love marriages

10:29 - May 14, 2018

నిజామాబాద్ : ప్రేమించానన్నాడు..పెళ్లి చేసుకున్నాడు..ఆ తరువాత ముఖం చాటేశాడు. తనకు న్యాయం చేయాలంటూ ఆ ప్రియురాలు మౌనపోరాటం..గత రెండు రోజులుగా ఆమె పోరాటం చేస్తున్నా ఎలాంటి చర్యలు లేవు..పైగా ఆమెపైనే దాడి కూడా జరగడం గమనార్హం. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.

సదాశివనగర్ మండలం అడ్డూరు ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన ప్రవీణ్ రెడ్డి ఎదుట ప్రియురాలు మమత ఆందోళన చేపట్టింది. ప్రేమించి మోసం చేశాడని..వెంటనే తనను పెళ్లి చేసుకోవాలని డిమాండ్ చేస్తోంది. తాము ఐదేళ్ల పాటు ప్రేమించుకున్నామని, కులాలు వేరు కావడంతో పెద్దలు ఒప్పుకోలేదని బాధితురాలు పేర్కొంటోంది. దీనితో తనకు ప్రవీణ్ రెడ్డి తాళి కూడా కట్టాడని, కానీ కొద్ది రోజుల నుండి ముఖం చాటేశాడని వాపోతోంది. దీనితో ప్రవీణ్ రెడ్డి ఎదుట మౌన పోరాటం చేస్తోంది. ఈ విషయం తెలుసుకున్న ప్రియుడి బంధువులు మమతపై దాడికి పాల్పడ్డారు. తనకు న్యాయం దక్కకపోతే ఆత్మహత్య చేసుకుంటానని కిరోసిన్ డబ్బా పట్టుకుని హెచ్చరిస్తోంది. మహిళకు అన్యాయం జరుగుతున్నా కామారెడ్డి మహిళా పోలీసు అధికారులు స్పందించడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. 

15:55 - October 22, 2017

మార్క్సిజం అవసరమని ప్రముఖ రచయిత్రి రంగనాయకమ్మ పేర్కొన్నారు. రంగనాయకమ్మ..తెలుగు సాహిత్యానికి...తెలుగు సమాజానికి పరిచయం అవసరం లేని పేరు. ఎన్నో కథలు..నపలలు..వ్యాసాలు..సామాజిక..రాజకీయ అంశాలతో తెలుగు సాహిత్యంలో అంతులేని చర్చను రేకేత్తించారు. సుప్రసిద్ధ మార్కిస్టు, స్త్రీ వాద రచయిత్రి. ఈమె రచనల్లో రామాయణాన్ని మార్క్సిస్టు దృక్పధంతో విమర్శిస్తూ రాసిన 'రామాయణ విషవృక్షం' ఒకటి. దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు చెలరేగాయి. రచయిత్రిగా ఎదిగిన క్రమం..మార్క్సిజంపై ఆకర్షితులు కావడం..ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న పరిణామాలపై రంగనాయకమ్మతో టెన్ టివి ముచ్చటించింది. ఈ సందర్భంగా ఆమె తన అభిప్రాయాలను తెలియచేశారు. ఆమె నిర్మోహమాటంగా..స్పష్టంగా చెప్పిన అభిప్రాయాలు తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

13:10 - March 26, 2017

కర్నూలు : జిల్లాలోని మంత్రాలయంలో విషాదం చోటుచేసుకుంది. లాడ్జిలో పురుగుల మందుతాగి ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. పుదుచ్చేరికిచెందిన ఇద్దరు మహిళలు, మరో వ్యక్తి ఈనెల 24 న మంత్రాలయంలోని ఓ లాడ్డిలో 52 వ రూమ్ తీసుకున్నారు. లాడ్జీ సిబ్బంది... ఈరోజు రూమ్ తెరిచి చూశారు. ముగ్గురూ మృతి చెందిన ఉన్నారు. వచ్చిన రోజే ఆత్మహత్యకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. మృతుల్లో అన్నాచెల్లెల్లు ఉన్నారు. సూసైడ్‌ నోట్ లభ్యం అయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

12:57 - March 26, 2017

హైదరాబాద్‌ : అత్తింటివేధింపులతో మరో వివాహిత బలి అయింది. బేగంపేటలో భాగ్యలక్ష్మి అనే వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఏడాది కిందట శశిధర్‌ అనే వ్యక్తితో భాగ్యలక్ష్మి ప్రేమ వివాహం జరిగింది. ఇటీవలే వివాహ మొదటి వార్షికోత్సవం జరుపుకున్న ఆసందర్భంగా దంపతులు గొడవపడ్డారు. భర్త, అత్తింటివారి వేధింపలపై బేగంపేట పోలీస్టేషన్‌లో భాగ్యలక్ష్మి ఫిర్యాదు కూడా చేసింది. అయితే.. పోలీసుల నుంచి సహకారం అందలేదని.. దీంతో అత్తంటివారి వేధింపులు మరింత ఎక్కువయ్యాయని .. అందుకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు లెటర్‌ రాసి ఇంట్లో ఉరివేసుకుంది. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

