kcr

16:47 - July 18, 2018

భద్రాద్రి : తెలంగాణ ప్రభుత్వం హరితహారం పేరుతో గిరిజనుల భూములు లాక్కునే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. గిరిజనుల సమస్యలపై పోడుదారుల సదస్సును ఈ నెల 26న హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నామని చెప్పారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని నిర్మించాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 25న బయ్యారం నుండి మహబూబాబాద్‌ జిల్లాకేంద్రం వరకు బీఎల్‌ఎఫ్ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహిస్తామన్నారు. 

 

19:59 - June 4, 2018
20:25 - April 12, 2018

ఇప్పటికే చేశిన పనికి శిగ్గుపడకుంట.. ఇంక నేను అట్ల జేయలేదు ఇట్ల జేయలేదు.. అగో ఫలానోళ్లు డ్యాన్సు జేస్తె తప్పులేదు నేను జేస్తె తప్పా..? అంటున్నడు హయత్ నగర్ కార్పొరేటర్ తిర్మల్ రెడ్డి.. నిన్న ప్రెస్ మీటింగు వెట్టి.. నా అంత ప్రతివత లేదని ముచ్చట్లు జెప్తున్నడు సారు.. అయ్యా తిర్మల్ రెడ్డి ఈ తీట ముచ్చట్లు జెప్పుడు కంటె జర్ర నిన్ను నువ్వు అదుపుల వెట్టుకుంటె సమాజానికి మంచిగుంటది..

ఆ జనంల తిర్గుబాటు సుర్వైనట్టే ఉందిగదా..? టీఆర్ఎస్ పార్టీ మీద.. మొన్న మెదక్ నియోజకవర్గంల పద్మాదేవేందర్ రెడ్డి పనితనం మీద.. నిన్న మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మీద.. గాయాళ్ల పెద్దపల్లి ఎమ్మెల్యేను గెద్మిండ్రు.. ఇప్పుడు తుంగతుర్తి ఎమ్మెల్యే పనిజేశిండ్రు పబ్లీకు.. నడి చౌరస్తాల నిలవెట్టి ఏందయ్యా నువ్వు జేశింది అని తిడ్తున్నరు..

సూడుండ్రి సర్కారు తమాష ఎట్లున్నదో.. టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగ ఎవ్వలు మాట్లాడినా వాళ్లను సోషల్ మీడియా తిట్టుడు అడ్డగోలు మాటలనుడు.. ఇట్ల సర్కారోళ్లే కొంతమందికి జీతాలిచ్చి రాపిస్తున్నరన్న సంగతి జనానికి తెల్సిందేగని.. అయితే ఆడోళ్లను గూడ ఇష్టమొచ్చినట్టు తిట్టుడు మంచిదేనా.?? ఇగో గీమె తెలంగాణ జన సమితి పార్టీ నాయకురాలు ఆమెను ఎట్ల తిట్టిండ్రో సూడుండ్రి..

ఇప్పుడు వెయ్యిరూపాలిస్తె.. పదిరోజులళ్ల.. పద్నాలుగు వందల రూపాలిస్తాంటె.. ఎవ్వలికైనా ఆశ ఉంటదిగదా..? పదిరోజులకే నాల్గువందల రూపాల మిత్తిరావట్టే అని.. అయితె ఇట్ల కోట్ల రూపాలు జమజేశిన ఒక బాబాగాడు జనాన్ని నిండముంచి అవుతల వడ్డడు..మొత్తం మీద నెల్లూరు పోలీసోళ్లు వాన్ని దొర్కిచ్చుకున్నరు.. తెచ్చి మీడియాకు జూపెట్టిండ్రు..

20:19 - April 10, 2018

కోదండరాం సభకు సర్కారు అడ్డుపుల్ల...సభకు అనుమతియ్యమన్న పోలీసోళ్లు, టీడీపీ పోరాటం కుండ వలగొట్టిన జేసీ... హోదా కోసం గాదంట.. డ్రామానంట, మా నాయిన కళలు గంటున్నడు....అప్పటి నుంచి కళలే గని.. అమలు లేదుగదా?, టీఆర్ఎస్ ఎంపీ, ఎమ్మెల్యేకు పట్టవగటీలే సుక్కలు...నడిరోడ్డు మీద నిలవెట్టి నిలదీశిన జనాలు, నిజాంబాదుల రాందేవ్ బాబా యోగాసనాలు... ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారి అవస్థలు, తాగి తందనాలాడిన హయత్ నగర్ కార్పొరేటర్...వన్యప్రాణుల వనం.. చట్టాల ఉల్లంఘన... ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం.. 

