launch

20:02 - December 5, 2018

ఢిల్లీ : అమెజాన్ కొనుగోలుదారులు, జియో వినియోగదారులు మరో బంపర్ ఆఫర్ పొందనున్నారు. రూ.4,999లకే కొత్త స్మార్ట్ ఫోన్ లభించనుంది. మెయ్‌జు మొబైల్ సంస్థ నూతన స్మార్ట్ ఫోన్ ను తీసుకొచ్చింది. నేడు భారత మార్కెట్లో కొత్త స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. ఆకట్టుకునే ఫీచర్లతో కేవలం రూ.4,999 ధరకే 'మెయ్‌జు సీ9' పేరిట భారత మార్కెట్లో విడుదలైంది. అమెజాన్ వెబ్ సైట్లో ప్రత్యేకంగా లభించే ఈ ఫోన్ పై అమెజాన్ కొనుగోలుదారులు, జియో వినియోగదారులు పలు బంపర్ ఆఫర్లు పొందనున్నారు. అమెజాన్ కొనుగోలుదారులకి వోచర్ల రూపంలో రూ.2,200 లభిస్తాయి. జియో కస్టమర్లు 50 జీబీ డేటాను పొందనున్నారు.
మెయ్‌జు సీ9 ప్రత్యేకతలు...

  • 5.45" హెచ్‌డీ ప్లస్ డిస్ప్లే (1400 x 720 పిక్సల్స్)
  • 2 జీబీ ర్యామ్,16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
  • ఆండ్రాయిడ్ 8.0 ఆపరేటింగ్ సిస్టం
  • 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా
  • 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
  • ఫేస్ అన్‌లాక్, క్వాడ్‌కోర్ ప్రాసెసర్
  • 3000 ఎంఏహెచ్ బ్యాటరీ

 

10:33 - November 29, 2018

నెల్లూరు : పీఎస్ఎల్వీ-సీ43 రాకెట్ ప్రయోగం విజయవంతం అయింది. పీఎస్ఎల్వీ-సీ43 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఉదయం 9.58 గంటలకు పీఎస్ఎల్వీ-సీ43 రాకెట్ ప్రయోగం జరిగింది. శ్రీహరికోట రాకెట్‌ ప్రయోగ కేంద్రం నుంచి ఉదయం 9.58 గంటలకు రాకెట్ ను ఇస్రో నింగిలోకి పంపింది. పీఎస్ఎల్వీ-సీ43 రాకెట్ 31 ఉపగ్రహాలను నింగిలోకి తీసుకెళ్లింది. ఒకేసారి 31 ఉపగ్రహాలను నింగిలోకి మోసుకెళ్లింది. భారత్ కు చెందిన హైసిస్ ను పీఎస్ఎల్ వీ-సీ43 రాకెట్ కక్ష్యలోప్రవేశపెట్టింది. భూఉపరితల పరిశీలనలో హైసిస్ కీలకంగా వ్యవహరించనుంది. అడవులు, సముద్రగర్భంలోని పరిస్థితులను హైసిస్ పరిశీలించనుంది. ప్రయోగానికి ముందుగా నిర్వహించే కౌంట్‌డౌన్‌ ప్రక్రియ నిన్న ఉదయం 5.58 గంటలకు ప్రారంభమైంది. ఇది నిరంతరాయంగా 28 గంటలపాటు కొనసాగాక రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. 
పీఎస్‌ఎల్‌వీ సి-43 ద్వారా నింగిలోకి 31 ఉపగ్రహాలు  
పీఎస్‌ఎల్‌వీ-సి43 ద్వారా మన దేశానికి చెందిన హైపవర్‌ స్పెక్ట్రల్‌ ఇమేజింగ్‌(హెచ్‌వైఎస్‌ఐఎస్‌)ఉపగ్రహంతోపాటు విదేశాలకు చెందిన 30 ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టారు. యూఎస్‌కు చెందిన 23 ఉపగ్రహాలు, ఆస్ట్రేలియా, కెనడా, కొలంబియా, ఫిన్‌లాండ్‌, మలేషియా, నెదర్లాండ్స్‌, స్పెయిన్‌ దేశాలకు చెందిన ఒక్కొక్క ఉపగ్రహంతో కలిపి 261.5 కిలోల బరువున్న 30 ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశ పెట్టనున్నారు. ఇందులో ఒక మైక్రో, 29 నానో ఉపగ్రహాలు ఉన్నాయి. ఈ ఉపగ్రహాలను వేర్వేరు కక్ష్యల్లో పీఎస్‌ఎల్‌వీ ప్రవేశ పెట్టనుంది. ఇందుకుగాను రాకెట్‌లోని నాలుగో దశను రెండుసార్లు మండించారు. మన దేశానికి చెందిన హైపవర్‌ స్పెక్ట్రల్‌ ఇమేజింగ్‌ ఉపగ్రహం(హెచ్‌వైఎస్‌ఐఎస్‌) బరువు 380 కిలోలు. ‘ఆప్టికల్‌ ఇమేజింగ్‌ డిపెక్టర్‌ ఆరె చిప్‌’ ఇందులో ఉంది. దీన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థలో ప్రధాన విభాగమైన అహ్మదాబాద్‌లోని స్పేస్‌ అప్లికేషన్‌ సెంటర్‌ వారు రూపొందించారు. ఆ తర్వాత చండీగఢ్‌లోని సెమికండక్టర్‌ ప్రయోగశాల తయారు చేశారు. 
630 కిమీ దూరం నుంచి భూమిపై రంగురంగుల చిత్రాలు.. 
630 కిలోమీటర్ల దూరం నుంచి భూమిపై రంగురంగుల చిత్రాలను తీసే అవకాశం ఉంది. ఈ ఉపగ్రహం వ్యవసాయం, అటవీ ప్రాంతాలు, తీర మండలాల అంచనా, లోతైన నీటి, మట్టి, ఇతర భూగర్భ పరిసరాలకు సంబంధించి అనేక రకాల అనువర్తనాలకు సేవలందిస్తుంది. 

