kollywood

20:04 - May 26, 2017

హైదరాబాద్ : టుడే అవర్ రీసెంట్ రిలీజ్ '' రారండోయ్ వేడుక చూద్దాం''.....మన్మథుడు హిరోగా సోగ్గాడే చిన్నినాయనా హిట్ కొట్టి మళ్లి అక్కినేని ఫ్యామిలీతో జగకట్టిన డైరెక్టర్ కల్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో వచ్చిన సినిమా ''రారండోయ్ వేడుకచూద్దాం''..ఈ సినిమా ఈనాటి నేడే విడుదలలో ఉంది. లెట్ చేయకుండా ప్రేక్షకుల టాక్ చూద్దాం. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

 

08:33 - May 22, 2017

విజయ్ 61వ సినిమాపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. ఈ చిత్రంలో ఏకంగా విజయ్ మూడు పాత్రలను పోషిస్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మూడు పాత్రలకు ముగ్గురు హీరోయిన్లను ఎంపిక చేసింది. కాజల్..నిత్యా మీనన్ లను ఎంపిక చేసిన చిత్ర యూనిట్ తాజాగా 'సమంత'ను కూడా ఎంపిక చేసింది. గ్రామ పెద్దగా..వైద్యుడిగా..ఇంద్రజాలకుడిగా..విజయ్ కనిపించబోతున్నారు. విజయ్ తో కలిసి నటించడం చాలా ఆనందంగా ఉందని, కథ..కథనం..తనకెంతో నచ్చాయన్నారు. తన పాత్ర చాలా ఫ్రెష్ గా సమ్ థింగ్ స్పెషల్ గా ఉంటుందని సమంత పేర్కొన్నారు. రొమాంటిక్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ఉంటుందని, చిత్రంలో మూడు భిన్న గెటప్స్‌తో విజయ్ ప్రేక్షకులను అలరిస్తారని తెలిపింది. ఎస్‌.జె.సూర్య ప్రతినాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి ఏ.ఆర్‌.రెహ్మాన్‌ సంగీతం అందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి దీపావళి కానుకగా ఈచిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు దర్శక, నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

16:25 - May 15, 2017

చెన్నై : భయం నా బ్లడ్ లో లేదు, రాజకీయ ఆదాయం కోసమే కొందరు రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నారు. రాజకీయాల్లోకి రావాలని దేవుడు ఆదేశిస్తే వస్తాను అని సూపర్ స్టార్ రజనీకాంత్ మనసులోని మాటలను తేటతెల్లం చేశారు. చెన్నైలో ఆయన మనసువిప్పి అభిమానులతో మాట్లాడారు. చెన్నైలోని రాఘవేంద్ర కళ్యాణ మండపంలో తన అభిమానులతో సమావేశమైన రజనీకాంత్ తన భవిష్యత్తు ప్రణాళికలను స్పష్టం చేశారు. సీనియర్ దర్శకుడు ముత్తురామన్‌తో కలిసి అభిమానులను కలుసుకున్న రజనీ వారిని ఉద్దేశించి మాట్లాడారు. ఈ నెల 20 నుంచి తన కొత్త సినిమా షూటింగ్‌ ప్రారంభమవుతుందని ప్రకటించారు. ఇక తాను ఏ పార్టీలో చేరేది లేదని..ఏ పార్టీకి మద్దతు ఇచ్చేది లేదని రజనీ స్పష్టం చేశారు. నటనే తన వృత్తి అని అది దేవుడు ఆదేశించాడు కాబట్టి..దానినే పాటిస్తున్నానని సూపర్‌స్టార్ స్పష్టం చేశారు. ఒకవేళ రాజకీయాల్లోకి రావాలని దేవుడు ఆదేశిస్తే..తప్పకుండా వస్తానన్నారు. తన అభిమానులు నిజాయితీగా జీవించాలని ఫ్యాన్స్‌కు విజ్ఞప్తి చేశారు.