 

21:52 - March 15, 2018

హైదరాబాద్ : తెలంగాణ బడ్జెట్‌ అంకెల గారడీగా ఉందని విపక్షాలు మండిపడ్డాయి. ప్రతిపాదనలు- ఖర్చుల వివరాలు అసంబద్ధంగా ఉన్నాయని కాంగ్రెస్‌, బీజేపీ, టీడీపీ, సీపీఎం విమర్శించాయి. రైతులను, నిరుద్యోగులను, స్కీమ్‌ వర్కర్‌ను వంచించేదిగా బడ్జెట్‌ను రూపకల్పన చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
హామీలు అమలు లేదన్న రేవంత్‌రెడ్డి 
తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని.. కాంగ్రెస్‌ నేత రేవంత్‌రెడ్డి ఆరోపించారు. చివరి బడ్జెట్‌లోనైనా అన్నివర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందనుకుంటే అదీ లేదన్నారు. డబుల్‌బెడ్‌రూం ఇళ్లకు తక్కువమొత్తంలో నిధులు కేటాయించారని.. వాటితో పేదల ఇళ్ల పథకం ఎప్పటికీ పూర్తి కాదన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతులకు, అమరవీరులకు నయాపైసా కేటాయించలేదని ఇది తెలంగాణ అమరవీరులను, రైతులను అవమానించడమేనన్నారు.
బడ్జెట్‌ కేటాయింపులే తప్ప ఖర్చు లేదు : టీడీపీ 
బడ్జెట్‌ కేటాయింపులే తప్ప ఖర్చుపెట్టేది కాదని టీడీపీ ఆరోపించింది. డబుల్‌బెడ్‌రూం ఇళ్లు, దళితులకు మూడు ఎకరాల భూములకు బడ్జెట్‌లో తక్కువ నిధులు కేటాయించారని.. వీటితో ఆ పథకాలు పూర్తి కావని టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. కేసీఆర్‌ కుటుంబంలో ఉద్యోగాలు వస్తున్నాయని.. నిరుద్యోగులకు మాత్రం రావడం లేదని ఆయన మండిపడ్డారు. 
బడ్జెట్‌లో లెక్కలకు... వాస్తవాలకు వ్యత్యాసం : కిషన్ రెడ్డి
బడ్జెట్‌లో లెక్కలకు... వాస్తవాలకు చాలా వ్యత్యాసం ఉందన్నారు బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి. ప్రభుత్వం ఆర్భాటంగా పథకాలు ప్రవేశపెడుతుందే తప్ప అవి పూర్తి చేయడం లేదన్నారు. పథకాలన్నీ పూర్తి చేయాలంటే మరో 3 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేయాల్సిన అవసరముందని కిషన్‌రెడ్డి అన్నారు. 
బడ్జెట్‌ అంకెల గారడీ : సున్నం రాజయ్య  
బడ్జెట్‌ అంకెల గారడీగా ఉందని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య విమర్శించారు. బడ్జెట్‌ ప్రగతి నిరోధకంగా ఉందన్నారు. బలహీనవర్గాలను మభ్యపెట్టే విధంగా బడ్జెట్‌ ప్రతిపాదనలు ఉన్నాయని  మండిపడ్డారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి  తీసుకుంటున్న చర్యలను బడ్జెట్‌లో ప్రస్తావించకపోవడాన్ని రాజయ్య తప్పుపట్టారు. మొత్తంగా సంక్షేమ బడ్జెట్‌ అని ప్రభుత్వం అంటుంటే.. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసేలా బడ్జెట్‌ను రూపొందించారని విపక్షాలు మండిపడుతున్నాయి. 

