lovers

10:47 - October 7, 2018

పాట్నా : భారతదేశంలో ప్రేమికుల హత్యలు..ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. తమ కులం కాదని..దాడులు..దారుణాలకు పెట్రేగిపోతున్నారు. పరువు హత్యలు కూడా ఇందులో చోటు చేసుకుంటుండడం ఆందోళన వ్యక్తమౌతోంది. పాట్నాలో ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. మైనర్ ప్రేమికులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. 

బీహార్ లోని గర్దనీబాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో విష్ణుపురి ప్రాంతంలో మైనర్ యువతి..మైనర్ యువకుడు ప్రేమించుకున్నారు. అమ్మాయి వయస్సు 16 కాగా..అబ్బాయి వయస్సు 17 ఏళ్లు. వీరి ప్రేమ విషయం ఇరు కుటుంబ సభ్యులకు తెలిసింది. దీనితో వారిని మందలించారు. దీనితో వారి నివాసాల నుండి పారిపోయి వేరే దగ్గర నివాసం ఉంటున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వారిని విడదీయాలని కుటుంబసభ్యులు భావించారు. దీనితో తాము ఒక్కటిగా జీవించలేమని భావించి ఆ మైనర్ ప్రేమికులు విషం తీసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించారు. స్థానికులు..ఇతరులు గమనించి ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. కానీ అక్కడ చికిత్స పొందుతూ వారిరిరువురూ స్వల్ప వ్యవధిలోనే కన్నుమూశారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసినట్లు సమాచారం. 

10:05 - September 19, 2018

విజయవాడ : మిర్యాలగూడ పరువు హత్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఆ ఘటన మరువకముందే...ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటకు బంధువుల నుంచి వేధింపులు మొదలయ్యాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్నజంటకు...అమ్మాయి బంధువుల నుంచి వేధింపుల మొదలయ్యాయి. వేధింపులను తట్టుకోని ప్రేమజంట మీడియా ముందుకు వచ్చింది. 

కడప జిల్లాకు చెందిన మురహరి విజయ్ కుమార్, నెల్లూరు జిల్లా గూడూరు చెందిన దీప్తిరెడ్డిలు ప్రేమించుకున్నారు. కులాలు వేరు కావడంతో...వీరి పెళ్లికి అమ్మాయి బంధువులు అడ్డు చెప్పారు. దీంతో కుటుంబాన్ని ఎదురించి...జూలై 26న వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి విజయ్ కుమార్ ను చంపేస్తామంటూ...దీప్తిరెడ్డి బంధువులు బెదిరిస్తున్నారు. దీంతో విజయ్ కుమార్, దీప్తిరెడ్డిలు...రక్షణ కల్పించాలంటూ ఏపీ డీజీపీని కలిశారు. తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను డీజీపీకి వివరించారు.

తమ బంధువుల్లో కొందరు పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఉన్నత పదువుల్లో ఉన్నారని దీప్తి రెడ్డి డీజీపీకి తెలిపారు. తాము ఎక్కడికి వెళ్లినా.. ఎవరికి ఫోన్ చేసినా ట్రేస్ చేసి మానసికంగా వేధిస్తున్నారని దీప్తిరెడ్డి వాపోయింది. మూడు నెలలుగా తమను చిత్రహింసలకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ కారణంగానే పోలీసులను ఆశ్రయించినా తమకు న్యాయం జరగదని భావించి మీడియాను ఆశ్రయించినట్లు నవ దంపతులు తెలిపారు. తమను బెదిరింపుల నుంచి కాపాడాలంటూ...డీజీపీని కోరారు. ప్రణయ్ లాంటి పరిస్థితి తమకు రాకుండా...రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. 

