Mahakutami

16:37 - November 18, 2018
హైదరాబాద్ : ఎట్టకేలకు తెలంగాణ జన సమితి (టీజేఎస్‌) అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. పీపుల్స్‌ ఫ్రంట్‌ కూటమిలో భాగంగా టీజేఎస్‌ నుంచి పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాలో నలుగురు పేర్లను ప్రకటించారు. సోమవారం నామినేషన్ లకు చివరి రోజు కావడంతో చివరి జాబితాను ఆదివారం ప్రకటించే అవకాశం ఉంది. కానీ కోదండరాం ఎక్కడి నుండి పోటీ చేస్తారనే దానిపై స్పష్టత లేదు. శనివారం ఉదయం పార్టీ కోర్‌ కమిటీతో చర్చించిన అనంతరం నలుగురుతో కూడిన జాబితాను విడుదల చేశారు. వారిలో దిలీప్‌ కుమార్‌ కపిలవాయి (మల్కాజ్‌గిరి), జనార్ధన్‌రెడ్డి (మెదక్‌), చిందం రాజ్‌కుమార్‌ (దుబ్బాక), భవానీరెడ్డి (సిద్దిపేట) ఉన్నారు. మహాకూటమి సీట్ల సర్దుబాటులో భాగంగా కాంగ్రెస్‌ 94, తెదేపా 14, తెజస 8, సీపీఐ 3 స్థానాల్లో బరిలోకి దిగనున్న సంగతి తెలిసిందే.
15:37 - November 18, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో టీ.కాంగ్రెస్ 94 స్థానాల్లో పోటీ చేయనుంది. మహాకూటమిలో భాగంగా సీపీఐ, టీటీడీపీ, తెలంగాణ జనసమితికి పలు స్థానాలను కేటాయించింది. కూటమి పొత్తులో భాగంగా 94 స్థానాలకు పోటీ చేస్తున్న కాంగ్రెస్ శనివారం వరకూ 88 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. మరో ఆరు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. సోమవారం నామినేషన్‌లు దాఖలు చేయడానికి చివరి గడువు. 
కాంగ్రెస్ ఇప్పటి వరకు విడుదల చేసిన జాబితాల్లో మహిళలకు 11 మందికి అవకాశం కల్పించారు. ఏడు స్థానాల్లో మైనార్టీ అభ్యర్థులను పోటీ చేయిస్తుండడం విశేషం. 

  • 12 ఎస్టీ నియోజకవర్గాల్లో పదింటిలో కాంగ్రెస్, ఒక చోట టీడీపీ,  మరోస్థానం నుండి సీపీఐ పోటీ చేస్తున్నాయి. 
  • 19 ఎస్సీ రిజర్వుడు స్థానాలకు గాను రెండు స్థానాల్లో మిత్రపక్షమైన టీజేఎస్, ఒక స్థానంలో సీపీఐ, మిగిలిన 16 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తున్నాయి. 
    కూటమిలో ఎవరికెన్నిసీట్లు
మొత్తం స్థానాలు  119
కాంగ్రెస్  94
టీడీపీ  14
టీజేఎస్  8
సీపీఐ  3
ప్రకటించాల్సివని  కాంగ్రెస్ 6, టీడీపీ 1, టీజేఎస్ 2
10:35 - November 16, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పార్టీలలో రెబెల్స్ బెడద ఎక్కువైంది. మహాకూటమి సీట్ల సర్దుబాటు అటు కాంగ్రెస్..ఇటు టీడీపీలో అసమ్మతి జ్వాల చెలరేగింది. కూటమి పొత్తులో భాగంగా కొన్ని సీట్లు టీడీపీకి..మరికొన్ని సీట్లు కాంగ్రెస్ కు వచ్చాయి. ఇదే నేతలకు..కార్యకర్తలకు తీవ్ర ఆగ్రహం కలిగించింది. తమకు టికెట్ వస్తుందని ఆశించి భంగపడిన నాయకులు అధిష్టానాలపై కన్నెర్ర చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితి టీడీపీలో కూడా నెలకొంది. 
Image result for NTR Trust Bhavan TDP Leaders Protestముషీరాబాద్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ వంటి సీట్లు కాంగ్రెస్ కు వెళ్లాయి. దీనిపై ఆయా నియోజకవర్గాల టీడీపీ నేతలు గుర్రుగా ఉన్నారు. తమ తడాఖా చూపెట్టాలని భావించిన సదరు నేతలు రెబెల్స్ గా బరిలోకి దిగాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఓ హోటల్ లో రహస్యంగా సమావేశమయ్యారని తెలుస్తోంది. నగరంలో టీడీపీ బలంగా ఉందని..గెలిచే స్థానాలను కాంగ్రెస్ కు ఇవ్వడమేంటీ ? అని వారు వాదిస్తున్నారు. టీ.టీడీపీకి చెందిన ముఖ్యనాయకుడి తీరుపై నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఆయన వ్యవహరించిన తీరు...ఇతరత్రా అంశాలను పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి తెలియచేయాలని వారు భావిస్తున్నట్లు తెలుస్తోంది. రెబెల్స్ గా పోటీ చేయకుండా టీ.టీడీపీ నిలువరిస్తుందా ? లేదా ? అనేది రానున్న రోజుల్లో తెలుస్తోంది. 

