leaders

17:19 - October 11, 2018

హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ ముందస్తు ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తోంది. సభలు, సమావేశాలతో ముందుకెళ్తోంది. టీఆర్ఎస్‌ను ఓడించి రాష్ట్రంలో అధికారంలోకి రావాలని ఉవ్విళ్లూరుతోంది. టీడీపీ, సీపీఐ, జన సమితి పార్టీలతో కలిసి మహాకూటమి ఏర్పాటు చేసింది. టీఆర్ఎస్‌ను గద్దె దించాలనే తలంపుతో జట్టు కట్టింది. అయితే ఈ క్రమంలో కాంగ్రెస్‌కు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. పార్టీలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. ఆ పార్టీకి నేతలు రాజీనామాలు చేస్తున్నారు. టికెట్ దక్కని నేతలు రాజీనామా బాట పడుతున్నారు. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో టికెట్ రాని వారు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. ఇటీవలే మాజీ మంత్రి దానం నాగేందర్, మాజీ స్పీకర్ సురేష్ రెడ్డిలు కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత దామోదర రాజనర్సింహ సతీమణి పద్మినీరెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. నేతలు వరుసగా పార్టీని వీడడంతో కాంగ్రెస్ కష్టాల సుడిగుండంలో పడింది.Image result for పద్మినీరెడ్డి
పద్మినీరెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీ పార్టీలో చేరారు. గత కొంత కాలంగా సామాజిక, సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నపద్మినీరెడ్డి బీజేపీ కండువా కప్పుకున్నారు. మురళీధర్ రావు సమక్షంలో ఆమె బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. పద్మినీరెడ్డి చేరికను స్వాగతిస్తున్నామని, ఆమె సేవలను వినియోగించుకుంటామని మురళీధర్ రావు తెలిపారు. సంగారెడ్డి నుండి పోటీ చేయాలని పద్మినీ రెడ్డి భావిస్తున్నట్లు సమాచారం. గతంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆమెకు సంగారెడ్డి శాసనసభ టికెట్ కోసం దామోదర రాజనర్సింహ తీవ్రంగా ప్రయత్నించారు. కుటుంబానికి ఒకటే టికెట్ నిర్ణయం కారణంతో ఆమెకు టికెట్ ఇవ్వలేమని కాంగ్రెస్ అధిష్టానం తేల్చి చెప్పడంతో పోటీ యోచనను ఆయన విరమించుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం దామోదర రాజనర్సింహను మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్‌గా నియమించింది. సతీమణి పద్మినీరెడ్డిని సంగారెడ్డి నుండి బరిలోకి దింపాలని దామోదర యోచించినట్లు తెలుస్తోంది. అయితే సతీమణి బీజేపీలో చేరడంతో దామోదర కూడా బీజేపీలో చేరుతారా అనే చర్చ జరుగుతోంది.

Related imageకాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి దానం నాగేందర్ పార్టీకి రాజీనామా చేశారు. సిటీ కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు దానం నాగేందర్‌ టీఆర్ఎస్‌లో చేరారు. గ్రేటర్ హైదరాబాద్‌లో మంచి పట్టున్నవ్యక్తి దానం నాగేందర్ అని చెప్పవచ్చు. ఆత్మాభిమానం దెబ్బతిన్నందుకే పార్టీకి రాజీనామా చేశానని దానం నాగేందర్‌ అన్నారు. తనకు పార్టీలో ప్రాధాన్యత తగ్గడం... తనను నమ్ముకున్న కార్యకర్తలకు న్యాయం చేసేందుకే పార్టీ మారుతున్నట్లు స్పష్టం చేశారు. ఎన్నో ఏళ్లుగా పార్టీని నమ్ముకుని జెండా మోస్తున్న వారికి సరైన ప్రాధాన్యం దక్కడం లేదని.. ఓ వర్గం పార్టీని బ్రష్టు పట్టిస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 30 ఏళ్లుగా కాంగ్రెస్‌ పార్టీకి ఎంతో సేవ చేశానని.. కానీ రానురాను బీసీలకు అన్యాయం జరుగుతోందని.... ఒకే వర్గానికి చెందిన వారు పార్టీని ఏలుతున్నారని ఆరోపించారు.అందుకే ఆత్మగౌరవం లేని చోట ఉండటం సరికాదని రాజీనామా చేసినట్లు తెలిపారు. Image result for ex-speaker suresh reddy