10:35 - September 6, 2018

అదిలాబాద్ : యువతీ యువకులు ప్రేమించుకోవటం సర్వసాధారణం. వారి ప్రేమకు ఎన్నో ఆటంకాలు కూడా ఏర్పడతుంటాయి. కులం, మతం, ఆస్తులు, అంతస్థులు ఇలా వారి ప్రేమకు ప్రతిబంధాకాలుగా మారుతున్న నేపథ్యంలో కొందరు ప్రేమికులు పెద్దలను ఎదిరించలేక, ఆవేశంతోనో లేక ఆవేదనతోనో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో చావులో కూడా మేము ఒకటిగానే వుంటామంటు ఓకే తాడుతో ఒకే చెట్టుకు ఉరి వేసుకుని ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకోవటం సంచలనంగా మారింది. ఎందరో ప్రేమజంటలు ఆత్మహత్యలు చేసుకున్నాయి. కానీ ఈ తరహా ఆత్మహత్య జిల్లా ఉట్నూర్ మండలం నర్సాపూర్.జి లో ప్రేమజంట ఆత్మహత్య చేసుకోవం సంచలనంగా మారింది. చావులోనూ ఇద్దరం కలిసే చనిపోవాలనుకున్న ఆ ప్రేమజంట ఒకే చెట్టకు ఒకే తాడుతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. కాగా వీరి ఆత్మహత్యలకు కారణాలు మాత్రం పూర్తిస్థాయిలో తెలియరాలేదు. స్థానికలు సమచారం మేరకు సంఘనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఐతే చెట్టుకు శవాలు వేలాడుతున్న తీరును చూస్తుంటే ఎవరైనా వారిని హత్య చేసి అలా చెట్టుకు వేలాడదీశారా అన్న అనుమానాలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో వీరు ఆత్మహత్య చేసుకున్నారా? లేదా ఎవరైరా వారిని హత్య చేసిన ఆత్మహత్యగా చిత్రీకరించారా? అనే కోణంలో పోలీసులు తమ దర్యాప్తును కొనసాగిస్తున్నారు. 

17:14 - July 25, 2018

హైదరాబాద్ : తిరుమలగిరిలో ఓ ఆర్మీ జవాన్ దారుణాలకు పాల్పడుతున్న విషయం వెలుగు చూసింది. ఒంటరిగా ఉన్న ఓ ప్రేమజంటపై ఆర్మీ జవాన్ బ్రిజేష్ కుమార్ అత్యాచారానికి పాల్పడేందుకు యత్నించాడు. అత్యాచారానికి యత్నిస్తున్న సమయంలో యువతి స్నేహితుడు అడ్డుకోవటంతో అతనిపై కూడా జవాన్ దాడి చేశాడు. ఈ దాడిలో ప్రియుడిపై బ్రిజేష్ దాడి చేయడంతో అతని పళ్లు ఊడిపోయాయి. యువతి అరుపులు, కేకలు వేయడంతో గస్తీ తిరుగుతున్న పోలీసులు ఆమెను రక్షించారు. జవాన్‌ను పట్టుకునేందుకు పోలీసులు యత్నించగా... దాడికి పాల్పడ్డాడు. అయినా కూడా పోలీసులు జవాన్‌ను అదుపులోకి తీసుకున్నారు.కాగా నాలుగు నెలల క్రితం పదో తరగతి విద్యార్థినిపై బ్రిజేష్ అత్యాచారానికి పాల్పడ్డాడు. డీఎన్ఏ ఆధారంగా ఈ రెండు కేసుల్లో అతని ప్రమేయం ఉన్నట్లుగా సమాచారం. 

12:00 - May 29, 2018

హైదరాబాద్‌ : యూసుఫ్‌గూడలో యువతిని దారుణంగా హత్య చేసిన ప్రేమోన్మాది సాగర్‌ పోలీసుల ముందు లొంగిపోయాడు. వెంకటలక్ష్మీ తన ప్రేమను నిరాకరించిందని ఓ గోల్డ్‌షాప్‌లో ఆమె గొంతు కోసి చున్నీ భిగించి అతి దారుణంగా చంపేశాడు. తన ప్రేమను నిరాకరించిందని యువతిని హత్య చేశాడు. 

