kavitha

06:47 - September 3, 2018

హైదరాబాద్ : ప్రజల సంక్షేమానికి మరెన్నో సంక్షేమ పథకాలు చేపడతామన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు. నాలుగున్నరేళ్ల పాలనలో 469 సంక్షేమ పథకాలు చేపట్టామని.... 2014 ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొనని హామీలను కూడా నెరవేర్చామన్నారు. మరోసారి ప్రజలు దీవిస్తే బంగారు రాష్ట్రాన్ని తెలంగాణ చేస్తామన్నారు గులాబీ దళపతి. తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చేందుకు 2000 సంవత్సరంలోనే బీజం పడిందన్నారు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు. తెలంగాణ వస్తే ఏం చేయాలనే ఆలోచనలు జయశంకర్‌ సార్‌తో కలిసి 2006-07లోనే చేశామన్నారు. అప్పటి ఆలోచనల ఫలితమే నేటి సంక్షేమ పథకాలన్నారు. ఆర్థిక ప్రగతిలో తెలంగాణ మొదటి స్థానంలో ఉందన్నారు సీఎం.

14 ఏళ్ల కఠోర శ్రమ అనంతరం తెలంగాణ సాధించుకున్నామన్నారు సీఎం. వేరే వారితో కలిసే వెళ్తే కష్టపడి సాధించుకున్న తెలంగాణకు న్యాయం జరగదనే అభిప్రాయంతో 2014 ఎన్నికలకు ఒంటరిగా వెళ్లామన్నారు. తెలంగాణ వస్తే రాష్ట్రం అంధకారమవుతుందని ఎంతోమంది శాపనార్దాలు పెట్టారు. కానీ.. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే విద్యుత్‌ కష్టాలు తొలిగించామన్నారు. దేశంలో రైతాంగానికి 24 గంటల ఉచిత విద్యుత్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు కేసీఆర్‌.

కాంగ్రెస్‌ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు సీఎం. అందుకే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత చేతివృత్తుల వారికి ఎన్నో పథకాలు చేపట్టామన్నారు. రాష్ట్రంలో అందరికీ కేజీ నుండి పీజీ విద్య అందిస్తామన్నారు కేసీఆర్‌. ఎన్నో ఏళ్లుగా అన్యాయానికి గురైన గిరిజనుల గురించి ఆలోచించి.. గిరిజన తండాలను పంచాయతీలు మార్చామన్నారు కేసీఆర్‌. తెలంగాణకు శాశ్వత ఆదాయం వచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు కేసీఆర్‌. త్వరలోనే కోటి ఎకరాలను ఆకుపచ్చగా మార్చి చూపిస్తామన్నారు సీఎం. .

ఇప్పటికే 22 వేల గ్రామాలకు నీళ్లు అందించామని.. మరో ఆరేడు రోజుల్లో మరో 1300 గ్రామాలకు నీళ్లు అందిస్తామన్నారు కేసీఆర్‌. రైతులకు గురించి ఆలోచించి రుణమాపీ చేశామని.. రైతుబంధు పథకం ప్రవేశపెట్టామన్నారు. నవంబర్‌లో రెండో విడత రైతుబంధు చెక్కులు అందజేస్తామన్నారు ఇసుకపై కాంగ్రెస్‌ నేతలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్‌ పాలనలో ఇసుకపై ఆదాయం 10 కోట్ల రూపాయలు వస్తే.. నాలుగున్నరేళ్ల పాలనలో... 1980 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందన్నారు. మళ్లీ టీఆర్‌ఎస్‌కు అధికారం ఇస్తే... రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తామన్నారు స్పష్టం చేశారు కేసీఆర్‌. ప్రజల దీవెనలతో మళ్లీ టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు గులాబీ దళపతి.

కొంగరకలాన్‌లో జరిగిన ప్రగతి నివేదన సభకు జనం భారీగా తరలిరావడంతో సీఎం కేసీఆర్‌ ఉప్పొంగి పోయారు. సభ ముగిసిన తర్వాత తిరుగు ప్రయాణంలో హెలిక్యాప్టర్‌లోంచి ప్రజలకు అభివాదం చెప్పారు. 

