kohli

14:31 - October 13, 2018

హైదరాబాద్ : భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీని కొద్దిలో మిస్ అయ్యాుడు. ఉప్పల్ స్టేడియంలో వెస్టిండీస్ - భారత్ జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరుగుతోంది. విండీస్ తొలి ఇన్నింగ్స్ 311 పరుగుల వద్ద ముగిసింది. అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన భారత్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. భారత ఓపెనర్ రాహుల్ (4) త్వరగా అవుటయ్యాడు. మరో ఓపెనర్ పృథ్వీ షా చెలరేగాడు. కేవలం 53 బంతుల్లో 70 పరుగులు చేసి అవుటయ్యాడు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన పుజారా (10) ఎక్కువ సేపు నిలవలేదు. ఇతనితో జత కట్టిన కెప్టెన్ కోహ్లీ భారత్ స్కోరును పరుగెత్తించే ప్రయత్నం చేశాడు. 78 బంతులను ఎదుర్కొన్న కోహ్లీ 45 పరుగులు చేసి వెనుదిరిగాడు. దీనితో భారత్ 4 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. 

12:16 - June 13, 2018

కొందరు హీరోలు కేవలం రీల్ లో మాత్రమే హీరోలు..రియల్ లైఫ్ లో వారు జీరోలే కాదు..విలన్ ల కంటే దారుణంగా ప్రవర్తిస్తుంటారు. సినిమా డైలాగుల్లో సూక్తులు చెబుతుంటారు. నిజజీవితంలో రాక్షసుల్లా ప్రవర్తిస్తుంటారు అనే దానికి ఈ హీరోనే నిదర్శనం.

ఆర్మాన్ కోహ్లీ అరెస్ట్..
తన భార్య, ఫ్యాషన్ స్టయిలిస్ట్ నీరూ రంధావాను దారుణంగా హింసించిన కేసులో బాలీవుడ్ నటుడు అర్మాన్ కోహ్లీని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. గత వారంలో నీరూ ఫిర్యాదు మేరకు అర్మాన్ పై కేసును రిజిస్టర్ చేసిన శాంతాక్రజ్ పోలీసులు, అప్పటి నుంచి ఆయన కోసం గాలిస్తున్నారు.

నీరు తలను నేలకేసి బాదిన కోహ్లీ..
ఈ నెల 3వ తేదీన ఆర్థిక వివాదంలో అర్మాన్, నీరూల మధ్య వాగ్వాదం జరుగగా, నీరూ తలను అర్మాన్ నేలకేసి బలంగా కొట్టాడన్నది ప్రధాన ఆరోపణ. ఈ ఘటనలో నీరూ రంధావాకు బలమైన గాయాలు కాగా, కోకిలాబెన్ దీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో ఆమెకు చికిత్స చేశారు. తన తలకు 15 కుట్లు పడ్డాయని, తలపై మచ్చ జీవితాంతం ఉంటుందని డాక్టర్ చెప్పిన మాటలు విని తానెంతో ఆందోళన చెందుతున్నానని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన అనంతరం నీరూ వ్యాఖ్యానించారు. కాగా, నిందితుడు అర్మాన్ ను న్యాయస్థానం ముందు హాజరు పరచనున్నట్టు శాంతాక్రజ్ పోలీసులు తెలిపారు.

08:33 - May 15, 2018

‌‌‌హైదరాబాద్ : ఐపీఎల్‌లో పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. పంజాబ్‌ నిర్దేశించిన 89 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని బెంగళూర్‌ 8.1 ఓవర్లలో వికెట్‌ కోల్పోకుండా ఛేదించింది. రాయల్‌ ఛాలెంజర్స్‌ ఓపెనర్లు విరాట్‌ కోహ్లి, పార్థీవ్‌ పటేల్‌ వికెట్‌ పడకుండా జట్టుకు విజయాన్ని అందించారు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌ దిగిన కింగ్స్‌ పంజాబ్‌ 15.1 ఓవర్లలో 88 పరుగులకే అలౌటైంది. ఆర్సీబీ పేసర్‌ ఉమేశ్‌ యాదవ్‌ మూడు వికెట్లు సాధించి.. పంజాబ్‌ను దెబ్బ తీశాడు. ఒకే ఓవర్లో రాహుల్‌, క్రిస్‌ గేల్‌లను జౌట్‌ చేసి పంజాబ్‌ను కష్టాల్లోకి నెట్టాడు. బెంగళూర్‌ విజయంలో కీలక పాత్ర పోషించిన పేసర్‌ ఉమేష్‌ యాదవ్‌కు మ్యాన్‌ ఆఫ్ ది మ్యాచ్‌ అవార్డ్‌ దక్కింది.