09:42 - November 16, 2018

హైదరాబాద్ : మహాకూటమిలో సీట్ల పంచాయతీ ఇంకా కొనసాగుతూనే ఉంది. టీజేఎస్ సీట్లపై ఇంకా సందిగ్ధత వీడడం లేదు. తమకు కేటాయించిన స్థానాల్లో కాంగ్రెస్ రెబల్స్ రంగంలోకి దిగకుండా చూడాలని టీజేఎస్ బెబుతతోంది. ఈమేరకు టీజేఎస్ అధినేత కోదండరాం ఢిల్లీకి చేరారు. ఇవాళ ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో కోదండరాం సమావేశం కానున్నారు. జనగామ స్థానంపై చర్చించనున్నారు. అలాగా తమకు కేటాయించిన స్థానాల్లోనే కాకుండా వేరే చోట పోటీ చేయాలా లేదా అనే అంశంపై చర్చించే అవకాశం ఉంది.

 

22:03 - November 15, 2018

హైదరాబాద్: ఊహాగానాలకు తెరపడింది. దివంగత నందమూరి హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసినికే కూకట్‌పల్లి టీడీపీ టికెట్ ఖరారు అయింది. ఈ నెల 17వ తేదీన సుహాసిని నామినేషన్ దాఖలు చేయనున్నారు. కూకట్‌పల్లి నేతలతో సమావేశం నిర్వహించిన చంద్రబాబు.. అనంతరం సుహాసినికే టికెట్ ఇవ్వాలని నిర్ణయించారు. సుహాసిని విజయానికి సహకరించాలని టీడీపీ నేతలు పెద్దిరెడ్డి, మందాడి శ్రీనివాసరావులకు చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. ఎన్టీఆర్ కుటుంబానికి టికెట్ ఇస్తున్నందున సహకరించాలని కూకట్‌పల్లి టీడీపీ నేతలను చంద్రబాబు కోరారు. నందమూరి ఫ్యామిలీ వచ్చి టికెట్ కోరడంతో తాను కాదనలేకపోయానని టీడీపీ నేతలతో చంద్రబాబు అన్నారు. కాగా పార్టీకి సేవలు అందించిన మందాడి శ్రీనివాసరావుకి న్యాయం చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.
నందమూరి కల్యాణ్‌రామ్ సోదరిగా సుహాసిని సుపరిచితురాలే అయినా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్ర ప్రాంతం వారు ఎక్కువగా ఉండే కూకట్‌పల్లి నియోజవకర్గం నుంచి నందమూరి ఫ్యామిలీకి అవకాశం ఇవ్వడం ద్వారా విజయం ఈజీ అవుతుందని చంద్రబాబు అంచనా వేసినట్లు తెలుస్తోంది. అందుకే నందమూరి కుటుంబం నుంచి మూడోతరం నేతగా సుహాసినిని బరిలో నిలపాలని నిర్ణయించినట్టు స్పష్టమవుతోంది.
మహాకూటమి పొత్తుల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ కూకట్‌పల్లి స్థానాన్ని టీడీపీకి కేటాయించింది. కూకట్‌పల్లి నుంచి పోటీ చేసేందుకు భారీసంఖ్యలో ఆశావహులు పోటీపడ్డారు. టీడీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి, మందాడి శ్రీనివాసరావులు కూకట్‌పల్లి నుంచే పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. అయితే, అనూహ్యంగా నందమూరి సుహాసిని పేరు తెరమీదకు వచ్చింది.