21:36 - March 15, 2018
21:26 - March 15, 2018

హైదరాబాద్ : భారీ సైజ్‌ బడ్జెట్‌ను ప్రతిపాదించిన తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల.. సాగునీటి రంగానికి 25వేల కోట్ల రూపాయలు కేటాయించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెప్పుకుంటున్న పంటల పెట్టుబడి పథకానికి పన్నెండు వేల కోట్లు కేటాయించారు. డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల పథకానికి కేవలం రెండు వేల 643 కోట్ల రూపాయలు కేటాయించారు. మొత్తంగా.. లక్షా 74 వేల 453 కోట్లతో బడ్జెట్‌ ప్రతిపాదనలను ఈటల రాజేందర్‌ శాసనసభలో ప్రవేశపెట్టారు. 
బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మంత్రి ఈటల  
2018-19 వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ శాసనసభలో ప్రవేశపెట్టారు. లక్షా 74 వేల 453 కోట్ల రూపాయల బడ్జెట్‌లో..రెవెన్యూ వ్యయం లక్షా 25 వేల 454 కోట్లు .. రెవెన్యూ మిగులు 5 వేల 520కోట్లు, ద్రవ్యలోటు 29 వేల 77కోట్లుగా అంచనా వేశారు. రాష్ట్ర ఆదాయం 73 వేల 751కోట్లు కాగా.. కేంద్రం వాటా 29 వేల 41కోట్లు ఉందని ఈటల తెలిపారు. 
టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి ఇదే పూర్తిస్థాయి చివరి బడ్జెట్
ఐదోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఈటల రాజేందర్‌.. ఒక గంటా 20 నిమిషాల పాటు బడ్జెట్‌ సారాంశాన్ని చదివి వినిపించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి ఇదే పూర్తిస్థాయి చివరి బడ్జెట్. బడ్జెట్‌లో సంక్షేమ రంగంతో పాటు వ్యవసాయం, విద్య, ఆరోగ్య రంగాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఈటల చెప్పారు. వ్యవసాయరంగానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అన్నారు. మొదటి పంట రుణాలను మాఫీ చేశామన్న ఆయన.. పంట పెట్టుబడి మద్దతుకు 12 వేల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామన్నారు. ఎకరానికి 4 వేల చొప్పున రెండు పంటలకు మొత్తం 8 వేల రూపాయలు రైతుకు ఇవ్వనున్నట్లు తెలిపారు. సమగ్రభూ సర్వేతో భూముల ప్రక్షాళన జరిగిందన్న ఆయన.. రైతు బీమా పథకానికి రూ.500 కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు. అలాగే వ్యవసాయ యాంత్రీకరణకు రూ.522 కోట్లు, బిందు, తుంపర సేద్యానికి 127 కోట్లు, పాలీ-గ్రీన్‌హౌజ్‌కు 120 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు చెప్పారు. పౌరసరఫరాల రంగానికి 2 వేల 946 కోట్లు, నీటి పారుదల రంగానికి 25వేల కోట్లు కేటాయిస్తున్నట్లు ఈటల తెలిపారు. గ్రామీణ స్థానిక సంస్థలకు 1500కోట్లు, పట్టణ స్థానిక సంస్థలకు 1000 కోట్లు కేటాయించారు. గొర్రెల పెంపకంతో గొల్లకురుమలకు, చేపల పెంపకంతో ముదిరాజ్‌లకు చేయూత లభించిందన్నారు. పౌల్ట్రీలో దేశంలో రెండోస్థానంలో ఉన్నామన్న ఈటల.. పౌల్ట్రీరంగానికి 109 కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు. 
సంక్షేమ రంగానికి పెద్దపీట 
తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ రంగానికి పెద్దపీట వేస్తుందని ఈటల అన్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ పథకానికి 1450 కోట్లు, మహిళా శిశు సంక్షేమానికి 1799 కోట్లు, ఎస్సీ ప్రగతి నిధికి 16 వేల 453 కోట్లు, ఎస్టీల ప్రగతి నిధికి 9 వేల 693 కోట్లు కేటాయించారు. అలాగే.. షెడ్యూల్‌ కులాల శాఖకు 12 వేల 709 కోట్లు, దళితులకు 3 ఎకరాల భూ పంపిణీ కోసం 1469 కోట్ల రూపాయలను బడ్జెట్‌లో పొందుపర్చారు. అలాగే ఎస్టీ సంక్షేమ శాఖకు 8వేల 63 కోట్లు ప్రతిపాదించారు. ఎంబీసీల సంక్షేమానికి వెయ్యి కోట్లు, రజకుల ఫెడరేషన్‌కు 200 కోట్లు, నాయిబ్రాహ్మణులకు 250 కోట్లు కేటాయించారు. వెనుకబడిన తరగతుల అభివృద్ధికై ఈసారి బడ్జెట్‌లో 5వేల 920 కోట్లు కేటాయించారు. మైనార్టీ శాఖకు 2 వేల కోట్లు, బ్రాహ్మణుల సంక్షేమానికి 100కోట్లు, జర్నలిస్టుల సంక్షేమానికి 75 కోట్లు ప్రతిపాదించారు.
డబుల్‌ బెడ్‌రూం ఇళ్లకు 2 వేల 643కోట్లు
డబుల్‌ బెడ్‌రూం ఇళ్లకు 2 వేల 643కోట్లు, అమ్మఒడి పథకానికి 561 కోట్లు, వైద్య రంగానికి 7వేల 375 కోట్లు కేటాయించారు. విద్యారంగానికి 10 వేల 830 కోట్లు ప్రతిపాదించారు. సాంకేతిక విద్యకు 95 కోట్లు, కళాశాలల్లో మౌళిక వసతులకు 247 కోట్లు, ఉన్నత విద్యా రంగానికి 2 వేల 448 కోట్లు, రెసిడెన్షియల్‌ సంస్థలకు 2వేల 823 కోట్లు కేటాయించారు. మిషన్‌ భగీరథ పథకం కోసం 1801 కోట్లు, తెలంగాణకు హరితహారం పథకానికి 1166 కోట్లు,  రవాణా-రోడ్లు, భవనాల శాఖకు 5 వేల 575 కోట్లు, పంచాయితీరాజ్‌-గ్రామీణాభివృద్ధికి 15 వేల 563 కోట్లు, విద్యుత్‌ రంగానికి 5 వేల 650 కోట్లు కేటాయించారు. 
చేనేత, టెక్స్‌టైల్‌ రంగానికి 1200 కోట్లు
చేనేత, టెక్స్‌టైల్‌ రంగానికి 1200 కోట్లు, పరిశ్రమలు-వాణిజ్య శాఖకు 1286 కోట్లు, ఐటీ రంగానికి 289 కోట్లు కేటాయించారు. పురపాలక-పట్టణాభివృద్ధికి 7 వేల 251 కోట్లు,  సాంస్కృతిక రంగానికి 58 కోట్లు, యాదాద్రి అభివృద్ధికి 250 కోట్లు, వేములవాడ దేవాలయ అభివృద్ధికి 100కోట్లు,  భద్రాచలం, బాసర, ధర్మపురి దేవాలయాల అభివృద్ధికి 200కోట్లు ప్రతిపాదించారు. హోం శాఖకు 5 వేల 790 కోట్లు కేటాయించారు. అనేక ప్రతికూల పరిస్థితులు, సవాళ్ల మధ్య ఏర్పడిన నూతన రాష్ట్రం అనేక విషయాల్లో దేశానికి ఆదర్శంగా నిలిచే స్థాయికి ఎదిగిందని ఈటల రాజేందర్‌ అన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణమే ధ్యేయంగా పనిచేస్తున్నామని చెప్పారు. 

