laxmi parvathi

13:38 - November 3, 2018

హైదరాబాద్ : టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీని కలవడంపై రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఈ భేటీపై పలు పార్టీల నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఆనాడు కాంగ్రెస్ ను విమర్శించిన బాబు నేడు కలవడం వెనుక ఆంతర్యం ఏంటని ప్రశ్నిస్తున్నారు. దీనిపై వైసీపీ నేత లక్ష్మీపార్వతి స్పందించారు. శనివారం ఏకంగా ఎన్టీఆర్ ఘాట్ కు వచ్చి మౌనదీక్ష చేపట్టారు. 
తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పుట్టిందని, కానీ బాబు సొంత ప్రయోజనాల కోసం తాకట్టు పెడుతున్నారని విమర్శించారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు తనకు తీవ్ర ఆవేదన కలిగిస్తున్నాయని, నాలుగేళ్లపాటు బీజేపీ ప్రభుత్వంతో అంటకాగి, ఎన్నికల ముందు కాంగ్రెస్ తో జతకట్టడం ప్రజలను మోసం చేయడమేనన్నారు. కేవలం అవినీతిని కప్పిపుచ్చుకొనేందుకే ఆయన కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటున్నారని, దీనిపై న్యాయపోరాటం చేసే అవకాశాలుంటే పరిశీలిస్తానన్నారు. 

09:15 - May 28, 2018

హైదరాబాద్ : ఎన్టీఆర్ జీవితంలో జరిగిన కుట్రలను సీరియల్స్ వెల్లడిస్తానని లక్ష్మీ పార్వతి వెల్లడించారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆమె ఎన్టీఆర్ ఘాట్ కు విచ్చేసి ఎన్టీఆర్ సమాధికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ...గతంలో ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ మార్గం ఎంతో కళకళలాడుతూ ఉండేదని, ప్రస్తుతం ఈ రోడ్డు అంతా బోసి పోయిందన్నారు. బ్యానర్స్..ఘనంగా స్వాగతం పలికే విధంగా చేయాల్సిన ఏర్పాట్లు టిడిపి ప్రభుత్వం చేయడం లేదని విమర్శించారు. ఎన్టీఆర్ ను టిడిపి ప్రభుత్వం తక్కువగా చూపిస్తోందని, భారతరత్న రాకుండా అడ్డుకొంటోంది బాబేనని కుండబద్ధలు కొట్టారు. 

08:39 - March 23, 2018

పార్లమెంట్ లో టీడీపీ, వైసీపీ అవిశ్వాస తీర్మానంపై వక్తలు భిన్నవాదనలు వినిపించారు.  పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానంపై అనే అంశంపై నిర్వహించిన న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమంలో వైసీపీ నాయకురాలు నందమూరి లక్ష్మీపార్వతి, బీజేపీ నేత విష్ణుశ్రీ, టీడీపీ నేత సూర్యప్రకాశ్ పాల్గొని, మాట్లాడారు. కేంద్రం... రాష్ట్రానికి అన్యాయం చేస్తుందన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

15:29 - November 14, 2017

హైదరాబాద్ : తన అనుమతి లేకుండా సినిమా తీస్తున్నారంటూ లక్ష్మీస్‌ వీరగ్రంథం నిర్మాతపై లక్ష్మి పార్వతి మండిపడ్డారు. తన పేరు పక్కన తనకు సంబంధం లేని వ్యక్తి పేరు పెట్టి సినిమా తీయడం, ఎన్టీఆర్‌ను అవమానించడమేనని లక్ష్మిపార్వతి అన్నారు. సినిమా నిర్మాతపై న్యాయ పోరాటం చేస్తామని పేర్కొన్నారు. ఎన్టీఆర్ సమాధి వద్ద షూటింగ్ చేయడంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాధిపై పాలు పోసి శుద్ధి చేశారు. ఈ సందర్భంగా లక్ష్మీ పార్వతితో టెన్ టివి ముచ్చటించింది. నిర్మాతపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ మాట్లాడారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

21:39 - February 23, 2017

టీటీడీ నిధులు దారి మళ్లుతున్నాయని వక్తలు తెలిపారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో టీడీపీ నేత విజయ్ కుమార్, లక్ష్మీపార్వతి, సీపీఎం నేత మురళి పాల్గొని, మాట్లాడారు. వారు తెలిపిన మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

