Kshanam Kshanam

12:36 - June 8, 2017

చీకట్లో ఇంటి ముందు కాల్పుల శబ్ధం..పరుగున వచ్చిన ఆ ఇంటి ఇల్లాలు..అప్పటికే రక్తపు మడుగులో కొడుకు..భర్త..ప్రతిఘటించబోతే ఆమెపైనా కాల్పులు...

ఉత్తర్ ప్రదేశ్ లో క్రిమినల్స్ పెరిగిపోతున్నారు..దోచుకొనేందుకు కూడా కాల్చేస్తున్నారు..విరివిగా దొరుకుతున్న తుపాకులతో సంచరిస్తూ దారుణాలకు పాల్పడుతున్నారు..రాజధానికి 90 కి.మీటర్ల దూరంలో ఓ కుటుంబాన్ని దుండగులు కాల్చిపారేశారు..వ్యాపారవేత్త..ఆయన కొడుకు..భార్యను కాల్చిపారేశారు..ఈ దాడుల దృశ్యాలు సీసీ కెమెరాలో రిక్డారయ్యాయి. ఆ దృశ్యాలు చూడండి..

12:27 - June 8, 2017

ఆస్తి కోసం గొడవలు..అల్లుడికి సపోర్టుగా అత్తామామలు..చెలరేగిపోయిన కుమారుడు..భార్యపేరున ఆస్తి రాసివ్వాలని దాడి..వారు ప్రాణాలతో ప్రస్తుతం కొట్టుమిట్టాడుతున్నారు..

ఆస్తులు అరాచకాలకు కారణమౌతున్నాయి..డబ్బు మనిషిని మృగంగా మార్చేస్తోంది..రక్తం చిందిస్తుంది..పేగు బంధాలను తెంచేస్తోంది..ఈ ఆస్తుల కోసం ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయి...కన్న తల్లిదండ్రులను అత్తామామల సహకారంతో చంపేందుకు కట్ర చేశాడో ఓ దుర్మార్గుడు..ఈ ఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ విషాద ఘటన చూడాలి..వినాలంటే వీడియో క్లిక్ చేయండి.

12:22 - June 8, 2017

కూతురి ప్రేమలో ఉన్నాడని తెలిసి కక్ష...కసితో రగిలిపోయాడు...తన కూతురికి కనిపించకుండా చేయాలని...నమ్మకస్తుడిని పిలిపించి చంపేసిన దుర్మార్గం...

ఆస్తి..అంతస్తుల ముందు పేగు బంధం తెగిపోతోంది. మనుషుల్లో పెరుగుతున్న స్వార్థం..ఎన్నో ఘోరాలకు దారి తీస్తోంది..ప్రాణాలు తీస్తోంది..ఈ ఆస్తుల కోసం జన్మనిచ్చిన వారిని అంతం చేస్తున్నారు..రక్తసంబంధాన్ని కాలరాస్తూ..రక్తాన్ని చిందిస్తున్నారు..ఎందుకు కక్షలు..కార్పణ్యాలు.. ? అన్నదమ్ముల మధ్య అనుబంధాలు మాయమౌతున్నాయి.. దీనితో సాధిస్తున్నది ఏమిటీ ?
ప్రేమించడమే శాపమైంది..మనస్సుకు నచ్చిన వారిని ఎంచుకోవడం పాపంగా మారుతోంది..రెండు హృదయాలు కలవడం అంటే పెద్దల అంగీకారం కావాల్సిందే..లేదంటే ప్రాణాలు తీస్తున్నారు..తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన పరువు హత్యలో రెండు కుటుంబాల్లో విషాదం నింపింది... యావత్తు తెలుగు రాష్ట్రాల్లో ప్రేమికుల గుండెలు పగిలేలా భయాన్ని సృష్టించాయి. మరి పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి....

13:53 - May 10, 2017

వడ్డీ వ్యాపారుల వేధింపులు ఒకవైపు..పోలీసుల నుండి ఒత్తిళ్లు మరోవైపు..వీరిద్దరి మధ్య నలిగిన సామాన్యుడు. కాల్ మనీ బాధితుడు ఆత్మహత్యాయత్నం..

హైదరాబాద్ లో కాల్ మనీ దందాలు పెరిగిపోతున్నాయి. రహస్యంగా కొనసాగుతున్న ఈ వ్యవహారం గురించి పోలీసులకు తెలిసినా ఏమీ చేయలేకపోతున్నారు. వత్తిళ్లు తెస్తూ కాల్ మనీ కేటుగాళ్లను తమ పని చేసుకుంటున్నారు. మరో ఉదంతం పోలీసులకు సవాల్ గా మారింది. కాల్ మనీ కేటుగాళ్ల వేధింపులకు భయపడి దిల్ నగర్ కు చెందిన వెంకట రమణ ఆత్మహత్య చేసుకొనేందుకు ప్రయత్నించాడు. ఘటనకు సంబధించి పూర్తి వివరాలు వీడియో క్లిక్ చేయండి. 