21:13 - March 15, 2018

టీ.బడ్జెట్ నిరాశజనకంగా ఉందని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చ కార్యక్రమంలో సీపీఎం కేంద్రకమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, కాంగ్రెస్ అధికారి ప్రతినిధి అద్దంకి దయాకర్, టీఆర్ఎస్ నేత సుధాకర్ రెడ్డి, బీజేపీ నేత రాకేష్ రెడ్డి లు పాల్గొని, మాట్లాడారు. బడ్జెట్ తో పేదలకు ఒరిగేమీలేదని విమర్శించారు. వివిధ శాఖలకు నిధుల కేటాయింపులు తక్కువగా ఉన్నాయన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

20:45 - February 24, 2018

మేడ్చల్‌ : జిల్లాలోని మల్కాజిగిరి మౌలాలీలోని గాంధీ నగర్‌లో కిడ్నాప్‌ కలకలం సృష్టించింది. చాక్లెట్‌ ఆశ చూపి చిన్నారులను ఎత్తుకెళ్లేందుకు నలుగురు యువకులు యత్నించారు. పిల్లలను ఎత్తుకొని పారిపోతుండగా చిన్నారులు అరవడంతో స్థానికులు యువకులను పట్టుకొని చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. 

 

09:44 - January 29, 2018

నల్లగొండ : జిల్లా కేంద్రంలో హత్య కలకలం రేపుతోంది. కాంగ్రెస్ నేత, మున్సిసల్ చైర్ సర్సన్ భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య ఘటన మరువకుమందే మరో వ్యక్తి హత్య గావించబడ్డారు. బొట్టుగూడలో ఓ వ్యక్తిని దుండగులు హత్య చేశారు. తల నుండి మొండెం వేరు చేశారు. దుండగులు తలను పడేసి వెళ్లారు. మొండెం లభ్యం కాలేదు. మృతుడు కనగల్‌ గ్రామానికి చెందిన పాలకూరి రమేష్‌గా గుర్తించారు. రమేశ్‌ ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడని పోలీసులు తెలిపారు. అయితే తల మాత్రమే లభించడంతో మొండేన్ని ఎక్కడ పడవేశారన్న దానిపై పోలీసులు ఆరాతీస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

Pages

Don't Miss

Subscribe to RSS - kcr