Land Disputes

16:07 - July 11, 2018

నిర్భయ కేసులో ముగ్గురు నిందితులకు కోర్టు మరణ శిక్ష విధించింది. కింద కోర్టు విధించిన తీర్పును సుప్రీంకోర్టు ఖరారు చేసింది. రివ్యూ పిటిషన్ ను కొట్టివేస్తూ తుది తీర్పును వెలువరించడం పట్ల హర్షాతిరేకలు వ్యక్తమౌతున్నాయి. నిర్భయ ఘటన అనంతరం దేశ వ్యాప్తంగా తీవ్ర నిరసనలు...ఆందోళనలు మిన్నంటిన సంగతి తెలిసిందే. 2012 సంవత్సరంలో జరిగిన ఈ ఘటనపై 2018 జూలైలో సుప్రీం తీర్పును వెలువరించింది. ఈ అంశంపై న్యాయ సమస్యలు..సందేహాలను మానవి ' మై రైట్ ' కార్యక్రమంలో లాయర్ పార్వతి నివృత్తి చేశారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

14:39 - January 28, 2018

నాగర్ కర్నూలు : ఓ కుటుంబంలో చెలరేగిన భూ వివాదం ముగ్గురి ప్రాణాలు తీసింది. కుటుంబంలోని తండ్రి..ఇద్దరు సోదరులను ఓ అన్న అతి కిరాతకంగా నరికి చంపాడు. ఈ ఘోరమైన ఘటన నాగర్ కర్నూలు జిల్లా ఉప్పునుంతల మండలం మామిళ్లపల్లిలో చోటు చేసుకుంది. భాస్కరయ్య వ్యక్తికి ముగ్గురు కుమారులున్నారు. పెద్ద కొడుకు మల్లేష్..తండ్రి సోదరుల మధ్య భూ వివాదం చెలరేగుతోంది. పొలం దగ్గరకు వెళ్లిన చిన్న తమ్ముడితో మల్లేష్ వాదనకు దిగాడు. వెంటనే తెచ్చుకున్న గొడ్డలితో నరికి చంపేశాడు. వెంటనే రెండో తమ్ముడికి దగ్గరకు చేరుకుని అతడిని నరికివేశాడు. తండ్రిని కూడా ఇదే విధంగా హత్య చేసిర పరారయ్యాడు. మల్లేష్ సైకోగా వ్యవహరిస్తుంటాడని స్థానికులు పేర్కొంటున్నారు. గతంలో కూడా తల్లిపై మల్లేష్ ఘర్షణకు పాల్పడ్డాడని, దీనితో వీరందరినీ వదిలేసిన ఆ తల్లి పుట్టింట్లో ఉంటోందని స్థానికులు పేర్కొంటున్నారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. 

14:08 - January 12, 2018

జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలోని కాటారంలో దారుణం చోటుచేసుకుంది. 501 సర్వే నెంబర్‌లోని భూ తగదాలతో ఇద్దరు వీఆర్‌ఏలపై సోదరి శ్రీను అనే వ్యక్తి గొడ్డలితో దాడి చేశాడు. ఈ ఘటనలో దొడ్డు రాములు మృతి చెందగా.. బొడ్డు లక్ష్మణ్‌ పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స నిమిత్తం అతన్ని ఆస్పత్రికి తరలించారు.

 

18:18 - November 29, 2017

జనగామ : జిల్లాలోని పాలకుర్తి మండలం గూడూరులో భూ తగాదాలు భగ్గుమన్నాయి. తండ్రి వెంకటయ్య, కొడుకు రాజుపై గొడ్డళ్లతో ఆరుగురు ప్రత్యర్థులు దాడి చేశారు. రాజు అక్కడికక్కడే మృతి చెందారు. వెంకటయ్య పరిస్థితి విషమంగా ఉండటంతో వరంగల్ ఎంజిఎం ఆస్పత్రికి తరలించారు. ప్రధాన నిందితుడు కొమురయ్య సహా ఐదుగురు నిందితులు లొంగిపోయారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

09:41 - November 21, 2017

హైదరాబాద్ : రాజేంద్రనగర్‌ సర్కిల్ మైలార్‌ దేవులపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారిపై హత్యాయత్నం జరిగింది. ఆరాంఘర్‌ చౌరస్తా సమీపంలోని రియల్‌ ఎస్టేట్‌ కార్యాలయంపై దుండగులు దాడి చేశారు. యజమాని అలీతో పాటు మరో వ్యక్తిపై కత్తులతో దాడి చేసి 7 లక్షల రూపాయల నగదుతో పరారయ్యారు. గాయపడ్డవారిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే మైలార్‌ దేవులపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కింగ్స్‌ కాలనీలో జరిగిన కాల్పుల ఘటన మరవక ముందే మరో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారిపై దాడి జరగడం కలకలం రేపుతోంది. 

 

12:20 - November 11, 2017

రంగారెడ్డి : మైలార్ దేవుపల్లిలోని కింగ్స్ కాలనీలో కాల్పులు కలకలం సృష్టించాయి. హసన్ వ్యక్తిపై దుండగులు కాల్పులు జరిపారు. కాల్పులకు కారణం భూ తగదాలే కారణమని తెలుస్తోంది. హసన్ పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి తరలించారు. ఛాతి భాగంలో బుల్లెట్లు దూసుకపోవడంతో పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు పేర్కొంటున్నారు. అసలు ఎందుకు కాల్పులు జరిపారు ? అనేది తెలియరావడం లేదు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. 

Don't Miss

Subscribe to RSS - Land Disputes