keerthi suresh

12:37 - May 26, 2018

అమరావతి : 'మహానటి'టీమ్ అమరావతిలో సీఎం చంద్రబాబుని కలిసింది. ఈ సందర్భంబగా చంద్రబాబు మాట్లాడుతు..మహానటి సావిత్రిని కీర్తి సురేష్ మహానటిని కళ్లకు కట్టిందని నటి కీర్తి సురేష్ ను చంద్రబాబు ప్రశంసించారు. వయస్సులో చిన్నదైనా మహానటి వంటి సినిమాలో నటించింది అనేకంటే జీవించింది అనే సబబు అని అన్నారు. ఏదన్నా చేయాలనే పట్టుదల వుంటే సాధించి తీరతారని దానికి కీర్తీ సురేష్ నటనే తార్కాణమన్నారు. ఎన్నీఆర్,సావిత్రి వంటివారు పరిశ్రమలో రీప్లేస్ లేని వ్యక్తులన్నారు. అటువంటి పాత్రలను చేయటం ఒక సాహసమేననీ..ఆ సాహసం చేసి కీర్తి సురేష్ న్యాయం చేశారన్నారు. చిన్న పల్లెటూర్ లో పుట్టిన సావిత్రి మహానటి స్థాయికి చేరుకుని అనేక సమస్యలను ఎదుర్కొని ఆ స్థాయికి చేరుకోవటం ఆమె ఆత్మవిశ్వాసానికి, పట్టుదలకు తార్కారణమని చంద్రబాబు తెలిపారు. అలాగే ఆర్థికంగా అనేక ఇబ్బందులు, బాధలు పడుతున్నా ఆమె దానగుణాన్ని మాత్రం విస్మరించకుండా తన సహజమైన దాతృత్వాన్ని చాటిచెప్పారనీ..అది అందరికీ సాధ్యం కాదని..అలనాటి మహానటి, అద్భుతమైన నటి సావిత్రిని సీఎం చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. 

13:47 - May 7, 2018

మ‌హాన‌టి సావిత్రి జీవిత క‌థ ఆధారంగా తెర‌కెక్కిన 'మ‌హాన‌టి' సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఎప్పుడెప్పుడు ఈ సినిమాను చూద్దామా అన్నంతగా సినిమాపై ఆసక్తి నెలకొంది. తెలుగువారికి ఆరాధ్య నటి సావిత్రి నిజ‌జీవిత క‌థ ఆధారంగా ఈ సినిమా తెర‌కెక్క‌డం..సినిమాలో వివిధ భాష‌ల‌కు చెందిన ప్ర‌ముఖ న‌టులు న‌టిస్తుండ‌డం 'మ‌హాన‌టి' జీవితకథను చూడాలనే ఆసక్తి మరోవైపు ఏ ప్రాతలో ఎవరు నటిస్తున్నారు అనే ఆసక్తి వెరసి ఈ సినిమాపై అంచనాలను భారీగా పెంచుతోంది. ప్రధాన పాత్రలో సావిత్రిగా కీర్తి సురేష్‌, స‌మంత‌, దుల్క‌ర్ స‌ల్మాన్‌, విజ‌య్ దేవ‌ర‌కొండ‌, మోహ‌న్‌బాబు, సింగీతం శ్రీనివాస‌రావు, డైరెక్ట‌ర్ క్రిష్‌, ప్ర‌కాష్‌రాజ్ వంటి ప్ర‌ముఖ న‌టులు న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.

తాజాగా ఈ సినిమాలో మ‌రో టాప్ హీరోయిన్ కాజ‌ల్ అగ‌ర్వాల్ కూడా న‌టిస్తోందంటూ షాకింగ్ న్యూస్ బ‌య‌టికొచ్చింది. ఈ విష‌యాన్ని `మ‌హాన‌టి` చిత్ర నిర్మాణ సంస్థ వెల్ల‌డించింది. కాజ‌ల్ ఫోటోను కూడా త‌న సోష‌ల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది.'మ‌హాన‌టి`లో కాజ‌ల్ ఏమి చేస్తోందో తెలుసుకోవాల‌నుకుంటున్నారా? అయితే మే తొమ్మిదో తేదీ వ‌ర‌కు ఆగండి` అంటూ కామెంట్ కూడా పెట్టింది.