17:58 - November 15, 2018
విశాఖ: హైదరాబాద్ కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా దివంగత నందమూరి హరికృష్ణ కూతురు నందమూరి సుహాసిని బరిలోకి దిగనున్నారనే వార్తలు నిజం కానున్నాయి. ఈ స్థానం నుంచి నందమూరి సుహాసినికి టికెట్ దాదాపు ఖరారైనట్టు సమాచారం. సెటిలర్ల ఓట్లు అధికంగా ఉన్న ఈ నియోజవకర్గంలో.. హరికృష్ణ వారసురాలిగా సుహాసినిని బరిలోకి దింపడం ద్వారా ఫలితం ఉంటుందని చంద్రబాబు భావిస్తున్నట్టు తెలుస్తోంది.
హరికృష్ణ కూతురు సుహాసిని... తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును కలిశారు. విశాఖలోని నోవాటెల్ హోటల్‌లో భేటీ అయ్యారు. కూకట్‌పల్లి అసెంబ్లీ టికెట్‌ సుహాసినికి ఇస్తారని ప్రచారం జరుగుతున్న తరుణంలో ఆమె చంద్రబాబును కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కూకట్‌పల్లి నుంచి పోటీ విషయమై వారివురూ చర్చించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సాయంత్రం కూకట్‌పల్లి నేతలతో సమావేశం కానున్న చంద్రబాబు... అభ్యర్థిని ఖరారు చేసే అవకాశం ఉంది. పార్టీ నేతల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్న చంద్రబాబు... ఆమెను ఆ స్థానం నుంచి బరిలోకి దింపాలనే నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయాన్ని సుహాసినికి చంద్రబాబు చెప్పారని... అందరని కలుపుకుపోతూ ప్రచారంలో పాల్గొనాలని ఆమెను సూచించినట్టు వార్తలు వస్తున్నాయి.
నందమూరి కల్యాణ్‌రామ్ సోదరిగా సుహాసిని సుపరిచితురాలే అయినా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కూకట్‌పల్లి నియోజవకర్గం నుంచి నందమూరి ఫ్యామిలీకి అవకాశం ఇవ్వడం ద్వారా విజయం ఈజీ అవుతుందని చంద్రబాబు అంచనా వేస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే నందమూరి కుటుంబం నుంచి మూడోతరం నేతగా సుహాసినిని బరిలో నిలపాలని నిర్ణయించినట్టు స్పష్టమవుతోంది.
మహాకూటమి పొత్తుల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ కూకట్‌పల్లి స్థానాన్ని టీడీపీకి కేటాయించింది. కూకట్‌పల్లి నుంచి పోటీ చేసేందుకు భారీసంఖ్యలో ఆశావహులు పోటీపడ్డారు. టీడీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి తాను కూకట్‌పల్లి నుంచే పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. అయితే, అనూహ్యంగా నందమూరి సుహాసిని పేరు తెరమీదకు వచ్చింది.
16:58 - November 14, 2018

హైదరాబాద్ : మహాకూటమిలో సీపీఐ పోటీ చేసే స్థానాలు ఖరారయ్యాయి. ఆ పార్టీ నవంబర్ 14వ తేదీ (బుధవారం) అభ్యర్థులను ప్రకటించింది. 119 నియోజకవర్గాలున్న తెలంగాణ రాష్ట్రంలో కేవలం 3 స్థానాల్లో సీపీఐ పోటీ చేయనుంది. ఇప్పటికే టీకాంగ్రెస్ రెండు జాబితాలు (75 స్థానాలు) ప్రకటించిన సంగతి తెలిసిందే. మొదటి నుండి ఐదు సీట్లలో పోటీ చేస్తామని..కాంగ్రెస్ నిర్ణయం తీసుకోవాలని సీపీఐ కోరుతూ వస్తోంది. చివరకు మూడు సీట్లలతో సర్దుబాటు చేసుకొంది. 