 

06:52 - May 13, 2018

ఢిల్లీ : రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఢిల్లీపై సూపర్‌ విక్టరీ కొట్టింది. ప్లేఆఫ్‌ రేసులో తామూ ఉండాలంటే కచ్చితంగా మిగిలిన నాలుగు మ్యాచ్‌లను నెగ్గాల్సిన దశలో బెంగళూరు ఎదురొడ్డి నిలిచింది. కోహ్లీ, డివిల్లీర్స్‌ చెలరేగి ఆడారు. కోహ్లీ 40 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 70రన్స్‌ చేయగా... డివిల్లీర్స్‌ 37 బాల్స్‌ను ఎదుర్కొని 4ఫోర్లు, 6 సిక్సర్లతో 72 రన్స్‌ చేసి నాటౌట్‌గా నిలిచాడు. దీంతో ఢిల్లీపై బెంగళూరు 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అంతకుముందు బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ... 20 ఓవర్లలో 4వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది. ఢిల్లీ జట్టులో రిషబ్‌, అభిషేక్‌ రాణించారు. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ డివిల్లీర్స్‌కు దక్కింది.

22:14 - February 23, 2017

పూణె : ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతోన్న నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లోని ఆరంభ టెస్ట్‌ మొదటి రోజు ఆతిధ్య జట్టు ఆధిపత్యం ప్రదర్శించింది. పూణే టెస్ట్‌ తొలి రోజు భారత బౌలర్లు సమిష్టిగా చెలరేగడంతో  కంగారూ బ్యాట్స్‌మెన్‌ క్యూ కట్టారు. 205 పరుగులకే 9 వికెట్లు కోల్పోయి కష్టాలు పడిన ఆస్ట్రేలియా జట్టును మిషెల్‌ స్టార్క్‌ మెరుపు హాఫ్‌ సెంచరీతో ఆదుకున్నాడు.

పూణే టెస్ట్  తొలి రోజు టీమిండియా డామినేట్‌ చేసింది.ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లోని మొదటి టెస్ట్‌లో ఆతిధ్య భారత జట్టు శుభారంభం చేసింది.

ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగిన డేవిడ్‌ వార్నర్‌, స్టీవ్‌ స్మిత్‌, షాన్‌ మార్ష్‌ భారీ స్కోర్లు చేయడంలో విఫలమయ్యారు.భారత స్పిన్నర్లు, పేసర్లు సమిష్టిగా రాణించడంతో  కంగారూ బ్యాట్స్‌మెన్‌ క్యూ కట్టారు.

స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ విఫలమైనా ఓపెనర్‌ రెన్‌షా టెస్టుల్లో 2వ హాఫ్‌ సెంచరీ నమోదు చేశాడు. వార్నర్‌తో కలిసి తొలి వికెట్‌కు 78 పరుగులు జోడించి... ఆస్ట్రేలియాకు శుభారంభాన్నిచ్చాడు. 

ఉమేష్‌ యాదవ్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, జడేజా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పాటు పోటీలు పడి మరీ వికెట్లు తీయడంతో....ఆస్ట్రేలియా జట్టు తేలిపోయింది. స్టీవ్‌స్మిత్‌,షాన్‌ మార్ష్‌,హ్యాండ్స్‌ కూంబ్‌ కొద్దిసేపు పోరాడినా భారీ స్కోర్లుగా మలచడంలో మాత్రం విఫలమయ్యారు.