13:29 - September 11, 2017

హైదరాబాద్‌: అలనాటి మేటి తార సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్న చిత్రం మహానటి. ఇందులో సావిత్రి పాత్రలో కీర్తి సురేశ్‌ ఒదిగిపోయారు. సమంత, దుల్కర్‌ సల్మాన్‌, ప్రకాశ్‌రాజ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే సావిత్రిగా కీర్తి ఎలా కనిపించనున్నారనే విషయంపై ఆసక్తినెలకొంది. కాగా మహానటి సెట్‌లో తీసిన కొన్ని ఫొటోలు బయటికి వచ్చాయి. వీటిలో కీర్తి సావిత్రి గెటప్‌లో చాలా చక్కగా కనిపించారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వైజయంతి మూవీస్‌ పతాకంపై ప్రియాంకా దత్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ్‌, మలయాళ భాషల్లో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. విజయ్‌ దేవరకొండ, షాలిని పాండే, ప్రగ్యా జైశ్వాల్‌ కూడా ఇందులో నటిస్తున్నట్లు సమాచారం.

08:26 - April 5, 2017

పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' తో నటించే అవకాశం కోసం చాలా మంది ఎదురు చూస్తుంటారు. అందులో హీరోయిన్స్ కూడా ఉంటుంటారు. ‘పవన్' సరసన నటించే ఛాన్స్ 'అను ఇమ్మాన్యూయెల్' కి దక్కింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో 'పవన్' హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ‘పవన్ కళ్యాణ్' నటించిన 'కాటమరాయుడు' ఇటీవలే రిలీజైంది. అనంతరం త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందే చిత్ర పూజా కార్యక్రమాలు కూడా ప్రారంభమయ్యాయి. సోమవారం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. తొలి రోజు షూటింగ్ లో 'పవన్' పాల్గొనగా 'అనూ ఇమ్మాన్యూయెల్' షూటింగ్ కు హాజరైంది. తొలి రోజు షూటింగ్ సందర్భంగా దిగిన ఫొటోను సోషల్ మీడియా పేజ్ లో పోస్టు చేసింది. ‘అద్భుతాలు జరగబోతున్నాయి..పీకే 25 ఫస్ట్ డే షూటింగ్' అంటూ కామెంట్ చేసింది. ‘పవన్' సరసన 'కీర్తి సురేష్' కూడా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకు తమిళ యువ సంగీత దర్శకుడు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో పవర్ స్టార్ సాప్ట్ వేర్ ఇంజినీర్ గా కనిపంచనున్నాడని టాక్.

13:04 - December 1, 2016

'నేను శైలజ' మూవీతో టాలీవుడ్ కి పరిచయమైన 'కీర్తి'కి ఫస్ట్ మూవీతోనే మంచి క్రేజ్ వచ్చింది. ఈ మూవీ తరువాత తెలుగులో చాలా ఆఫర్లు వచ్చినా ఆచి తూచి సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం ఈ ఓమ్లీ బ్యూటీ 'నాని'తో 'నేను లోకల్' మూవీ చేస్తోంది. ఈ మూవీ రిలీజ్ కి రెడీగా ఉంది. అయితే కేవలం రెండు సినిమాలతోనే 'కీర్తీ' టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ బిగ్ స్టార్స్ తో నటించే ఛాన్స్ ని దక్కించుకున్నట్లు వినికిడి. హీరోయిన్ గా 'కీర్తి సురేష్' రైజింగ్ లో వుంది. టాలీవుడ్ తో పాటూ కోలీవుడ్ స్టార్ హీరోలు ఫస్ట్ ఛాయిస్ 'కీర్తి'కే ఇస్తున్నారు.

గ్లామరస్..
తన తోటి హీరోయిన్లు లిమిట్ లేకుండా గ్లామరస్ గా కనిపించడానికి రెడీ అంటే 'కీర్తి' మాత్రం గ్లామర్ విషయంలో లిమిట్ దాటడం లేదు. అయినా సరే 'కీర్తి'ని క్రేజీ ఆఫర్లు వెతుక్కుంటూ వస్తున్నాయి. తెలుగులో 'పవన్ కళ్యాణ్', 'మహేష్ బాబు', 'అల్లు అర్జున్' ఇలా వరుసగా క్రేజ్ వున్న హీరోలతో హీరోయిన్ గా చేసే అవకాశం వచ్చింది. తమిళ్ లో కూడా 'కీర్తి సురేష్' హవా మొదలైంది. అక్కడ కూడా టాప్ హీరోలతో జత కడుతోంది. 'విజయ్' తో 'భైరవ' ఫినిష్ చేసిన ఈ బ్యూటీ కోలీవుడ్ స్టార్ బ్రదర్స్ 'సూర్య', 'కార్తీ'లతో నటించే ఛాన్స్ అందుకుంది. 'సింగం' తరువాత 'సూర్య' చేయబోయే కొత్త సినిమాలో ఈ చెన్నై చిన్నదాన్ని హీరోయిన్ తీసుకున్నారు. ఇక 'సూర్య', తమ్ముడు 'కార్తీ' కొత్త సినిమాలో కూడా ఈ బ్యూటీనే హీరోయిన్ గా ఫైనల్ చేశారు. మొత్తానికి సౌత్ న్యూ స్టార్ హీరోయిన్ 'కీర్తి సురేష్' కీర్తీ వెలిగిపోనుంది.

