Mahanubhavudu Movie

20:57 - September 29, 2017

చిన్న సినిమాలతో పెద్ద డైరక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న మారుతి.. బాబు బంగారం అంటూ పెద్ద సినిమా చేసి పరాజయం పాలు అయ్యాడు... అందుకే కాస్త గ్యాప్ తీసుకుని తన బలమైన కథను నమ్ముకుని దానికి ఓసిడీ అనే కొత్త కాన్సెప్ట్ ను యాడు చేసి.. ప్రెష్ స్క్రీన్ ప్లేతో, మహానుభావుడు అనే స్క్రిప్ట్ ను తయారుచేసుకున్నాడు.దానికి వరుస హిట్స్ తో దూసుకుపోతున్న శర్వానంద్ హీరో కావడంతో, ఈ సినిమాకు మంచి హైప్ క్రియేట్ అయ్యింది. పైగా పెద్ద స్టార్స్ మధ్య వచ్చి, భారీ విజయాలు అందుకోవడం శర్వానంద్ కు సెంటిమెంట్ గా మారడంతో.. ఈ సినిమా గురించి అందరూ.. ఆసక్తిగా ఎదురు చూశారు..  అలా రిలీజ్ కు ముందే మంచి క్రేజ్ ను పెంచుకున్న మహానభావుడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.. 
కథ..
కథ విషయానకి వస్తే. ఓ సాప్ట్ వేర్ కంపెనీలో ప్రొగ్రాం మేనేజర్ గా పనిచేస్తున్న ఆనంద్.. ఓసిడీ అనే ఓవర్ క్లీన్ లీ నెస్ ప్రొబ్లమ్ తో బాధపడుతుంటాడు. అయితే అతనికి అనుకోకుండా పరిచయం అయిన మేఘన బిహేవియర్, క్లీన్  లీ నెస్ నచ్చి ఆమెతో లవ్ లో పడతాడు.. ఆమె కూడా అతని  బిహేవియర్ నచ్చి ఇష్టపడుతుంది. తమ పెళ్ళికి తన తండ్రిని కూడా ఒప్పిస్తుంది కాని తరువాత అతని డిజార్డర్ చూసి అసహ్యించుకుని దూరం పెడుతుంది. అలా లవ్ లో ఫేయిల్ అయిన ఓసిడీ బాధితుడు ఆనంద్ మేఘనాని ఎలా కన్వింన్స్ చేశాడు.. చివరికి ఆనంద్ ప్రేమని మేఘన ఆక్సెప్ట్ చేసిందా లేదా.. ఆనంద్ తన ఓసిడీ డిజార్డర్ ను ఎలా దూరం చేసుకున్నాడు అనేది సినిమాచూసి తెలుసుకోవాలసిందే..
నటీనటులు..
నటీనటుల విషయానికి వస్తే డిఫరెంట్ అండ్ ఫన్ ఫీల్డ్ సినిమాలతో అందరి ఆడియన్స్ కి చేరువైన శర్వానంద్ మరోసారి మహానుభావుడు సినిమాతో అందరిని అలరించాడు అనే చెప్పాలి..  ఓసిడీ అనే ప్రబ్లమ్ ఉన్న ఆనంద్ క్యారక్టర్ లో ఇమిడిపోయాడు.. తన గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో నాచ్యూరల్ యాక్టింగ్ ను చాలా ట్రై చేశాడు,... అతని కామెడీ టైమింగ్ ఈ సినిమాకు బ్యాక్ బోన్ గా నిలించింది.. శర్వానంద్ స్టైలింగ్ చాలాబావుంది.. ఇక మెహరిన్ మొదటి సినిమాలాగా మంచి ఇంపార్టెన్స్ ఉన్న క్యారక్టర్  దక్కించుకుంది.. అపీరియన్స్ పరంగా 100% మార్కులు దక్కించుకుంది.. స్కిన్ షో చేయకుండానే మెస్మరైజ్ చేసింది,... యాక్టింగ్ పరంగా అక్కడక్కడా తడబడినప్పటికీ... ఓవర్ ఆల్ గా మేఘన పాత్రలో మెప్పించింది.. వెన్నెల కిషోర్ మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించి. సినిమాకు ప్లస్ గా మారాడు. నాజర్, బద్రం, వేణు తదితరులంతా.. తమ పాత్రల పరిధిమేర బెస్ట్ ఔట్ పుట్ ఇచ్చారు.. 
టెక్నీషియన్స్...
టెక్నీషియన్స్ విషయానికి వస్తే డైరక్టర్ మారుతి.. మరోసారి ఓసిడీ అనే కొత్త కాన్సెప్ట్ ని తన స్టైల్ ఆఫ్ రైటింగ్ తో మంచి వినోదాత్మక సినిమాగా మలిచాడు శర్వానంద్ కూడా పూర్తిగా కోఆప్ రేట్ చేయడంతో కుటుబం సమేతంగా ఎంజాయి చేయదగ్గ సినిమాగా మారింది మహానుభావుడు.. డైలాగ్ రైటర్ గా కూడా మారుతి తన మార్కును నిలబెట్టుకున్నాడు. ఇక కెమేరామెన్ నిజర్ షఫీ డీసెంట్ విజ్యూవల్స్ తో ఇంప్రస్ చేశాడు. ఒకే సీన్ లో ఎమోషన్, కామెడీ పండించాల్సిన టైంలో అతని కెమేరా పనితనం వలన ఆయా సీన్స్ బాగా ఎలివేట్ అయ్యాయి.. సినిమాటోగ్రాఫర్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది. మ్యూజిక్ డైరక్టర్ తమన్ ఓకే అనిపించే ఆల్బమ్ అందించాడు.. పాటలు స్క్రీన్ పై బాగున్నాయి.. ఆర్ ఆర్ పరంగా స్పెషల్ ఎఫర్ట్ పెట్టి సినిమా కలర్ ను కాపాడాడు.. ప్రతి సీన్ లో ని సెన్స్ బులిటీని ఎలివేట్ చేశాడు తమన్ ఇక ఎడిటింగ్ కూడ క్రిస్బ్ గా ఉంది.. యూవీ క్రియేషన్స్ నిర్మాణ విలువలకు తిరుగులేదు.. సినిమాను చాలా రిచ్ గా తెరకెక్కించారు.. 
ఓవర్ ఆల్ గా చెప్పాలి అంటే.. దసరా బరిలో చివరిగా చిన్న సినిమాగా రిలీజ్ అయిన మహానుభావుడు గ్రాండ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది.. ఎక్కడా ఎలాంటి అసభ్యతకు తావు లేకుండా ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ చేసిన మహానుభావుడు సరదాగా నవ్వించి.. బాగుంది అనిపిస్తాడు.
ప్లస్ పాయింట్స్
శర్వానంద్ నటన
ఫ్రెష్ స్క్రీన్ ప్లే..
కొత్త కాన్సెప్ట్
డైలాగ్స్ ..
కామెడీ..
బ్యాగ్రౌండ్ స్కోర్
నిర్మాణ విలువలు
మైనస్ పాయింట్స్
కొన్నిరిపీటెడ్ సీన్స్
లైటర్ క్లైమాక్స్.. 