21:35 - February 23, 2017

చిత్తూరు : టీటీడీ నిధులపై ప్రభుత్వం కన్నుపడింది. హిందూ ధర్మ ప్రచారం పేరిట ఓ ట్రస్ట్‌కు ఏటా అప్పనంగా కోట్ల రూపాయలు కట్టబెట్టేందుకు రంగం సిద్ధమైంది. ఇందుకోసం జీవో కూడా జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయంపై టీటీడీ ఉద్యోగులు, భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీవారి నిధులను అక్రమంగా దారి మళ్లిస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు. 
టీటీడీ నిధులు బొక్కేసేందుకు మరో కుట్ర 
టీటీడీ నిధులు అప్పనంగా బొక్కేసేందుకు మరో కుట్ర జరుగుతోంది. హిందూ ధర్మ ప్రచారం పేరుతో ఓ ప్రైవేట్‌ సంస్థకు ఏటా కోట్లాది నిధులను మంజూరు చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఇందుకోసం  ఈనెల 8న జీవో 65 జారీ చేసింది. 
ప్రభుత్వ నిర్ణయం పట్ల వ్యతిరేకత
హిందూ ధర్మ ప్రచారం ట్రస్ట్‌కు టీటీడీ నుంచి ప్రతి నెల 50 లక్షలు, దేవాదాయ శాఖ నుంచి మరో 50 లక్షలు చెల్లించాలంటూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నిర్ణయాన్ని ప్రజాసంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఇప్పటికే టీటీడీ.. దానికి అనుబంధంగా ఉన్న హిందూ ధర్మ ప్రచార పరిషత్‌కు కోట్లాది రూపాయలు వెచ్చిస్తుందంటున్నారు. ఇప్పుడు అదికాకుండా.. హిందూ ధర్మ పరిరక్షణ పేరిట ట్రస్ట్‌ ఏర్పాటు చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. 
ప్రభుత్వం ఆఘమేఘాల మీద నిర్ణయం 
టీటీడీ మాజీ ఈవోగా పని చేసిన పీవీ ఆర్కే ప్రసాద్‌.. హిందూ ధర్మ ప్రచారం పేరిట వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు.. ఇందుకు నిధులు మంజూరు చేయాలని గతేడాదిలో ప్రభుత్వాన్ని కోరగా.. ప్రభుత్వం ఆఘమేఘాల మీద ఈ నిర్ణయం తీసుకుంది. ప్రతి నెల దేవాదాయశాఖ 50 లక్షలు,.. టీటీడీ 50 లక్షల రూపాయలు ఇవ్వాలని జీవోలో స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతి నెలా 5వ తేదీలోగా నిధులు విడుదల చేయాలని ప్రత్యేకంగా  పేర్కొనడం గమనార్హం. అయితే.. ఇప్పుడు ఆ నిర్ణయం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. టీటీడీలో పని చేస్తున్న కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందికి కనీస వేతనాలు, ఇతర సదుపాయాల కోసం ఎంతోకాలంగా ఆందోళనలు కొనసాగుతున్నా పట్టించుకోని ప్రభుత్వం.. ఓ ట్రస్ట్‌కు కోట్ల రూపాయలు అప్పనంగా మంజూరు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. 
శ్రీవారి భక్తులు, టీటీడీ ఉద్యోగులు ఆందోళన బాట
ప్రభుత్వ నిర్ణయంపై శ్రీవారి భక్తులు, టీటీడీ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. ధర్మ ప్రచారం ముసుగులో శ్రీవారి సొమ్ము స్వాహా చేస్తున్నారని మండిపడుతున్నారు. తాము సమర్పించే కానుకలకు జవాబుదారీ ఎవరు ? అని ప్రశ్నిస్తున్నారు. భవిష్యత్‌లో కూడా ఎవరో ప్రైవేట్‌ వ్యక్తులు, సంస్థలు హిందూ ధర్మ ప్రచారం పేరిట సంస్థలు పెడితే ఇలానే కోట్లాది రూపాయలు కట్టబెడతారా ? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం శ్రీవారి నిధులను ఇష్టమొచ్చిన వారికి అప్పనంగా కట్టబెడితే.. భవిష్యత్‌లో తమకు, భక్తులకు అన్యాయం జరిగే అవకాశముందని టీడీపీ ఉద్యోగులంటున్నారు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు ఆందోళన చేపడతామని వారు హెచ్చరిస్తున్నారు.

