KCR Government Failures

20:30 - August 10, 2018

భారతదేశంలనే గాదు ఈ ప్రపంచంలనే రైతులకు భీమా జేశిన ప్రభుత్వంగానీ.. రైతులకు పెట్టుబడి ఇచ్చిన ప్రభుత్వంగాని ఏడలేదు అంటున్నడు ఎవుసం శాఖామంత్రి శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి సారు.. సూడుండ్రి నెల రోజుల సంది గ్రామ పంచాది కార్మికులు సమ్మె జేస్కుంట జీతాలు వెంచుమంటే ఎవ్వడు వాళ్ల ముచ్చట వట్టిచ్చుకోలే..రాసమయి బాలకిషన్ సారు.. ఎందుకు సారు ఈ ఉద్దెర మాటలు మాట్లాడ్తవ్..? నిజామాబాద్ జిల్లా బాల్కొండ జడ్పీటీసీ రాజీనామా జేశింది..ప్రజలారా మీరు ముందుగాళ్ల మారకుంట ఈ భూమ్మీద ఏ వ్యవస్థ మారది.. మార్పురావాల్సింది ముందుగాళ్ల ప్రజలళ్లనే.. నిన్న పొద్దుగాళ్ల యాదాద్రి బోనగిరి జిల్లా బీబీనగర్ మండలం కొండమడ్గుకాడ.. ఒక కారు స్కూటీ మీద వోతున్న పోరగాళ్ల బండికి టక్కరైంది..రాజుగాని పెండ్లి శ్రీకాంతు సావుకొచ్చింది.. ప్రేమించుకున్నోళ్లు బాగనే ఉన్నరు.. గీ గరం గరం ముచ్చట్ల కోసం వీడియో క్లిక్ చేయండి. 

20:23 - August 9, 2018

సూస్తిరా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికలు ఎట్లైనయో.. మనం ఈడ అంగీలు శింపుకుంటం.. అభిమానం ఉండాలేగని.. అది బానిసత్వానికి ప్రతిరూపంగ మారొద్దు.. కరుణానిధి జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమన్న ఉన్నదా..? జగన్ మోహన్ రెడ్డిగారు పాదయాత్ర జేస్తున్నడు.. ఎందుకు..?అభిమానం ఉండాలేగని.. అది బానిసత్వానికి ప్రతిరూపంగ మారొద్దు.. జగన్ మోహన్ రెడ్డిగారు పాదయాత్ర జేస్తున్నడు.. ఎందుకు..? రేపు పొద్దుగాళ్ల పేపర్ల పొంట వస్తయ్ తాటికాయంత అచ్చరాలతోని.. ఘనంగా ఆదివాసీ దినోత్సవ వేడుకలు.. రాజకీయాలు ఎంత దిగజారిపోయినయో సూడుండ్రి మొన్న ఒకనాడు ఒక బాండు బైటవడెనా..? డబుల్ బెడ్రూం ఇండ్ల పథకం కేసీఆర్ రాజకీయ కొంప కొల్లేరు జేస్తట్టే గొడ్తున్నది..వర్దన్నపేట ఎమ్మెల్యేగారు.. మీరు రాజీనామా జేయవల్చిన ఎమ్మెల్యేల లిస్టుల ఫస్టు ప్లేస్ల ఉంటరేమో... పదో తర్గతి పోరడు ఉరివెట్టుకోని సచ్చిపోయిండు.. ఎందుకు..? గీ గరం గరం ముచ్చట్ల కోసం వీడియో క్లిక్ చేయండి. 