  • బెల్లంపల్లిలో అసమ్మతి ఎదురైనా గుండా మల్లేశ్ టికెట్ దక్కించుకున్నారు. 
  • హుస్నాబాద్ బరిలో చాడ వెంకట్ రెడ్డి.
  • వైరా నియోజకవర్గం నుండి బానోత్ విజయబాయి.

18-19వ తేదీల్లో నామినేషన్ దాఖలు చేస్తారని ఆ పార్టీ నేత పల్లా వెంకట్ రెడ్డి తెలిపారు. నల్గొండ జిల్లలో దేవరకొండ మిగిలిందని ఇది కూడా కోరుకుంటున్నామని..ఇస్తారనే భావన ఉందన్నారు. ఆయా నియోజవకర్గాల్లో రెబల్‌ అభ్యర్థులను బుజ్జగించేందుకు అక్కడున్న పార్టీ నాయకత్వం చూసుకుంటుందన్నారు. 

13:47 - November 14, 2018

హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ విడుదల చేస్తున్న జాబితాల్లో పలువురి పేర్లు లేకపోవడంతో నేతల్లో ఉత్కంఠ నెలకొంటోంది. నామినేషన్ల దాఖలు కూడా ఇప్పటికే ప్రారంభమైన సంగతి తెలిసిందే. నవంబర్ 14వ తేదీ బుధవారం ఉదయం కాంగ్రెస్ పది మందితో కూడిన రెండో జాబితా విడుదలైంది. ఈ లిస్టులో కూడా పలువురి ప్రముఖుల పేర్లు లేకపోవడం గమనార్హం. 

కాంగ్రెస్ రెండో జాబితా : - 
>
 ఖానాపూర్‌ (ఎస్టీ) - రమేష్‌ రాథోడ్‌   ఎల్లారెడ్డి - జాజల సురేందర్‌    ధర్మపురి (ఎస్సీ) - అదూరి లక్ష్మణ్‌ కుమార్‌    సిరిసిల్ల  -  కేకే మహేందర్‌ రెడ్డి    మేడ్చల్‌ - కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి    ఖైరతాబాద్‌ - దాసోజు శ్రవణ్‌   జూబ్లీహిల్స్‌ - పి విష్ణువర్ధన్‌ రెడ్డి   షాద్‌నగర్‌ - సీ ప్రతాప్‌రెడ్డి     భూపాలపల్లి - గండ్ర వెంకట రమణారెడ్డి   పాలేరు -  కాందాల ఉపేందర్‌రెడ్డి

Image result for sabitha indra reddy karthik reddyవివిధ పార్టీలు..ఇతరులు కాంగ్రెస్ కండువాలు కప్పుకున్న కొంతమందికి టి.కాంగ్రెస్ టికెట్లు కేటాయించింది. టికెట్ వస్తుందని ఆశించిన వారు తీవ్ర భంగపాటుకు గురవుతున్నారు. అందులో సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ కూడా ఉన్నారు. ఇటీవలే ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తానని బాహాటంగానే ప్రకటించారు కూడా. అంతేగాకుండా ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి అధికారంలోకి వస్తుందని ముందే చెప్పారు. అయితే విడుదల చేసిన జాబితాలో ఆయనకు కాంగ్రెస్ మొండి చేయి చూపింది. బండ్ల గణేష్ రాజేంద్రనగర్ స్థానాన్ని కో్రుతున్నారు. ఈ స్థానం కోసం మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్ రెడ్డి పోటీ పడుతున్నారు. తన కొడుకుకు టికెట్ కోసం సబిత ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు వినికిడి. కాంగ్రెస్ అధిష్టానం మాత్రం రాజేంద్రనగర్ స్థానాన్ని సస్సెన్ష్ పెడుతూ ఉత్కంఠ కంటిన్యూ చేస్తోంది. మహాకూటమి పొత్తులో భాగంగా ఈ స్థానం తమకు కేటాయించాలంటూ టీటీడీపీ కోరుతోంది. గత ఎన్నికల్లో రాజేంద్రనగర్ స్థానం నుండి టీడీపీ అభ్యర్థి ప్రకాష్ గౌడ్ బరిలోకి దిగి గెలుపొందారు. అనంతరం టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకుని ఈసారి కూడా ఎన్నికల బరిలో నిలుచున్నారు. మరి కాంగ్రెస్ అధిష్టానం బండ్లగణేష్ కు ఛాన్స్ ఇస్తుందా ? కార్తీకరెడ్డి వైపు మొగ్గు చూపుతుందా ? లేక వీరిద్దరినీ కాదని టీటీడీపీకి వదిలేస్తుందా ? అనేది చూడాలి. 