కాంగ్రెస్ సీనియర్ నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి గత నెల 12న టీఆర్ఎస్ లో చేరారు. కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. గౌరవం లేని చోట ఉండడం ఇష్టం లేకే పార్టీ మారాల్సి వచ్చిందని సురేశ్‌రెడ్డి తెలిపారు. పార్టీ మారే వారి కోసం టికెట్‌ కేటాయించడంతో బాల్కొండ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచే అవకాశాలు పూర్తిగా మూసుకుపోవడం వల్లే తాను కాంగ్రెస్‌ నుంచి తప్పుకోవలసి వచ్చిందన్నారు. ఏ పరిస్థితుల్లో కాంగ్రెస్‌ పార్టీని వీడాల్సి వచ్చిందో సురేశ్‌రెడ్డి తన అనుచరులకు వివరించారు. 2009 నుంచి పార్టీలో చోటు చేసుకున్న పరిణామాలను ప్రస్తావించారు. తొందరపడి పార్టీ మారాలనే నిర్ణయం తీసుకోలేదన్నారు. ఎన్నికల నేపథ్యంలో సీనియర్ నేతలు పార్టీని వీడడం కాంగ్రెస్‌కు నష్టమే అని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు  ఏవిధంగా ముందుకెళ్తారో చూడాలి మరి.

-చింత భీమ్‌రాజ్

09:23 - October 5, 2018

హైదరాబాద్ : తెలంగాణలో ఎన్నికల వేడి ప్రారంభంలోనే తారస్థాయికి చేరుకుంటోంది. అగ్రనేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరిపై మరొకరు తీవ్రవిమర్శలు చేసుకుంటున్నారు. ఆరోపణలు, ప్రత్యారోపణలకు దిగుతున్నారు. అధికార పార్టీ నేతలపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. ప్రతిపక్షాల విమర్శలను అదేస్థాయిలో అధికార పార్టీ నేతలు తిప్పికొడుతున్నారు. ఒకరిపైమరొరకు ఘాటైన విమర్శలు చేసుకుంటూ రాష్ట్రంలో రాజకీయ వేడి పుట్టిస్తున్నారు.
 
తెలంగాణ రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌.. ఏపీ సీఎం చంద్రబాబును టార్గెట్‌ చేస్తే.. ఆయన.. దీనికి కౌంటర్‌ ఇచ్చారు. మధ్యలో కాంగ్రెస్‌ అగ్రనాయకులూ.. కేసీఆర్‌పై విమర్శల దాడిని కొనసాగిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌.. విపక్షాలపైన.. ముఖ్యంగా ఏపీ సీఎం చంద్రబాబుపైనా చెలరేగి పోయారు. నల్లగొండ వేదికగా.. కాంగ్రెస్‌ వారినీ కడిగి పారేశారు. 

కేసీఆర్‌ వ్యాఖ్యలపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉంటే తప్పేంటని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌తో కలిసి పనిచేద్దామని సీరియస్‌గా ప్రయత్నించానని...కానీ, అందరూ తెలుగుదేశాన్ని దెబ్బ తీయాలని చూస్తున్నారని వాపోయారు. అసలు.. తెలుగురాష్ట్రాల మధ్య తగువులు పెట్టేందుకు ప్రధాని మోడీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తనకన్నా తెలంగాణ సీఎం కేసీఆర్‌ మోర్ మెచ్యూర్డ్ అని అనడంలోనే మోదీ ఉద్దేశం అర్థమవుతోందన్నారు. తనపైకి జాతీయ సంస్థలను ఉసిగొల్పుతున్నారని చంద్రబాబు అన్నారు. 

అటు పాలమూరు జిల్లాలో ప్రచారానికి శ్రీకారం చుట్టిన కాంగ్రెస్‌ నాయకత్వం.. కేసీఆర్‌ లక్ష్యంగా విమర్శనాస్త్రాలు సంధించింది. నాలుగున్నర ఏళ్లలో చేసిందేంటో చెప్పమంటే.. కేసీఆర్‌ ప్రతిపక్షాల పొత్తుల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. తెలంగాణలో ఎన్నికలు టీఆర్‌ఎస్‌కు కాంగ్రెస్‌కు మధ్య కాదని, కేసీఆర్ కుటుంబానికి తెలంగాణకు ప్రజలకు మధ్య అని ఆయన వ్యాఖ్యానించారు. తాము ఎవరితో పొత్తు పెట్టుకుంటే కేసీఆర్‌కు ఎందుకని ప్రశ్నించారు. నిజామాబాద్ సభలో కేసీఆర్ చేసిన విమర్శలను ఖండిస్తున్నామన్నారు. కేసీఆర్‌ కుటుంబానికి, తెలంగాణ ప్రజలకు మధ్య ఎన్నికల పోరాటమని ఉత్తమ్‌ అభివర్ణించారు. 

16:10 - January 18, 2018

పశ్చిమ గోదావరి : జిల్లా నరసాపురంలో టెన్‌టీవీ క్యాలెండర్‌ను ఎమ్మెల్యే మాధవనాయుడు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. టెన్‌టీవీ నిరంతరం ప్రజాసమస్యలపై పోరాటం చేస్తోందని కొనియాడారు. ఈ సందర్భంగా టెన్‌టీవీ ప్రేక్షకులకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. 