06:42 - August 4, 2018

నిజామాబాద్ : గులాబి పార్టీలో నిజామాబాద్ రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. సీనియర్ నేత డిశ్రీనివాస్‌పై పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటూ.. సాక్షాత్తు నిజామాబాద్‌ ఎంపీ కవిత ఇటీవలే డిమాండ్‌ చేశారు. ఇప్పుడు, ఆయన తనయుడు సంజయ్‌పై పోలీసు కేసు నమోదైంది. ఈ పరిమాణాలన్నీ చూస్తే.. కారు పార్టీ డిఎస్‌కు పొగబెడుతున్నట్లే అన్న భావన వ్యక్తమవుతోంది. తెలంగాణా రాష్ట్ర సమితిలో.. దాదాపుగా అన్ని జిల్లాల్లోనూ నేతల ఆధిపత్య పోరు సాగుతోంది. అయితే.. నిజామాబాద్ జిల్లా నేతల పోరు మాత్రం ప్రత్యేకతరె సంతరించుకుటోంది. ఆ పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీ కవిత ప్రాతినిథ్యం వహిస్తుండడం... జిల్లా అంతటా ఈ పార్టీకి చెందిన శాసనసభ్యులు, ఎంపీలే ఉండడంతో... ఇక్కడ అంతర్గత పోరు కాస్త అధికంగానే ఉంది. ఎమ్మెల్యేల మధ్య సమన్వయం లేకుండా పోయిందని, నేతలంతా ఎవరికివారే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు.

నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ తో.....ఎమ్మెల్సీ భూపతిరెడ్డికి విబేధాలు సమిసి పోకపోవడంతో భూపతి రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఆరు నెలల క్రితం జిల్లా ప్రజాప్రతినిధులు తీర్మానం చేసి సిఎంకు పంపారు. డి.శ్రీనివాస్ కూడా పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారని రెండు నెలలక్రితం జిల్లా నేతలు తీర్మానించి చర్యలు తీసుకోవాలని కోరారు. రాజకీయంగా కలకలం రేపిన ఈ రెండు ఫిర్యాదులనూ సీఎం పెండింగ్‌లో ఉంచారు.

అనూహ్యంగా డిఎస్‌ తనయుడు సంజయ్‌పై ప్రభుత్వానికి ఫిర్యాదు అందడం.. పోలీసు శాఖ శరవేగంగా స్పందించడం.. నిర్భయ సహా నాలుగు సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేయడంతో జిల్లా రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. నిజానికి సంజయ్‌పై ఎప్పటి నుంచో ఆరోపణలున్నాయి. అయితే.. ఉన్నట్టుండి ఇప్పుడే వాటిని తెరపైకి తెచ్చి.. కేసులు నమోదు చేయడం వెనుక రాజకీయ కోణం ఉందన్న భావన విశ్లేషకుల్లో వ్యక్తమవుతోంది.

డి.శ్రీనివాస్‌, ప్రస్తుతం అధికార పార్టీలోనే కొనసాగుతున్నా, తనయుడిపై కేసు విషయంలో నోరు మెదపలేని పరిస్థితిలో ఉన్నారు. ప్రతిపక్ష పార్టీలో ఉండి ఉంటే.. తన పరిస్థితి, కేసు తీవ్రత మరోవిధంగా ఉండేదని, పార్టీ నుంచి తనను పొమ్మనలేకే పొగబెడుతున్నారన్న వాదనను ప్రజలకు వినిపించేందుకు డిఎస్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తాజా పరిణామాల నేపథ్యంలో, డిఎస్‌, రాహుల్ పర్యటనలోపే కాంగ్రెస్ గూటికి చేరతారన్న ప్రచారం ఇప్పటికే జోరందుకుంది. జిల్లా రాజకీయ పరిణామాలు ఎలాంటి మలుపులు తిరుగుతాయో వేచి చూడాలి. 

06:40 - August 4, 2018

నిజామాబాద్ : డి.శ్రీనివాస్‌ తనయుడు.. ధర్మపురి సంజయ్‌పై... లైంగిక వేధింపుల ఉచ్చు బిగుసుకుంటోంది. శాంకరి నర్సింగ్‌ కాలేజీ విద్యార్థినుల ఫిర్యాదు మేరకు.. పోలీసులు చర్యలకు శ్రీకారం చుట్టారు. నిర్బయ సహా.. నాలుగు సెక్షన్ల కింద.. కేసులు నమోదు చేశారు. ఇక సంజయ్‌ని అరెస్ట్‌ చేయడమే తరువాయి అన్నట్లుగా వ్యవహారం సాగుతోంది. తనను రాజకీయంగా దెబ్బతీసేందుకే ఈ కుట్ర సాగుతోందని సంజయ్‌ ఆరోపిస్తున్నారు.

