mahajana padayatra

13:36 - January 20, 2017

వరంగల్ : అటవీభూములను సాగుచేసుకుంటున్న గిరిజనులకు హక్కుపత్రాలు ఇవ్వాలని గిరిజన విద్యార్థినేత శోభన్‌ నాయక్‌ డిమాండ్‌ చేశారు. అటవీ భూములపై గిరిజనులకు హక్కులేదని కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలను శోభన్‌నాయక్‌ తీవ్రంగా ఖండించారు. భూపాలపల్లి జిల్లాలో ఉత్సాహంగా కొనసాగుతున్న సీపీఎం మహాజన పాదయాత్ర బృందంలో శోభన్‌నాయక్‌ పాల్గొన్నారు. 96వ రోజు సీపీఎం మహాజన పాదయాత్ర భూపాలపల్లిలో కొనసాగుతోంది. చెల్పూరు, మంజూర్‌నగర్‌, భూపాలపల్లి, బస్వరాజుపల్లిలో పాదయాత్ర బృంద సభ్యులు ఉత్సాహంగా పర్యటిస్తున్నారు. సింగరేణిలో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని శోభన్‌నాయక్‌ డిమాండ్‌ చేశారు. భూములు కోల్పోయిన వారికి 2013 చట్టం ప్రకారం నష్ట పరిహారం చెల్లించి.. ఇంటికొక ఉద్యోగం కూడా ఇవ్వాలని శోభన్‌ నాయక్‌ డిమాండ్ చేశారు.

13:34 - January 20, 2017

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్యది వన్‌మ్యాన్‌ షోనే అని.. అలాగే మహాజనపాదయాత్రలోనూ తమ్మినేని వీరభద్రంది వన్‌మ్యాన్ షోనే అని మంత్రి హరీష్‌రావు విమర్శించారు. ఆయన టీఆర్ ఎస్ ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. పాదయాత్రకు ప్రజల నుంచి స్పందన శూన్యమన్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల పనితీరు గురించి మాట్లాడుతూ సీపీఎంపై తీవ్రస్థాయిలో హరీష్‌ విరుచుకుపడ్డారు. ప్రజలను రెచ్చగొడుతూ సీపీఎం రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. పేదల పార్టీ అని చెప్పుకునే సీపీఎం ఎన్నడూ పేదల కోసం పాటుపడింది లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. తమ్మినేని సొంత నియోజకవర్గంలో ఆ పార్టీకి కనీసం డిపాజిట్స్ కూడా దక్కలేదన్నారు.

13:40 - January 19, 2017

వరంగల్ : సీపీఎం నిర్వహిస్తున్న మహాజన పాదయాత్ర 95వ రోజుకు చేరుకుంది. గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటన కొనసాగుతోంది. పాదయాత్ర బృందానికి గ్రామస్తులు ఘన స్వాగతం పలుకుతున్నారు. చెన్నాపూర్, రేగొండ, బాగెర్తిపేటలో బృందం పర్యటించనుంది. భౌగోళిక తెలంగాణ రాష్ట్రం మాత్రమే వచ్చిందని సామాజిక తెలంగాణ రాలేదని పాదయాత్ర బృంద సభ్యుడు ఆశయ్య టెన్ టివికి తెలిపారు. ఇప్పటి వరకు 900 గ్రామాలపైనా పాదయాత్ర బృందం పర్యటించిందన్నారు. కులసంఘాలను, నాయకులను సీఎం కేసీఆర్ మభ్య పెడుతున్నారని, ఎన్నో కులాల వారు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారని, వృత్తులు దెబ్బతింటున్నాయన్నారు. ఇంకా ఏమి మాట్లాడారో తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

10:56 - January 19, 2017

వరంగల్ : పదండి ముందుకు.. పోదాం పోదాం.. అంటూ... ఎర్రజెండా చేతబట్టి కదం తొక్కిన సీపీఎం మహాజన పాదయాత్ర 94 రోజులు పూర్తి చేసుకుంది. తమ్మినేని బృందానికి పల్లెపల్లెలో అపూర్వ స్వాగతం లభిస్తోంది. కేసీఆర్‌ ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల ప్రజల సంక్షేమాన్ని తుంగలో తొక్కిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. కేసీఆర్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లయినా... ప్రజలికిచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. టీఆర్‌ఎస్‌ పాలనలో ప్రజలంతా తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అట్టడుగు, బడుగు, బలహీన వర్గాల సంక్షేమాన్ని మరిచిన కేసీఆర్‌ ప్రభుత్వం ప్రజలను వంచించిందని తమ్మినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి, కేజీ టూ పీజీ ఉచిత విద్య హామీల మాటేమిటని తమ్మినేని ప్రశ్నించారు. తెలంగాణలో విద్యావ్యవస్థ అస్తవ్యస్థం అయినా..ఈ ప్రభుత్వం ఏం పట్టనట్లు వ్యవహరించడం దారుణమని ఆయన అన్నారు. చేనేత కార్మికులకు పెన్షన్‌లు ఇవ్వాలని, వారికి హెల్త్‌కార్డులిచ్చి ఆదుకోవాలని తమ్మినేని డిమాండ్ చేశారు.

