Komatireddy Venkat reddy

08:16 - June 6, 2018

హైదరాబాద్ : కేసీఆర్‌ సిరిసిల్ల, సిద్ధిపేటలకే ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. సొంత నియోజకవర్గాలకే నిధులు గుమ్మరిస్తున్నారని మండిపడ్డారు. తనకు మంచి పేరు వస్తుందనే కేసీఆర్‌ నల్లగొండజిల్లాకు నిధులు రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు.

పాలనలో కేసీఆర్ వివక్ష..
ముఖ్యమంత్రి కెసిఆర్ పాలనపై కాంగ్రెస్‌ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రస్ధాయిలో విమర్శలు చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సీఎం కెసిఆర్ పాలనలో వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. కేసీఆర్‌ పక్షపాత ధోరణితో దక్షిణ తెలంగాణా అభివృద్ధిలో వెనుకబడి పోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కాళేశ్వరం ఎత్తపోతల ప్రాజెక్టుకు వేలకోట్ల రూపాయలు మంజూరుచేసిన ప్రభుత్వం.. నల్లగొండ జిల్లాకు సాగు, తాగు నీరిచ్చే ఎస్సెల్బిసి ప్రాజెక్టుకు మాత్రం ఒక్కరూపాయి కూడా విడుదల చేయడం లేదన్నారు.

పోరాడితేగాని నల్లగొండకు మెడికల్‌ కళాశాల రాలేదు : కోమటిరెడ్డి వెంకటరెడ్డి
బతుకమ్మ చీరల తయారీకి కేవలం సిరిసిల్ల జిల్లాకే 250కోట్ల ఆర్డర్లు ఇచ్చిన ముఖ్యమంత్రికి ఇతర జిల్లాల్లో చీరలు నేసే విషయం తెలియదా అని కోమటిరెడ్డి ప్రశ్నించారు. ఎప్పటినుంచో జిల్లాకేంద్రంగా ఉన్న నల్లగొండకు పోరాడితేకాని రాని మెడికల్ కళాశాల .. సిద్దిపేటకు మాత్రం మొదటి విడతలోనే మంజూరు చేసి 750కోట్లు నిధులు కేటాయించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. సొంత ప్రాంతానికి ఒకరకంగా, మిగతా ప్రాంతానికి మరో రకంగా నిధులు మంజూరు చేస్తూ వివక్ష చూపుతున్నారని మండిపడ్డారు. మొత్తానికి మరోసారి తనదైన శైలిలో సీఎం కేసీఆర్‌పై ఘాటు విమర్శలు చేసిన కోమటిరెడ్డి.. వార్తల్లో నిలిచారు.

 

16:17 - May 7, 2018

హైదరాబాద్ : టి.కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి, సంపత్ సభ్యత్వ రద్దుపై టి.కాంగ్రెస్ ఇంకా పోరాటం కొనసాగిస్తోంది. దీనిపై కోర్టులో కేసు నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ను టి.కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్, ఇతర నేతలు కలిశారు. ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దుపై హైకోర్టు ఆదేశం ప్రభుత్వం అమలు చేసేలా చూడాలని కోరారు. కోర్టు ఆదేశాల కాపీలను గవర్నర్ కు అందచేయడం జరిగిందన్నారు. 

08:54 - May 3, 2018

హైదరాబాద్ : కాంగ్రెస్‌ నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌ శాసనసభ్యత్వం రద్దుపై హైకోర్టు డివిజన్‌ బెంచ్‌లో వాదనలు ముగిశాయి.ఈ కేసులో సింగిల్‌ జడ్జి బెంచ్‌ ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ 12 మంది టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు డివిజన్‌ బెంచ్‌కి అప్పీల్‌ చేశారు. పిటిషనర్ల తరుపున వైద్యనాథన్‌  వాదనలు వినిపించారు.  కోమటిరెడ్డి, సంపత్‌కుమార్‌ తరుపున అభిషేక్‌ మను సింఘ్వి వాదించారు. పిటిషన్‌ వేసిన 12 మంది టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది పార్టీ ఫిరాయించిన వారేనని, ఇలాంటి వారు కేసు వేసే అర్హతలేదని సింఘ్వి వాదించారు. అయితే  సభలో సభ్యులకు కేసు వేసే అర్హత ఉందని వైద్యనాథన్‌ వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ తీర్పును రిజర్వు చేసింది. 
 

 

07:34 - March 28, 2018

హైదరాబాద్ : కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌ సభ్యత్వం రద్దు కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో కౌంటర్‌ దాఖలు చేసేందుకు ప్రభుత్వం నాలుగు వారాల గడువు కోరగా.. అంత సమయం ఇవ్వలేమని హైకోర్టు ధర్మాసనం తేల్చి చెప్పింది. ఇప్పటికే ఆలస్యమైందని అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు... వచ్చే నెల 3 వ తేదీలోగా కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. కేసు విచారణకు స్వీకరించిన రోజే.. అసెంబ్లీలో చోటుచేసుకున్న పరిణామాలకు సంబంధించిన వీడియో దృశ్యాలను సమర్పించాలని ఆదేశించింది. అయితే వీడియోలు లేవని అదనపు అడ్వకేట్‌ జనరల్‌ చెప్పడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 