నిజమాబాద్‌ నగర మాజీ మేయర్‌, రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్‌ తనయుడు.. డి.సంజయ్‌ని లైంగిక వేధింపుల ఆరోపణలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. సంజయ్‌, కాలేజీ హాస్టల్‌కు వచ్చి లైంగిక వికృత చేష్టలకు పాల్పడడం, అసభ్య పదజాలంతో దూషించడం, వేధింపులకు పాల్పడుతున్నారన్నది.. శాంకరి నర్సింగ్‌ కాలేజీ విద్యార్థినుల ఆరోపణ. వీరి ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్న పోలీసులు.. సంజయ్‌పై.. నిర్భయ సహా ఐపీసీలోని నాలుగు సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు.

గురువారం, రాష్ట్ర హోంమంత్రి నాయిని నరసింహారెడ్డికి ఫిర్యాదు చేసిన శాంకరి నర్సింగ్‌ కాలేజీ విద్యార్థినులు, శుక్రవారం, నిజమాబాద్‌ పోలీసు కమిషనర్‌ను కలిసి విషయం వివరించారు. అనంతరం నాలుగో ఠాణాలో ఫిర్యాదు చేశారు. డిసెంబర్‌లో అడ్మిషన్‌లు తీసుకున్న తాము.. మూడు నెలల పాటు ప్రైవేటు హాస్టల్స్‌ ఉంటే.. సంజయ్‌ కాలేజీ హాస్టల్‌లో ఉండాలంటూ ఒత్తిడి తెచ్చారని.. అక్కడ సంజయ్‌ తమను వేధించారన్నది విద్యార్థినుల అభియోగం.

నిర్భయ సహా.. నాలుగు సెక్షన్ల కింద కేసులు ఎదుర్కొంటోన్న సంజయ్‌.. తనపై వచ్చిన అభియోగాన్ని తోసిపుచ్చారు. ఇదంతా రాజకీయ కుట్ర అని అభిప్రాయపడ్డారు. అటు.. సంజయ్‌ సోదరుడు, బీజేపీ నేత ధర్మపురి అరవింద్‌.. దీన్ని టీఆర్ఎస్‌ అంతర్గత వ్యవహారంగా అభివర్ణించారు. సంజయ్‌తో విడిపోయి 20 ఏళ్లు దాటిందని, ఆయనపై వస్తోన్న ఆరోపణలు తనకు వ్యక్తిగతంగా ఎలాంటి డ్యామేజీ చేయవని అభిప్రాయపడ్డారు.

మరోవైపు.. మహిళా, ప్రజాసంఘాలు సంజయ్‌ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాయి. పదకొండు మంది విద్యార్థినులు సంజయ్‌ వేధింపులపై రోడ్డెక్కితే.. దీన్ని రాజకీయ కుట్రగా అభివర్ణించడాన్ని.. మహిళా, ప్రజా సంఘాలు తప్పుబడుతున్నాయి. ఆయన దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని, పోలీసులు అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

మొత్తానికి సంజయ్‌పై వచ్చిన ఆరోపణలు.. నిజామాబాద్‌ జిల్లా రాజకీయాల్లో పెను ప్రకంపనలనే సృష్టిస్తున్నాయి. రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్‌ కాంగ్రెస్‌ గూటికి చేరుకుంటారని వస్తోన్న వార్తల నేపథ్యంలో.. ఆయన తనయుడు సంజయ్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు.. ఆసక్తిని కలిగిస్తున్నాయి. కేసులో సంజయ్‌కి శిక్ష పడితే.. ఆయన రాజకీయ భవితవ్యం అంధకారం అవుతుందని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పుడు పోలీసులు ఎంత పకడ్బందీగా కేసును కడుతున్నారన్న దానిపై.. సంజయ్‌ భవితవ్యం ఆధారపడుతుంది. 

