KCR government

21:59 - April 23, 2018

మేడ్చల్ : ఈనెల 27న జరగబోయే టీఆర్‌ఎస్ ప్లీనరీని ఘనంగా నిర్వహిస్తామని ఐటీ, పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. కొంపల్లిలో ప్లీనరీ ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు. ప్లీనరీ నిర్వహణ కోసం 9 కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్లీనరీ జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 13 వేల మంది ప్రతినిధులు హాజరుకానున్నారని చెప్పారు. ప్లీనరీకి వచ్చే వారి కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని కేటీఆర్ పేర్కొన్నారు. 

21:03 - April 21, 2018

హైదరాబాద్ : రైతుబంధు చెక్కులు, పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీకి సంబంధించిన అంశాలపై కలెక్టర్లతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమై చర్చించారు. పాస్ బుక్స్‌ పంపిణీ, చెక్కుల పంపిణీ నిర్వహణపై అధికారులకు సీఎం పలు సూచనలు చేశారు. పట్టాదారులైన రైతులందరికీ కొత్త పాస్ పుస్తకాలు, రైతుబంధు చెక్కులు పంపిణీ చేస్తామని కేసీఆర్ వెల్లడించారు. అసైన్డ్ భూముల లబ్దిదారులు, ROFR పట్టాదారులు, ఏజెన్సీలో వ్యవసాయం చేసే గిరిజనేతరులతో సహా పట్టాదారులైన రైతులందరికీ కొత్త పాస్ పుస్తకాలు, పంట పెట్టుబడి మద్దతు పథకం కింద ఆర్థిక సహాయం అందించే చెక్కులను పంపిణీ చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కొత్త పట్టాదారు పాస్ బుక్స్‌ను సీఎం కేసీఆర్ విడుదల చేశారు.

ఈ నెలాఖరుకు 58 లక్షల పాస్ పుస్తకాలు, చెక్కుల ముద్రణ పూర్తవుతుందని సీఎం స్పష్టం చేశారు. చెక్కులు, పాస్ పుస్తకాల పంపిణీతో అధికారులంతా తమ శక్తి మేరకు కృషి చేయాలన్నారు. దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఇలాంటి భారాన్ని ఎవరూ ఎత్తుకోలేదని సీఎం తెలిపారు. గతంలో ఎప్పుడూ లేని కార్యక్రమాలను మనమే రచించుకొని అమలు చేస్తున్నామని చెప్పారు.

పాస్‌బుక్స్ పంపిణీకి రాష్ట్ర వ్యాప్తంగా 2762 బృందాలు ఏర్పాటు చేశామన్నారు. ఒక్కో బృందం 300 పాస్ పుస్తకాల చొప్పున పంపిణీ చేస్తుందని సీఎం వెల్లడించారు. చెక్కులు తీసుకున్న రైతులు వెంటనే బ్యాంకుల నుంచి నగదు పొందేలా ఏర్పాట్లు చేశామని సీఎం పేర్కొన్నారు. రైతులకు వెంటనే నగదు చెల్లించకపోతే బ్యాంకులపై చర్యలు తీసుకుంటామన్నారు.

గ్రామాల్లోని పాఠశాలల్లో చెక్కులు, పాస్‌బుక్స్ పంపిణీ కార్యక్రమం చేపట్టాలని సూచించారు. ఏ గ్రామంలో ఎప్పుడు పంపిణీ ఉంటుందో ప్రజలకు ముందే సమాచారం ఇవ్వాలని సూచించారు. పంపిణీ సమయంలో చెక్కులు, పాస్ బుక్స్ తీసుకోని వారికి తహసీల్దార్ ఆఫీస్‌లో ఇవ్వాలని చెప్పారు. రూ. 50 వేల కంటే ఎక్కువ ఉన్న వారికి రెండు చెక్కులు ఇవ్వాల్సి ఉంటుందని కేసీఆర్ తెలిపారు. పాస్ బుక్స్, చెక్కులు పొందిన వారి నుంచి రశీదు తీసుకోవాలని ఆదేశించారు. కొంతమంది రైతులు పెట్టుబడి మద్దతును స్వచ్చందంగా వదులుకుంటున్నారు. వదులుకున్న సొమ్మును రైతు సమన్వయ సమితి మూలధనంగా మార్చుకోవాలని సీఎం కేసీఆర్ సూచించారు.

18:23 - April 21, 2018

హైదరాబాద్ : త్వరలోనే తెలంగాణ రైతులకు కొత్త పట్టాదారు పుస్తకాలు రానున్నాయి. ఇప్పటికే దీనిపై ప్రభుత్వం కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా శనివారం ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను ప్రగతి భవన్‌లో విడుదల చేశారు. రైతుబంధు చెక్కులు, పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీకి సంబంధించిన అంశాలపై ఆయన కలెక్టర్లతో చర్చించారు. ఈ సందర్భంగా కొత్త పాస్ పుస్తకాలను విడుదల చేశారు. 