13:42 - July 9, 2017

ప్రముఖ నవలారచయిత ప్రభాకర్ జైని రాసిన సినీవాలీ నవల ఆవిష్కరణ సభ ఇటీవల రవీంద్రభారతిలో జరిగింది. తెలంగాణా ప్రభుత్వ సలహాదారులు కె.వి.రమణాచారి అధ్యక్షతన జరిగిన ఈ సభలో  ఆధ్యాత్మిక గురువు శ్రీరాంసార్ సినీ వాలీ నవలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణా సాంస్కృతికశాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, నవ్యవీక్లీ ఎడిటర్ జగన్నాథశర్మ, ఎ.పి.బ్రాడ్ కాస్ట్ జర్నలిస్టు అసోషియేషన్  అధ్యక్షులు టి.రాజేందర్, బిక్కి కృష్ణ, అసుర, కత్తిమహేశ్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా పలువురిని ఘనంగా సత్కరించారు. ఇటీవల మహబూబాబాద్ లో కవయిత్రి కీర్తనారెడ్డి రాసిన జీవనవీణ కవితా సంపుటిని ప్రముఖ కవి, ప్రజాగాయుడు గోరటి వెంకన్న ఆవిష్కరించారు. బిక్కి కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రభ ఎడిటర్ వై.ఎస్.ఆర్ శర్మ, జాయింట్ కలెక్టర్  దామోదర్ రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ ఉమా మురళీనాయక్, ఆకెళ్లరాఘవేంద్ర తదితరులుపాల్గొన్నారు. 

13:41 - July 9, 2017

తెలంగాణాలో ఎందరో గేయరచయితలున్నారు. అద్భుతమైన పాటలు రాస్తున్నారు. ప్రజలను తమ పాటలతో ఉత్తేజపరుస్తున్నారు. ఉద్యమాల బాట పట్టిస్తున్నారు. అలాంటి వారిలో కరీంనగర్ కు చెందిన కన్నం లక్ష్మీనారాయణ ఒకరు. ఆయన ఓ పక్క సింగరేణి బొగ్గుగనిలో కార్మికునిగా పనిచేస్తూ మరో పక్క గేయరచయితగా పాటలు రాస్తూ వచ్చారు. ప్రముఖ గేయరచయిత కన్నం లక్ష్మినారాయణ జనం పాట మీ కోసం..పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం....

 

13:39 - July 9, 2017

తెలుగు కథా శిఖరం నేలకొరిగింది.. తెలుగు కథా మాంత్రికుడు నిష్క్రమించాడు.. సంక్లిష్ట సందర్భంలో ఉన్న సమాజంలోని సంఘర్షణను ఒడిసిపట్టి తెలుగు పాఠకుల ముందు నిబద్ధతగా నిలబడిన ఓ నిలువెత్తు కథలాంటి మనిషి అదృశ్యమయ్యాడు.. ప్రముఖ కథారచయిత, నవలాకారుడు డా.వి.చంద్రశేఖరరావు కన్నుమూతతో తెలుగు సాహితీ ప్రపంచం విషాదంలో మునిగింది. ఆ మహాకథన శిల్పికి నివాళులర్పిస్తూ..ఈ వారం అక్షరం మీ ముందుకొచ్చింది. 
సంచలనం సృష్టించిన రచయిత డా.వి.చంద్రశేఖరరావు 
తెలుగు కథాసాహిత్యంలో, నవలా రచనలో సంచలనం సృష్టించిన గొప్ప రచయిత డా.వి.చంద్రశేఖరరావు శనివారం కన్నుమూసారు. ఆకుపచ్చని దేశం, నల్లమిరియం చెట్టు, ఐదుహంసలు,లాంటి నవలలు, జీవని, లెనిన్ ప్లేస్, మాయాలాంతరు, ద్రోహవృక్షం లాంటి కథాసంకలనాలు వెలువరించారు. దాదాపు మూడు దశాబ్దాలపాటు వర్తమాన జీవితం నుంచి వస్తువును తీసుకుని, తన రక్తంలో ముంచి అద్భుతమైన సృజన సాగించిన... మన కాలం మహాకథారచయిత వి. చంద్రశేఖర్రావు. 

18:16 - June 27, 2017

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వ తీరుపై టీజేఏసీ చైర్మన్ కోదండరామ్ మండిపడ్డారు. ప్రజాప్రతినిధులు కాంట్రాక్ట్‌ల మీద .. భూదందాల మీద చూపుతున్న శ్రద్ధ ప్రజా సమస్యల పరిష్కారంపై చూపించడం లేదని అన్నారు. వారి అక్రమాల కోసం పోలీసు యంత్రాంగాన్ని కూడా వాడుకుంటున్నారని ఆరోపించారు. అందుకు సహకరించని అధికారులపై ఒత్తిడి పెరుగుతోందని.. అందుకు కుకునూరుపల్లి ఎస్సై ఆత్మహత్య ఘటన ఓ ఉదాహరణ అని అన్నారు. ప్రభుత్వ పథకాలన్ని పేపర్లకే పరిమితం చేస్తున్నారని.. అర్హులకు సరిగ్గా చేరడం లేదని కోదండరామ్‌ అన్నారు. మొదటి దశ అమరుల స్ఫూర్తి యాత్ర ముగిసిన సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కోదండరామ్ మాట్లాడారు. 