09:02 - November 29, 2018

నెల్లూరు : నేడు పీఎస్ఎల్వీ-సీ43 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఉదయం 9.58 గంటలకు పీఎస్ఎల్వీ-సీ43 రాకెట్ ప్రయోగం జరుగనుంది. శ్రీహరికోట రాకెట్‌ ప్రయోగ కేంద్రం నుంచి గురువారం ఉదయం 9.58 గంటలకు రాకెట్ ను నింగిలోకి పంపేందుకు ఇస్రో ఏర్పాట్లు చేసింది. పీఎస్ఎల్వీ-సీ43 రాకెట్ 31 ఉపగ్రహాలను నింగిలోకి తీసుకెళ్లనుంది. ప్రయోగానికి ముందుగా నిర్వహించే కౌంట్‌డౌన్‌ ప్రక్రియ నిన్న ఉదయం 5.58 గంటలకు ప్రారంభమైంది. ఇది నిరంతరాయంగా 28 గంటలపాటు కొనసాగాక రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. 
పీఎస్‌ఎల్‌వీ సి-43 ద్వారా నింగిలోకి 31 ఉపగ్రహాలు  
పీఎస్‌ఎల్‌వీ-సి43 ద్వారా మన దేశానికి చెందిన హైపవర్‌ స్పెక్ట్రల్‌ ఇమేజింగ్‌(హెచ్‌వైఎస్‌ఐఎస్‌)ఉపగ్రహంతోపాటు విదేశాలకు చెందిన 30 ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. యూఎస్‌కు చెందిన 23 ఉపగ్రహాలు, ఆస్ట్రేలియా, కెనడా, కొలంబియా, ఫిన్‌లాండ్‌, మలేషియా, నెదర్లాండ్స్‌, స్పెయిన్‌ దేశాలకు చెందిన ఒక్కొక్క ఉపగ్రహంతో కలిపి 261.5 కిలోల బరువున్న 30 ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశ పెట్టనున్నారు. ఇందులో ఒక మైక్రో, 29 నానో ఉపగ్రహాలు ఉన్నాయి. ఈ ఉపగ్రహాలను వేర్వేరు కక్ష్యల్లో పీఎస్‌ఎల్‌వీ ప్రవేశ పెట్టనుంది. ఇందుకుగాను రాకెట్‌లోని నాలుగో దశను రెండుసార్లు మండించనున్నారు. మన దేశానికి చెందిన హైపవర్‌ స్పెక్ట్రల్‌ ఇమేజింగ్‌ ఉపగ్రహం(హెచ్‌వైఎస్‌ఐఎస్‌) బరువు 380 కిలోలు. ‘ఆప్టికల్‌ ఇమేజింగ్‌ డిపెక్టర్‌ ఆరె చిప్‌’ ఇందులో ఉంది. దీన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థలో ప్రధాన విభాగమైన అహ్మదాబాద్‌లోని స్పేస్‌ అప్లికేషన్‌ సెంటర్‌ వారు రూపొందించారు. ఆ తర్వాత చండీగఢ్‌లోని సెమికండక్టర్‌ ప్రయోగశాల వారు తయారు చేశారు. 630 కిలోమీటర్ల దూరం నుంచి భూమిపై రంగురంగుల చిత్రాలను తీసే అవకాశం ఉంది. ఈ ఉపగ్రహం వ్యవసాయం, అటవీ ప్రాంతాలు, తీర మండలాల అంచనా, లోతైన నీటి, మట్టి, ఇతర భూగర్భ పరిసరాలకు సంబంధించి అనేక రకాల అనువర్తనాలకు సేవలందిస్తుంది. 