21:53 - April 14, 2018

అగ్రరాజ్యపు వైఖరిని ప్రధాని నరేంద్ర మోదీ అవలంభిస్తున్నారని పేర్కొన్నారు. భారతదేశపు సార్వభౌమాధికారాన్ని మోదీ విదేశీయులకు తాకట్టు పెట్టారని విమర్శించారు. ట్రంప్ కు అత్యంత సన్నిహితుడు ప్రధాని మోదీ అని ఎంసీపీఐ అఖిల భారత ప్రధాన కార్యదర్శి ఎండీ గౌస్ విమర్శించారు. ప్రపంచ సామ్రాజ్య వాదానికి నిలువెత్తు నిరద్శనంగా వున్న అమెరికాకు మోదీ మోకరిల్లుతున్నారని గౌస్ పేర్కొన్నారు. నాలుగేళ్ళ ప్రధాని మోదీ పాలన ఎలా వుంది? దేశంలో ప్రస్తుత రాజకీయ సామాజిక పరిస్థితులు ఎలా వున్నాయి? వంటి వివిధ అంశాలపై ఎంసీపీఐ అఖిల భారత ప్రధాన కార్యదర్శి ఎండీ గౌస్ ఫేస్ టూ ఫేస్..

10:34 - April 14, 2018

హైదరాబాద్ : బలహీన వర్గాలకు మోడీ ప్రభుత్వం తీవ్రమైన అన్యాయం చేస్తోందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు పేర్కొన్నారు. లిబర్టి వద్దనున్న ట్యాంక్ బండ్ విగ్రహానికి సీపీఎం నేతలు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాఘవులు, సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంలు మీడియాతో మాట్లాడారు. దేశంలో దళితులు, మైనార్టీలు, మహిళలు వారి ఆత్మగౌరవాన్ని కోరుకొనే వారు మతోన్మాద సంఘ్ పరివార్ శక్తులతో పోరాడాల్సినవసరం ఉందని తెలిపారు. బహుజనులకు రాజ్యాధికారం సాధిస్తే అప్పుడే అంబేద్కర్ కు అసలైన నివాళి అని తమ్మినేని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బహుజనులు రాజ్యాధికారం సాధించేందుకు బిఎల్ఎఫ్ కృషి చేస్తోందన్నారు. 

09:44 - April 14, 2018

హైదరాబాద్ : గొర్రెనో..బర్రెనో..ఇస్తే సామాజిక న్యాయం కల్పించినట్లు కాదని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. ట్యాంక్ బండ్ పై అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ...ఇవి కేవలం సామాజిక సహాయాలు సంక్షేమాలు మాత్రమేనని, గత ప్రభుత్వాలు అన్ని సంక్షేమ పథకాలు అమలు పరిచాయన్నారు. కొంత లబ్ధి జరిగినా అవి బతుకులు మార్చిన స్కీంలు కాదని, బతుకులు మారాలంటే సామాజిక న్యాయం జరగాలన్నారు. చట్టబద్ధమైన అధికారాలు...రక్షణలు ఉండాలని, రాజ్యాంగపరమైన రక్షణాలుండాలన్నారచు. దేశంలో దళితులపై జరుగుతున్న దాడులు అరికట్టాలని పేర్కొన్నారు. అంతిమంగా అసెంబ్లీలో..పార్లమెంట్ లో బహుజనులందరికీ వారి వారి జనాభాను బట్టి వాటాలు లభించాయని, ఇది నెరవేరినప్పుడే సామాజిక న్యాయం అమలైనట్లు భావించాలన్నారు. సామాజిక న్యాయం అంటూ పెద్ద పెద్ద మాటలు చెబుతున్నారని, 119 అసెంబ్లీ సీట్లలో బీసీలకు ఎన్ని సీట్లు కేటాయిస్తారనే దానిపై చెప్పడం లేదన్నారు. 65-70 తక్కువ కాకుండా బీసీలకు సీట్లు కేటాయిస్తామని ఇప్పటికే ప్రకటించామన్నారు. బీఎల్ఎఫ్ చేస్తున్న పని తీరును గమనించి మద్దతివ్వాలని కోరారు. 

21:24 - April 11, 2018

తల్గుదెంపు కున్న అంబర్ పేట అన్మంతు...పూలే జయంతి కాడ తోటోళ్ల మీద గంతు, దగ్గుపాటి సురేష్ బాబు కొడ్కు బాగోతం...ముద్దుల పోట్వ రిలీజ్ జేశ్న శ్రీ రెడ్డి, మోడీని కాల్చి సంపుతాంటున్న కత్తి మహేష్...అనంతపురం జిల్లాల రాజ్యంగ రక్షణ సభ, దళితుల భూమి మీద మున్సిపాలిటీ గద్ద...మహబూబాబాద్ కాడ దళిత జనం ధర్నా, బోధన్ కాడ బోరుగొట్టేశిన టీఆర్ఎస్ సభ...ఖాళీ కుర్చీలే ఇన్న నేతల ప్రసంగాలు, కుత్కె గోశెతట్టు జేశిన ఐపీఎల్ క్రికెట్... టీవీ ఛానల్ మార్పుకాడ పంచాది... ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం...

