love birds

12:00 - May 29, 2018

హైదరాబాద్‌ : యూసుఫ్‌గూడలో యువతిని దారుణంగా హత్య చేసిన ప్రేమోన్మాది సాగర్‌ పోలీసుల ముందు లొంగిపోయాడు. వెంకటలక్ష్మీ తన ప్రేమను నిరాకరించిందని ఓ గోల్డ్‌షాప్‌లో ఆమె గొంతు కోసి చున్నీ భిగించి అతి దారుణంగా చంపేశాడు. తన ప్రేమను నిరాకరించిందని యువతిని హత్య చేశాడు. 

 

07:13 - March 31, 2018

వికారాబాద్ : జిల్లా కొడంగల్‌ మండలంలో విషాదం చోటుచేసుకుంది. తమ ప్రేమను పెద్దవాళ్లు అంగీకరించలేదన్న మనస్తాపంతో... ప్రేమికులు పురుగుల మందు తాగారు. పొలాల్లో అపస్మారక స్థితిలో పడి ఉన్న ఇద్దరినీ స్థానికులు తాండూరు ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గమధ్యంలోనే ప్రియురాలు రోజా మృతిచెందగా... ప్రియుడు రాజు పరిస్థితి విషమంగా ఉంది. మరో 15రోజుల్లో వేరే వ్యక్తితో రోజాకు ఎంగేజ్‌మెంట్‌ ఉండటంతో... ఇరువురు ఈ దారుణానికి పాల్పడి ఉండవచ్చని.. స్థానికులు చెబుతున్నారు.

18:50 - March 30, 2018

హైదరాబాద్ : గోల్నాకలో దారుణం జరిగింది. లాలాగూడ ఘటన మరవక ముందే మరో ఘటన చోటుచేసుకుంది. ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడిన బాలిక మృతి చెందింది. తన ప్రేమను నిరాకరించిందని మూడు రోజుల క్రితం బాలికపై సొహైల్ అనే యువకుడు కిరోసిన్ పోసి నిప్పంటించాడు. బాలిక తీవ్రంగా గాయపడింది. 3 రోజులుగా ఉస్మానియాలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందింది.  

 

12:44 - January 31, 2018

కర్నూలు : మాటలతో నమ్మించాడు..ప్రేమించాడు..పెళ్లి చేసుకుంటానని అన్నాడు..చివరకు వేరే అమ్మాయితో వివాహానికి సిద్ధమయ్యాడు..సమాచారం తెలుసుకున్న ఆ యువతి తీవ్ర ఆగ్రహానికి గురైంది. ప్రేమికుడిని పట్టుకుని చెప్పు దెబ్బలు కొట్టింది. ఈ ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. దివ్యాభాయి..చంద్రశేఖర్ లు గత మూడు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. వీరు సహజీవనం చేసినట్లు తెలుస్తోంది. కానీ చంద్రశేఖర్ వేరే అమ్మాయిని వివాహం చేసుకోబోతున్నాడని దివ్య తెలుసుకుంది. చంద్రశేఖర్ కోసం వెతికింది. చివరకు అతను కనబడడంతో పట్టుకుని పోలీసు భవన్ కు తీసుకొచ్చింది. కుటుంబసభ్యులు చూసే అమ్మాయిను వివాహం చేసుకుంటానని చంద్రశేఖర్ చెప్పడంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన దివ్య చెప్పుతో బాదింది. శారీరకంగా..మానసికంగా వాడుకుని ఇప్పుడు తనను వదిలించుకోవాలని చూస్తున్నాడని యువతి ఆరోపిస్తోంది. పీఎస్ లో ఎదురుగానే యువతి..కుటుంబసభ్యులు దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులు కౌన్సిలంగ్ చేయడంతో చంద్రశేఖర్ వివాహం చేసుకోవడానికి అంగీకరించినట్లు సమాచారం. 

15:07 - January 23, 2018

చిత్తూరు : జిల్లా తిరుపతిలో ప్రియుడి నయవంచనకు ప్రియురాలు ఆత్మహత్యాయత్నం చేసింది. తిరుపతి ఎస్పీ కార్యాలయం ముందు ఆ యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఏడాది కాలంగా ఈ యువతిని ప్రేమించి, పెళ్లిచేసుకుంటానని ప్రేమికుడు పరారయ్యాడు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