14:38 - May 8, 2017

చలన చిత్ర పరిశ్రమల్లో అగ్ర కథానాయకుల సరసన నటించాలని పలువురు హీరోయిన్లు ఆసక్తి కనబరుస్తుంటారన్న సంగతి తెలిసిందే. వారితో కనీసం యాక్ట్ చేయాలని...వారితో కనీసం డ్యాన్స్ అయినా చేయాలని తహతహలాడుతుంటారు. అందులో కొంతమంది హీరోయిన్స్ కు మాత్రమే ఛాన్స్ దొరుకుతుంది. తమిళ సూపర్ స్టార్ 'రజనీకాంత్' సరసన నటించాలని చాలా మంది అనుకుంటుంటారు. కానీ బాలీవుడ్ నటి ఆయన సరసన నటించేందుకు 'నో' చెప్పిందని సోషల్ మాధ్యమాల్లో తెగ ప్రచారం జరుగుతోంది. ఇటీవలే పా. రంజిత్ దర్శకత్వంలో వచ్చిన 'కబాలి' విజయం సాధించింది. ఆయన దర్శకత్వంలోనే మరో చిత్రంలో నటించేందుకు 'రజనీ' గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో 'రజనీ' సరసన బాలీవుడ్ నటి 'విద్యా బాలన్' నటించనున్నారని ప్రచారం జరిగింది. ఈ విషయంపై త్వరలో ప్రకటిస్తానని పేర్కొన్నట్లు సోషల్ మాధ్యమాల్లో వార్తలు వెలువడ్డాయి. కానీ ఇప్పుడు డేట్లు కుదరక ఏకంగా సినిమా నుండే తప్పుకున్నట్లు సమాచారం. దీనితో వేరే కథానాయిక ఎంపిక చేసే యోచనలో ఉన్నట్లు టాక్. మరి ఈ సినిమాపై త్వరలోనే అన్ని వివరాలను తెలియనున్నాయి.

10:50 - May 7, 2017

సూపర్ స్టార్ 'రజనీ కాంత్' వరుస సినిమాలు చేస్తూ బిజీ బిజీగా మారనున్నారు. గత ఏడాది ఆయన 'కబాలి' తో ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న 'రోబో 2’ లో రజనీ నటిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి ప్రారంభంలో రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే తాజాగా మరో చిత్రానికి రజనీ సైన్ చేశారని టాక్. 'కబాలి' సినిమాను తెరకెక్కించిన పా.రంజిత్ దర్శకత్వంలో మరోసారి 'రజనీ' నటించనున్నారు. ధనుష్ కు చెందిన వండర్ బాయ్ ఫిలిమ్స్ సంస్థ దీనిని నిర్మించనుంది. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం వహించనున్నట్లు తెలుస్తోంది. మళ్లీ పా.రజింత్, సంతోష్ నారాయణన్, రజనీ కాంబినేషన్ లో రూపొందబోయే ఈ చిత్రంపై ఇప్పుడే భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. మే 28న ఈ చిత్రం ప్రారంభం కానుందని టాక్. ముంబై బ్యాక్ గ్రౌండ్ లో ఈ చిత్రం రూపొందనుందని తెలుస్తోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. మరి ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

21:31 - May 4, 2017

హైదరాబాద్: బాహుబలి 2 కలెక్షన్ల మోత మోగిస్తోంది. జక్కన చెక్కిన గ్రాఫిక్‌ మూవీ..కాసుల పంట పండిస్తోంది. బాలీవుడ్‌ రికార్డులను బద్ధలుకొడుతూ బాక్సాఫిస్‌ను షేక్‌ చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన 6 రోజుల్లోనే 792 కోట్లు వసూళ్లు చేసి..పీకే, దంగల్‌ చిత్రాల పేరిట ఉన్న రికార్డులను బ్రేక్‌ చేసి దేశంలోనే హయ్యస్ట్ రెవెన్యూ మూవీగా నిలిచింది. హిందీ వర్షెన్‌ విడుదలైన 6 రోజుల్లోనే 375 కోట్లు రాబట్టి.. బాలీవుడ్‌లోనూ బాహుబలి..ది కన్‌క్లూజన్‌ సత్తా చాటింది.

21:27 - May 4, 2017

హైదరాబాద్: దర్శకరత్న దాసరి నారాయణరావు జన్మదిన వేడుకలు ఆయన నివాసంలో ఘనంగా జరిగాయి. సినీ ప్రముఖులు, నటీనటులతో ఆయన నివాసం సందడిగా మారింది. సినీ ప్రముఖులు.. మురళీమోహన్, ఆర్‌ నారాయణమూర్తి, పరుచూరి గోపాలకృష్ణ తదితరులు దాసరికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత చిరంజీవి, మోహన్‌బాబు, మంచులక్ష్మీ దాసరికి బర్త్‌ డే విషేస్‌ చెప్పారు. ఈ సందర్భంగా అల్లురామలింగయ్య అవార్డును దాసరి నారాయణరావుకు చిరంజీవి అందజేశారు.

