madhya Pradesh

09:13 - June 13, 2018

భూపాల్ : మధ్యప్రదేశ్‌కు చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక గురువు భయ్యూజీ మహారాజ్‌ తుపాకితో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. భయ్యూజీ మహారాజ్‌ను హుటాహుటిన ఇండోర్‌లోని ముంబై ఆసుపత్రిలో చేర్చగా... చికిత్స పొందుతూనే ఆయన కన్ను మూశారు. ఆయన ఇంట్లో సూసైడ్‌ నోట్‌ లభించింది. జీవితంపై విరక్తి చెందడం వల్లే ఆత్మహత్యకు పాల్పడినట్లు పేర్కొన్నారు. తన చావుకు ఎవరూ బాధ్యులు కారని సుసైడ్‌ నోట్‌లో ఉంది. సుసైడ్‌ నోట్‌తో పాటు పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు భయ్యూజీ మరణంపై  దర్యాప్తు చేపట్టారు. భయ్యూజీ తుపాకితో తనని తాను తలపై కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డట్లు పోలీసులు తెలిపారు.  ఫోరెన్సిక్‌ బృందం సుసైడ్‌ నోట్‌పై దర్యాప్తు జరుపుతోంది.  భయ్యూజీ మహారాజ్‌కి రాజకీయాలతోనూ సంబంధాలున్నాయి. శివరాజ్‌సింగ్‌ ప్రభుత్వం ఇటీవల ఆయనకు కెబినెట్‌ మంత్రి హోదా పదవిని ఆఫర్‌ చేయగా ఆయన దాన్ని సున్నితంగా తిరస్కరించారు. భయ్యూజీ మొదటి భార్య చనిపోవడంతో ఇటీవల రెండో పెళ్లి చేసుకున్నారు.

 

13:44 - May 21, 2018

మధ్యప్రదేశ్‌ : ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గునాలో ఓ ట్రక్కు - బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 9 మంది చనిపోయారు. మరో 20 మందికి గాయాలుకాగా... వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈప్రమాదంలో బస్సు ముందుభాగం నుజ్జునుజ్జయ్యింది. అయితే డ్రైవర్‌ నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. 

13:22 - May 21, 2018

మధ్యప్రదేశ్ : ఢిల్లీ నుంచి విశాఖపట్నం వస్తున్న ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయి. బి6, బి7 ఏసీ బోగీల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఢిల్లీ నుండి విశాఖ వస్తుండగా గ్వాలియర్ వద్ద బిర్లా నగర్ రైల్వే స్టేషన్ వద్ద బోగీల్లో చెలరేగిన మంటలు ఒక్కసారిగా బోగీ అంతా వ్యాపించాయి. ఈ ప్రమాదంలో రెండు బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. దట్టమైన పొగతో మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ రైలును నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదం నుంచి 36 మంది ట్రైనీ ఐఏఎస్‌లు సురక్షితంగా బయటపడ్డారు. కాగా ఈ ఘటనపై రైల్వే శాఖ దృష్టిసారించింది. ప్రయాణీకులను వేరే ట్రైన్స్ లో తరలించారు. గాయపడినవారికి రైల్వే ఆసుపత్రిలో చికిత్సనందిస్తున్నారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పేందుకు యత్నిస్తున్నారు. 

08:47 - April 6, 2018

భూపాల్ : మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం హిందూ సాధువులకు కాబినెట్‌ హోదా కల్పించడంపై శంకరాచార్య స్వామి స్వరూపనంద తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆధ్మాత్మిక భావంతో ప్రజలు సాధువులను గౌరవిస్తారని.... శివరాజ్‌సింగ్‌ ప్రభుత్వం తమ స్వార్థం కోసం స్వాములకు మంత్రి హోదా కల్పించడాన్ని ఆయన దుయ్యబట్టారు. ప్రజలకు వారెవరో కూడా తెలియదన్నారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో  ఐదుగురు సాధువులు నర్మదానంద్‌ మహరాజ్‌, హరిహరానంద్‌ మహరాజ్‌, కంప్యూటర్‌ బాబా, భయ్యూ మహరాజ్‌, పండిత్‌ యోగేంద్ర మహంత్‌లకు ఎంపి ప్రభుత్వం క్యాబినెట్‌ హోదా కల్పించింది. నర్మదా నది పరిరక్షణను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఎంపి ప్రభుత్వం ఆరోపణలు ఎదుర్కొంటున్న సమయంలో శివరాజ్‌సింగ్‌ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఓట్ల కోసమే సాధువులకు కెబినెట్‌ హోదా కల్పించిందని కాంగ్రెస్‌ విమర్శించింది.

