Maharashtra

15:27 - December 7, 2018

ముంబై: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అస్వస్ధతకు గురయ్యారు. శుక్రవారం గడ్కరీ మహరాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లాలోని మహాత్మా పూలే  వ్యవసాయ విశ్వవిద్యాలయంలో స్నాతకోత్సవంలో పాల్గొన్నారు.  ఆ కార్యక్రమంలో జాతీయగీతం ఆలపించే సమయంలో లేచి నిలబడినప్పుడు షుగర్ లెవల్స్ పడిపోవటంతో ఆయన స్టేజీమీద కుప్పకూలిపోయారు. పక్కనే ఉన్న గవర్నర్ సిహెచ్ విద్యాసాగర రావు ఆయన పడిపోకుండా చేయి అందించి పైకి లేపే ప్రయత్నం చేశారు. పక్కనే ఉన్న సహాయక సిబ్బంది ఆయన్ను వెంటనే  ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. 
ప్రస్తుతం తాను డాక్టర్ల పర్యవేక్షణలో క్షేమంగానే ఉన్నానని గడ్కరీ ట్వీట్ చేసారు. తాను కోలుకోవాలవి కోరుకున్నవారందరికీ  నితిన్ గడ్కరీ  కృతజ్ఞతలు తెలిపారు. 

16:20 - December 6, 2018

ముంబై  (మహారాష్ట్ర) : శ్రీమంతుల ఇంట్లో పెళ్లి అంటే అంతా హడావిడే. ఎక్కడ చూసినా రిచ్ లుక్సే. ఏది చేసినా ఘనంగా వుండాలి. అందరూ గొప్పగా చెప్పుకోవాలి. ఇటువంటి వివాహాలు ఎక్కడా జరగలేదబ్బా అనుకునేంత గొప్పగా..రిచ్ గా వుండాలి. దాని కోసం ఫుడ్, కాస్ట్యూమ్స్, ఎకామిడేషన్,  నుండి అన్ని అరేంజ్ మెంట్స్ అన్నీ అంటే అన్నీ ఘనంగా వుండాలి.అటువంటిది అంబానీవారింటో పెళ్లి అంటే మాటలా? ఎంతటి రిచ్ గా వుంటుందో ఊహించటానికి కూడా సాధ్యంకానంత రిచ్ గా వుండబోతోంది అంబానీగారి గారాల పట్టి ఇషా అంబాని వివాహం. 
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కుమార్తె ఇషా వివాహం డిసెంబర్ 12న జరగనుంది. ముంబైలోని ‘ఆంటిల్లా’లో వీరి పెళ్లిని అంగరవైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు భారీ నుండి అతి భారీగా జరుగుతున్నాయి. అంబానీల ఇంట పెళ్లంటే.. ఎంత గ్రాండ్‌గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెళ్లికి ముందే కుటుంబ సభ్యులు, సన్నిహితులకు అంబానీ, పిరమాళ్ కుటుంబాలు ప్రి వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌ నిర్వహిస్తున్నాయి. ఈ వేడుకలకు రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వేదిక కానుంది. ప్రి వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కోసం అతిథులను తీసుకెళ్లడానికి అంబానీ ఫ్యామిలీ 30 నుంచి 50 చార్టర్డ్ ఎయిర్ క్రాఫ్ట్‌లను ఉపయోగించనున్నట్టు సమాచారం. సాధారణ రోజుల్లో మహారాణా ప్రతాప్ విమానాశ్రయంలో రోజుకు 19 విమానాలు మాత్రమే రాకపోకలు సాగిస్తాయి. ఎన్నికల ఎఫెక్ట్, అంబానీ కూతురి ప్రి వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కారణంగా ఆ విమానాశ్రయానికి రద్దీ భారీగా పెరగనుంది. ఉదయ్‌పూర్‌లో భారీ సంఖ్యలో ఫైవ్ స్టార్ హోటళ్లను కూడా అంబానీ కుటుంబం బుక్ చేసిసేసారు. ఇషా పెళ్లి వేడుకలను సెలబ్రిటీ వెడ్డింగ్ ఫొటోగ్రాఫర్ జోసెఫ్ రాధిక్ తన కెమెరాలో బంధించనున్నారు. ప్రియాంక-నిక్, అనుష్క-విరాట్‌ల పెళ్లికి కూడా ఆయనే ఫొటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. ఉదయ్‌పూర్‌లో ప్రి వెడ్డింగ్ సెలబ్రేషన్స్ తర్వాత ముంబైలో నాలుగు రోజులపాటు అంబానీ కూతురి పెళ్లి వేడుకలు ఘనంగా జరగనున్నాయి. గతంలో కర్ణాటక మైనింగ్ మాఫియా కింగ్ గాలి జనార్థన్ రెడ్డి కుమార్తె వివాహం పెద్ద నోట్ల రద్దు సమయంలో జరిగినా ఎంత ఘనంగా చేశాడో తెలిసిన విషయమే. 