12:15 - May 3, 2017

టాలీవుడ్ మెగాస్టార్ 'చిరంజీవి' ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాతో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చి తన తదుపరి చిత్రంపై ఫోకస్ పెట్టాడు. 151వ సినిమాగా 'ఉయ్యాలవాడ నరసింహరెడ్డి' రూపొందనుందని సోషల్ మాధ్యమాల్లో తెగవార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే చిత్ర షూటింగ్ ఉండనున్నట్లు ఆయన తనయుడు రామ్ చరణ్ ప్రకటించారు. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో హీరోయిన్ గా బాలీవుడ్ నటుడు 'అభిషేక్ బచ్చన్' సతీమణి 'ఐశ్వర్య రాయ్' నటించనుందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్లు టాక్. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను రామ్ చరణ్ మరోసారి కొణిదల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ లో తెరకెక్కిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కబోయే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన వివరాలతో మెగా టీం ముందుకు రానున్నట్లు తెలుస్తోంది.

11:21 - May 3, 2017

శ్రియ..టాలీవుడ్ అగ్ర హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. ఈ ఇన్నింగ్స్ ఆమెకు బాగానే కలిసివచ్చినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే 'గోపాల గోపాల'...’గౌతమి పుత్ర శాతకర్ణి' అవకాశాలు రావడం ఈ చిత్రాలు మంచి పేరు తెచ్చుకోవడంతో ఆమెకు పలు ఆఫర్లు వస్తున్నాయి. 'బాలకృష్ణ' తాజా చిత్రంలో కూడా ఛాన్స్ కొట్టేసినట్లు టాక్. తాజాగా కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న 'నక్షత్రం' సినిమాలో ఓ ఐటమ్ సాంగ్ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో ముగ్గురు హీరోలు..ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. సందీప్ కిషన్..సాయి ధరమ్ తేజ్..తనీష్ లు నటిస్తున్నారు. వీరికి జోడిగా రాశీ ఖన్నా..రెజీనా..ప్రగ్వా జైస్వాల్ లు నటిస్తున్నారు. ప్రస్తుతం 'శ్రియ' ఐటమ్ సాంగ్ చేయనుందని టాక్ రావడంతో చిత్రానికి మరింత గ్లామర్ పెరిగినట్లైంది.

11:05 - May 3, 2017

టాలీవుడ్ రెబల్ స్టార్ 'ప్రభాస్' తన తదుపరి చిత్రంపై పూర్తి ఇంట్రస్ట్ పెట్టాడు. ‘బాహుబలి'..'బాహుబలి-2’ చిత్రం కోసం 'ప్రభాస్' ఇతర చిత్రాలకు సైన్ చేయలేదనే సంగతి తెలిసిందే. చిత్ర షూటింగ్ పూర్తయిన తరువాత సుజీత్ చిత్రానికి 'ప్రభాస్' పచ్చజెండా ఊపారు. ఇటీవలే చిత్ర టీజర్ విడుదలైంది. దీనికి భారీగా రెస్పాన్స్ వస్తోంది. కానీ సినిమాకు సంబంధిన విషయాలు మాత్రం వెల్లడికావడం లేదు. ప్రభాస్ చిత్రంలో నటించేది ఎవరు ? హీరోయిన్ ఎవరు ? విలన్ ఎవరు ? తదితర పాత్రలు ఎవరు పోషించనున్నారనేది తెలియరావడం లేదు. తాజాగా ఈ సినిమాలో 'ప్రభాస్'కు జోడిగా 'తమన్నా' నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో 'రెబల్' .. 'బాహుబలి' సినిమాల్లో వీరిద్దరూ నటించిన సంగతి తెలిసిందే. 'బాహుబలి 2' సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేయడానికి ప్రభాస్ అమెరికా వెళ్లనున్నాడు. అక్కడి నుంచి తిరిగి వచ్చిన తరువాత ఆయన ఈ సినిమా షూటింగులో పాల్గొననున్నాడని తెలుస్తోంది.

Pages

Don't Miss

Subscribe to RSS - kollywood