Madhav
అమరావతి : వైఎస్ జగన్- యనమల మధ్య అసెంబ్లీలో ఆసక్తికర చర్చ జరిగింది. ప్రతిపక్ష సభ్యులు బడ్జెట్‌పై అడిగిన ప్రశ్నలకు యనమల సమాధానమిస్తున్న సమయంలో జగన్ బయటకు వెళ్లారు. దీంతో జగన్ బాత్రూమ్కు వెళ్లారా అని యనమల అడగగా.. బాత్రూమ్కు కూడా చెప్పి వెళ్లాలా అని జగన్ ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు మాత్రం బడ్జెట్‌పై చర్చ జరుగుతుంటే మనవడి పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ వెళ్లొచ్చున్నారు. దీనికి సమాధానంగా సీఎం స్పీకర్‌కు చెప్పే వెళ్లారని యనమల చెప్పారు.
అమరావతి : పోలవరం ప్రాజెక్టుకు అయ్యే ఖర్చు మొత్తాన్ని కేంద్రం భరిస్తుందని.. ఇందుకోసం చంద్రబాబు కృషిచేశారని యనమల రామకృష్ణుడు అన్నారు. 2019 కల్లా పోలవరాన్ని పూర్తిచేస్తామని స్పష్టంచేశారు.
అమరావతి: ఏపీలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల 8వ రౌండ్ కౌంటింగ్ పూర్తయింది. 5 వేల 45 ఓట్ల ఆధిక్యంలో టీడీపీ-బీజేపీ అభ్యర్థి పీవీఎస్ మాధవ్ ఉన్నారు. మాధవ్‌కు 42 వేల 863 ఓట్లు రాగా.. అజ శర్మకు 37 వేల 818 ఓట్లు పోలయ్యాయి. అటు పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయింది. టీడీపీ అభ్యర్థి కేకే రెడ్డిపై 12 వేల 682 ఓట్ల ఆధిక్యంలో వైసీపీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి ఉన్నారు. అటు తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇందులో ఏడుగురు అభ్యర్థులను ఎలిమినేట్ చేశారు. టీడీపీ అభ్యర్థి పట్టాభిరామిరెడ్డికి 258 ద్వితీయ ప్రాధాన్య ఓట్లు రాగా.. పీడీఎప్ అభ్యర్థి యండపల్లి శ్రీనివాస్‌రెడ్డికి 224 ఓట్లు వచ్చాయి. దీంతో యండపల్లి ఆధిక్యం 3 వేలపైగా చేరుకుంది.
హైదరాబాద్ : ఏపీలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు నాలుగో రౌండ్ కౌంటింగ్ పూర్తి అయింది. టీడీపీ...బీజేపీ అభ్యర్థి పీవీఎస్ మాధవ్ 4095 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక మూడో కౌండ్ కౌంటింగ్ పూర్తి అయింది. వైసీపీ అభ్యర్థి వెన్నపూస గోపాల్ రెడ్డి 5924 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. నాలుగో రౌండ్ లో పీడీఎస్ అభ్యర్థి యండవల్లి శ్రీనివాస్ రెడ్డి 4 వేల ఆధిక్యంలో ఉన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

హైదరాబాద్ : ఏపీలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో రెండుచోట్ల పీడీఎఫ్ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థి విఠపు బాలసుబ్రహ్మణ్యం, పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం నుంచి కత్తి నర్సింహారెడ్డి గెలుపొందారు. విజయ సాధించిన ఇద్దరు పీడీఎఫ్ ఎమ్మెలీలను పలువురు అభినందించారు.
పీడీఎఫ్ అభ్యర్థులు విజయఢంకా
ఏపీలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థులు విజయఢంకా మోగించారు. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలు కలిసివున్న తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం నుంచి విఠపు బాలసుబ్రహ్మణ్యం గెలుపొందారు. అనంతపురం, కడప, కర్నూలు జిల్లాలు కలిసివున్న పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం నుంచి కత్తి నర్సింహారెడ్డి విజయం సాధించారు.