21:03 - August 3, 2018

పేపర్ మిల్లు మూశింది వీళ్లె తెర్శింది వీళ్లు...పెండ్లినాడు విడాకుల నాడు పెద్దలు వీళ్లే, ప్రొటోకల్ అంటే టీఆర్ఎస్ పార్టీ సభ్యతమట...కనీసం సోయిలేకుంటున్న కరెంటి మంత్రి, తిరుమల కొండ మీదికి జేర్న రాజకీయం...దేవుని సన్నిధి గూడ పాలిటిక్స్ వేదికైంది, ఇగ తెల్లారి ఒంటిగంటదాక బార్ షాపులు...తాగువోతుల కష్టాలు తీర్చిన కేసీఆర్ సార్, గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ చేతివాటం...పిల్లల సర్కులు చోరి జేశి అడ్డంగ దొర్కింది, పూజలందుకున్న పాము పుటుక్కుమంది...పాము సావుతోని రోడ్డెక్కిన మూడ భక్తులు... ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం... 

 

20:35 - August 3, 2018

నిజామాబాద్ : నిజామాబాద్ మాజీ మేయర్ సంజయ్ అరెస్టుకు రంగం సిద్ధం అయింది. నిర్భయ సహా నాలుగు సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి. 354, 354/ఎ, 342, నిర్భయ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సంజయ్ ను ఏ క్షణమైనా అరెస్టు చేసే అవకాశం ఉంది. 

20:59 - August 2, 2018

ఉద్యోగాల భర్తీ కాడ మంత్రి అవద్దాలు...అవద్దాలే ఆత్మహత్య జేస్కుంటయ్, ఎస్ఈ ఆఫీసు మీద మహిళ రైతుల దాడి...నీళ్లిడుస్తలేరని కుర్చీలు ఫర్నీచర్ ధ్వంసం, పోలీసోళ్లను పొర్కపొర్క గొట్టిన జనం.. ఓవరాక్షన్ జేస్తె కొట్టకపోతె ఏం జేస్తరు.??, ఆంధ్రా కాపులళ్ల రగులుతున్న సెగలు...ఉద్యమానికి సిద్దమైతున్న నాయకులు, కొత్తగూడెం ఎమ్మెల్యే గారి దత్తత దరిద్రం...ఎక్కిరిస్తున్న మోరీలు.. రోడ్లు, నల్లాలు, బైకులు పార్కింగు జేశే కాడ జాగ్రత్త సుమా...పాములు జొర్రి పంటున్నయ్ ఈ కాలంల... ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం... 

 

20:19 - August 1, 2018

నీళ్ల మంత్రి జెప్పిన దాంట్లె నిజమేమన్నుందా?... ఓట్ల కోసం హరీష్ రావు ఆడుతున్న డ్రామేంది?, కాంగ్రెస్ కండువాల మెరిశిపోతున్న కిరణాలు...ఢిల్లీ స్క్రిప్టును నాల్గేండ్ల సంది అమలు జేస్తుండు, పంద్రాగష్టి రోజు ఏం మాట్లాడాలంటున్నమోడీ...అవద్దాలు బట్టెవాయి మాటలు మాత్రం వద్దు, పేదల ఇండ్లను కూలగొట్టిన అధికారులు...మర్రవడ్డ జనం.. లాఠీ ఛార్జీ రాళ్ల దాడులు, మాల్యాగారి విలాస జైలు వీడ్యో వంపుండ్రి...భారత్కు అప్పగించెకాడ లండన్ కోర్టు మాట, పచ్చికోడిని వీక్కతిన్న మానవ జంతువు.. ఆదిమానవుల కంటె అద్వాహ్నమైన తీరు.... ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం... 

20:50 - July 31, 2018

మా పిల్లలకు మీ పిల్లలకు ఒక్కటే తీరు బువ్వ..మంత్రి కల్వకుంట్ల తారీఫ్ రామయ్య అవద్దాలు, కులవృత్తులకు మళ్ల జీవం బోస్తరంట..అంటే మళ్ల గవ్వే జేశి బత్కుమంటరా..?, మళ్ల భూమ్మీదికొచ్చిన పుట్టపర్తి సాయిబాబ..ఢిల్లీల కనువిందుజేస్తుంటే కెమెరాల జిక్కిండు, గబ్బు గబ్బు అయిన జగిత్యాల మున్సిపాలిటీ.. సొంతంగ చెత్తేరిపోస్తున్న కౌన్సిలర్ మేడం, కేసీఆర్ తాతా మా అమ్మకు జీతం పెంచవా?.. తన మన్మని మాట తప్ప ఎవ్వలిదింటడు.?, ఈగెల భయానికి ఎత్తిపోతున్న పెండ్లీలు..కోళ్ల ఫారంతోని ఆగమైన ఆ ఊరి బత్కులు.. ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం...