 

12:06 - February 9, 2017

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసలు విలన్ అని లక్ష్మీ పార్వతి పేర్కొన్నారు. ఎన్టీఆర్ జీవిత కథను తెరకెక్కిస్తానని, ఇందులో హీరోగా తానే నటిస్తానని సినీ నటుడు, టిడిపి ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రకటించడం వివాదాలకు కారణమైంది. ఇందులో అసలు విలన్ లక్ష్మీ పార్వతి అంటూ టిడిపి నేతలు చేసిన ప్రకటనలకు వివాదాలకు మరింత ఆజ్యం పోసినట్లైంది. ఈ నేపథ్యంలో లక్ష్మీ పార్వతితో టెన్ టివి ముచ్చటించింది. ఈ సందర్భంగా తన జీవిత విశేషాలు..ఎన్టీఆర్ గత చరిత్ర తెలియచేశారు. బాలకృష్ణ తీయబోయే సినిమాలో నిజాలు ఉండాలని కుండబద్ధలు కొట్టారు. వివాదాల జోలికి వెళ్లకుండా సినీ నటుడు ఎలా ఎదిగాడు..సీఎం పీఠం ఎలా అధిరోహించాడు..? ఎలా కష్టపడ్డారో చూపించాలని సూచించారు. అలా కాకుండా ఉంటే మాత్రం తాను మాత్రం కోర్టుకు వెళుతానని స్పష్టం చేశారు. ఇదంతా తన వ్యక్తిగత వ్యవహారమని, వైసీపీ సహాయం తీసుకోనని తేల్చి చెప్పారు. బాలయ్య ప్రకటన తరువాత టిడిపి నేతల వ్యాఖ్యల నేపథ్యంలో బాలకృష్ణ వివాదాల జోలికి వెళుతారా ? లేదా ? అనేది చూడాలి.

20:34 - February 8, 2017

ఎన్టీఆర్ జీవిత చరిత్రపై బాలయ్య బయోపిక్ సందర్భంగా లక్ష్మీ పార్వతితో 10 టివి స్పెషల్ ఇంటర్వ్యూ నిర్వహించింది. వివాదాంశాల జోలికి బాలయ్య వెళ్తాడకోను.. వెళ్తే ఖచ్చితంగా ఆధారాలతో న్యాయ పోరాటం చేస్తానని అన్నారు. సినిమాలో తనను విలన్ చేయాలని టీడీపీ నేతలు చూస్తున్నారని.. అసలు విలన్ చంద్రబాబు నాయుడు అని స్పష్టం చేశారు. మరిన్ని వివరాలను ఆమె మాటల్లోనే..
'ఎన్ టీఆర్ మహానుభావుడు.. ఆయన చరిత్రను పూర్తిగా చెబితేనే న్యాయం. చంద్రబాబు వెన్నుపోటే ఎన్టీఆర్ ను బాగా బాధ పెట్టిన ఘటన. ఆ విషయాన్ని సినిమాలో ప్రస్తావించకపోతే అర్థమే లేదు. నన్ను విలన్ గా ప్రస్తావిస్తారన్న అనుమానం ఉంది. టీడీపీ నేతల వ్యాఖ్యలే అందుకు నిదర్శనం. ఏపీలో పాలన కుంటుపడింది. ప్రజలను ఏమార్చడానికే బాబు డైరెక్షన్ లో బాలయ్య ఎత్తుగడ ఇది. ఎన్టీఆర్ కు సంబంధించిన ఎవ్వరికి తెలియని ఎన్నో విషయాలు నాకు తెలుసు. బయోగ్రఫీ సందర్భంగా ఎన్నో అనుభవాలను ఆయన పంచుకున్నారు. నేనే బయోగ్రఫీని సినిమాగా తీద్దాం అనుకున్నాను. చంద్రబాబే జామతా దశమ గ్రహమంటూ ఎన్టీఆరే అన్నారు. ఇప్పటికే ఆ వీడియో క్లిప్పులే సజీవ సాక్ష్యాలు. చంద్రబాబును హీరోగా చూపిస్తే ఒప్పుకోను ఖచ్చితంగా నా ప్రస్తావన కూడా ఉండాలి. ఎన్టీఆర్ పార్టీ పెట్టి సీఎం ఎలా అయ్యారో చూపిస్తే అభ్యంతరం లేదు. నా బయోగ్రఫీ పుస్తకాలను ఇప్పటికే బాలయ్యకు ఇచ్చాను. నేనంటే బాలయ్యకు అభిమానమే. హరికృష్ణ, దగ్గుబాటి ఇలా ఎందరో బాబు బాధితులు. నేను పవర్ సెంటర్ పాలిటిక్స్ నడపలేదు. పవర్ సెంటర్ పాలిటిక్స్ అంటే ఇప్పుడు లోకేష్ నడుపుతున్నది. నన్ను తెలుగు తల్లి అన్న సోమిరెడ్డి ఇప్పుడు విలన్ అంటున్నాడు. ఎన్టీఆర్ వివాహమాడిన వెంటనే నెల్లూరులో సోమిరెడ్డి. వేలాది మంది మహిళలతో నాకు సన్మానం చేశాడు. అధికారికంగా ఇప్పుడు నేనే ఎన్టీఆర్ భార్యను లక్ష్మీపార్వతిని తక్కువగా అంచనా వేయొద్దు. ఎన్టీఆర్ జీవితం తెరిచిన పుస్తకం. అనారోగ్యంపాలై ఎన్టీఆర్ ఇంట్లో ఉంటే కొడుకులు పట్టించుకోలేదు. ఒకానొక సందర్భంలో బాలయ్యపై ఎన్టీఆర్ ఫైర్ అయ్యారు. బాబుతో కుటుంబ చేతులు కలపడాన్ని జీర్ణించుకోలేకపోయారు. అనారోగ్యంతో ఉంటే పట్టించుకోలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ కు కష్టకాలంలో అన్ని తానైయ్యాను. బాలకృష్ణ బయోపిక్ పై ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతి ఫైర్. చరిత్రను వక్రీకరించారో కోర్టు మెట్లు ఎక్కిస్తా'. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