 

18:14 - April 9, 2018

ఖమ్మం : జిల్లా మధిరలో టీఆర్ఎస్‌ బహిరంగసభకు..డబ్బులు ఇచ్చి మరీ జనాన్ని తరలించారు. సభను సక్సెస్‌ చేసేందుకు నేతలు జనాన్ని ప్రలోభపెట్టి బస్సుల్లో తీసుకువచ్చారు. బస్సు దిగిన వెంటనే డబ్బులు పంపిణీ చేశారు. ఈ విజువల్స్‌ను టెన్‌ టీవీ ఎక్స్‌క్లూజివ్‌గా సాధించింది. 

08:13 - April 8, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితి 18వ ఆవిర్భావ దినోత్సవానికి రెడీ అవుతోంది. ఈనెలలోనే పార్టీ ప్లీనరీ, బహిరంగ సభను జరుపుకోవాలని భావిస్తోంది. 27న బహిరంగ సభ నిర్వహించి... విపక్షాలకు తమ పాలనపై ధీటైన సమాధానం ఇవ్వాలని డిసైడ్‌ అయ్యింది.
ఈ నెలలోనే టీఆర్‌ఎస్‌ ప్లీనరీ
టీఆర్‌ఎస్‌ ప్లీనరీకి ముహూర్తం దాదాపు ఖరారు అయ్యింది. 2001 ఏప్రిల్‌ 27న టీఆర్‌ఎస్‌ ఆవిర్భవించింది.  ఏప్రిల్‌ 27న ప్రతిఏటా టీఆర్‌ఎస్‌ ఆవిర్భావ సభను ఘనంగా జరుపుతోంది. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహిస్తోంది. ఈ ఏడాది కూడా పార్టీ ఆవిర్భావ  దినోత్సవాన్ని గ్రాండ్‌గా జరిపేందుకు గులాబీబాస్‌ రెడీ అయ్యారు. 
ప్లీనరీ ఘనంగా నిర్వహించాలని డిసైడ్‌ 
ఈసారి నిర్వహించే పార్టీ ఆవిర్భావ సభ, ప్లీనరీకి ఓ ప్రత్యేకత ఉంది. సార్వత్రిక ఎన్నికలకు ఇక సంవత్సరం కూడా సమయం లేదు. దీంతో ఇప్పటి వరకు ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం టీఆర్‌ఎస్‌ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే పార్టీ ప్లీనరీ ఘనంగా నిర్వహించాలని డిసైడ్‌ అయ్యింది. ప్లీనరీ వేదికగా తమ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను టీఆర్‌ఎస్‌ ప్రజలకు వివరించనుంది. 
రెండు రోజులపాటు ప్లీనరీ సమావేశాలు
ప్లీనరీని రెండు రోజులపాటు నిర్వహించే అవకాశముంది. ఈనెల 23 24న  ప్లీనరీని నిర్వహించాలన్న యోచనలో టీఆర్‌ఎస్‌ ఉంది. పార్టీ ఆవిర్భావ దినమైన ఈనెల 27న బహిరంగ సభను నిర్వహించనుంది. ప్లీనరీతోపాటు బహిరంగ సభా వేదికలు ఇంకా ఖరారు కాలేదు. బహిరంగ సభకు జనసమీకరణ భారీగా చేయాలని టీఆర్‌ఎస్‌ డిసైడ్‌ అయ్యింది. 20 లక్షల మందిని సమీకరించి.. తమ సత్తాచాటుకోవాలని గులాబీదళం పావులు కదుపుతోంది. అయితే బహిరంగ సభను జింఖానా గ్రౌండ్స్‌లోనా లేక.. ఔటర్‌రింగ్‌కు సమీపంలోనా అన్నది ఇంకా ఖరారు కాలేదు. మరో రెండు మూడు రోజుల్లో ప్లీనరీకి సంబంధించిన తేదీలు అధికారికంగా ప్రకటించే అవకాశముంది. ప్లీనరీతోనే  ఎన్నికల శంఖారావం పూరించేందుకు కేసీఆర్‌ పావులుకదుపుతున్నట్టు పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.

 

06:49 - April 5, 2018

సింగరేణిలో కాంట్రాక్ట్‌ కార్మికులు ఆందోళన బాట పట్టారు. అసలు సింగరేణిలో కాంట్రాక్ట్‌ కార్మికులే లేరన్న మంత్రి జగదీశ్‌రెడ్డిపై వారు మండిపడుతున్నారు. తమకు బోనస్‌లు, తమ న్యాయమైన కోర్కెల విషయంలో ప్రభుత్వం, యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ వారి ఆందోళకు గల కారణాలు, కార్మికుల పట్ల యాజమాన్యం అనుసరిస్తున్న వైఖరి, ప్రభుత్వ విధానాలపై టెన్ టివి జనపథంలో సీఐటీయూ నాయకులు మధు చర్చించారు. పూర్తి విశ్లేషణ కోసం వీడియో క్లిక్ చేయండి. 

Pages

Don't Miss

Subscribe to RSS - KCR government