06:18 - November 5, 2015

హైదరాబాద్ : క్షణికావేశం నిండు జీవితాలను మింగేస్తోంది. కట్టలు తెంచుకున్న ఆగ్రహం బంగారు భవిష్యత్తును చిదిమేస్తోంది. తప్పు ఒప్పుల తర్కంలో, నువ్వెంత, నేనేంత అని ఎంచుకునే సమరంలో లోకాన్ని చూడని కనుపాపలు కమిలిపోతున్నాయి. అభం శుభం తెలియని చిన్నారి జీవితాలు చేయని పాపానికి ఫలితాన్ని అనుభవిస్తున్నాయి. వెలుగులు పంచకుండానే కొండెక్కుతున్న దీపాలవుతున్నాయి.

సమిధలవుతున్న చిన్నారులు..
ఏవైతేనేం.... జీవితపు మాధుర్యాన్ని రుచి చూడకుండానే, చేసుకున్న బాసలకు వాస్తవ రూపమివ్వకుండానే అర్ధాంతరంగా ఆగిపోతున్నాయి. వేదమంత్రాల మధ్య నడుమ నిర్వహించిన పెళ్లి ప్రమాణాలకు, ఊహాల పల్లకిలో, హృదయాల లోగిలిలో చేసుకున్న ఒప్పందాలను సమాధి చేస్తున్నాయి. కడదాకా సాగుతుందనుకున్న పయనం మధ్యలోనే ఆగిపోతోంది. తుది శ్వాస వరకు ఒక్కటై నిలుస్తుందనుకున్న బంధం నిట్టనిలువునా కూలిపోతోంది. ఈ దుష్పరిణామం ముక్కుపచ్చలారని చిన్నారులను చిదిమేస్తోంది. దంపతుల మధ్య మనస్పర్ధలకు, పొడసూపిన విబేధాలకు అమాయకులు మూల్యం చెల్లించుకుంటున్నారు. ఇంకా లోకాన్ని చూడని పసివారు, లోకం పోకడ తెలియని చిన్నారులు కుటుంబ కలహాలకు సమిధలవుతున్నారు. ఎవరో చేసిన నేరానికి తప్పేదో, ఒప్పేదో తెలుసుకోలేని అమాయకులు కొడిగడుతున్న దీపాలవుతున్నారు.

చచ్చిపోతున్న సహనం..
ఇన్‌స్టంట్ ప్రేమలు, హద్దులు దాటుతున్న పరిచయాలు, అవివేకవంతమైన నిర్ణయాలు రాజ్యమేలుతున్న రోజుల్లో సహనం చచ్చిపోతోంది. ఓపిక పడితే సమస్యలు సరిహద్దులు దాటిపోతాయనే ఆలోచన కనుమరుగైపోతోంది. విరక్తి రూపంలోకి ఒదిగిపోయిన మహమ్మారి బంధాలు, అనుబంధాలు అంతెందుకు చివరికి కడుపు తీపిని సైతం కన్నపేగే హతమార్చేలా చేస్తోంది. మాయమైపోతున్న మనిషితనాన్ని మరింతగా దిగజార్చుతోంది.

ప్రాణం తీసే హక్కు ఎవరిచ్చారు...?
చేజేతులా ఏ ఒక్కరూ నేరం చేయరు. తెలిసెవరూ దోషులు కారు. కానీ ఫలితం మాత్రం మోస్తున్నారు. చేయని నేరానికి చిన్నారులను కాలగర్భంలో కలిపేస్తున్నారు. పరాయి వాడైనా, పగ వాడైనా, ప్రాణ స్నేహితుడైనా చివరికి రక్తం పంచుకు బిడ్డనైనా చంపేసే హక్కు ఎవరికి లేదు. కానీ విచక్షణ మరిచిన దంపతులు చిన్నారులనే బలి తీసుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే తమ అభిప్రాయ బేధాలకు, పంతాలకు కడుపుతీపిని హత్య చేస్తున్నారు. ఇకనైనా ఈ దారుణాలకు తెరపడాలి. తాము చేసిన తప్పులకు పసివాళ్లను బలిపశువులు చేస్తున్న అరాచకానికి ముగింపు కావాలి. 

Don't Miss

Subscribe to RSS - love marriages