 

12:49 - August 29, 2017

డిఫరెంట్ సినిమాలతో ఆడియన్స్ కి దగ్గరైన ఓ హీరో మరో మంచి స్టోరీ లైన్ తో రాబోతున్నాడు. చిన్న సినిమాలతో హిట్ కొట్టి తన నేమ్ నే ఒక బ్రాండ్ గా మార్చుకున్న డైరెక్టర్ ఈ హీరో తో జతకట్టబోతున్నాడు. వరుస విజయాలతో మంచి జోరు మీదున్న హీరో 'శర్వానంద్'కి 'రాధ' సినిమా బ్రేక్ పడింది. సంక్రాంతి బరిలో 'శతమానం భవతి'తో భారీ హిట్ అందుకున్న 'శర్వా' తరువాత 'రాధా' సినిమాతో వచ్చాడు. కధలో కత్తదనం లేదని, 'శర్వానంద్' రెగ్యులర్ మూస సినిమాలని నెత్తిన వేసుకుని ఫ్లాప్స్ ని మూటకట్టుకుంటున్నాడని ఫిలిం నగర్ టాక్. ఇప్పటివరకు పలు విభిన్నమైన పాత్రలు పోషించాడు 'శర్వానంద్' మళ్లీ రెగ్యులర్ స్టోరీస్ ని ఎందుకు సెలెక్ట్ చేసుకుంటున్నాడో అని ఫిలిం లవర్స్ అనుకుంటున్నారట. జస్ట్ ఫర్ చేంజ్ అన్నట్టు ఇప్పుడు కొత్త సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. 'శతమానం భవతి' సినిమాకి గాను నేషనల్ అవార్డు రావడం కూడా మంచి ఉత్సహాన్ని ఇచ్చినట్టుంది.