ములుగు మాజీ ఎమ్మెల్యే సీతక్క పాదయాత్రలో పాల్గొని తమ్మినేని బృందానికి మద్దతు తెలిపారు. అసెంబ్లీని వేదికగా చేసుకుని కేసీఆర్‌ ప్రభుత్వం అబద్దాలను ప్రచారం చేస్తున్నారని సీతక్క అన్నారు. కేసీఆర్‌ ఫామ్‌ హౌజ్‌లో ఉండి కలలు కంటూ.. ప్రజలను మోసం చేస్తున్నారని ఆమె విమర్శించారు. సీపీఎం మహాజన పాదయాత్ర 94 రోజులు పూర్తి చేసుకుంది. 94వ రోజు పాదయాత్ర బృందం వరంగల్‌ రూరల్ జిల్లాలోని నేరుకుల్ల, పత్తిపాక, శాయంపేట, మైలారం, జోగంపల్లి, పెద్దకోడెపాక, పరకాలలో పర్యటించింది. తమ్మినేని పాదయాత్రకు భూపాలపల్లి మాజీ జెడ్పీ ఛైర్మన్‌ గండ్ర సత్యనారాయణ, సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ సంఘీభావం తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తీరుపై సీఎం కేసీఆర్‌కు తమ్మినేని లేఖ రాశారు.

14:35 - January 17, 2017

వరంగల్ : సీపీఎం మహాజన పాదయాత్ర 93వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వరంగల్‌లోని కొన్ని గ్రామాలలో మహాజన బృందం పాదయాత్ర కొనసాగింది. కాగా రోహిత్‌ వేముల వర్ధంతి సందర్భంగా ఆయనకు సీపీఎం నేతలు నివాళులు అర్పించారు. బీజేపీ మతోన్మాద చర్యలు రోహిత్‌ మరణానికి కారణమని.. సంబంధిత బాధ్యులను వెంటనే శిక్షించాలని సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం డిమాండ్‌ చేశారు.

06:48 - January 17, 2017

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం వచ్చినా.. రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం ప్రజలు సంతోషంగా లేరని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. తెలంగాణ అభివృద్ధి చెందాలంటే, ప్రజల బతుకులు మారాలంటే కనీస వసతులు కల్పించాలని ఆయన డిమాండ్‌ చేశారు. సామాజిక తెలంగాణ సాధనకు ప్రజలు ఉద్యమించాలని తమ్మినేని పిలుపునిచ్చారు. బంగారు తెలంగాణ అంటూ ప్రచారం చేసుకుంటూ..ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రజాసమస్యలను గాలికొదిలేశారని తమ్మినేని ధ్వజమెత్తారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామన్న కేసీఆర్‌... ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదని విమర్శించారు. పిల్లలందరికీ నాణ్యమైన విద్య అందిస్తే బంగారు తెలంగాణ అదే సాధ్యం అవుతోందని ఈ సందర్భంగా తమ్మినేని అన్నారు.

ఇచ్చిన హామీలను విస్మరించి.....

టీఆర్‌ఎస్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను విస్మరించిందని, ప్రభుత్వం పూర్తిగా అవినీతి, పక్షపాత ధోరణితో పాలన సాగిస్తోందని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. కేసీఆర్‌ ఇచ్చిన హామీలను నెరవేర్చేలా సీపీఎం తలపెట్టిన మహాజన పాదయాత్రకు తమ పూర్తి మద్దతు ఇస్తున్నట్లు మాధవరెడ్డి చెప్పారు.

వరంగల్‌ రూరల్‌ జిల్లాలో...

92వ రోజు మహాజన పాదయాత్ర వరంగల్‌ రూరల్‌ జిల్లాలో పర్యటించింది. మర్రిమెట్ట, భూపతిపేట, బుధవారంపేట, ఖానాపూర్‌, అశోక్‌నగర్‌, నర్సంపేట గ్రామాల్లో పర్యటించిన తమ్మినేని బృందం ప్రజల సమస్యల్ని అడిగి తెలుసుకుంది. మహాజన పాదయాత్రకు స్థానిక సీపీఐ, కాంగ్రెస్‌, వైసీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. 22వ జిల్లాలోకి ప్రవేశించిన పాదయాత్ర ఇప్పటివరకు మొత్తం 2400 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. మహబాబాబాద్‌ జిల్లాలో గిరిజనుల కోసం తక్షణమే ఐటీడీఏ ఏర్పాటు చేయాలని కోరుతూ సీఎం కేసీఆర్‌కు తమ్మినేని లేఖ రాశారు.