13:42 - May 10, 2017

బెల్టుషాపు నిర్వహిస్తున్నారని దాడులు..తండ్రీ కొడుకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు..కేసులు పెడుతామంటూ హెచ్చరికలు..అవమాన భారంతో ఆత్మహత్యకు ప్రయత్నించడం..

బెల్ట్ షాపులు ఉండకూడదని ఆందోళనలు జరుగుతున్నవి తెలిసిందే. కానీ ఓ గ్రామంలో ఉన్న బెల్టుషాపును మాత్రం ఎవరూ వ్యతిరేకించలేదు. పోలీసులు వచ్చి దాడులు చేసి పట్టుకొంటే మాత్రం గగ్గొలు పెడుతున్నారు. నిర్వాహకులు ఆత్మహత్య చేసుకోవడంతో ఎస్ఐ పై తగిన చర్యలు తీసుకోవాలని నానా యాగీ చేస్తున్నారు. అసలు తప్పు చేసింది ఎవరు ? ఆ తప్పును ప్రోత్సాహించింది ఎవరు ? పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

17:53 - April 13, 2017

పెద్దపల్లి : జిల్లాలో దారుణం జరిగింది. ఓ వివాహితపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. సుల్తానాబాద్‌ మండలంలోని కాట్నపల్లిలో ఆరుగురు యువకులు వివాహితను 20 రోజుల క్రితం కిడ్నాప్ చేసి ఆటోలో తీసుకెళ్లారు. ఆమెకి మద్యం తాగించి అత్యాచారం చేశారు. ఆమెకు ప్రేమ వివాహం జరిగింది. వీరికి ఓ కూతురు ఉంది. అయితే భర్తకు ఇదివరకే పెళ్లి అయిందని తెలిసాక అతనితో విడిపోయి ఒంటరిగా ఉంటుంది. రైస్ మిల్లులో పని చేస్తూ జీవనం సాగిస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.

 

16:56 - April 13, 2017

కన్నతల్లితో బంధాన్ని తెంచేసుకున్నారు...మానవత్వాన్ని మంటగలిపారు..పేగు బంధాన్ని అపహాస్యం చేశారు..ఏడాదిగా వాష్ ఏరియాలోనే అమ్మ..ఇదంతా హెడ్ మాస్టర్ దుర్మార్గం..

పేగు బంధం మరోసారి అపహాస్యం అయ్యింది. కన్నతల్లిని ఏడాదిగా హింసిస్తున్న కొడుకు నిర్వాకం బయటపడింది. అంట్లు తోమే ప్రాంతంలో నిసత్తువుగా ఉన్న అమ్మను పడేసి దుర్మార్గంగా ప్రవర్తించాడు. అరవ లేక..ఆదుకొనే వారు లేక..ఆ అమ్మ రోదించింది. విషయం తెలిసిన అధికారులు ఆమెను విముక్తిరాలిని చేశారు. పలువురిని కంటతడిపెట్టించిన ఈ ఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలోని హైటెక్ సిటీలో చోటు చేసుకుంది. పలువురికి ఆదర్శంగా ఉండాల్సిన ఓ హెడ్ మాస్టర్ ఇలా చేశాడు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

13:46 - April 12, 2017

'అక్షయ' పాత్ర పేరిట మళ్లీ మోసాలు..అమాయకులకు కుచ్చుటోపి పెడుతున్న గ్యాంగ్..సొమ్ము చేసుకుని పారిపోతున్న ముఠా..నగరంలో మరో గ్యాంగ్ ను పోలీసులు అరెస్టు చేశారు.

ఆ పాత్ర మీ ఇంట్లో కోటీశ్వరులే...దరిద్రం మీ ఇంట దరిచేరదు. ఇలాంటి మాటలతో మోసాలకు పాల్పడుతున్న రైస్ పుల్లింగ్ ముఠా దొరికింది. మహానగరంలో ఇలాంటివి ఎన్నో గ్యాంగులున్నాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ముఠాలోని ముగ్గురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. వీరివద్ద రెండు కార్లు..పుల్లింగ్ కు ఉపయోగించే వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

13:33 - April 12, 2017

ఇంట్లోంచి ఇప్పుడే వస్తానంటూ వెళ్లింది..తెల్లారేసరికి ఊరి చివర డెడ్ బాడీ..ఇల్లాలిని ముక్కలు చేశారు..

భర్త కష్టపడి డబ్బులు సంపాదించి పంపిస్తున్నాడు. ముగ్గురు పిల్లల భవిష్యత్ ను తీర్చిదిద్దాల్సిన బాధ్యతగల ఆ ఇల్లాలు తప్పటడుగు వేసింది. అందుకు పర్యవసానం ఆమె ప్రాణాలను బలితీసుకుంది. పాశ్చాత్య పోకడలు మరో మహిళను అంతం చేసింది. సిద్ధిపేట జిల్లాలోని నంగునూరు మంగలంలోని గట్ల మల్యాల గ్రామంలో లావణ్య నివాసం ఉంటోంది. ఈమె భర్త దుబాయ్ లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇదిలా ఉంటే పరుశురాంగౌడ్ తో లావణ్య అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ నేపథ్యంలో లావణ్య మృతి చెందడం..మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరకడం కలకలం రేగింది. పరుశురాం గౌడ్..ఇద్దరు వ్యక్తులతో కలిసి హత్య చేశారని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు.