205 పరుగులకే 9 వికెట్లు కోల్పోయి కష్టాలు పడిన జట్టును మిషెల్‌ స్టార్క్‌ ఆదుకున్నాడు. ఆఖరి వికెట్‌కు హేజిల్‌వుడ్‌తో కలిసి పోరాడిన మిషెల్‌ స్టార్క్‌  టెస్టుల్లో 9వ హాఫ్‌ సెంచరీ నమోదు చేసి...ఆస్ట్రేలియా జట్టు పరువు కాపాడాడు.
 
తొలి రోజు ఆట ముగిసే సరికి 9 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా జట్టు 256 పరుగులు చేసింది.భారత బౌలర్లలో ఉమేష్‌ యాదవ్‌ నాలుగు వికెట్లు పడగొట్టగా.... రవిచంద్రన్‌ అశ్విన్‌, జడేజా చెరో రెండు వికెట్లు తీశారు.

రెండో రోజు ఆరంభ ఓవర్లలోనే ఆస్ట్రేలియాను ఆలౌట్‌ చేసి....తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్‌ సాధించి ప్రత్యర్ధికి సవాల్‌ విసరాలని భారత్‌ పట్టుదలతో ఉంది. టెస్టుల్లో వరుస విజయాలతో జోరు మీదున్న టీమిండియా....పూణే టెస్ట్‌లో నెగ్గి సిరీస్‌ను విజయంతో ఆరంభించాలని తహతహలాడుతోంది.

11:31 - February 5, 2017

టీమిండియా యాంగ్రీ యంగ్‌ గన్‌... విరాట్‌ కొహ్లీ సారధిగా వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ఇంగ్లండ్‌పై మూడు ఫార్మాట్లలో సిరీస్‌ విజయాలు సాధించి కెప్టెన్‌గా చరిత్రను తిరగరాస్తున్నాడు. మూడు వారాల క్రితమే ఇండియా ఫుల్‌ టైమ్‌ కెప్టెన్‌గా ప్రమోట్‌అయిన విరాట్‌....అప్పుడే మాజీ కెప్టెన్‌ ధనా ధన్‌ ధోనీ రికార్డ్‌ను టార్గెట్‌ చేశాడు. ఇంటర్నేషనల్‌ క్రికెట్‌లో ఇండియన్ కెప్టెన్‌గా రికార్డ్‌ల మోత మోగిస్తున్నాడు. మూడు వారాల క్రితమే ఇండియా ఫుల్‌ టైమ్‌ కెప్టెన్‌గా ప్రమోట్‌అయిన విరాట్‌ అప్పుడే మాజీ కెప్టెన్‌ ధనా ధన్‌ ధోనీ రికార్డ్‌ను టార్గెట్‌ చేశాడు. ఇంగ్లండ్‌పై మూడు ఫార్మాట్లలో సిరీస్‌ విజయాలు సాధించి భారత కెప్టెన్‌గా చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్‌తో టీ 20 సిరీస్‌లో కొహ్లీ బ్యాట్స్‌మెన్‌గా విఫలమైనా...కెప్టెన్‌గా ఆకట్టుకున్నాడు.ఒత్తిడిలో , ఓటమి ఖాయమనుకున్న దశలోకనూ భారత బౌలర్లను విరాట్‌ కొహ్లీ సమర్ధవంతంగా వినియోగించుకున్న తీరు విమర్శకులను సైతం ఆకట్టుకుంది. ఇంటర్నేషనల్‌ క్రికెట్‌లో ఇంగ్లండ్‌పై మూడు ఫార్మాట్లలోనూ సిరీస్‌ సాధించిన ఇండియన్ కెప్టెన్‌గా విరాట్‌కొహ్లీ అరుదైన రికార్డ్‌ నమోదు చేశాడు. అన్ని ఫార్మాట్లలో వరుసగా సిరీస్‌ విజయాలు అందించిన భారత కెప్టెన్‌గా ధోనీ రికార్డ్‌ను విరాట్ సమం చేశాడు.