 

15:42 - November 29, 2018

మహారాష్ట్ర : మరాఠాలకు ప్రభుత్వం శుభవార్తనందించింది. వర్గానికి రిజర్వేషన్లు కల్పించాలని మరాఠాలు కొద్ది నెలల క్రితం భారీ స్థాయిలో ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 2019లో ఎన్నికలు రానున్న తరుణంలో మరాఠాలకు రిజ్వషన్స్ కల్పిస్తు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం నవంబర్ 18న శీతాకాల సమావేశాల సందర్భంగా బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదం పలికింది. మరాఠాలకు విద్య, ఉదోగ్యాల్లో 16 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రూపొందించిన బిల్లుకు మహారాష్ట్ర శాసనసభ గురువారం ఆమోద ముద్ర వేసింది. బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీలు మద్దతు తెలిపాయి. తర్వాత ఈ బిల్లును శాసనమండలికి పంపనున్నారు. ఈ బిల్లు ద్వారా కేవలం విద్య, ఉద్యోగాల్లో మాత్రమే మరాఠాలకు రిజర్వేషన్లు లభించనున్నాయి. ఇప్పటికే ఎస్సీ, ఎస్టీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు వర్తిస్తుండగా.. మరాఠాలకు మాత్రం రాజకీయంగా ఈ రిజర్వేషన్లు వర్తించటంలేదు. ఈ నేపథ్యంలో మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించడం కోసం.. మహారాష్ట్ర రాష్ట్ర బీసీ కమిషన్ సూచనల మేరకు ఫడ్నవీస్ సర్కారు ఎస్‌ఈబీసీ  అంటే సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన తరగతిని ఏర్పాటు చేసింది. దీని వల్ల ఓబీసీల రిజర్వేషన్లకు విఘాతం కలగదని ప్రభుత్వం స్పష్టం చేసింది. 
కాగా వచ్చే ఏడాది అంటే 2019లో మహారాష్ట్ర ఎన్నికలు జరగనున్న తరుణంలో.. మరాఠాల డిమాండ్‌ పట్ల సానుకూలంగా నిర్ణయం తీసుకోవడం తమకు కలిసి వస్తుందని బీజేపీ భావిస్తోంది. దీంతో మరాఠాల ఓట్ల కోసం ఫడ్నవీస్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా రాజకీయవర్గాల సమాచారం. 
 

13:17 - November 20, 2018

మహారాష్ట్ర : దేశంలోనే అతిపెద్ద సైనిక ఆయుధాగారం మహారాష్ట్రలోని వార్దా జిల్లాలో పుల్గావ్ లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 10 వరకు తీవ్రంగా గాయపడినట్లుగా తెలుస్తోంది. మందుగండు సామగ్రిని నిర్వీర్యం చేస్తుండగా పేలుడు సంభవించినట్లుగా తెలుస్తోంది. గాయపడిన 10మందిలో మరో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. మహారాష్ట్రలోని వార్దా జిల్లాలో పుల్గావ్ ఆయుధ గోదాంలో ఈ మంగళవారం అంటే నవంబర్ 20వ తేదీ ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 