బాలసుబ్రహ్మణ్యం గెలుపు
తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం నుంచి విఠపు బాలసుబ్రహ్మణ్యం వరుసగా మూడవసారి గెలుపొందారు. టీడీపీ బలపరిచిన వాసుదేవనాయుడుపై రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో బాలసుబ్రహ్మణ్యం విజయం సాధించారు. బాలసుబ్రహ్మణ్యంకు 3,545 ఓట్లు ఆధిక్యతంలో గెలిచారు. ఈ ఎన్నికల్లో మొత్తం 17,652 ఓట్లు పోలయ్యాయి. 537 ఓట్లు చెల్లలేదు. ఉపాధ్యాయులు తనపై ఉంచిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని విఠపు బాలసుబ్రహ్మణ్యం చెబుతున్నారు.
కత్తి నర్సింహారెడ్డి గెలుపు
పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం నుంచి పీడీఎఫ్ అభ్యర్థి కత్తి నరసింహారెడ్డి విజయం సాధించారు. స్వతంత్ర అభ్యర్థి ఒంటేరు శ్రీనివాసులురెడ్డిపై 3,759 ఓట్ల ఆధిక్యతతో గెలిచారు. నియోజకవర్గంలో మొత్తం 18,840 ఓట్లు పోలయ్యాయి. వీటిలో 9,620 ఓట్లు నర్సింహారెడ్డికి వచ్చాయి. 513 ఓట్లు చెల్లలేదు. 26 నోటా ఓట్లు నమోదయ్యాయి. టీడీపీ బలపరిచిన ప్రస్తుత ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య 3,812 ఓట్లతో మూడోస్థానంలో నిలిచారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయానికి కృషి చేసిన నేతలకు కత్తి నర్సింహారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. తూర్పు, పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలను నుంచి విజయం సాధించిన పీడీఎఫ్ అభ్యర్థులను పలువురు నేతలు, ఉపాధ్యాయులు అభినందించారు.

అమరావతి: ఏపీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థులు హవా కొనసాగిస్తున్నారు. తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థి విఠపు బాలసుబ్రమణ్యం విజయం సాధించారు. రాయలసీమ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థి కత్తి నర్శింహారెడ్డి గెలుపొందారు. వీరి గెలుపును కాసేపట్లో అధికారిక ప్రకటన విడుదల కానుంది.
చిత్తూరు: ఏపీలో ఎమ్మెల్సీ కోటాలో 3 పట్టబధ్రుల స్థానాలు, 2 ఉపాధ్యాయ స్థానాల కౌంటింగ్ కొనసాగుతోంది. రేపు ఉదయానికి పూర్తిస్థాయిలో ఫలితాలు వెలువడనున్నాయి. చిత్తూరు తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కౌంటింగ్ లో పీడీఎఫ్ ఆధిక్యంలో ఉంది. ఇక్కడ తొలిరౌండ్లో 1766ఓట్ల ఆధిక్యంలో పీడీఎఫ్ అభ్యర్థి విఠపు బాలసుబ్రమణ్యం ఉన్నారు. అనంతపురం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కౌంటింగ్‌లో బీజేపీ అభ్యర్థి ఒంటేరు శ్రీనివాసరెడ్డిపై.. పీడీఎఫ్ అభ్యర్థి కత్తి నర్సింహారెడ్డి 2వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మరోవైపు విశాఖలో పట్టభద్రుల కౌంటింగ్ ఆలస్యమైంది.
విశాఖ : ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ కౌంటింగ్ విశాఖలోని స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో కొనసాగుతోంది. మొత్తం 30 మంది అభ్యర్థులో బరిలో ఉండగా.. ప్రధానంగా టీడీపీ-బీజేపీ ఉమ్మడి అభ్యర్థి మాధవ్, పీడీఎఫ్ అభ్యర్థి అజాశర్మ మధ్యే నెలకొంది. కౌంటింగ్‌కు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..
విశాఖపట్టణం : ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ పట్టభద్రులకు ఎన్నికల నామినేషన్ల పర్వం జోరుగా కొనసాగుతోంది. ఎవరిని బరిలోకి దించాలన్న దానిపై టిడిపి, బిజెపిలు తర్జనభర్జనలు పడిన సంగతి తెలిసిందే. చివరకు బీజేపీకి కేటాయిస్తున్నట్లు టిడిపి ప్రకటించింది. రాష్ట్ర కార్యవర్గసభ్యులు వి.వి.ఎన్.మాధవ్ కు బీజేపీ బరిలో నిలిపింది. శనివారం ఆయన నామినేషన్ ను దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులతో పాటు బీజేపీ, టిడిపి నేతలు భారీగా తరలివచ్చారు.
Don't Miss
