loan waiver

17:37 - February 15, 2018

హైదరాబాద్ : కార్పొరేట్ కంపెనీలకు రుణాలను మాఫీ చేస్తూ లక్షలాది కోట్ల రూపాయలను సబ్సిడీ రూపంలో కేంద్ర ప్రభుత్వం ఇస్తోందన్నారు జేఏసీ చైర్మన్‌ కోదండరాం. దేశ వ్యాప్తంగా ఉన్న రైతు రుణాలను మాఫీ చేయకుంటే.. కార్పొరేట్ సంస్థలకు మద్దతుగా నిలుస్తోందని ఆయన మండిపడ్డారు. పార్లమెంటులో వెంటనే రైతులను రుణ విముక్తులను చేసే బిల్లును ప్రవేశపెట్టాలన్నారు. ఆలిండియా కిసాన్ సమన్వయ సమితి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్ర సదస్సులో సమితి కేంద్ర నాయకులు యోగేంద్ర యాదవ్ తో కలిసి ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ... రైతు రుణ విముక్తి బిల్లు, కనీస మద్దతు ధరలపై నమూనా బిల్లును ప్రవేశపెట్టారు.

20:29 - November 14, 2017

నిన్నియాళ్ల ఫేస్ బుక్కులళ్ల.. వాట్సప్ గ్రూపులళ్ల.. ఒక పోట్వ గిర్రా గిర్రా తిర్గుతున్నది.. కేరళ ముఖ్యమంత్రి ఎందుకు గొప్పోడు.. మన తెల్గు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎందుకు సన్నాసులైండ్రు అనేది కుద్దు అచ్చరాలు రాశి అండ్లిండ్ల తింపుతున్నరు.. నిజంగ కేరళ ముఖ్యమంత్రి మన సీఎంలకంటె తోపా..? తోపైతె ఎట్ల తోపు అనేది ఒక్కపారి జూడాలంటే వీడియో క్లిక్ చేయండి...

18:45 - October 24, 2017

మెదక్‌ : జిల్లాలో రైతులు ఆందోళన బాట పట్టారు. రుణమాఫీ అవుతుందనుకున్న తమకు బ్యాంకు నుంచి నోటీసులు రావడంతో రైతులు ఆందోళనకు దిగారు. రుణమాఫీకి అన్ని అర్హతలున్నా నోటీసులు పంపి డబ్బు కట్టమనడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ రుణాలు మాఫీ అయ్యాయని రీషెడ్యూల్‌ చేశామని చెప్పిన అధికారులు.. ఇప్పుడు మాట మార్చి గత రుణాలు చెల్లించాలని నోటీసులు పంపారన్నారు. రుణమాఫీ లిస్టులో తమ పేర్లున్నాయని రైతులు తెలిపారు. రామాయం పేట మండలంలో 123 మంది రైతులకు టీ.ఎస్.జీ.వీ.బీ బ్యాంకు అధికారులు నోటీసులు పంపారు. అయితే ఈ నోటీసులపై రైతులు ఆందోళన చెందవద్దనీ రుణమాఫీ జరుగుతుందని ఏవో అన్నారు.

08:37 - October 22, 2017

రుణామాఫీ విడుదల చేసిన మాట వాస్తమే అని టీడీపీ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ అన్నారు. రుణామాఫీ అనేది మంచి పథకం అని సీపీఎం నేత గఫుర్ అన్నారు. రుణామాఫీలో ప్రభుత్వం విఫలం చెందిందని కాంగ్రెస్ నేత విష్ణు అన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