పేలుడు దాటికి నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మరణించారు. గడువు తీరిన మందుగుండు సామగ్రిని నిర్వీర్యం చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా పేలుళ్లు జరిగినట్లు రక్షణశాఖ అధికారులు తెలిపారు. 
2016లో జరిగిన ప్రమాదం..16మంది మృతి
కాగా పుల్గావ్‌ ఆయుధ గోదాంలో గతంలోనూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. 2016 మేలో ఇదే గోదాంలో జరిగిన భారీ అగ్నిప్రమాదం తీవ్ర విషాదం నింపింది. ఈ ప్రమాదంలో రక్షణ శాఖకు చెందిన 16 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. పుల్గావ్‌ గోదాం దేశంలో సైన్యానికి చెందిన అతిపెద్ద ఆయుధ గోదాం. బాంబులు, గ్రనైడ్లు, తుపాకులు, ఇతర పేలుడు పదార్థాలను ఇక్కడ నిల్వ చేస్తారు. దేశంలోని పలు ఫ్యాక్టరీల్లో తయారు చేసిన ఆయుధాలను ఇక్కడకు తీసుకొచ్చి భద్రపరుస్తారు. అక్కడి నుంచి ఫార్వర్డ్‌ బేస్‌లకు తరలిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంలో పలు ప్రమాదాలు చోటు చేసుకోవటం జరుగుతోంది. అలాగే పలువురు ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోతున్నాయి. దీనిపై అధికారులు తగిన జాగ్రర్త చర్యలు తీసుకోవాల్సిన అవసరం వుంది.
 

12:21 - November 9, 2018

పూణే: పోతూ పోతూ రోడ్డు మీద ఉమ్మేసే వారిని నిత్యం మనం చూస్తూనే ఉంటాం. ఈ చెడు అలవాటు చదువుకున్న వారిలో సైతం ఉంటుంది. భాధించే అంశం ఏంటంటే వాళ్లు కనీసం తాము తప్పు చేస్తున్నాం అనే భావనకూడా వీరిలో కలగకపోవడం విచారకరం. ఇక మన హైదరాబాద్‌లో  అయితే చెప్పాల్సిన పనేలేదు. ఏ ప్రభుత్వ ఆఫీసులో చూసినా గోడలు పాన్ మరకలతో ఎంతో అసహ్యంగా ఉంటాయి. ఎన్ని తొట్లు పెట్టినా.. బోర్డులు పెట్టినా జనంలో మార్పు తీసుకురావడం కష్టం అనే అభిప్రాయం పాలకులలో గట్టిగా స్థిరపడిపోయింది.
అయితే మహారాష్ట్రలోని పూణే మునిసిపల్ పరిథిలో అధికారులు ఓ వినూత్న ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైనా రోడ్డు మీద ఉమ్మేస్తే రూ 100 జరిమానా విధిస్తున్నారు. ఇక్కడితో అయిపోలేదు వారిచేత రోడ్లు శుభ్రపరిచే కార్యక్రమాన్నికూడా చేపట్టారు పూణే మునిసిపల్ అధికారులు. ఈ కార్యక్రమాన్ని పూణేలోని బిబీవేవాడి ప్రాంతంలో విజయవంతంగా అమలు చేశారు. ఇప్పటివరకూ 25 మందికి ఇటువంటి శిక్షలు విధించినట్టు అధికారలు తెలిపారు. ఇది కఠినమైన శిక్షలే అని మాకు తెలుసు.. కానీ భవిషత్తులో పొగాకును నమిలి ఉమ్మేసే ముందు ఒకసారి ఆలోచిస్తారనే నమ్మకం మాకుంది అని స్థానిక అధికారులు అభిప్రాయపడ్డారు.
 