15:47 - October 9, 2017

పశ్చిమగోదావరి : తమకు కనీస వేతనం 6 వేల రూపాయలు ఇవ్వాలంటూ ఏలూరులో ఆశావర్కర్లు ఆందోళనబాట పట్టారు. సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ను ముట్టడించారు. తాము చేస్తున్న పనికి తగ్గ వేతనం ఇవ్వడం లేదంటూ ఆశావర్కర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్‌ను కలిసేందుకు వచ్చిన ఆశావర్కర్లను పోలీసులు అరెస్ట్‌ చేశారు. దీనిపై మరింత సమాచారం వీడియో చూడండి.

17:07 - October 8, 2017
16:45 - October 8, 2017

తూర్పుగోదావరి : సీఎం చంద్రబాబుకు ముద్రగడ పద్మనాభం బహిరంగ లేఖ రాశారు. కాపు వర్గ ప్రతినిధులను కలవడానికి వెళ్లడమే నేరమా అని లేఖలో ప్రశ్నించారు. గ్రామాల్లో తిరగకుండా తననెందుకు అడ్డుకుంటున్నారని.. ఈ రాష్ట్రం మీ ఎస్టేట్‌ కాదని, మీరు ట్రస్టీ మాత్రమేనని లేఖలో తెలిపారు. సీబీసీఐడీల పేరుతో తనను బెదిరించడం తగదన్నారు.

 

21:27 - October 7, 2017

హైదరాబాద్ : కేసీఆర్‌ తనపై చేసిన వ్యాఖ్యలపై టీజేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ మండిపడ్డారు. జేఏసీ లేవనెత్తే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకనే సీఎం... తనపై వ్యక్తిగత దాడికి దిగారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఏ ఒక్కరి వల్ల రాలేదని.. యావత్‌ తెలంగాణ సమాజంతోనే అది సాధ్యమైందని స్పష్టం చేశారు. కేసీఆర్‌ తెలంగాణ ఉద్యమకారులను దూరం చేసి.... ఉద్యమ ద్రోహులను దగ్గరికి చేర్చుకున్నారని విమర్శించారు. తెలంగాణ కోసం ఉద్యమిస్తున్న సమయంలో తమపై ఆంధ్రపాలకులు మాటలతో దాడి చేశారని... ఇప్పుడు స్వరాష్ట్రంలో పాలకులు తమపై దాడిచేయం బాధాకరంగా ఉందని కోదండరాం ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో కుటుంబ పాలన కొనసాగుతోందని..నిరంకుశ పాలన అంతమై... ప్రజాస్వామిక పాలన రావాలని కోరుకుంటున్నామన్నారు. తన ఇష్టపూర్వకంగానే ఉద్యమ పంథా ఎంచుకున్నానని... అవసరమైతే రాజకీయంగా ముందుకెళ్తామని ఆయన స్పష్టం చేశారు.

ప్రజాగ్రహానికి గురికాకతప్పదని
కాంగ్రెస్‌ నేతలపై కేసీఆర్‌ మాట్లాడిన తీరు తీవ్ర అభ్యంతరకరంగా, జుగుప్సాకరంగా ఉందని సీఎల్పీనేత జానారెడ్డి మండిపడ్డారు. తనపై వాడిన దొంగ అనే పదానికి కేసీఆర్‌ వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమని.. గెలిచినంత మాత్రాన ఇతరులను కించపరిచేలా మాట్లాడటం కేసీఆర్‌కు తగదన్నారు. సీఎం తన తీరు మార్చుకోకుంటే ప్రజాగ్రహానికి గురికాకతప్పదని హెచ్చరించారు.కేసీఆర్‌ కాంగ్రెస్‌ నేతలను అగౌరవపరుస్తూ మాట్లాడారని, కేసీఆర్‌ వాడిన భాషను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మల్లు భట్టివిక్రమార్క అన్నారు. ఇతరులకు ఆదర్శంగా ఉండాల్సిన సీఎం... దిగజారి మాట్లాడారని విమర్శించారు. సభానాయకుడిగా ఒక ప్రతిపక్ష నేతను గౌరవించాల్సిన బాధ్యత కేసీఆర్‌కు లేదా అని ప్రశ్నించారు. సీఎం తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోకపోతే రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో నిలదీస్తామని హెచ్చరించారు.