 

17:07 - November 26, 2018

గుంటూరు : తెలుగుజాతి ప్రయోజనాల కోసం శతృవుతో చేతులు కలిపానని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశంలో అన్ని వ్యవస్థల్ని దెబ్బతీసిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విమర్శించారు.  ఈడీ, ఐటీ, సీబీఐ వంటి సంస్థల్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర సంబంధాలను మోదీ పూర్తిగా దెబ్బతీశారని.. రాష్ట్రం కోసం పోరాడుతున్న వారిపై కేంద్రం ఐటీ, ఈడీ దాడులు చేయిస్తున్నారని విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ నమ్మించి మోసం చేసిందని.. రాష్ట్రానికి అన్యాయం చేస్తుంటే చూస్తూ ఊరుకోబోమని చంద్రబాబు హెచ్చరించారు. దేశాన్ని కాపాడుకునేందుకు అన్ని పార్టీలను కలిపేందుకు ప్రయత్నం జరుగుతోందని.. తెలుగుజాతి ప్రయోజనాల కోసం శత్రవుతో చేతులు కలిపానన్నారు. కాగా గోదావరి-పెన్నా నదుల అనుసంధానానికి శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతు..చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేసారు. 

కాగా ఆనాటి కాంగ్రెస్ పార్టీపై వున్న ఆగ్రహంతోను..తెలుగువారి ఆత్మగౌరవం కోసం దివంగత నేత ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఈనాటి రాజకీయ పరిస్థితుల రీత్యా ఇటు తెలంగాణలోను..అటు కేంద్రంలో కాంగ్రెస్ తో పాటు పలు పార్టీలను కూడగట్టి థర్డ్ ఫ్రంట్ కు యత్నిస్తున్న విషయం తెలిసిందే. ఎన్డీయే ప్రభుత్వం ఏపీకి విభజన హామీలు నెరవేర్చకుండా చేస్తున్న నేపథ్యంలో పలు రాజకీయ పరిణామాల మధ్య చంద్రబాబు జాతీయ నేతలను కూడగట్టి మూడవ ఫ్రంట్ కు అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. కాగా కాంగ్రెస్ తో పొత్తుల నేపథ్యంలో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు కాంగ్రెస్, టీడీపీ పొత్తు అనైతికమనీ.. టీడీపీ ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్ కాళ్లపై చంద్రబాబు పడవేసారని విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే.  ఈ అంశాలను దృష్టిలో పెట్టుకునే సీఎం చంద్రబాబు ఈ వ్యాఖ్యలు  చేసినట్లుగా భావించవచ్చు.

13:49 - November 20, 2018

అమరావతి : అన్నింటికీ ఒక్కటే ఆధారం అదే ‘ఆధార్’ కార్డ్. ఏ పథకమైన ఆధారే ఆధారం. అది లేకుంటే ఏదీ లేదు ఆధారం అన్నట్లుగా వుంది. అన్నింటికి ఆధార్ ను అనుసంధానం చేస్తు దేశ, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న విధానాలతో ఆధార్ కార్డు అందరికీ ఆధారం అయిపోయింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా భూసేవ కార్యకలాపాలను అమరావతిలో భూధార్ వెబ్ సైట్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, భూ లావాదేవీల్లో మోసాలను అరికట్టడానికి భూధార్ ను అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. ఇప్పటికే ఈ కార్యక్రమాన్ని కృష్ణా జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేశామని, మంచి ఫలితాలు వచ్చాయని తెలిపారు. ఇకపై వేలిముద్రల ఆధారంగానే భూముల అమ్మకాలు, కొనుగోళ్లు ఉంటాయని చెప్పారు.