15:56 - March 27, 2018

హైదరాబాద్ : కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి, సంపత్‌ల శాసనసభ సభ్యత్వం రద్దుపై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. సీసీటీవీ వీడియోల సమర్పణపై ఇప్పుడు మేము ఏమీ చెప్పలేమని అడిషనల్ అడ్వకేట్ జనరల్... హైకోర్టుకు తెలిపారు. దీంతో ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయాలన్న న్యాయస్థానం.. విచారణను వచ్చే మంగళవారానికి వాయిదాపడింది. కాగా మండలి చైర్మన్ స్వామిగైడ్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి హెడ్ ఫోన్ విసిన ఘటనను సీరియస్ గా తీసుకున్న టీ.సర్కార్ కోమటిరెడ్డి తోపాటు సంపత్ ను కూడా శాసనసభ నుండి శాస్వతంగా రద్దు చేసింది. ఈ విషయంపై న్యాయస్థానాన్ని కోమట్టిరెడ్డి ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈ కేసుపై కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ సర్కార్ కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

14:35 - March 27, 2018

ఢిల్లీ : ప్రత్యేక హోదాపై నేనెప్పుడు కేంద్ర ప్రభుత్వంతో రాజీ పడలేదని అఖిల పక్షం సమావేశంలో సీఎం చంద్రబాబు తెలిపారు. ఏపీకి రెండు జాతీయ పార్టీలు అన్యాయం చేశాయన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం 49 సార్లు ఢిల్లీలకి వెళ్లి రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి ప్రస్తావించానని తెలిపారు. రూ. రాష్ట్రానికి రావాల్సిన ఆర్థిక లోటు గురించి పదే పదే గుర్తు చేసిన కేంద్రం నుండి ఎటువంటి స్పందన రాలేదన్నారు.

ఏ రాష్ట్రానికి జరగని అన్యాయం ఏపీకి జరిగింది : సీపీఎం మధు

ఈ సమావేశానికి హాజరైన సీపీఎం పార్టీ ఏపీ కార్యదర్శి మధు మాట్లాడుతు.. భారతదేశంలో ఏ రాష్ట్రానికి జరగని అన్యాయం ఏపీకి జరిగిందన్నారు. పార్లమెంట్ లో చేసిన చట్టాన్ని కూడా అమలు చేయటంలేదన్నారు. జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సీఎం చంద్రబాబు నాయుడికి రాసిన లేఖ గురించి కూడా మధు మాట్లాడారు. అమిత్ షా లేఖ రాజకీయ స్కోరు కోసం రాసినదేనన్నారు. చంద్రబాబు అధ్యక్షతన అఖిల పక్ష సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశానికి వామపక్ష పార్టీలు హాజరు కాగా..బీజేపీ, వైసీపీ, జనసేన పార్టీలు హాజరుకాలేదు. 

14:01 - March 22, 2018

హైదరాబాద్ : కాంగ్రెస్ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి, సంపత్‌ల సభ్యత్వం రద్దుపై  హైకోర్టులో విచారణ జరిగింది. గవర్నర్ ప్రసంగం రోజు జరిగిన వీడియోలను,ఒర్జినల్ సీడీలను సీల్డ్ కవర్లో 22 తేదీన  కోర్టుకు  సమర్పించాలని హైకోర్టు గతంలో ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే ఇంకా వీడియోలు సిద్ధం కాలేదని కొంత సమయం కావాలని ప్రభుత్వం హైకోర్టును కోరింది. 27 తేదీన ఈ  కేసుకు సంబంధించిన ఒర్జినల్ సీడీలను ,కౌంటర్‌ను దాఖలు చేస్తామని ప్రభుత్వం తెలిపింది. తదుపరి విచారణ హైకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది.

 

19:11 - March 21, 2018

ఢిల్లీ : తెలంగాణ ప్రభుత్వం చట్ట వ్యతిరేకంగా ఎలాంటి కారణం లేకుండా తమ అసెంబ్లీ సభ్యత్వాన్ని రద్దు చేసిందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్.. ఈసీకి ఫిర్యాదు చేశారు. ఢిల్లీలో వీరిరువురు కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నతాధికారులను కలిశారు. ఈ నిర్ణయంపై హైకోర్టు తాత్కాలిక స్టే ఇచ్చిందని ఈసీ దృష్టికి తీసుకొచ్చారు. రాజ్యసభ ఎన్నికల ఓటర్ల జాబితాలో తమ పేర్లను తొలగించారని... వాటిని చేర్చాలని ఈసీని కోరినట్లు కాంగ్రెస్‌ నేతలు తెలిపారు. 

21:05 - February 12, 2018

హైదరాబాద్ : నల్గొండలో తమ ఆధిపత్యం కోసం కోమటిరెడ్డి సోదరులు నీచ రాజకీయాలు చేస్తున్నారమని విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి విమర్శించారు. బొడ్డుపల్లి శ్రీనివాస్‌ హత్య కేసులో కాల్‌ డెటాను పోలీసులు విడుదల చేయలేదన్నారు. ఆరోపణలు చేస్తున్న వారే రిలీజ్‌ చేశారని చెప్పారు. వీటిపై విచారణ చేయాలని పోలీసులను కోరినట్లు జగదీశ్ రెడ్డి తెలిపారు. 

14:43 - January 29, 2018

హైదరాబాద్ : ముఖ్యమంత్రి ప్రోద్బలంతోనే బొడ్డుపల్లి శ్రీను హత్యకేసును పోలీసులు నీరుగార్చారని కాంగ్రెస్‌ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. శ్రీను హత్యకేసులో ముఖ్యమంత్రి తన పాత్రలేదని రుజువు చేసుకోవాలని కోమటిరెడ్డి డిమాండ్‌ చేశారు. ఇప్పటికైన బొడ్డుపల్లి శ్రీను హత్యకేసును సీబీఐకి అప్పగించాలన్నారు. ముఖ్యమంత్రి నిర్లక్ష్యంగా ఉంటే.. కాంగ్రెస్‌ నేత చిరుమర్తి లింగయ్యను కూడా త్వరలోనే చంపేసే అవకాశం ఉందని కోమటిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.  

Pages

Don't Miss

Subscribe to RSS - Komatireddy Venkat reddy