ఓయూలో జలదీక్ష
తెలంగాణకు ఉత్తమే అసలైన దొరంటూ కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్‌ సీనియర్‌నేత వి. హనుమంతరావు తప్పుపట్టారు. దేశం కోసం బార్డర్‌లో ప్రాణాలకు తెగించిన పనిచేసిన చరిత్ర ఉత్తమ్‌కు ఉందని గుర్తు చేశారు. కేసీఆర్‌ మాట్లాడే భాష సరిగాలేదన్న వీహెచ్‌.. సీఎంకు మైండ్‌ దారి తప్పినట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్‌పై టీ టీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి విరుచుకుపడ్డారు. మయసభలో దుర్యోధనుడిలా కేసీఆర్‌ మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టికెట్‌ కోసం తన కొడుకు పేరు మార్చిన నీచ చరిత్ర కేసీఆర్‌దని దుయ్యబట్టారు. కేసీఆర్‌కు అమరుల కుటుంబాలపట్ల గౌరవం ఉంటే శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మను నల్లగొండ బరిలో నిలపాలని, శంకరమ్మ ఏకగ్రీవానికి తాము సహకరిస్తామన్నారు. డీఎస్సీకి తొందరెందుకు, డీఎస్సీ వేయకపోతే ప్రపంచం మునుగుతుందా అన్న కేసీఆర్‌ వ్యాఖ్యలపై నిరుద్యోగులు మండిపడుతున్నారు. సీఎం వ్యాఖ్యలను నిరసిస్తూ ఓయూలోని ల్యాండ్‌స్కేప్‌ చెరువులో జలదీక్ష చేపట్టారు. తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్లు, నిధులు, నియామకాల కోసమని... ఉద్యమ సమయంలో వాటిని పదేపదే వినిపించిన కేసీఆర్‌ ఇప్పుడు మాటమార్చారంటూ మండిపడ్డారు. డీఎస్సీ వేయకపోతే ప్రపంచం మునగదుకానీ.... వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌ నిండా మునుగుతారని వారు హెచ్చరించారు.

19:15 - October 7, 2017

హైదరాబాద్ : జనసేన పార్టీపైకానీ, తనపై కానీ ఇతర పార్టీల నేతలు చేసే విమర్శలపై కార్యకర్తలెవరూ స్పందించవద్దని పవన్‌ విజ్ఞప్తి చేశారు. ఈమేరకు ఆయన ట్విట్టర్‌లో ట్వీట్‌ చేశారు. ప్రజాసమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్న జనసేన దృష్టి మరల్చడానికో, లేక ప్రచారం కోసమో కొంతమంది విమర్శలు చేస్తుంటారని అన్నారు. తనకు అపకీర్తి వచ్చేలా మాట్లాడినా మనం హుందాగా ప్రవర్తిద్దాని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ప్రస్తుత రాజకీయాలకు భిన్నంగా జనసేన సిద్ధాంతాలు, ఆశయాలు ఉన్నాయన్న విషయాన్ని పవన్‌ తన ప్రకటనలో గుర్తు చేశారు. భావి తరాల భవిష్యత్‌, దేశ శ్రేయస్సు కోసం విశాల దృక్పథం కలిగిన రాజకీయాలు అవసరమనేది జనసేన ప్రాథమిక సూత్రమని గుర్తు చేశారు. అందుకే కార్యకర్తలెవరూ ఆవేశపడవద్దని సూచించారు. కార్యకర్తలంతా ప్రజాసేవే పరమావధిగా ముందుకెళ్లాలని లేఖలో పవన్‌ పిలుపునిచ్చారు. ప్రస్తత రాజకీయ వ్యవస్థకు భిన్నంగా, బాధ్యతాయుత రాజకీయాలు పరిఢవిల్లేందుకు కార్యకర్తలంతా కృషి చేయాలని కోరారు.

17:43 - October 7, 2017

హైదరాబాద్ : సీఎం హోదాలో ఉండి కేసీఆర్‌ ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మల్లు భట్టివిక్రమార్క. సింగరేణి ఎన్నికల్లో అధికార పార్టీ డబ్బును విచ్చలవిడిగా పంచిపెట్టిందన్నారు. నాయకుడు అనేవాడు అందరికీ ఆదర్శంగా ఉండాలన్నారు.

17:42 - October 7, 2017

హైదరాబాద్ : కాంగ్రెస్‌ పార్టీ, కాంగ్రెస్‌ నేతలపై సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలను సీఎల్పీ నేత జానారెడ్డి ఖండించారు. ఎన్నికల్లో గెలుపు-ఓటములు సహజమని... గెలిచినంత మాత్రాన ఇతరులను కించపరిచినట్లు మాట్లాడటం సరికాదన్నారు. రాజకీయాల్లోకి వచ్చే ఇతరులకు... ఆదర్శంగా ఉండాల్సిన వారు ఇలా మాట్లాడటం ఎంతవరకు సమంజసమన్నారు.  

Pages

Don't Miss

Subscribe to RSS - leaders