09:25 - September 8, 2017

హైదరాబాద్ : రుణ మాఫీ కోసం ఎదురు చూస్తున్న రైతుల ఆశ తీరనుంది. మూడవ విడత రుణమాఫీని రైతులకు అందించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందు  కోసం మూడు వేల 600 కోట్లను కేటాయించింది. 
రైతులకు కొంత ఊరట 
రుణ మాఫీ కోసం ఎదురు చూస్తున్న రైతులకు కొంత ఊరట లభింనుంది. ఇప్పటికే రుణ మాఫీ విషయంలో అనేక విమర్శలు ఎదుర్కొంటున్న ఏపీ ప్రభుత్వం రైతులకు మూడో విడతగా రుణ మాఫీ చేయాలని నిర్ణయించింది. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం కావడంతో మూడో విడతగా రుణమాఫీ నిధులను ప్రభుత్వం విడుదల చేయనుంది.
వన్‌ టైం సెటిల్‌మెంట్‌ కింద రూ.50 వేలు మాఫీ
మొదటి రుణ మాఫీలో భాగంగా వన్‌టైం సెటిల్‌మెంట్‌ కింద 50 వేల వరకు మాఫీ చేశారు. లక్షన్నర వరకు ఉన్న రైతులకు మాత్రం రుణమాఫీ కోసం ప్రత్యేకంగా బాండ్లు జారీ చేసింది. ఈ బాండ్లను తాకట్టు పెట్టుకొని రుణాలు పొందొచ్చని ప్రభుత్వం అంటోంది.  అయితే బాండ్లను పెట్టుకొని రుణాల ఇవ్వడానికి బ్యాంకులు అంగీకరించకపోవడంతో కొన్ని రోజులుగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైతుల ఇబ్బందుల దృష్ట్యా ప్రభుత్వం తాజాగా మూడవ విడత రుణ మాఫీ నిధులు విడుదల చేయాలని నిర్ణయించింది. మొత్తం 3600 కోట్ల రూపాయలు మూడవ విడతలో రైతులకు రుణ మాఫీ చేయనున్నారు. దీని కోసం ఇప్పటికే వెయ్యి కోట్లు రైతు సాధికార సంస్థలో ప్రభుత్వం జమ చేసింది. మిగిలిన 2600 కోట్లను సర్దుబాటు చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
ప్రభుత్వం నిర్ణయం పట్ల రైతులు హర్షం 
రెండవ విడత రుణ మాఫీలో రైతులకు అందించిన ఉపశమన పత్రాల వివరాలను బ్యాంకులు సక్రమంగా నిర్వహించకపోవడం వల్ల తమకు తొమ్మిది లక్షల ఫిర్యాదులు వచ్చినట్లు మంత్రి చెప్పారు.  అందులో అర్హులైన 5.47 లక్షల మంది రైతులకు 528 కోట్లను కేటాయించామన్నారు. ప్రభుత్వం నిర్ణయం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

21:44 - August 24, 2017

గుంటూరు : రైతులకు మూడో విడత రుణమాఫీ కింద 3వేల 6వందల కోట్లు విడుదల చేసేందుకు నిర్ణయించినట్లు ఏపీ వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి చెప్పారు. త్వరలోనే వాటిని రిలీజ్ చేస్తున్నట్లు చెప్పారు. రుణమాఫీ అంశంలో టెక్నికల్ సమస్యల కారణంగా అర్హత ఉండి రాని 7వేల 7 వందల 93 ఖాతాల్లో 18 కోట్ల 87 లక్షలు రిలీజ్ చేసినట్లు సోమిరెడ్డి చెప్పారు. 

18:58 - August 6, 2017

చిత్తూరు : దళితులపై అక్రమ కేసులు ఎత్తివేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు డిమాండ్‌ చేశారు. దళితుల సమస్యలు పరిష్కరించాలంటూ చిత్తూరు కలెక్టర్‌ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగిన ప్రజాసంఘాల నేతలపై కేసులు బనాయించడాన్ని నిరసిస్తూ తిరుపతి మున్సిపల్‌ కార్యాలయం వద్ద అఖిలపక్ష నేతలు ఆందోళనకు దిగారు. ఈ కార్యక్రమంలో మధు పాల్గొని... మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయకపోతే... రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగుతామని మధు హెచ్చరించారు. 