మూడు ఫార్మాట్లు..ఏడు సిరీస్ లు..
మూడు ఫార్మాట్లలో కలిపి గత 7 సిరీస్‌ల్లో విరాట్‌ కొహ్లీ నాయకత్వంలోని భారత జట్టు విజేతగా నిలిచింది. మరికొద్ది రోజుల్లో బంగ్లాదేశ్‌తో జరుగనున్న సింగిల్‌ టెస్ట్‌ మ్యాచ్‌ సైతం నెగ్గితే విరాట్‌ కొహ్లీ....వరుసగా 8 సిరీస్‌ విజయాలు సాధించిన భారత కెప్టెన్‌గా ప్రపంచ రికార్డ్‌ సృష్టిస్తాడు. టెస్ట్‌ ఫార్మాట్‌లో కొహ్లీ కెప్టెన్సీలోని టీమిండియా ఎంతలా ఆధిపత్యం ప్రదర్శిస్తోందో అందరికీ తెలిసిందే.బంగ్లాదేశ్‌తో ఆడనున్న ఏకైక టెస్ట్‌లో... ప్రస్తుతం టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టాప్‌ ప్లేస్‌లో ఉన్న టీమిండియాకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయనడంలో ఎటువంటి సందేహం లేదు. మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న బంగ్లాదేశ్‌ టెస్ట్‌లో టీమిండియా..విజయం సాధిస్తే విరాట్‌ భారత కెప్టెన్‌గా చరిత్రను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది. మరి మూడు ఫార్మాట్లలోనూ విరాట్‌ కొహ్లీ...ఇదే స్థాయిలో భారత్‌ను ముందుండి నడిపిస్తే మరిన్ని రికార్డ్‌లు బద్దలవుతాయనడంలో సందేహమే లేదు.

10:04 - December 30, 2016

ప్రముఖ క్రికేటర్ 'విరాట్ కోహ్లీ' నిశ్చితార్థం చేసుకోబోతున్నాడా ? ఇక దాగుడుమూతల స్టోరికీ చెక్ పెట్టనున్నాడా ? ఈ మేరకు ఏర్పాట్లన్నీ చకచకా సాగిపోతున్నాయా ? దీనిపై సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. గత కొద్దికాలంగా టీమిండియా కెప్టెన్ 'విరాట్ కోహ్లీ'..బాలీవుడ్ నటి 'అనుష్క శర్మ' లు ప్రేమించుకుంటున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలిసి పలు వేడుకల్లో పాల్గొన్న సంగతి తెలిసిందే. దీనితో వీరి వివాహంపై ప్రచారం జరిగింది. కానీ వివాహం ఎప్పుడనేది ప్రకటించలేదు. తాజాగా క్రిస్మస్ సెలబ్రేషన్స్ కోసం ఈ ప్రేమ జంట ఉత్తరాఖండ్ కు వెళ్లారు. న్యూ ఇయర్ డే నాడు వీరిద్దరి ఎంగేజ్ మెంట్ జరుగుతుందని ప్రచారం జరుగుతోంది. ఉత్తరాఖండ్ లోని నరేంద్ర నగర్ ఆనందా హోటల్ లో ఈ వేడుక జరగనుందని టాక్. ఇప్పటికే ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఈ ఇద్దరి ఎంగేజ్ హెంట్ కు బాలీవుడ్..క్రికెట్ సెలబ్రిటీలంతా హాజరు కానున్నట్లు తెలుస్తోంది. 'అనుష్క' కుటుంబీకులు..స్నేహితులు ఇప్పటికే ఉత్తరాఖండ్ చేరుకున్నట్లు సమాచారం. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

16:16 - December 20, 2016

చెపాక్ : చివరి టెస్టు...మ్యాచ్ డ్రా గా ముగుస్తుందా ? లేక భారత్ విజయం సాధిస్తుందా ? లంచ్ సమయానికి ఇంగ్లండ్ స్కోరు ఒక వికెట్ పోకుండా 97 పరుగులు చేసింది. దీనితో మ్యాచ్ రసకందాయంలో పడింది. చివరకు మలుపు తిరిగింది. భారత బౌలర్ రవీంద్ర జడేజా ఇంగ్లండ్ నడ్డి విరిచాడు. ఏడు వికెట్లు సాధించి పతనాన్ని శాసించాడు. చివరకు భారత్ అద్భుత విజయం సాధించింది. వరుసగా 18 టెస్టు మ్యాచ్ ల్లో భారత్ జయభేరి మోగించింది. 1992 తరువాత వరుసగా రెండు టెస్టుల్లో ఇన్నింగ్స్ విజయాలు నమోదు చేసుకుంది. ఇన్నింగ్స్ 75 పరుగుల తేడాతో విజయం సాధించి తమకు తిరుగులేదని నిరూపించింది.