 

16:50 - November 3, 2018

మహారాష్ట్ర : కోరుకున్న పాపులర్ బ్రాండ్స్ సిగరేట్లు కావాలంటే దుకాణాలకు వెళ్లాల్సినవసరం లేదు. నేరుగా ఇంటికే పంపిణీ చేయనున్నారు. మహారాష్ట్రలో త్వరలో ఇది అమలు కానుంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవలే మోడల్ మేఘా శర్మ చేసిన ఉదంతం తెలిసిందే. ముంబైలోని కీలక ప్రాంతాలు బాంద్రా, వర్లి, కొలబా ఇతర ప్రాంతాలను మొదట ఎంచుకున్నట్లు తెలుస్తోంది. 2019 జనవరి 1వ తేద నుండి దీనిని ప్రారంభించేందుకు అక్కడి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. 
Image result for Maharashtra Govt Doorstep Delivery Of Cigarettesముంబైలోని లోఖండ్‌వాలా కాంప్లెక్స్‌లో ఉంటున్న మోడల్ మేఘా శర్మ అక్టోబర్ 25 అర్థరాత్రి సమయంలో సెక్యూరిటీ గార్డు అలోక్‌కు ఫోన్ చేసింది. కానీ అతను నిరాకరించడంతో మేఘా శర్మ తీవ్ర ఆగ్రహానికి గురైంది. అతనితో ఘర్షణకు దిగింది. అలోక్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనా స్థలానికి మగ పోలీసులు చేరుకున్నారు. స్టేషన్ కు రావాల్సిందిగా పోలీసులు ఆదేశించారు. దీనికి మేఘా శర్మ నిరాకరించింది. అది కూడా మహిళా కానిస్టేబుల్ కూడా లేనందున పోలీస్ స్టేషన్‌కు తెల్లారగానే వస్తానని చెప్పింది. అయినా పోలీసులు వినకపోవడంతో వేసుకున్న దుస్తులను మేఘా శర్మ తొలగించింది. చివరకు పోలీసులు వెనక్కి వెళ్లిపోయారు. మరి మహా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ఎలాటి వివాదం చెలరేగుతుందో చూడాలి. 

16:37 - November 3, 2018

మహారాష్ట్ర : మనిషి మానవత్వాన్ని విడిచి దానవత్వంలోకి పోతున్నాడా? ఆది మానవుడుగా తిరోగమనంలోకి పోతున్నాడా? మనిషి ప్రాణం కంటే వస్తువులకు, ఆస్తులకు విలువనిస్తున్నాడా? సాటి మనిషి ప్రాణం పోతున్న సమయంలో కూడా స్వార్థంలో పడిన మనిషి దానవుడుగా మారిపోతున్నాడు. దీనికి ఎన్నో రోడ్డు ప్రమాదాలు సాక్ష్యాలుగా నిలిచాయి. ప్రమాదం జరిగిన ప్రాంతంలో సాటి మనిషి ప్రాణాల కోసం కొట్టుకులాడుతుంటే..అది మరచి సెల్ఫీలు తీసుకోవటమే టెక్నాలజీకి నిదర్శనమా? అని అనుమానం రాక మానదు. ప్రమాదానికి లోనైన మనిషి ప్రాణాలు కాపాడాల్సింది పోయి మనకెందుకులే అనుకుని వెళ్లిపోయేవారు కొందరైతే..ప్రమాదంలో ఉన్న వ్యక్తి దగ్గరి వస్తువులు తీసుకుని వెళ్తుంటారు మరికొందరు.

Image result for onion truck accident రోడ్డు ప్రమాదం జరిగి ఓ ట్రక్కు డ్రైవర్‌ ప్రాణాపాయ స్థితిలో ఉంటే.. అతడ్ని ఏమాత్రం పట్టించుకోని జనం ఆ ట్రక్కు నుంచి పడిపోయిన ఉల్లిగడ్డలు ఎత్తుకెళ్లారు. గురువారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.పుణె నుంచి ఉల్లి లోడ్‌తో ముంబయి వెళ్తున్న ఓ ట్రక్కు లోనావ్లా ప్రాంతంలో రోడ్డు ప్రమాదానికి గురైంది. వాల్వన్‌ బ్రిడ్జిపై నుంచి వెళ్తున్న ట్రక్కు ఒక్కసారిగా అదుపుతప్పి వంతెనపై నుంచి పుణె-ముంబయి పాత హైవేపై పడింది. ఈ ఘటనలో ట్రక్కు డ్రైవర్‌ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదాన్ని గమనించి స్థానికులు వెంటనే అక్కడ గుమిగూడారు. అయితే వారి దృష్టి గాయపడిన డ్రైవర్‌ మీద కాకుండా ట్రక్కు నుంచి పడిపోయిన ఉల్లిగడ్డల మీద పడింది.
ఇంకేముంది డ్రైవర్‌ను పట్టించుకోని స్థానికులు తమకు దొరికినన్ని ఉల్లిగడ్డలు ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని డ్రైవర్‌ను ఆసుపత్రికి తరలించారు. ఉల్లిగడ్డల ట్రక్కు బోల్తా పడిందన్న వార్త దావానలంలా వ్యాపించిందని, దీంతో స్థానికులు సంచులు తెచ్చుకుని మరి ఉల్లిగడ్డలను ఎత్తుకెళ్లారని ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటో ఒకటి తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
 