 

13:43 - August 6, 2017
21:03 - August 4, 2017

శ్రీకాకుళం : ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమైనా రైతులకు బ్యాంకులు రుణాలు మంజూరు చేయలేదు. అధికారులు, ప్రజాప్రతినిధులు అటువైపు చూడటమే మానేశారు. కాయ కష్టం చేసినా, సేద్యానికి మదుపు దొరకడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇదీ శ్రీకాకుళం జిల్లా రైతుల పరిస్థితి.
రైతన్నలకు చుక్కలు చూపిస్తున్న బ్యాంకులు  
శ్రీకాకుళం జిల్లాలో బ్యాంకులు రైతన్నలకు చుక్కలు చూపిస్తున్నాయి. పంట రుణాల కోసం బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా..అప్పు మాత్రం పుట్టడం లేదు.ఖరీఫ్‌ రుణ లక్ష్యం 1580 కోట్లు ఉండగా ఇప్పటి వరకు 436 మందికి మాత్రమే రుణాలు అందాయి. వీరికి కోటి పదమూడు లక్షల రూపాయల రుణాలను మాత్రమే బ్యాంకులు అందిచాయి. కొత్తగా దరఖాస్తు చేసిన వారికి రుణ అర్హత కార్డులు, సాగు విస్తీర్ణ ధృవపత్రాలున్నా ఇంకా రుణాలు మంజూరు చేయలేదు. 
కౌలు రైతులకు బ్యాంకులు మొండి చేయి
శ్రీకాకుళం జిల్లాలో వరిసాగు విస్తీర్ణం రెండు లక్షల హెక్టార్లుగా ఉంది. ఇందులో లక్షా ఎనబై వేల మంది కౌలు రైతులు ఉన్నారు. కౌలు రైతులకు బ్యాంకులు మొండి చేయి చూపించడంతో దిక్కుతోచని స్థితిలో రైతులు అల్లాడుతున్నారు. సేద్యానికి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉందని, బ్యాంకుల నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ముప్పై ఎనమిది మండలాల పరిధిలో 500 మంది రుణ ధరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా, ఇంకా దరఖాస్తు చేయని వారి సంఖ్య చాలానే ఉంది. ఈ తరుణంలో బ్యాంకులు రుణాలు మంజూరు చేసి, పెట్టుబడికి సహాయం అందించాలని రైతులు కోరుతున్నారు. సకాలంలో రుణాలు అందితే తప్ప ఖరీఫ్‌ సాగుకు పెట్టుబడి పెట్టే పరిస్థితి లేదు. జిల్లాలో కౌలు రైతులకు జాయింట్‌ లయిబులిటీ గ్రూపులు ఏర్పాటు చేసి పంట రుణాలు అందించాలని రైతు సంఘాలు డిమండ్‌ చేస్తున్నాయి. 