18:42 - April 4, 2018

మధ్యప్రదేశ్ : అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం వివాదస్పద నిర్ణయం తీసుకుంది. కంప్యూటర్‌ బాబా సహా ఐదుగురు హిందూ సాధువులకు కాబినెట్‌ హోదా కల్పిస్తూ శివరాజ్‌సింగ్‌ ప్రభుత్వం తీర్మానం చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో నర్మదానంద్‌ మహరాజ్‌, హరిహరానంద్‌ మహరాజ్‌, కంప్యూటర్‌ బాబా, భయ్యూ మహరాజ్‌, పండిత్‌ యోగేంద్ర మహంత్‌లు  క్యాబినెట్‌ హోదా పొందారు. ఈ హోదా కల్పించడానికి నాలుగు రోజుల ముందు వీరికి నర్మదా పరిరక్షణ కమిటీలో సభ్యులుగా నియమించడం గమనార్హం. నర్మదా నది పరిరక్షణను శివరాజ్‌ సింగ్‌ ప్రభుత్వం గాలికి వదిలేసిందని కాంగ్రెస్‌ విమర్శించింది. కాబినెట్‌ హోదా పొందిన బాబాలు నర్మదా నది ఒడ్డున ఆరుకోట్ల మొక్కలు నాటారో లేదో తేల్చాలని సూచించింది. మరోవైపు నదిని కాపాడుకునేందుకే సాధువులకు మంత్రి హోదా ఇవ్వడం జరిగిందని బిజెపి తన నిర్ణయాన్ని సమర్థించుకుంది. 

 

08:18 - April 1, 2018

మధ్యప్రదేశ్ : రాష్ట్రంలో ఘోరమైన ప్రమాదం చోటు చేసుకుంది. ఇండోర్ లో నాలుగంతస్తుల పురాతన హోటల్ భవనం కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో పది మంది మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలున్నట్లు సమాచారం. శిథిలాల కింద చాలా మంది ఉంటారని తెలుస్తోంది. ఇప్పటి వరకు పది మంది మృతదేహాలను వెలికి తీశారు. శనివారం రాత్రి 9గంటలకు ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రద్దీ ప్రాంతంలో ఈ హోటల్ ఉండడంతో మృతుల సంఖ్య ఎక్కువగానే ఉంటుందని సమాచారం. సమాచారం తెలుసుకున్న అధికారులు హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టారు. తమ వారి ఆచూకి తెలియకపోవడంతో బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.

14:53 - January 8, 2018

భూపాల్ : మధ్యప్రదేశ్‌లో ఓ బీజేపీ నేతకు ఊహించని పరిణామం ఎదురైంది. ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఆ నేతకు స్థానికుడు ఒకరు చెప్పుల దండ వేసి నిరసన వ్యక్తం చేశాడు. మధ్యప్రదేశ్‌ స్థానిక సంస్థల ఎన్నికలు జనవరి 17న జరగనున్న నేపథ్యంలో ఓట్ల కోసం ప్రచారానికి వెళ్లిన దినేష్‌ శర్మకు ఈ అవమానం ఎదురైంది. తమ ప్రాంతంలో నీటి సమస్య తీవ్రంగా ఉందని...ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో ఇలా నిరసన వ్యక్తం చేశానని దండ వేసిన పెద్దాయన పేర్కొన్నారు. ఆయన చర్య పట్ల తనకు ఎలాంటి కోపం లేదని...వారి అవసరాలు తీర్చేందుకు మరింత పనిచేస్తానని బీజేపీ నేత చెప్పారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

 

06:48 - December 23, 2017

ఢిల్లీ : ఇండోర్‌ టీ -20 మ్యాచ్‌లోనూ టీమ్‌ ఇండియా జోరు కొనసాగింది. హోల్కార్‌ స్టేడియం వేదికగా జరిగిన రెండో టీ -20లో భారత్‌ శ్రీలంకను చిత్తు చేసింది. 88 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మూడు టీ -20ల సిరీస్‌ను 2-0తో టీమ్‌ ఇండియా కైవసం చేసుకుంది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమ్‌ ఇండియా మొదటి నుంచీ దూకుడు ప్రదర్శించింది. ఓపెనర్లు రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌ టీమ్‌ ఇండియాకు శుభారంభం అందించారు. రోహిత్‌ శర్మ 118 రన్స్‌తో చెలరేగగా.... రాహుల్‌ 89 రన్స్‌తో ఆదుకున్నాడు. దీంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. తొలుత 23 బందుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో హాఫ్‌ సెంచరీ సాధించిన రోహిత్‌.. ఆ తర్వాత మరో 12 బాల్స్‌లోనే మిగతా యాభై పరుగులు పూర్తి చేశాడు. 35 బంతుల్లో 11బౌండరీలు, 8 సిక్సర్లతో సెంచరీ సాధించి అంతర్జాతీయ టీ -20ల్లో ఫాస్టెస్ట్‌ సెంచరీ సాధించిన రికార్డు సమం చేశాడు. 108 రన్స్‌ను రోహిత్‌ కేవలం ఫోర్లు, సిక్సర్ల రూపంలోనే రాబట్టాడు.

జట్టు స్కోరు 165 పరుగుల వద్ద రోహిత్‌ ఔటయ్యాడు. ఆ తర్వాత రాహుల్‌ హాఫ్‌ సెంచరీ చేశాడు. జట్టు స్కోరు 243 రన్స్‌ దగ్గర రాహుల్‌ పెవిలియన్‌ చేరాడు. ధోనీ కూడా సొగసైన షాట్లతో అలరించాడు. 20 ఓవర్లలో టీమ్‌ ఇండియా 5 వికెట్లు కోల్పోయి 260 పరుగులు చేసింది.