 

12:43 - November 13, 2018

హైదరాబాద్ : మహాకూటమిలో కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా చిచ్చు రేపింది. 65 మందితో కాంగ్రెస్ తొలి జాబితాను విడుదల చేసింది. రెండు వారాల సుదీర్ఘ కసరత్తు అనంతరం తొలి జాబితా విడుదలైంది. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత విడుదల చేశారు. కూటమి పక్షాలకు కాంగ్రెస్ మొండి చేయి చూపింది. సీపీఐ కోరిన స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. రామగుండం, ఆసిఫాబాద్, స్టేషన్ ఘన్‌పూర్ స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేయనుంది. కాంగ్రెస్ జాబితాపై సీపీఐ ఆగ్రహం వ్యక్తం చేసింది. టీజేఎస్ కోరిన స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను నిలబెట్టింది. మునుగోడు, కొత్తగూడెంలోనూ కాంగ్రెస్ అభ్యర్థులను బరిలో దింపింది. దీంతో కాంగ్రెస్ తీరుపై సీపీఐ, టీజేఎస్, ఇంటి పార్టీలు ఫైర్ అయ్యాయి. 

కోమటిరెడ్డి బ్రదర్స్ అల్టిమేటంకు పార్టీ తలొగ్గింది. అయితే మొదటి జాబితాలో పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డికి జాబితాలో చోటు దక్కలేదు. పొన్నాల లక్ష్మయ్య హుటాహుటిన ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. అధిష్టానంతో తాడోపేడో తేల్చుకుంటానని చెప్పినట్లు తెలుస్తోంది. మిర్యాలగూడ టికెట్ ఆశిస్తున్న జానారెడ్డి కుమారుడిని పక్కనపెట్టారు. రాజేంద్ర నగర్ నుంచి టికెట్ ఆశిస్తున్న మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్ రెడ్డి పేరు కూడా పెండింగ్‌లోనే ఉంది. దీంతో కాంగ్రెస్‌తోపాటు మహాకూటమిలోని ఇతర పార్టీల్లో అసంత‌ృప్తులు వ్యక్తం అవుతున్నాయి. తొలి జాబితాలో టికెట్ రాని ఆశావహులు పలు చోట్ల నిరసనలు తెలుపుతున్నారు. 

 

19:13 - November 12, 2018

హైదరాబాద్: టీడీపీ అభ్యర్థుల జాబితా ఇదే అంటూ టీవీ ఛానెళ్లలో వస్తున్న వార్తలపై టీ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ తీవ్రంగా స్పందించారు. ఆ జాబితా పూర్తిగా అవాస్తవం అని ఆయన అన్నారు. అసలు టీడీపీ తరపున అభ్యర్థులను ఇంకా అధికారికంగా ప్రకటించలేదని రమణ స్పష్టం చేశారు. మహాకూటమిలోని పార్టీలు ఎక్కడి నుంచి పోటీ చేస్తాయనే విషయాన్ని అధికారికంగా వెల్లడిస్తామని, పార్టీలు పోటీ చేసే స్థానాలు తేలిన తర్వాతే అభ్యర్థుల ప్రకటన ఉంటుందని ఆయన వివరించారు. కాగా, మహాకూటమిలో టీడీపీకి కేటాయించిన స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తారంటూ ఊహాగానాలు వెలువడ్డాయి. దీంతో ఆశావహులు, పార్టీ అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. చివరకు అలాంటి ప్రకటన ఏదీ రాకపోవడంతో ఎదురుచూపులు తప్పలేదు.

Pages

Don't Miss

Subscribe to RSS - Mahakutami