10:32 - July 30, 2017

ఖమ్మం : రైతురాజ్యంగా చెప్పుకునే మన దేశంలో అన్నదాతలకు అడుగడుగునా భంగపాటు తప్పడం లేదు. విత్తనాల నుంచి  ఎరువులు, క్రిమి సంహారక మందుల వరకు నకిలీలే రాజ్యమేలుతున్నాయి. చివరికి రైతు రుణాలు కూడా నకిలీగా మారిపోయాయి. అదేంటి... రైతు రుణాలు నకిలీ కావడమేంటనే అనుమానం కలుగుతోందా. అవును. లేని రైతులను సృష్టించి వారి పేరుతో వ్యవసాయ రుణాలు కాజేస్తున్నారు కొందరు అక్రమార్కులు. 
బ్యాంకుల మోసం 
ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి బ్యాంకు మోసాలకు అడ్డాగా మారింది. ఇక్కడి బ్యాంకులు రైతులను మోసగించడం నిత్యకృత్యంగా మారింది.  గతంలో ఐడీబీఐ బ్యాంక్‌లో ముద్రా రుణాల కుంభకోణం బయటపడింది. ఇప్పుడు  ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంకులో మరో అవినీతి వెలుగు చూసింది. రైతు రుణాల మంజూరులో భారీగా అక్రమాలు జరిగాయి. నకిలీ పట్టాదారు పాస్‌పుస్తకాలు సృష్టించి రుణాలు కాజేశారు అక్రమార్కులు. 
బ్యాంకు అధికారులతో  పరిచయం పెంచుకున్న ముఠా
అధికారుల సంతకాలు ఫోర్జరీ
సత్తపల్లిలో ఓ ముఠా బ్యాంకు అధికారులతో పరిచయం చేసుకుని అక్రమాలకు పాల్పడుతోంది. నకిలీ రైతుల పేరుతో ఈ ముఠా పాస్‌పుస్తకాలు తయారు చేస్తుంది.  టైటిల్‌ డీడ్‌లో ఉండాల్సిన సంతకాలను సులువుగా ఫోర్జరీ చేస్తారు. నో డ్యూస్‌ సర్టిఫికెట్లనూ తయారు చేస్తారు. అంతేనా... స్టాంప్‌లనూ సృష్టిస్తారు. ఇలా ఒకటేమిటి పాస్‌పుస్తకాల ప్రింటింగ్‌ నుంచి తహసీల్దార్‌ సంతకాల వరకు అన్నీ పక్కాగా తయారు చేస్తారు.  ఆ తర్వాత బ్యాంక్‌ అధికారులను కలిసి వాటిని చూపిస్తారు. ఇంకేముంది రుణం మంజూరవుతుంది.  ఆ రుణంలో ఒకరికొకరు వాటాలు పంచుకుంటారు. ఇదీ ఇప్పుడు సత్తుపల్లిలోని ఐఓబీ  బ్యాంక్‌లో జరుగుతున్న అవినీతి. 
రుణాల మంజూరీలో అక్రమాలు
సత్తుపల్లికి చెందిన గాదె సత్యనారాయణ సత్తుపల్లి రెవెన్యూ పరిధిలో  26వ ఖాతా నంబర్‌లో 7.3ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఈ ఖాతా నంబర్‌పై స్థానిక డీసీసీబీ బ్యాంక్‌లో లక్ష రూపాయల రుణం మార్చి నెలలో రెన్యువల్‌ అయ్యింది.  ఇదే ఖాతా నంబర్‌పై ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంక్‌లో సయ్యద్‌ రజియా పేరుతోనూ 94వేల వ్యవసాయ రుణం తీసుకున్నట్టు తెలిసింది. దీంతో అవాక్కైన అతడు.. పోలీసులను ఆశ్రయించడంతో రుణాల మంజూరీ అక్రమాల డొంక కదిలింది.
లోతుగా దర్యాప్తుచేస్తున్న అధికారులు
నకిలీ రైతుల పేర్లతో  రుణాలు కాజేసిన వ్యవహారంపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. రెవెన్యూ అధికారులు, పోలీసులు చేస్తున్న తనిఖీల్లో వందల సంఖ్యలో నకిలీ పాస్‌పుస్తకాలు  బయటపడ్డాయి. దొంగ డాక్యుమెంట్లు దొరికాయి.  ఏజెంట్లు, బ్యాంకు సిబ్బంది కలిసి రుణాలు కాజేసినట్టు తెలుస్తోంది. రైతు రుణాల పేరుతో అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.
నకిలీ పట్టాదారు పాస్‌పుస్తకాలు 
సత్తుపల్లిలో నకిలీ పట్టాదారు పాస్‌పుస్తకాలతో రుణాలు కాజేసిన ఘటన సంచలనం సృష్టిస్తోంది. ఒక్క బ్యాంకులోనే వందల సంఖ్యలో నకిలీ పాస్‌పుస్తకాలు దొరికితే... మిగిలిన బ్యాంకుల్లో ఇంకెన్ని ఉన్నాయోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సత్తుపల్లి, దమ్మపేట, వేంసూరు, పెనుబల్లి మండలాల్లోని అన్ని బ్యాంకుల్లో తనిఖీలు నిర్వహిస్తే మరిన్ని అక్రమాలు బయటపడే అవకాశముంది.

Pages

Don't Miss

Subscribe to RSS - loan waiver