ఆలీ..బెన్ స్టోక్స్..
మంగళవారం ఆఖరి రోజు. 12/0 ఓవర్ నైట్ స్కోర్ తో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ ఆటను ఆరంభించింది. కెప్టెన్ కుక్, జెన్సింగ్స్ ఆచితూచి బాధ్యాతయుతంగా ఆడారు. తొలి సెషన్ లో వికెట్ పోకుండా భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. వీరి వికెట్ తీయాలని భారత బౌలర్లు కష్టపడ్డారు. తొలి వికెట్ కు కుక్..జెన్సింగ్స్ లు 103 పరుగులు జోడించారు. రెండో సెషన్ ప్రారంభమైంది. భారత బౌలర్లు ఈ సెషన్ లో విజృంభించారు. ఒక పరుగు చేస్తే అర్ధ సెంచరీ నమోదు కావాల్సిన తరుణంలో కుక్ (49) ను జడేజా వెనక్కి పంపాడు. కొద్దిసేపటిలోనే జెన్సింగ్ (54) వెనుదిరిగాడు. 110 పరుగుల వద్ద ఇంగ్లండ్ రెండు వికెట్లు కోల్పోయింది. 126 పరుగుల వద్ద రూట్ వికెట్ ను జడేజా తీశాడు. మొయిన్ ఆలీ భారత బౌలర్లను ఎదుర్కొని పరుగులు రాబట్టేందుకు కృషి చేశాడు. ఇతనికి కొద్దిసేపు బెన్ స్టోక్స్ సహకారం అందించాడు. వీరిద్దరూ ప్రమాదకరంగా మారుతారా అనే సందేహం అభిమానుల్లో కలిగింది. 63 పరుగులను జోడించడంతో ఇంగ్లండ్ గాడిలో పడ్డట్టే కనిపించింది.

జడేజా విజృంభజన..
కానీ మొయిన్ (44) ను జడేజా అవుట్ చేయడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. అనంతరం బెన్ (23) కూడా అవుట్ అయ్యాడు. పూర్తిగా మ్యాచ్ భారత్ చేతిలోకి వచ్చేసినట్లేనని అభిమానులు భావించారు. అభిమానుల ఆశలకు తగట్టే భారత బౌలర్లు విజృంభించారు. వరుసగా వికెట్లు తీయడంతో ఇంగ్లండ్ 207 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ప్రధానంగా జడేజా ఏడు వికెట్లు తీసి ఇంగ్లండ్ పరాజయానికి కారకుడయ్యాడు. జడేజా ఏడు, ఇశాంత్ శర్మ, ఉమేష్ యాదవ్, మిశ్రాలు తలా ఒక వికెట్ తీశారు. మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు విరాట్ కోహ్లికి లభించగా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కరుణ్ నాయర్ కు దక్కింది. భారత్ కు వరుసగా 18 వ టెస్టు విజయం. 2015 నుంచి వరుసగా ఐదో టెస్టు సిరీస్ విజయం.

ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్ : 477 ఆలౌట్..
భారత్ మొదటి ఇన్నింగ్స్ : 759/7.
ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ : 207 ఆలౌట్.