ఆధార్ మాదిరే భూధార్ లో భూములకు సంబంధించిన అన్ని వివరాలు ఉంటాయని చంద్రబాబు తెలిపారు. భార్య పేరిట ఉన్న భూమిని భర్త మోసం చేయడం కూడా ఇకపై కుదరదని చెప్పారు. ఒక వ్యక్తికి ఉన్న వేలిముద్రలు, కనురెప్పలు మరొకరికి ఉండవని... అందువల్ల మోసం చేయలేరని అన్నారు. ప్రతి భూమికి ఒక క్యూఆర్ కోడ్ ఉంటుందని తెలిపారు. భూధార్ తో రెవెన్యూ శాఖకు మంచి పేరు రాబోతోందని చెప్పారు. చుక్కల భూములపై 8వేల కేసులు ఉన్నాయని... నెలరోజుల్లో ఈ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని చెప్పారు. అవినీతి రహిత పాలనను అందించడమే టీడీపీ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. భూధార్ తీసుకురావడం ఒక చరిత్ర అని అన్నారు.

18:25 - October 9, 2018

ముంబయి:  గత కొద్ది ఏళ్లగా వినియోగదారులకు దూరమైన హ్యుండయ్ శాంట్రో మోడల్ కారు..మళ్లీ త్వరలో మార్కెట్‌లోకి రాబోతోంది.  కొత్తగా రాబోయే శాంట్రో హ్యుండయ్ ఇయాన్, హ్యుండయ్ గ్రాండ్ ఐ10 మధ్య మోడల్‌గా విడుదల చేసేందుకు హ్యుండయ్ సన్నాహాలు చేస్తోంది. గతంలో తమ మొదటి కారుగా కొనుక్కున్న శాంట్రో వినియోగదారులు.. కొత్త మోడల్ కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు.
గతంలో మార్కెట్‌లో రిలీజ్ అయిన శాంట్రో మోడల్ కంటే రాబోయే మోడల్ కొన్ని మార్పులు, చేర్పులతో విడుదల చేస్తున్నారు. ఎక్సటీరియర్, ఇంటీరియర్ లుక్స్‌లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. అలాగే సరికొత్త ఫీచర్లతో శాంట్రో వస్తోంది. ప్రధానంగా కొత్త ఇంజన్, పెట్రోల్, డీజిల్ మోడళ్లతో పాటు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ మరికొన్ని ఫీచర్లు ఉండబోతున్నాయి.  దీని ధర రూ 46 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది. ఈ కారు ఈ నెల 23న విడుదల చేస్తున్నట్టు హ్యుండయ్ కంపెనీ వెల్లడించింది. 

 

14:10 - September 22, 2018

తిరుపతి : నవ్యాంధ్రను హరితాంధ్రగా మార్చాల్సిన బాధ్యత అందరిపై ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. తిరుపతిలో నగరవనాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన ప్రసంగించారు. తిరుపతి మంచి నగరమని కొనియాడారు. తిరుపతి నగరాన్ని మొత్తం పచ్చని నగరంగా మార్చాలన్నారు. ప్రతీ ఒక్కరు ఒక్క మొక్కనైనా నాటాలని పిలుపునిచ్చారు. తిరుపతిని నెంబర్ వన్ స్మార్ట్ సిటీగా తయారు చేసేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. తిరుపతిని అభివృద్ధి చేసిన ఘనత టీడీపీదేనని చెప్పారు. పేదల సొంతింటి కల నెరవేరుస్తామన్నారు. కాంగ్రెస్ హయాంలో రాజీవ్‌గృహ కల్పను దయ్యాల కొంపగా తయారు చేశారని విమర్శించారు.