స్టోరీ ని నమ్ముకోకుండా కేవలం హాస్యానికే పెద్ద పీట వేసి ఫ్లాప్ సినిమాని తీసాడు అని డైరెక్టర్ 'మారుతీ' గురించి ఫిలింనగర్ అనుకుంటుంది అంట. 'బాబు బంగారం' సినిమా ఆశించిన స్థాయిని అందుకోలేదని అనుకుంటుంటారు. తన దగ్గర ఉన్న కథలని మంచి స్క్రీన్ ప్లే తో రాసుకుని ప్రెసెంట్ చేసే డైరెక్టర్స్ లో 'మారుతీ' ఒకడు. చిన్న సినిమాతో పెద్ద హిట్ ఇవ్వడం 'మారుతీ' టాలెంట్. మరి 'మారుతీ' ఇప్పుడు మరో సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమాలో హీరో 'శర్వానంద్' కావడం విశేషం .

దర్శకుడు 'మారుతీ’.. ‘భలే భలే మగాడివోయ్’లో హీరోను మతిమరుపు వాడిగా చూపించి అదిరిపోయే వినోదాన్నందించాడు. బ్లాక్ బస్టర్ కొట్టాడు. 'భలే భలే..’లో 'నాని' మతిమరుపు వాడైతే.. 'మారుతీ' కొత్త సినిమా ‘మహానుభావుడు’లో హీరో 'శర్వానంద్' ఓసీడీతో బాధపడే కుర్రాడిగా నటిస్తున్నాడు. ఓసీడీ అంటే.. అతి శుభ్రతతో బాధపడే ఒక డిసార్డర్ అన్నమాట. ‘భలే భలే..’ సినిమా నిర్మాణంలో భాగస్వాములైన యువి క్రియేషన్స్ వాళ్లే ఈ చిత్రాన్ని కూడా నిర్మిస్తుండటం విశేషం. ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’ ఫేమ్ మెహ్రీన్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. ‘మహానుభావుడు’ దసరా కానుకగా విడుదల కానుంది. అయితే ఈ సినిమా ట్రైలర్ చూసిన ఫిలిం క్రిటిక్స్ మాత్రం 'భలే భలే మగాడివోయ్' సినిమాని అటు ఇటు తిప్పి పాచిపోయిన పాత చింతకాయ పచ్చడిని కొత్త ప్యాకెట్ లో పెట్టి అమ్మబోతున్నారు అని అనుకుంటున్నారంట. కొందరైతే ఏకంగా 'మారుతీ' పని అయిపోయింది అని అనుకుంటున్నారంట. 

14:50 - August 16, 2017

టాలీవుడ్ యంగ్ హీరో 'శర్వానంద్' మరోసారి రిస్క్ చేయబోతున్నాడంట. తనదైన స్టైల్ లో సినిమాల్లో నటిస్తూ అభిమానులు ఆదరణ చూరగొంటున్నాడు. అగ్ర హీరోల సినిమాల రిలీజ్ టైంలోనే తన సినిమాలను కూడా విడుదల చేస్తున్నాడు. గతంలో 'ఖైదీ నెంబర్ 150', 'గౌతమి పుత్ర శాతకర్ణి' సినిమాల రిలీజ్ లోనే ఆయన నటించిన 'శతమానం భవతి' చిత్రం రిలీజ్ అయ్యింది. ఈ సినిమా మంచి టాక్ నే తెచ్చుకుంది.

ఈసారి కూడా అదే ఫీట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న 'మహానుభావుడు' సినిమాలో 'శర్వానంద్' నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ కొనసాగుతోంది. ఈ సినిమాను దసరా కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దసరా బరిలో 'జూ.ఎన్టీఆర్' నటించిన 'జై లవ కుశ'..'మహేష్ బాబు' నటించిన 'స్పైడర్' సినిమాలు కూడా నిలుస్తున్నాయి. ఇంతా భారీ కాంపిటీషన్ లో 'శర్వా' తన సినిమా రిలీజ్ చేస్తుండటంతో మరోసారి టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారాడు. మరి ఈ రిస్క్ ఎలాంటి ఫలితాలు ఇస్తుందో వేచి చూడాలి. 

Don't Miss

Subscribe to RSS - Mahanubhavudu Movie