20:37 - December 17, 2016

తమిళనాడు : చెన్నై టెస్ట్‌లో ఇంగ్లండ్‌ జట్టు ఆధిపత్యం రెండో రోజు సైతం కొనసాగింది. మిడిల్‌ ఆర్డర్‌లోమొయిన్‌ అలీ సూపర్‌ సెంచరీతో చెలరేగడంతో పాటు లోయర్‌ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ పోరాడటంతో భారీ స్కోర్‌ నమోదు చేసిన ఇంగ్లండ్‌ జట్టు భారత్‌కు సవాల్‌ విసిరింది. 4 వికెట్లకు 284 పరుగులతో రెండోరోజు బ్యాటింగ్ కొనసాగించిని ఇంగ్లండ్‌ జట్టు ఓవర్‌ నైట్‌ స్కోర్‌కు మరో 193 పరుగులు జోడించింది. మొయిన్‌ అలీ 146 పరుగులకు ఔటైనా లోయర్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్ లయామ్ డాసన్‌,ఆదిల్ రషీద్‌ హాఫ్ సెంచరీలు నమోదు చేసి ఇంగ్లండ్‌ భారీ స్కోర్‌ నమోదు చేయడంలో కీలక పాత్ర పోషించారు. 8వ వికెట్‌కు డాసన్‌, రషీద్‌ 109 పరుగులు జోడించడంతో ఇంగ్లండ్‌ జట్టు 477 పరుగులు చేసింది.భారత బౌలర్లలో జడేజా 3 వికెట్లు పడగొట్టగా, ఇషాంత్‌ శర్మ,ఉమేష్‌ యాదవ్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఇప్పటికే 5 మ్యాచ్‌ల సిరీస్‌ను 0-3తో కోల్పోయిన ఇంగ్లండ్‌ జట్టు చెన్నై టెస్ట్‌లో అయినా నెగ్గి పరువు దక్కించుకోవాలని పట్టుదలతో ఉంది.

 

17:18 - October 11, 2016

ఇండోర్ : భారత జట్టు చారిత్రక విజయం సాధించింది. టెస్టు సిరీస్ లో కివీస్ ఘోర పరాజయం పాలైంది. మూడు టెస్టుల సిరీస్ ను 3-0 తేడాతో భారత్ క్లీన్ స్వీప్ చేసింది. రవిచంద్రన్ అశ్విన్ మరోసారి విజృంభించి ఆడాడు. స్పిన్ మాయజాలానికి కివీస్ బ్యాట్స్ మెన్స్ చేతులెత్తేశారు. ఏడు వికెట్లు తీసి న్యూజిలాండ్ నడివిరిచాడు.
మొదటి ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు పడగొట్టిన అశ్విన్ రెండో ఇన్నింగ్స్ లో కూడా విజృంభించాడు. ఏకంగా ఏడు వికెట్లు తీశాడు. ఇతడికి రవీంద్ర జడేజా (2 వికెట్లు) సహకారం అందించాడు. టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో కోహ్లీ డబుల్ సెంచరీ, రహానే సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. 5 వికెట్ల నష్టానికి 557 పరుగులకు డిక్లేర్డ్ చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన కివీస్ జట్టు కుప్పకూలింది. అశ్విన్ ధాటికి న్యూజిలాండ్ 299 పరుగులకే ఆలౌట్ అయ్యింది. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ మూడు వికెట్లు కోల్పోయి పూజారా సెంచరీ చేయగానే 216 పరుగులకు డిక్లేర్డ్ చేసింది. రెండు ఇన్నింగ్స్ లో 8 వికెట్లు కోల్పోయి 773 పరుగులు చేసినట్లైంది. డ్రా చేద్దామని బ్యాటింగ్ ఆరంభించిన కివీస్ జట్టుకు రవిచంద్రన్ అశ్విన్ మరోసారి చుక్కలు చూపించాడు. ఏడు వికెట్లు తీసి కివీస్ నడ్డి విరిచాడు. రెండో ఇన్నింగ్స్ లో కేవలం 153 పరుగులకే ఆలౌట్ అయ్యింది. మూడో టెస్టును టీమిండియా 321 పరుగుల భారీ ఆధిక్యంతో విజయం సాధించింది. దీనితో టెస్టు సిరీస్ ను భారత్ 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది.
భారత్ మొదటి ఇన్నింగ్స్ : 557/5 (కోహ్లీ 211, రహానే 188, శర్మ 51 నాటౌట్)
న్యూజిలాండ్ మొదటి ఇన్నింగ్స్ : 299 ఆలౌట్ (గుప్తిల్ 72, లాథమ్ 53, జేమ్స్ నీషమ్ 71)
భారత్ రెండో ఇన్నింగ్స్ : 216 డిక్లేర్డ్ (గంభీర్ 50, పుజారా 101 నాటౌట్)
న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్ : 153 ఆలౌట్

Pages

Don't Miss

Subscribe to RSS - kohli