భారత్‌ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో శ్రీలంక అత్యంత దూకుడుగా ఆడింది. తొలి వికెట్‌ను 36రన్స్‌ దగ్గర కోల్పోయిన లంక... ఆపై విజృంభించింది. తరంగా, కుశాల్‌ పెరీరా బౌండరీల మోత మోగించారు. ఈ జోడీకి జట్టు స్కోరు 145 రన్స్‌ దగ్గర చాహల్‌ బ్రేక్‌ ఇచ్చాడు. తరంగాను అవుట్‌ చేసి టీమ్‌ ఇండియా శిబిరంలో జోష్‌ నింపాడు. ఆ తర్వాత కుల్దీప్‌ వేసిన 15 ఓవర్‌లో లంక మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ ఓవర్‌ తొలి బంతికి కెప్టెన్‌ తిషాల్‌ పెరీరా, ఆ తర్వాత బంతికి కుశాల్‌ పెరీరా ఔటయ్యాడు. ఇక ఐదో బంతికి గుణరత్నేను కూడా పెవిలియన్‌కు పంపాడు. దీంతో 161 పరుగులకు లంక 5 కీలక వికెట్లు చేజార్చుకుంది.

తర్వాతి ఓవర్‌ను వేసిన చాహల్‌ వరుస బంతుల్లో చతురగ డిసిల్వా, సమరవిక్రమను అవుట్‌ చేశాడు. ఆ ఓవర్‌ ఐదో బంతికి అకిల ధనంజయను పెవిలియన్‌ పంపాడు. ఈ రెండు ఓవర్లలో శ్రీలంక ఆరు వికెట్లు కోల్పోయింది. అప్పటి వరకు ఉత్కంఠను రేపిన మ్యాచ్‌ కాస్తా ఏకపక్షంగా మారిపోయింది. దీంతో 172 పరుగులకు శ్రీలంక ఆలౌట్‌ అయ్యింది. భారత బౌలర్లలో చాహల్‌ 4 వికెట్లు తీయగా.. కుల్దీప్‌ మూడు వికెట్లు పడగొట్టాడు. హార్థిక్‌, ఉనద్కట్‌ చెరో వికెట్‌ తీశారు. 118రన్స్‌ చేసి టీమ్‌ ఇండియా విక్టరీలో కీలకపాత్ర పోషించిన రోహిత్‌శర్మకు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది. ఇండోర్‌ విజయంతో మూడు టీ-20ల సిరీస్‌ను భారత్‌ 2-0 తేడాతో కైవసం చేసుకుంది.

22:13 - December 22, 2017

బెంగుళూరు : ఇండోర్‌లో శ్రీలంకకు భారత్ చుక్కలు చూపించింది. కెప్టెన్ రోహిత్ శర్మ చెలరేగడంతో... భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 261 పరుగులు చేసింది. టీమిండియా సారథి రోహిత్‌ శర్మ 43 బంతుల్లో 118 రన్స్ చేశాడు. ఓ దశలో 35 బంతుల్లోనే చరిత్రలో వేగవంతమైన సెంచరీ బాదేసి.. డేవిడ్‌ మిల్లర్‌ రికార్డును సమం చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో 12 బౌండరీలు.. 10 సిక్సర్లు ఉండటం విశేషం. తరువాత రాహుల్ కూడా విజృంబించాడు. 49 బంతుల్లో 89 పరుగులు చేశాడు. చివర్లో ధోనీ 28 రన్స్ చేయడంతో స్కోర్ 260కి చేరింది. మొత్తం మ్యాచ్‌లో 21 ఫోర్లు, 21 సిక్సులు ఉండటం విశేషం. 

 

21:35 - November 20, 2017

భోపాల్ : వివాదాస్పద పద్మావతి చిత్రాన్ని తమ రాష్ట్రంలో నిషేధిస్తున్నట్టు మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించింది. చరిత్రను వక్రీకరించిన పద్మావతి చిత్రంపై నిషేధం విధించాలని రాజ్‌పుత్‌ సంఘాలు చేసిన విజ్ఞప్తి మేరకు సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. సెన్సార్‌ సమస్యల నేపథ్యంలో డిసెంబర్‌ 1న విడుదల కావాల్సిన పద్మావతి మూవీని వాయిదా వేస్తున్నట్టు చిత్ర నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. పద్మావతి చిత్రానికి సెన్సార్‌ సర్టిఫికేషన్‌ కోసం అవసరమైన పత్రాలను సమర్పించలేదని సెన్సార్‌ బోర్డ్‌ చీఫ్‌ ప్రసూన్‌ జోషి పేర్కొన్నారు. సెన్సార్‌ సర్టిఫికెట్‌ కోసం చేసిన దరఖాస్తు అసంపూర్తిగా ఉందంటూ చిత్రాన్ని సీబీఎఫ్‌సీ నిర్మాతకు తిప్పిపంపింది. 

Pages

Don't Miss

Subscribe to RSS - madhya Pradesh