krishna

11:23 - October 19, 2017

కృష్ణా: చందర్లపాడు మండలంలోని బొబ్బెళ్లపాడువిష జ్వరాలతో విలవిలలాడుతోంది. బొబ్బిళ్లపాడు గ్రామంలో లో 200 మందికి పైగా మలేరియా, డెంగ్యూ, వైరల్ జ్వరాల పాలయ్యారు. కొంత మంది విజయవాడలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. నందిగామ ఆస్పత్రిలో మరో 20 మంది చికిత్స పొందుతున్నారు. ఆ గ్రామంలో ప్రతి ఇంట్లో ఒకరిద్దరు జ్వర పీడితులు ఉన్నారని, ఇంత జరుగుతున్నా గ్రామం వైపు ఆరోగ్య శాఖ అధికారులు కన్నెత్తి చూడలేదని గ్రామస్థులు మండిపడుతున్నారు.

19:11 - October 16, 2017

కృష్ణా : జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో విజిలెన్స్ తనిఖీలు నిర్వహించింది. ఉయ్యూరులో వెలుగు చూసిన నకిలీ పెన్షన్ల అంశంపై విజిలెన్స్ అధికారుల బృందం తనిఖీలకు వచ్చింది. అయితే విచారణకు సహకరించని ఏ.డి.రత్నకుమారిపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

16:20 - October 16, 2017

కృష్ణా : జిల్లాలోని కోడూరులో విషాదం చోటు చేసుకుంది. లెక్కలు రావడం లేదని మనస్థానంతో విద్యార్థిని గుళికలు తిని ఆత్మహత్య చేసుకుంది. సరితను అవనిగడ్డ వైద్యశాలకు తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతి చెందింది. కోడూరులోని స్వతంత్ర్యపురం హైస్కూల్‌లో పాలంకి సరిత తొమ్మిదో తరగతి చదువుతోంది. 
 

 

13:50 - October 16, 2017

కృష్ణా : కార్పోరేట్‌ కాలేజీల్లో విద్యార్థుల ఆత్మహత్మలను నివారించాలని కోరుతూ విద్యార్థి సంఘాలు విజయవాడలో కాలేజీలు బంద్‌ చేయించాయి. విద్యార్థులను యాజమాన్యాలు ర్యాంకుల కోసం మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నారని విద్యార్థి సంఘం నేతలు మండిపడ్డారు. వరుసగా విద్యార్థుల బలవన్మరణాలు పునరావృతమవుతున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదన్నారు. నారాయణ విద్యాసంస్థల అధినేత నారయణను మంత్రి పదవి నుంచి బర్తరఫ్‌ చేసి తగు చర్యలు తీసుకోవాలని PDSU రాష్ట్ర అధ్యక్షుడు రవిచంద్ర డిమాండ్‌ చేశారు.

16:42 - October 12, 2017

కృష్ణా : జిల్లాలోని గన్నవరం పరిసర ప్రాంతాల్లో భూప్రకంపనలతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. గన్నవరం మండలం ముస్తాబాద్‌, ఉంగుటూరు మండలం పెద్ద అవుటపల్లి, చిన్నఅవుటపల్లిలో భూమి కంపించింది. అటు గన్నవరం ఎయిర్ పోర్ట్‌లోనూ స్వల్పంగా భూమి కంపించింది. దీంతో అధికారులు భయంతో పరుగులు తీశారు. గన్నవరంలో మూడురోజుల్లో భూమి కంపించండం ఇది రెండోసారి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

12:35 - October 12, 2017

 

కృష్ణా : బాపులపాడు మండలం రేమల్లిలో పెళ్లికి ఒప్పుకోలేదంటూ ప్రియురాలిపై ప్రియుడు దాడి చేశాడు. రేమల్లి స్పిన్నింగ్ మిల్లులో పనిచేస్తున్న కమల్ కాంత్, రింకీరాణి ఇద్దరు ప్రేమించుకున్నారు. కామల్ కాంత్ పెళ్లికి ఒప్పుకోవాలంటూ రికీరాణిపై ఒత్తిడి చేయడం ప్రారంభించారు. ఆమె పెళ్లికి ఒప్పుకోకపోవడంతో కత్తితో దాడి చేశాడు. రాణి కేకలు వేయడంతో కమల్ కాంత్ పారిపపోయాడు. తీవ్రంగా గాయపడిన రికీరాణిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

19:24 - October 7, 2017

కృష్ణా : జిల్లా తిరువూరులో దారుణం చోటు చేసుకుంది. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ విద్యార్థిని కుమారి ఆత్మహత్య చేసుకుంది. కుమారి కాలేజ్‌లోనే పురుగుల మందు తాగింది. అయితే ఆత్మహత్యకు ఇంటర్‌ సెకండ్ ఇయర్‌ విద్యార్థి వెంకటేశ్వరరావు వేధింపులే కారణమని తెలుస్తోంది. వెంకటేశ్వరరావుని లెక్చరర్లు హెచ్చరించినా.. వేధింపులు ఆగలేదని సమాచారం. 

13:28 - October 4, 2017

 

కృష్ణా : జిల్లా తేలప్రోలు వద్ద ప్రైవేట్ ట్రావెల్స్‌ బస్సు బోల్తా పడింది. ప్రమాదంలో ఆరుగురు గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 22 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు విశాఖ నుంచి హైదరాబాద్‌ వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. 

08:17 - October 4, 2017

కృష్ణా : జిల్లా జగ్గయ్య పేట మండలం అనుమంచుపల్లిలోని లక్ష్మీ గణేష్ రైస్ మిల్లులో అగ్నిప్రమాదం జరిగింది. షాట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగడంతో పెద్ద ఎత్తున మంటలు రావడంతో స్థానికులు భయందోళనకు గురైయ్యారు. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. మంటలతో రైస్ మిల్లులో ఉన్న 2500 బియ్యం బస్తాలు అగ్నికి కాలిపోయాయి. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

16:35 - September 30, 2017

Pages

Don't Miss

Subscribe to RSS - krishna