17:45 - March 20, 2017

హైదరాబాద్‌: యూసుఫ్‌గూడలోని ఓ అపార్టుమెంట్‌ వద్ద దొరికిన డ్రైవర్ నాగరాజు డెడ్‌బాడీ కేసులో పురోగతి సాధించారు పోలీసులు.. పక్కా ప్లాన్‌ ప్రకారమే నాగరాజును అంతం చేసిన ఐఏఎస్‌ అధికారి వెంకటేశ్వర్‌రావు పుత్రరత్నం వెంకట్‌ సుకృత్‌ బయటపడకుండా జాగ్రత్త పడ్డాడు..సీసీ ఫుటేజీలు..ఇతర ఆధారాలు దొరికిన తర్వాత పోలీసులు సుకృత్‌ను అదుపులోకి తీసుకున్నారు...ఈ కేసులో కొడుకుకి సాయం చేసినందుకు వెంకటేశ్వర్‌రావును కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు....

ఆలస్యంగా వెలుగులోకి ఘటన..

17న ఐఏఎస్‌ అధికారి వెంకటేశ్వర్‌రావు వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్న నాగరాజు డ్యూటీ వెళ్లి ఇంటికి రాలేదు.. మధ్యలో భార్య ఫోన్ చేస్తే స్విచ్చాఫ్‌ రాగా..ఆ తర్వాత తానే ఫోన్ చేసి సారు వద్ద ఉన్నానని చెప్పాడు..ఆ తర్వాత తిరిగి రాలేదు...ఇదిలా ఉంటే అదే అర్ధరాత్రి నాగరాజు ఓ యువకుడితో కలసి యూసుఫ్‌గూడలోని సాయికల్యాణ్‌ అపార్ట్‌మెంట్‌ పైకి వెళ్లాడు...ఆ తర్వాత ఎవరూ చూడలేదు.. మర్నాడు ఉదయం అదే యువకుడు అపార్ట్‌మెంట్‌పైకి వెళ్లి ఓ మూటను తరలించేయత్నం చేయగా వృద్దుడు ప్రశ్నించడంతో అక్కడే వదిలేసి వెళ్లాడు...తీరా అది విప్పిచూస్తే అందులో డెడ్‌బాడీ ఉంది....

హత్యకు గురయింది డ్రైవర్ నాగరాజు..

కేసు నమోదు చేసిన పోలీసులు లోతుగా పరిశోధిస్తే వివరాలు బయటపడ్డాయి...సీసీ ఫుటేజీ పరిశీలించగా అందులో ఉన్న యువకుడు ఐఏఎస్‌ వెంకటేశ్వర్‌రావు కొడుకు వెంకట్‌ సుకృత్‌గా గుర్తించారు..నాగరాజును దారుణంగా చంపి మూటగట్టి తరలించే ప్రయత్నం చేసినట్లు తేలడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు...

ఐఏఎస్‌ కొడుకు మహిళను చిత్రహింసలు చేశాడా..?

డ్రైవర్ నాగరాజును ఎందుకు హత్య చేశాడన్నది అనుమానం...పోలీసుల దర్యాప్తు చేస్తుంటే తెలిసిన విషయాలను బట్టి చూస్తే వెంకట్‌ సుకృత్‌ తీరే బాగోలేదని తెలుస్తోంది...కొద్ది రోజులు క్రితమే వెంకట్ ఓ మహిళను తీసుకొచ్చి ఆమెని చిత్ర హింసలకు గురి చేశాడు .. అయితే సమయం లో ఆమ్మాయిని వేదిస్తున్న దృశ్యాలు ను డ్రైవర్ నాగరాజు సెల్ ఫోన్ లో చిత్రికారించాడా ? ఆ భయం తోనే నాగరాజు ను హత్యకు కారణామా ? లేక నాగరాజు భార్యపై వెంకట్ కన్నేశాడా..? ఇలా ఎన్నో అనుమానాలు కలుగుతుండడంతో అసలు కథ తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు వేగం చేశారు... ఈ హత్య కేసులో ఐఏఎస్ కుమారుడు నిందితుడుగా ఉండడంతో తప్పించే ప్రయత్నాలు చేస్తున్నారని బాధిత కుటుంబం ఆందోళన చేసింది...అయితే కేసులో అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి పూర్తి స్థాయిలో శిక్ష పడేలా వ్యవహరిస్తామని పోలీసు అధికారులు చెప్పారు...మూడు కోణాల్లో దర్యాప్తు చేయాల్సి ఉందంటున్నారు పోలీసులు...నాగరాజు , వెంకట్ సుకృత్‌ కాల్‌డేటాను పోలీసులు పరిశీలిస్తున్నారు.

Pages

Don't Miss

Subscribe to RSS - Kshanam Kshanam