10:51 - November 2, 2018

ముంబయి: టపాకాయ్ వెలగలేదు అనుకొని నోటీతో కొరికేందుకు ప్రయత్నించిన 7 ఏళ్ళ బాలుడు ఒక్కసారిగా అది పేలడంతో మృతి చెందిన ఘటన మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో మంగళవారం జరిగింది.
దీపావళి పండగను ముందుగా జరుపుకొనే ఉత్సహాంతో యాష్ సంజయ్ గావటే అనే పిల్లాడు మరో నలుగురు పిల్లలతో కలిసి సీమ టపాకాయలు కాలుస్తున్నాడు. ఒక సీమ టపాకాయ్ పేలకపోవడంతో చేతులోకి తీసుకొని చూసి.. మళ్లీ నిప్పు అంటించే ముందు కొనను కొరుకుదామని నోట్లో పెట్టుకున్నాడు. అది ఒక్కసారిగా పేలడంతో సంజయ్ తీవ్రంగా గాయపడ్డాడు. అసుపత్రికి తరలించినా ప్రయోజనం కలగలేదు. ఆసుపత్రికి వచ్చేసరికే సంజయ్ మరణించాడని వైద్యులు నిర్ధారించారు.

 

 

10:50 - October 28, 2018

ఢిల్లీ : వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మహారాష్ట్రలో ఎన్నికల పొత్తుపై కాంగ్రెస్‌, నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీలు  ఏకాభిప్రాయానికి వచ్చాయి.  మొత్తం 48 స్థానాల్లో 38 సీట్ల విషయంలో కాంగ్రెస్‌, ఎన్సీపీల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. పుణె, ఔరంగాబాద్‌, యావత్‌మల్‌ నియోజకవర్గాల కోసం ఎన్సీపీ ఎంతో ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. మరో పది స్థానాలు విషయంలో ఇరు పార్టీల నేతలు చర్చలు జరుపుతున్నారు. వీటిపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

 

19:03 - October 24, 2018

ముంబై: మహారాష్ట్ర సీనియర్ అధికారులను, మీడియా బృందాన్ని తీసుకెళుతున్న పడవ తిరగబడిన సంఘటనలో ఒకరు గల్లంతు అయ్యారు. అధికారుల బృందంలో మహారాష్ట్ర చీఫ్ సెక్రటరీ కూడా ఉన్నారు. ఈ సంఘటన బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. 
సముద్రంలో ఉన్న చత్రపతి శివాజీ మెమోరియల్‌ను సందర్శించేందుకు అధికారులతో పాటు 40 మంది ప్రింట్, టీవీ మీడియా సిబ్బంది ఈ పడవలో ప్రయాణిస్తున్నారు. హెలీకాప్టర్ల ద్వారా, ఇతర మెరైన్ సిబ్బంది చేపట్టిన రెస్క్యూ ఆపరేషనతో అందరు సురక్షితంగా మెమోరియల్‌కు చేరుకున్నారు. అయితే ఒకరు అచూకీ ఇంకా లభించలేదు. ఈ సంఘటనతో మెమోరియల్ ప్రారంభోత్సవాన్ని వాయిదా వేశారు. 

 

 

Pages

Don't Miss

Subscribe to RSS - Maharashtra