్రైలర్ చూసిన అనంతరం సినిమాపై నమ్మకం కలిగిందని, సినిమా చూసిన అనంతరం ఆశ కాస్త నిరాశే మిగిలిందని సినిమా క్రిటిక్ 'కత్తి మహేష్' పేర్కొన్నారు. మంచి కథ తీసుకున్నారని..కథలో గమనం లేకపోవడంతో సినిమాను అపహస్యం చేశారన్నారు. ఫ్యాన్స్ ను కూడా పూర్తిగా నిరాశపరిచిందన్నారు. మాస్..ఫ్యామిలీ డ్రామాతో తెరకెక్కించాలని ప్రయత్నించారని, కానీ చిత్ర యూనిట్ కన్ ఫ్యూజ్ అయ్యారని టెన్ టివి ఇన్ పుట్ ఎడిటర్ 'కృష్ణ సాయిరాం' పేర్కొన్నారు. ఇంకా ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేశారో పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

12:33 - January 10, 2018

హైదరాబాద్ : సినిమా హాళ్ళలో దోపిడీ అనేది బహిరంగ రహస్యం.... దాన్ని నిర్ధారించడానికి ప్రత్యేకంగా త్రీమెన్‌ కమిటీని నియమించింది బల్దియా.. కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా... దోపిడి నిజమే అంటూ నివేదిక ఇచ్చింది ఆ కమిటీ... చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మాత్రం అక్రమార్కులకు అండగా నిలుస్తున్నారు.  థియేటర్లలో నిలువు దోపిడీపై టెన్‌టీవీ స్పెషల్‌ స్టోరీ..
ప్రశ్నించిన వారిపై థియేటర్ల యాజమాన్యాలు దాడులు 
గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలో ప్రజలకు వినోదం కోసం... 200లకు పైగా సినిమా థియేటర్లు, మ‌ల్టీ ప్లెక్సులు ఉన్నాయి. వీటిలో ప్రతి రోజూ కనీసం ల‌క్షమంది దాకా సినిమాలు చూస్తుంటారు. వినోదం కోసం వచ్చిన ప్రేక్షకులను థియేటర్‌ యాజమాన్యాలు నిలువుదోపిడీ చేస్తున్నాయి. టికెట్ రుసుంతో పాటు... తినుబండారాలు, కూల్ డ్రింక్స్, పార్కింగ్ పేరుతో  అడ్డంగా దోచుకుంటున్నాయి. నిబంధనల‌కు పాత‌రేసి..  అధిక ధ‌ర‌ల‌ను వ‌సూలు చేస్తున్నాయి. ఇందేంట‌ని ప్రశ్నించిన వారిపై దాడుల‌కు సైతం థియేటర్ల యాజమాన్యాలు వెనుకాడ‌టం లేదు.  
థియేటర్లలో అక్రమాలపై హెచ్చరించిన బల్దియా
సినిమా థియేటర్లలో అక్రమాలకు పాల్పడితే తాటతీస్తామని బల్దియా హెచ్చరించింది. టికెట్లు కానీ... తినుబండారాలు కానీ... అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు తప్పవంది. బీ కేర్‌ ఫుల్‌... అంటూ బీరాలు పలికింది. సినిమా థియేటర్లో జరుగుతున్న దోపిడీపై త్రీమెన్‌ కమిటీని కూడా వేసింది. 
దోపిడీ నిజమే : త్రీమెన్‌ కమిటీ
థియేటర్లపై అధ్యయనానికి ఏర్పాటైన కమిటీ  కొంత ఆలస్యంగానైనా నివేదికను అందించింది.  థియేటర్ల యాజమాన్యాలు  ప్రేక్షకులను దోచుకుంటున్నాయన్న  విషయాన్ని నొక్కి చెప్పింది. థియేటర్లలో చట్టవిరుద్ధ చర్యలను కళ్ళకు కట్టినట్లు వివరించింది త్రీమెన్‌ కమిటీ.
చట్టప్రకారం పార్కింగ్ ఫీజు వ‌సూలు చెయ్యకూడదు 
చట్టప్రకారం థియేటర్లలో పార్కింగ్ ఫీజు వ‌సూలు చెయ్యకూడదు. కానీ  వారు  థియేటర్లు మాత్రం ఈ నిబంధనను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. వాహన పార్కింగ్‌ను ఆదాయ మార్గంగా మలచుకున్నాయి.  టూ వీలర్, ఫోర్ వీలర్, సైకిల్ ఇలా ఒక్కో వాహనానికి ఒక్కో లెక్కన పార్కింగ్‌ ఫీజు పేరుతో దోచుకుంటున్నాయి. ఆహార ప‌దార్థాల అమ్మకాల‌ విషయంలోనూ థియేటర్లకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. థియేటర్ల యాజమాన్యాల  దోపిడీని అరికట్టాలని  బ‌ల్దియాకు  త్రీమెన్‌ కమిటీ సూచించింది. అధికారులు తమ అధికారాన్ని ఉపయోగించి చర్యలు తీసుకోవాలని  కోరింది. త్రీమెన్‌కమిటీ నివేదిక ఇచ్చి  ఏడాది కావస్తున్నా....  ఇప్పటికీ  బల్దియా ఏ థియేటర్‌పైనా చర్యలు తీసుకున్నది లేదు.
ఫీజు వసూలుకు సిద్ధపడిన జీహెచ్‌ఎంసీ
థియేటర్లనుంచి ఆస్తి ప‌న్నుతోపాటు..  ట్రేడ్ లై సెన్స్ ఫీజు కూడా వసూలు  చెయ్యాల‌ని  జీహెచ్ఎంసీ భావించింది. ఐతే దీనిపై  థియేటర్‌ యజమానులు కోర్టుకు వెళ్ళారు. దీంతో స‌మ‌స్య మ‌ళ్లీ మొద‌టికి వచ్చింది. అధికారులు బాధ్యతగానూ... తెలివిగానూ వ్యవ‌హ‌రిస్తే బ‌ల్దియాకు ఆదాయంతో పాటు.... ప్రేక్షకుల జేబుకు ప‌డుతున్న చిల్లును కూడా అరిక‌ట్ట వచ్చని పలువురు సూచిస్తున్నారు. 

10:32 - January 10, 2018

చిత్తూరు : జిల్లాలోని శ్రీకాళహస్తిలో పవన్‌ కల్యాణ్ ఫ్యాన్స్‌ హంగామా చేశారు. సినీ విమర్శకుడు కత్తిమహేశ్‌ దిష్టిబొమ్మను  దగ్ధం చేశారు. కత్తి మహేశ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కత్తి మహేశ్‌ నోరుఅదుపులో పెట్టుకోకుంటే తీవ్ర పరిణామాలు అంటూ హెచ్చరించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

Pages

Don't Miss

Subscribe to RSS - Kathi mahesh