14:15 - November 23, 2016

టాలీవుడ్ ప్యూచర్ యువరాణి అంటూ కీర్తిసురేష్ ని పొగిడేస్తున్నారు. స్లోగా ఈ చెన్నై బ్యూటీ గాలివీస్తున్నట్లు కనిపిస్తుంది. నానితో నేను లోకల్ మూవీలో నటిస్తున్న ఈ పొన్ను ఇద్దరు బడా స్టార్స్ మూవీలో హీరోయిన్ గా సెట్ అయినట్లు సమాచారం. మరీ కీర్తీసురేష్ దక్కించుకున్న ఆ బడా మూవీస్ ఏంటో మీరే చూడండి.
నేను శైలజ మూవీతో టాలీవుడ్ కి పరిచయమైన కీర్తి 
నేను శైలజ మూవీతో టాలీవుడ్ కి పరిచయమైన కీర్తికి ఫస్ట్ మూవీతోనే మంచి క్రేజ్ వచ్చింది.ఈ మూవీ తరువాత తెలుగులో చాలా ఆఫర్లు వచ్చిన ఆచితూచి సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం ఈ ఓమ్లీ బ్యూటీ నానితో నేను లోకల్ మూవీ చేస్తుంది. ఈ మూవీ రిలీజ్ కి రెడీగా ఉంది. అయితే కేవలం రెండు సినిమాలతోనే కీర్తీ టాలీవుడ్ బిగ్ స్టార్స్ తో నటించే ఛాన్స్ ని దక్కించుకున్నట్లు వినికిడి.
పవన్, మహేష్ సరసన కీర్తి
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబోలో రాబోయే మూవీలో కీర్తిని హీరోయిన్ గా తీసుకున్నట్లు సమాచారం. త్వరలోనే యూనిట్ ఈ బ్యూటీ పేరు అఫిషియల్ గా అనౌన్స్ చేస్తారని తెలుస్తుంది. దీంతో పాటు మహేష్ బాబు న్యూ మూవీలో కూడా కీర్తీనే హీరోయిన్ ఫైనల్ చేసినట్లు సమాచారం. శ్రీమంతుడు తరువాత మహేష్ తో కొరటాల శివ కొత్త సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మధ్య ఒపెనింగ్ జరుపుకున్న మూవీలో ప్రిన్స్ పక్కన హీరోయిన్ కోసం వెతుక్కతున్నారు. లక్కీ గా ఈ ఛాన్స్ కీర్తి సురేష్ ని వరించినట్లు వినిపిస్తుంది. శ్రీమంతుడు మూవీలో మహేష్, శృతి హాసన్ పెయిర్ సూపర్ గా సెట్ అయినట్లే, మహేష్ కీర్తిల జోడి ఆడియన్స్ ని పుల్ ఎంటర్ టైన్ చేస్తుందని కొరటాల భావిస్తున్నాడు. అందుకే కీర్తి సురేష్ అయితే ప్రిన్స్ కి సరైన జోడి అని ఫిక్సైపోయాడట. చూస్తుంటే కీర్తీ టాలీవుడ్ లో చక్రం తిప్పే రోజులు వచ్చేసినట్లే కనిపిస్తుంది.

07:20 - November 22, 2015

రామ్‌, కీర్తి సురేష్‌ జంటగా కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో స్రవంతి రవికిషోర్‌ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర విశేషాలను నిర్మాత మీడియాకు తెలిపారు. 'రామ్‌ అంటేనే ఎనర్జీ, ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎమోషన్స్ గుర్తుకొస్తాయని, సరిగ్గా ఇలాంటి కథాంశంతో తాజా సినిమాను రూపొందిస్తున్నట్లు తెలితపారు. సినిమా టాకీ పార్ట్ పూర్తయ్యిందని, ప్రస్తుతం చివరి పాటను గోవాలో చిత్రీకరిస్తున్నట్లు తెలిపారు. రామ్‌ నటనను పూర్తి స్థాయిలో చూపించే కథ ఇదని, ఎనర్జిటిక్‌గా, ఎమోషనల్‌ ఎంటర్‌టైనర్‌గా సాగుతుందన్నారు. మాకిష్టమైన పాటల రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి చాలా రోజుల తర్వాత ఈ చిత్రానికి పాటలు రాస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉందన్నారు. వచ్చే వారంలో చిత్ర టైటిల్‌ని ప్రకటించి జనవరి 1న సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు.

 

Don't Miss

Subscribe to RSS - keerthi suresh