18:05 - June 27, 2017
17:12 - February 19, 2017

హైదరాబాద్ : కాలుష్య పూరితమైన పరిశ్రమలను అవుటర్‌ రింగ్‌ రోడ్డుకు తరలించే ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం. ఇప్పటికే దీనిపై కసరత్తు చేసిన సర్కార్‌.. ఫస్ట్‌ ఫేజ్‌లో కాలుష్యపూరిత పరిశ్రమలను తరలించాలని డిసైడ్‌ అయ్యింది. విశ్వనగరంలో భాగంగా కాలుష్యం లేని నగరాన్ని తీర్చిదిద్దాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
పౌరుల జీవితాల్లో క్వాలిటీ పెంచేందుకు ప్రయత్నాలు 
నగరంలోని పౌరుల జీవితాల్లో క్వాలిటీ పెంచేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. దీనిలో భాగంగానే కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలను అవుటర్‌ రింగ్‌ రోడ్డు అవతలికి తరలించాలని నిర్ణయం తీసుకుంది. మంత్రి కేటీఆర్‌ గతంలోనే అధికారులతో పరిశ్రమల షిప్టింగ్‌పై వరుస రివ్యూలు చేశారు. మొదటి దశలో ఏఏ పరిశ్రమలను తరలించాలనే దానిపై అధికారులతో చర్చించారు. నగరంలో దాదాపు 1545 ఉన్నట్లుగా పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు గుర్తించింది. ఇందులో 385 పరిశ్రమలు ఇప్పటికే అవుటర్‌ రింగ్‌ రోడ్డుకు తరలింపు ప్రక్రియ పూర్తి అయ్యింది. మిగతా 1160 పరిశ్రమలను అవుటర్‌కు తరలించాల్సి ఉంది. ఈ పరిశ్రమలను దశల వారీగా తరలించనున్నారు. పరిశ్రమల తరలింపుకు సంబంధించి టీఎస్‌ఐఐసీ స్థలాలను గుర్తించే పనిలో పడింది. నగరానికి కనీసం 100 కిలోమీటర్ల దూరంలో పరిశ్రమలను ఏర్పాటు చేయాలనే ఆలోచన చేస్తోంది. ేదీనిపై ఎన్విరాన్‌మెంట్‌ ప్రొటెక్షన్‌ ట్రైనింగ్‌ ఇనిస్టిట్యూట్‌ పరిశీలన చేసి నివేదిక కూడా ఇచ్చింది. 
పరిశ్రమల తరలింపును సవాల్‌గా తీసుకున్న ప్రభుత్వం  
పరిశ్రమల తరలింపును ప్రభుత్వం సవాల్‌గా తీసుకుంది. 2017 డిసెంబర్ నాటికి కాేలుష్య పూరిత పరిశ్రమలను తరలించాలని టార్గెట్‌గా పెట్టుకుంది. పరిశ్రమల్లో జీరో లిక్విడ్‌ డిచ్చార్జ్‌ వంటి విధానాలతో జల, వాయు కాలుష్యాన్ని పూర్తిగా తగ్గించవచ్చని నిర్ణయించారు. ల్యాండ్‌ కన్వర్షన్‌, పన్ను రాయితీలు, పరిశ్రమ అవరణల్లోనే గృహవసరాలకు అనుమతి వంటి ప్రొత్సహాకాలు ఇచ్చేందుకు ప్రతిపాదనలను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. క్లస్టర్ల ఏర్పాట్లులో హెచ్‌ఎండీఏ వంటి సంస్థలతో కలిసి పని చేయాలని టీఎస్‌ఐఐసీ అధికారులను మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు. 
కాలుష్యాన్ని తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వ ప్రయత్నాలు 
నగరంలో కాలుష్యాన్ని తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. తరలింపుపై నగరంలోని పరిశ్రమల డైరెక్టర్ల సమావేశం ఏర్పాటు చేయాలని కూడా పరిశ్రమల శాఖ నిర్ణయించింది. మంత్రి కేటీఆర్‌ నేతృత్వంలోనే త్వరలోనే ఈ సమావేశం జరగనుంది. 