15:11 - January 11, 2018

నేరాల సంఖ్య పెరుగుతోంది. దీనికి అనేక కారణాలున్నా ఆర్థిక కారణాలతో నేరాలు జరుగుతున్నట్లు వెల్లడైంది. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా ప్రియుడుతో కలిసి భర్తలను చంపిన భార్యల వార్తలు తెలుగు రాష్ట్రాల్లో వినిపిస్తున్నాయి. పక్కా ప్రణాళికతో చేస్తున్నారా ? లేక ఆవేశంతో చేస్తున్నారా ? అనేది పక్కన పెడితే వీటికి మూల కారణాలు ఏంటీ ? ఇంతటి భయంకరమైన పరిస్థితులకు అసలు కారణాలు ఏంటీ ? వివాహేతర సంబంధాల కేసుల్లో మహిళలను నిందితురాలిగా చేయాలన్న అంశాన్ని సుప్రీంకోర్టు పరిశీలనకు తీసుకోవడం యాదృచ్చకమైనా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు భర్తల హత్యలు హల్ చల్ చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో గత మూడు నెలల కాలంలో పది హత్యలు జరిగినట్లుగా తెలుస్తోంది. నేరం ఎవరు చేసిన మహిళలు చేసిన నేరంపై ఎందుకు పెద్దగా మాట్లాడుకోవాల్సి వస్తోంది ? వారి పిల్లల భవిష్యత్ ఏంటీ ? తదితర అంశాలపై టెన్ టివి ఫోకస్ ప్రత్యేక చర్చ చేపట్టింది. ఈ చర్చలో దేవి (సామాజిక కార్యకర్త) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

14:35 - January 11, 2018

చిత్తూరు : ప్రేమ హత్యలు..ప్రేమ మరణాలు పెరిగిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇటీవలే పలు దారుణ ఘటనలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. చిత్తూరు జిల్లా కుప్పం మండలం క్రిష్టాపురంలో దారుణం చోటు చేసుకుంది. ప్రియురాలు ఇంకొకరిని వివాహం చేసుకుందని ఓ ప్రియుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుప్పంలో నివాసం ఉండే స్నేహాంజలితో తిరుపతి నివాశి దామోదర్ కు పరిచయం అయ్యింది. గత కొన్ని రోజులుగా స్నేహాంజలిపై ప్రేమను పెంచుకున్నాడు. కానీ స్నేహాంజలి కూడా ప్రేమించిందా ? లేదా ? అనేది తెలియరాలేదు. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల కిందట కుప్పంకు చెందిన ఓ వ్యక్తితో స్నేహాంజలికి వివాహం జరిగింది. స్థానికంగా టీచర్ ఉద్యోగం కూడా చేస్తోంది. వివాహం చేసుకున్న విషయం తెలుసుకున్న దామోదర్ జీర్ణించుకోలేకపోయాడు. తిరుపతి నుండి కుప్పంకు వెళ్లిన దామోదర్..స్నేహాంజలి ఇంటి ఎదుట ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటికున్నాడు. స్థానికులు ఇతడిని ఆసుపత్రికి తరలించారు. 75 శాతం కాలిన గాయాలతో చికిత్స పొందుతున్నాడు. బతికే అవకాశం లేదని వైద్యులు పేర్కొంటున్నట్లు సమాచారం. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

07:19 - January 11, 2018

హైదరాబాద్ : ప్రేమోన్మాదానికి మరో యువతి బలైపోయింది. ప్రేమను తిరస్కరించినందుకు.. హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో జానకి అనే అమ్మాయిని .. ఓ ప్రేమోన్మాది దారుణంగా హత్య చేశాడు. శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం గుయ్యనవలస గ్రామానికి చెందిన బోను జానకి కేపీహెచ్‌బీలోని డీమార్ట్‌ సూపర్‌ మార్కెట్‌లో పనిచేస్తోంది. మూసాపేట హబీబ్‌నగర్‌లో ఓ అద్దె ఇంట్లో రూప అనే మరో యువతితో కలసి ఉంటోంది. అయితే అదే సూపర్‌ మార్కెట్‌లో పనిచేస్తున్న...అనంతప్ప అలియాస్‌ ఆనంద్‌.. తనను ప్రేమించాలంటూ.. జానకి వెంటపడ్డాడు.. ! అతని ప్రేమను జానకి తిరస్కరించింది. దీంతో రగిలిపోయిన ఆనంద్‌.. ఆమెను తిట్టాడు, కొట్టాడు.

10 రోజుల క్రితం జానకి ఇంటికి వెళ్లి..
10 రోజుల క్రితం జానకి ఇంటికి వెళ్లి.. తనను ప్రేమించకపోతే చంపేస్తానని బెదిరించాడు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం ఇంటికి వచ్చిన రూపకు .. అపస్మారస్థితిలో ఉన్న జానకి కనిపించింది. ఆమె కడుపులో కత్తితో పొడిచిన గాయాలు కనిపించాయి. దీంతో రూప.. స్థానికులు, సహోద్యోగుల సహాయంతో .. జానకిని సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించింది. అక్కడ చికిత్స పొందుతూ అర్ధరాత్రి జానకి మృతిచెందింది. నిరుపేద కుటుంబానికి చెందిన జానకి.. డబ్బులు దాచుకుని.. పెళ్లిచేసుకుందామనుకుందని.. కానీ ఇంతలో ఇలా జరిగిపోయిందని.. ఆమె బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘాతుకానికి పాల్పడిన నిందితుడు ఆనంద్‌ను కూకట్‌ పల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆనంద్‌ రంగారెడ్డి జిల్లా..పెద్దేముల్‌ సమీపంలోని మారెపల్లి గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.

13:23 - January 10, 2018
12:12 - January 10, 2018

Pages

Don't Miss

Subscribe to RSS - love birds