18:29 - January 26, 2017

హైదరాబాద్: ఏపీ కి ప్రత్యేక హోదా కోసం రాష్ట్రంలో యువత ముందుకు వచ్చి విశాఖ ఆర్కే బీచ్ లో శాంతియుతంగా ఆందోళన చేపట్టేందుకు పిలుపునిచ్చింది. దీనికి జనసేన, వామపక్షాలు, వైసీపీ పార్టీ లు మద్దతు ప్రకటించాయి. దీంతో ప్రభుత్వం ఎక్కడికక్కడ నేతలను అరెస్ట్ చేసి, విశాఖ లో ఎమర్జెన్సీని తలపించేవిధంగా పోలీసులను మోహరించారు. ఇది ఎంత వరకు కరెక్టు. ఇదే అంశంపై 'టెన్ టివి'లో ప్రత్యేక చర్చను చేపట్టింది. ఈ చర్చలో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి, వైసీపీ నేత లక్ష్మీపార్వతి, టిడిపి నేత మాల్యాద్రి పాల్గొన్నారు. వారు ఏఏ అంశాలపై చర్చించారో చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

07:47 - June 25, 2016

యురోపియన్ యూనియన్ నుండి బ్రిటన్ ప్రజలు చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. 43 ఏళ్లుగా యూరోపియన్‌ యూనియన్‌లో కొనసాగుతున్న బ్రిటన్‌ ఆ కూటమి నుంచి విడిపోయేందుకే మొగ్గు చూపారు. గురువారం నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో బ్రెగ్జిట్‌కు అనుకూలంగా 52 శాతం మంది, వ్యతిరేకంగా 48 శాతం ప్రజలు మద్దతు ప్రకటించారు. దీంతో ఈయే నుంచి బ్రిటన్‌ వేరుపడటం ఖాయమైంది. ప్రపంచ దేశాలపై ఈ ప్రభావం తీవ్రంగా పడనుంది. ఈ నేపథ్యంలో భారతదేశంలోని ఎటువంటి ప్రభావం చూపడనుంది అనే అంశంపై టెన్ టీవీ న్యూస్ మార్నింగ్ లో చర్చనుచేపట్టింది. ఈ చర్చలో లక్ష్మీపార్వతి (వైసీపీ జన్ రల్ సెక్రటరీ),కుమార్(బీజేపీ నేత),ఆనంద్ బాబు (టీడీపీ ఎమ్మెల్యే), పాల్గొన్నారు. .....మరి వక్తలు ఎటువంటి అభిప్రాయాలను వెల్లడించారో తెలుసుకోవాటంలే ఈ వీడియోను క్లిక్ చేయండి...మరింత సమాచారం తెలుసుకోండి....

Don't Miss

Subscribe to RSS - laxmi parvathi