 

08:36 - October 23, 2016

హైదరాబాద్ : కర్మన్ ఘాట్‌లో యాదగిరి అనే వ్యక్తి మృతి మిస్టరీగా మారింది. మెదట సహజ మరణంగా భావించి ఆంత్యక్రియలు పూర్తి చేసిన కుటుంబసభ్యులు..ఆ తర్వాత మృతిపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ పోలీసులను ఆశ్రయించారు. మృతి చెందిన కొన్నాళ్ల తర్వాత మృతుని సెల్ ఫోన్‌ని పరిశీలించగా కొట్టుమిట్టాడుతూ చనిపోయిన వీడియో బయటపడింది. దీంతో వెంటనే కుటుంబసభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసారు. కట్టుకున్న భార్యే హత్యే చేసిందని మృతుని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో సంచలనంగా మారింది.
సంచలనంగా మారిన యాదగిరి మృతి  
ఇదే ఇప్పుడు అటు కుటుంబసభ్యులు, ఇటు పోలీసులకు అంతుచిక్కని ప్రశ్నగా మారింది. యాదగిరిది మొదట సహజ మరణంగా భావించినా..ఆ తర్వాత సెల్‌ఫోన్లో బయటపడ్డ వీడియోతో మృతిపై పలు అనుమానాలు నెలకొన్నాయి. అయితే కట్టుకున్న భార్యే యాదగిరిని హత్య చేసిందని మృతుని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో సంచలనంగా మారింది.
సహజ మరణంగా భావించిన కుటుంబసభ్యులు 
హైదరాబాద్‌ కర్మన్ ఘాట్‌లో బైరు యాదగిరి, బైరు కవిత భార్యాభర్తలిద్దరూ నివాసం ఉంటున్నారు. నల్గొండ జిల్లాకు చెందిన యాదగిరి వివాహం తర్వాత కర్మన్‌ఘాట్‌లోనే వ్యాపారం చేస్తూ నగరంలోనే స్ధిరపడ్డారు. అయితే జులై 17న బెడ్‌పై నుండి కింద పడ్డాడన్న సమాచారం కుటుంబసభ్యులకు తెలిసింది. వెంటనే వారు..చికిత్స కోసం యాదగిరిని స్థానికంగా ఉన్న శ్రీ వెంకటేశ్వర ఆసుపత్రికి తరలించారు. అయితే యాదగిరిని పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయినట్టు కుటుంబసభ్యులకు తెలిపారు. ఎలా చనిపోయాడన్న దానిపై డాక్టర్‌ని వివరణ అడగగా..ఎక్కువ మోతాదులో ఆల్కాహాల్ తీసుకోవడం వల్లే చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. దీంతో కుటుంబసభ్యులు సహజ మరణంగా భావించి నల్గొండ జిల్లా పెద్ద ఆడిశర్లపల్లి గ్రామంలో అతని అంత్య క్రియలు పూర్తి చేసారు.
యాదగిరిని భార్య కవితే హత్య చేసిందని కుటుంబసభ్యులు ఫిర్యాదు 
అయితే చనిపోయిన ఐదు రోజుల తర్వాత మృతుడు యాదగిరి సెల్‌ఫోన్‌ని కుటుంబసభ్యులు పరిశీలించగా దానిలో ఓ వీడియో క్లిప్ కనిపించింది. వీడియో క్లిప్‌ని పరిశీలించగా దానిలో ఊపిరాడక,..కదలలేని వీడియో చూసినట్టు మృతుడి కుటుంబసభ్యులు పోలీసులకిచ్చిన ఫిర్యాదులో తెలిపారు. చనిపోయే సమయంలో మృతుడు యాదగిరి భార్య కవిత రికార్డు చేసినట్టు కంప్లైంట్‌లో మృతుడి కుటుంబసభ్యులు తెలిపారు. వీడియోని పరిశీలించిన తర్వాత మృతుడి కుటుంబసభ్యులు భార్య కవితపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసారు. సెల్ ఫోన్ గురించి పదే పదే కవిత అరాతీసేదని,.ఆందోళన చెందుతూ ఉండడం చూసి తాము సెల్ ఫోన్ చూడగా అసలు విషయం బయటపడిందని మృతుడి బంధువులు అంటున్నారు. జరిగిన సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

19:56 - October 5, 2016
16:55 - October 5, 2016

Pages

Don't Miss

Subscribe to RSS - kavitha