 

09:03 - September 9, 2018

నల్గొండ : నాగార్జున సాగర్ ను చూసేందుకు వెళ్తున్నారా ? అయితే మీరు కొత్త అనుభూతిని పొందుతారు. నాగార్జున సాగర్ కు వెళ్లే పర్యాటకులు కొత్త అనుభూతి పొందేలా...తెలంగాణ పర్యాటక శాఖ లాంచీ ప్రయాణాన్ని ప్రారంభించింది. ప్రతి ఒక్కరి జీవితంలో మధురానుభూతి కలిగించేలా ఈ లాంచీ ప్రయాణం ఉండనుంది. పర్యాటకానికి తోడు శ్రీశైలం మల్లికార్జునుడిని దర్శించుకునేలా ప్రత్యేక ప్యాకేజీని రూపొందించింది.

నాగార్జున సాగర్ పర్యాటకులు కొత్త అనుభూతి ఆస్వాదించేలా తెలంగాణ పర్యాటక శాఖ లాంచీ ప్రయాణానికి శ్రీకారం చుట్టింది. నాగార్జున సాగర్ నుంచి అధ్యాత్మిక కేంద్రమైన శ్రీశైలంకు లాంచీని ప్రారంభించింది. రెండు తెలుగు రాష్ట్రాలు, ఐదు జిల్లాల మీదుగా 110 కిలోమీటర్ల పాటు లాంచీ ప్రయాణం సాగనుంది. నల్లమల కొండల మధ్య సాగే లాంచీ ప్రయాణం....పర్యాటకులకు కొత్త అనుభూతి కలగనుంది. 

నాగార్జున సాగర్ ప్రాజెక్టు....నల్లమల జలాశయం అటవీ ప్రాంతం మధ్యలో విస్తరించి ఉంది. ప్రాజెక్ట్ నీటి మట్టం 570 అడుగులు దాటితేనే....శ్రీశైలంకు లాంచీ ప్రయాణానికి అణువుగా ఉంటుందన్న లక్ష్యంతో ముందు ట్రయల్ రన్ నిర్వహించారు. ఆ తర్వాత పర్యాటకుల డిమాండ్ దృష్టిలో పెట్టుకొని మూడు ప్యాకేజీలను నిర్ణయించారు. ప్రస్తుతం ప్రాజెక్ట్  నీటి మట్టం 585 అడుగుల మార్కు దాటడంతో...ట్రయల్ రన్ లేకుండానే తెలంగాణ పర్యాటక శాఖ యాత్రకు శ్రీకారం చుట్టింది. కృష్ణా నదిలో ఆరు గంటల పాటు సాగే యాత్రలో...అలలతో పోటీ పడుతూ లాంచీ యాత్ర సాగుతుంది. లాంచీయాత్ర మొత్తం నల్లమల అటవీ ప్రాంతంలోనే సాగడంతో...పర్యాటకులు ప్రకృతి అందాలను తిలకించేలా తెలంగాణ పర్యాటక శాఖ ఏర్పాట్లు చేసింది. 

19:15 - May 14, 2018

పశ్చిమగోదావరి : ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్రలో మరో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నియోజకవర్గంలోని వెంకటాపురం వద్ద జగన్‌ పాదయాత్ర 2 వేల కిలోమీటర్ల మైలురాయిని దాటింది. ఈ సందర్భంగా వెంకటాపురంలో 40 అడుగుల పైలాన్‌ జగన్‌ ఆవిష్కరించి... గుర్తుగా ఒక మొక్కను నాటారు. కాసేపట్లో ఏలూరుకు చేరుకోనున్న జగన్‌.. బహిరంగ సభలో పాల్గొననున్నారు. జగన్‌ పాదయాత్ర 2 వేల కిలోమీటర్ల సందర్భంగా భారీ ఎత్తున నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు. 

16:47 - May 14, 2018

పశ్చిమగోదావరి : వైసీపీ అధ్యక్షుడు జగన్‌ చేపట్టిన పాదయాత్ర పశ్చిమగోదావరి జిల్లాలో కొనసాగుతోంది. ఏలూరు రూరల్‌ మండలం మాదేవల్లి వద్ద 2 వేల కి.మీ. మైలురాయిని చేరుకుటుంది. మాదేపల్లి వద్ద వైసీపీ నాయకులు ఏర్పాటు చేసని 40 అడుగుల స్థూపాన్ని జగన్‌ ఆవిష్కరిస్తారు. దీనిపై మరింత సమాచారం కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

Pages

Don't Miss

Subscribe to RSS - launch