 

21:23 - July 23, 2018

హైదరాబాద్ : పాసుబుక్కు.. పంటచెక్కు.. భూమిపై హక్కు అన్న నినాదంతో.. తెలంగాణ జనసమితి.. తెలంగాణ వ్యాప్తంగా.. దీక్షలు నిర్వహించింది. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కోదండరామ్‌.. మూడు చోట్ల దీక్షల్లో పాల్గొన్నారు. ప్రభుత్వం రైతాంగ సమస్యలపై తక్షణమే స్పందించకుంటే.. సెప్టెంబర్‌లో రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి రూపకల్పన చేస్తామని, కోదండరామ్‌ హెచ్చరించారు. రైతుల సమస్యల పరిష్కారం కోరుతూ.. తెలంగాణ జనసమితి పార్టీ.. సోమవారం అన్ని జిల్లా కేంద్రాల్లో దీక్షలు చేపట్టింది. పార్టీ వ్యవస్థాపకుడు కోదండరామ్‌.. కొత్తగూడెం, జగిత్యాల, మహబూబాబాద్‌లలో జరిగిన దీక్షల్లో పాల్గొన్నారు. కొత్తగూడెంలో బైక్‌ర్యాలీలో పాల్గొని, అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించారు. తెలంగాణ రాష్ట్రం వస్తే.. ఆత్మగౌరవం ఇనుమడిస్తుందని ఆశిస్తే.. పరిస్థితి భిన్నంగా ఉందని.. కోదండరామ్‌, ఈసందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు.

జగిత్యాల కలెక్టర్‌ కార్యాలయం ఎదుట టీజేఎస్‌ ఆధ్వర్యంలో దీక్ష చేపట్టారు. రైతుబంధు, భూప్రక్షాళన, సాదాబైనామాలల్లోని అక్రమాలను గుర్తించి రైతులకు న్యాయం చేయాలని వక్తలు కోరారు. రైతుల సమస్యలు పరిష్కరించాలంటూ.. ప్రజావాణి కేంద్రంలో వినతిపత్రం సమర్పించారు. పెద్దపల్లి కలెక్టరేట్‌ వద్ద కూడా టీజేఎస్‌ నాయకులు దీక్ష చేపట్టారు. రైతు బంధు పథకం ఓ బూటకమని నేతలు ఈ సందర్భంగా విమర్శించారు.

నల్లగొండ జిల్లాలోనూ టీజేఎస్‌ నేతలు రైతు దీక్షలు చేపట్టారు. ప్రభుత్వం రైతు సమస్యల పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తోందని నేతలు విమర్శించారు. నిజామాబాద్‌ జిల్లా కలెక్టరేట్‌ వద్ద టీజేఎస్‌ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. భూ రికార్డులు ప్రక్షాళనలో తప్పులను యుద్ధప్రాతిపదికతన సరిదిద్దాలని, వెంటనే కొత్త పాసు పుస్తకాలు అందించాలని డిమాండ్‌ చేశారు. వరంగల్‌ జిల్లాలోనూ టీజేఎస్‌ నేతలు కలెక్టరేట్ల వద్ద ధర్నాలు చేపట్టారు. పాస్‌బుక్కు, పంట చెక్కు, భూమిపై హక్కు కోసం చేపట్టిన దీక్షకు ప్రభుత్వం స్పందించకుంటే.. ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని నేతలు హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ వద్ద కూడా టీజేఎస్‌ నేతలు దీక్షలు చేపట్టారు. పార్టీ కార్యకర్తలు, రైతులు పెద్ద ఎత్తున దీక్షలో పాల్గొన్నారు. పాసుపుస్తకాల్లో తప్పులను సరిదిద్దకుంటే 15 రోజుల్లో భవిష్యత్‌ కార్యాచరణను ప్రకటిస్తామని నేతలు హెచ్చరించారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - KCR Government Failures