 

14:42 - May 21, 2018

కరీంనగర్ : ప్రేమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదు. ఎదురించి..వారిని ఒప్పించే విధంగా చేయాల్సిన ఓ ప్రేమ జంట తనువు చాలించు కోవాలని అనుకున్నారు. విషం తాగారు. ఈ ఘటనలో ప్రియురాలు మృతి చెందగా ప్రియుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మైలారంకు చెందిన అంజలి, లోహిత్ లు ప్రేమించుకున్నారు.

అంజలికి వివాహం చేయాలని పెద్దలు సంబంధాలు వెతుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న లోహిత్, అంజలిలు ఇంటి నుండి బయటకు వెళ్లిపోయారు. అనంతరం ఓ గుడి దగ్గర విషం సేవించారు. స్నేహితులు విషయం తెలుసుకుని ఆసుపత్రికి తరలించారు. కానీ చికిత్స పొందుతూ అంజలి మృతి చెందగా ప్రియుడు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. దీనితో అంజలి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 

11:07 - May 3, 2018

రంగారెడ్డి : తనను పట్టించుకోవడం మానేసిందని ప్రియురాలిపై యాసిడ్‌తో దాడికి దిగాడు ఓ ప్రేమికుడు. హయత్‌నగర్‌ నివాసంలో ఉంటున్న ఝాన్సీ, శంకర్‌లు రెండు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. అయితే కొద్ది రోజులుగా ఝాన్సీ తనను పట్టించుకోకపోవడంతో కోపం పెంచుకున్నాడు శంకర్‌. ఝాన్సీ స్నేహితురాలు రమ్య తన గురించి చెడుగా చెప్పడం వల్లనే తనకు దూరంగా ఉంటుందని భావించిన శంకర్‌.... నిన్న రాత్రి నడుచుకుంటూ వెళ్తున్న ఝాన్సీ, రమ్యలపై యాసిడ్‌తో దాడి చేశాడు. ఆ యాసిడ్‌ కాన్సెంట్రేటెడ్‌ కాకపోవడంతో వీరికి ప్రమాదం తప్పింది. ఝాన్సీ, రమ్య పెట్రోల్‌ బంక్‌లో పని చేస్తున్నారు. 

14:57 - April 24, 2018

సిద్ధిపేట : జిల్లాలో విషాదం జరిగింది. జిల్లాలోని కొత్తబస్టాండ్‌లో ప్రేమ జంట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన స్థానికులు ఇద్దరినీ ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ప్రియుడు సంతోష్‌ రెడ్డి మృతి చెందగా, ప్రియురాలు రాణి పరిస్థితి విషమంగా ఉంది. అయితే వీరి కులాలు వేరు అయినందున తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకోరని మనస్థాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డారు.  

07:13 - March 31, 2018

వికారాబాద్ : జిల్లా కొడంగల్‌ మండలంలో విషాదం చోటుచేసుకుంది. తమ ప్రేమను పెద్దవాళ్లు అంగీకరించలేదన్న మనస్తాపంతో... ప్రేమికులు పురుగుల మందు తాగారు. పొలాల్లో అపస్మారక స్థితిలో పడి ఉన్న ఇద్దరినీ స్థానికులు తాండూరు ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గమధ్యంలోనే ప్రియురాలు రోజా మృతిచెందగా... ప్రియుడు రాజు పరిస్థితి విషమంగా ఉంది. మరో 15రోజుల్లో వేరే వ్యక్తితో రోజాకు ఎంగేజ్‌మెంట్‌ ఉండటంతో... ఇరువురు ఈ దారుణానికి పాల్పడి ఉండవచ్చని.. స్థానికులు చెబుతున్నారు.

18:50 - March 30, 2018

హైదరాబాద్ : గోల్నాకలో దారుణం జరిగింది. లాలాగూడ ఘటన మరవక ముందే మరో ఘటన చోటుచేసుకుంది. ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడిన బాలిక మృతి చెందింది. తన ప్రేమను నిరాకరించిందని మూడు రోజుల క్రితం బాలికపై సొహైల్ అనే యువకుడు కిరోసిన్ పోసి నిప్పంటించాడు. బాలిక తీవ్రంగా గాయపడింది. 3 రోజులుగా ఉస్మానియాలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందింది.  

 

Pages

Don't Miss

Subscribe to RSS - lovers