17:41 - January 16, 2017

వరంగల్ : సామాజిక తెలంగాణ సాధనకు ప్రజలు ఉద్యమించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా ఖానాపురం మండలంలో ఇవాళ పాదయాత్ర ప్రారంభమైంది. యాత్రకు సీపీఐ, కాంగ్రెస్‌, వైసీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. సీపీఎం చేపట్టిన మహాజనపాదయాత్రకు తమపార్టీ మద్దతిస్తోందని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. బంగారు తెలంగాణ అంటూ ప్రచారం చేసుకుంటూ..ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రజాసమస్యలను గాలికొదిలారని తమ్మినేని విమర్శించారు.

18:32 - January 15, 2017

మహబూబాబాద్ : పల్లెపల్లెను పలకరిస్తూ.. ప్రజల్లో చైతన్యాన్ని నింపుతూ ముందుకు సాగుతున్న సీపీఎం మహాజన పాదయాత్ర.. మహబూబాబాద్‌ జిల్లాలో కొనసాగుతోంది. 91వ రోజు తమ్మినేని పాదయాత్ర బృందం మందకొమురమ్మ నగర్‌లో పర్యటించింది. స్థానిక ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరు పేదలు తలదాచుకునేందుకు కనీసం ఇళ్లు కూడా ఇవ్వడం లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం దుయ్యబట్టారు. ప్రభుత్వాలు అగ్రవర్ణ ధనికులకు కొమ్ముకాయడం వల్లే పేదలకు న్యాయం జరగడం లేదని తమ్మినేని అన్నారు.

17:42 - January 12, 2017

మహబూబాబాద్ : ప్రజా సమస్యల పరిష్కారంపై సీపీఎం పార్టీ అలుపెరగకుండా పోరాటం చేస్తుండడం వల్లే... సీఎం కేసీఆర్‌కు సీపీఎం పార్టీ అంటే ఉలిక్కి పడుతున్నారని ఆ పార్టీ తెలంగాణ రాష్ర్ట కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా సీఎం కేసీఆర్‌ అమలు చేయడం లేదన్నారు. సీపీఎం మహాజన పాదయాత్ర నేటితో 88వరోజుకు చేరుకుంది. 23వందల కిలోమీటర్ల మేర యాత్ర పూర్తి చేసుకుని.. 24వందల కిలో మీటర్లకు చేరుకుంది. ప్రస్తుతం మహబూబాబాద్‌ జిల్లాలో పాదయాత్ర ఉత్సాహంగా కొనసాగుతోంది. చిల్కోడు, గొల్లచర్ల, బోరింగ్‌ తండా, కాంప్లాతండా, ఉయ్యాలవాడ, డోర్నకల్‌, బుద్దారంగేట్‌, గార్లలో పాదయాత్ర బృంద సభ్యులు పర్యటిస్తున్నారు.

17:39 - January 12, 2017

మహబూబాబాద్ : సీపీఎం మహాజన పాదయాత్ర నేటితో 88వరోజుకు చేరుకుంది. 23వందల కిలోమీటర్ల మేర యాత్ర పూర్తి చేసుకుని.. 24వందల కిలో మీటర్లకు చేరుకుంది. ప్రస్తుతం మహబూబాబాద్‌ జిల్లాలో పాదయాత్ర ఉత్సాహంగా కొనసాగుతోంది. చిల్కోడు, గొల్లచర్ల, బోరింగ్‌ తండా, కాంప్లాతండా, ఉయ్యాలవాడ, డోర్నకల్‌, బుద్దారంగేట్‌, గార్లలో పాదయాత్ర బృంద సభ్యులు పర్యటిస్తున్నారు. గ్రామాల్లో రియల్‌ ఎస్టేట్‌ పేర్లతో తాటిచెట్లను నరికివేస్తున్నారని, దీని వల్ల గీతకార్మికులకు ఉపాధి దెబ్బతింటోందని పాదయాత్ర బృంద సభ్యులు రమణ ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ ధనిక రాష్ర్టం అని చెబుతున్న కేసీఆర్‌.. ప్రమాదవశాత్తు గాయాలపాలైతే.. ఎక్స్‌గ్రేషియా ఇవ్వడంలో ఎందుకు ఇబ్బందులు సృష్టిస్తున్నారని రమణ ప్రశ్నించారు.

Pages

Don't Miss

Subscribe to RSS - mahajana padayatra