mahesh babu

13:51 - December 7, 2018

హైదరాబాద్ : జూబ్లిహిల్స్ లోని ఫిల్మ్ నగర్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఓ పోలింగ్ కేంద్రానికి వచ్చిన టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు భార్య సమ్రతతో కలిసి వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. సతీమణి నమ్రతతో కలసి పోలింగ్ కేంద్రానికి మహేష్ ను చూడగానే అభిమానులంతో చుట్టుముట్టారు. సెల్ఫీ అడిగిన అభిమానులను అలరించారు. కాగా కొంతసేపే క్యూ లో నిలబడ్డారు. అభిమానుల సందడి పెరిగిపోవటంతో మీడియా ఆయన చుట్టూ చేరడంతో ఎన్నికల అధికారులు మహేశ్ బాబును నమ్రతను లోపలకు తీసుకువెళ్లి ఓటు వేయించారు. దీంతో మీడియాను అదుపు చేయటం భద్రతా సిబ్బంది ఇబ్బంది పడాల్సివచ్చింది.
 

 

21:54 - December 6, 2018

హైదరాబాద్: టాలీవుడ్‌ హీరోలంతా ఎలక్షన్‌ పోలింగ్‌ సెంటర్ల బాట పట్టనున్నారు. తెలంగాణలో జరగనున్న ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. సినిమాలే కాదు రాజకీయ అవగాహన కూడా ఉందని చాటి చెప్పేందుకు తెలుగు సినీ ప్రముఖులు సిద్ధమవుతున్నారు.
జూబ్లిహిల్స్‌ క్లబ్‌లో మెగాస్టార్, భారతీయ విద్యాభవన్ స్కూల్‌లో సూపర్‌స్టార్:
తెలుగు సినిమా తారాగణం.. ఓటు వేసేందుకు క్యూ కట్టనుంది. సినిమాలే కాదు సమాజం పట్ల బాధ్యత కూడా ఉందని నిరూపించనుంది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో పలువురు ప్రముఖ హీరోలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. టాలీవుడ్‌ అగ్రహీరోల్లో చాలా మంది హైదరాబాద్‌లో సెటిలయ్యారు. వీరంతా శుక్రవారం(డిసెంబర్ 7) జరగనున్న తెలంగాణ ఎన్నికల్లో తమ ఓటును వేసేందుకు రెడీ అవుతున్నారు. మెగాస్టార్‌ చిరంజీవి, ఆయన తనయుడు రామ్‌చరణ్‌ జూబ్లిహిల్స్‌ క్లబ్‌లో.. సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు భారతీయ విద్యాభవన్ స్కూల్‌లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. యంగ్‌ టైగర్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌ జూబ్లిహిల్స్‌లో ఓటును వేయనున్నారు. టాలీవుడ్‌ మన్మధుడు నాగార్జున, స్టైలిష్‌ అల్లు అర్జున్‌, కల్యాణ్‌రామ్‌ జూబ్లీహిల్స్‌లోని వేరువేరు పోలింగ్ బూత్‌లలో ఓటు వేయనున్నారు. వీరితో పాటు చాలా మంది టాలీవుడ్‌ సినీ స్టార్స్‌ తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
ఇలా సినీ ప్రముఖులంతా సమజా పౌరులుగా తమ బాధ్యత నిర్వర్తించేందుకు సిద్ధమవుతున్నారు. వారికి కేటాయించిన పోలింగ్‌ సెంటర్లలో తమ ఓటు హక్కును వినియోగించుకొని.. అభిమానులకు ఓటు విలువ తెలియచేయనున్నారు.

 

12:54 - November 26, 2018

సూపర్‌స్టార్ మహేష్ బాబు మరోసారి తన మంచి మనసుతో అభిమానులను, ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. తనని కలవాలని గత కొంతకాలంగా ఎదురుచూస్తున్న106 సంవత్సరాల బామ్మగారి కోరిన నెరవేర్చాడు సూపర్‌స్టార్. మొన్నామధ్య రాజమండ్రికి చెందిన రేలంగి సత్యవతి అనే పెద్దావిడ, తనకు మహేష్‌ అంటే ఎంతో ఇష్టమనీ, ఎలాగైనా తనని కలవాలనీ, అతనితో ఫోటోదిగాలని ఉందని చెప్పింది.
ఈ జెనరేషన్‌లో సోషల్ మీడియా ఎంత స్పీడ్‌గా ఉందో తెలిసిందే. ఆ వార్త వైరల్ అవుతూ... మహేష్ దాకా చేరింది. దీంతో, షూటింగ్ కోసం అమెరికాలో ఉన్న మహేష్, బామ్మగారిని హైదరాబాద్ తీసుకురావాల్సిందిగా, రాజమండ్రికి చెందిన తన అభిమాన సంఘ నాయకులకు చెప్పాడు. మహేష్ నుండి పిలుపు రావడంతో, కుటుంబ సభ్యులు, అభిమాన సంఘానికి చెందినవాళ్ళు ఆమెని హైదరాబాద్ తీసుకొచ్చారు. మహర్షి సినిమా సెట్‌లో, సత్యవతి గారు మహేష్‌ని కలిసారు. మహేష్‌ని చూడగానే ఆమె ముఖం ఆనందంతో వెలిగిపోయింది. మహేష్, ఆమె ఆరోగ్యం గురించి, ఇతర విషయాల గురించి చాలాసేపు ఆమెతో ఆప్యాయంగా మాట్లాడి, ఫోటోదిగి, ఆమెకి కొత్త బట్టలు పెట్టడంతోపాటు, సెట్‌లోనే భోజన సదుపాయం కల్పించి, ఆమెని క్షేమంగా ఇంటికి చేర్చమని తన అభిమాన సంఘం వారికి చెప్పి, సత్యవతిగారిని సంతోషంగా సాగనంపాడు. ఈ ఫోటోలిప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అడగ్గానే అంత పెద్దామె కోరిక నెరవేర్చిన సూపర్‌స్టార్ మంచి మనసుని అందరూ అభినందిస్తున్నారు..

వాచ్ వీడియో...

 

11:16 - November 26, 2018

హైదరాబాద్ : టాలీవుడ్‌‌లో సహజనటిగా పేరొందిన జయసుధ మళ్లీ రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నారా ? అంటే అవుననే తెలుస్తోంది. 2009లో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేసిన జయసుధ పోటీ చేసి తొలిసారే గెలుపొందారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఆమె ఓటమి చవి చూశారు. 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున సీనియర్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్‌పై విజయం సాధించిన జయసుధ, తర్వాత నగర రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించారు. కానీ కొన్ని పరిణామాల నేపథ్యంలో జయసుధ రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 
> భారతీయ సంస్క‌తిలో భాగమైన చీరలంటే ఇష్టం.
> మిరాయ ఎగ్జిబీషన్‌లో జయసుధ సందడి.
ఈ తరం నటీనటుల్లో అందరూ ఇష్టమే. 
భవిష్యత్‌లో మళ్లీ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేకపోలేదని జయసుధ సంకేతాలు ఇచ్చారు. నగరంలో మిరాయఫ్యాషన్ ఎగ్జీబీషన్‌లో సందడి చేసిన ఆమె టెన్‌టివితో ముచ్చటించారు. భారతీయ సంస్కృతిలో భాగమైన చీరలంటే తనకెంతో ఇష్టమని..ఈ తరం నటీనటుల్లో అందరూ ఇష్టమేనన్నారు. ఓటు హక్కును అందరూ వినియోగించుకోవాలని జయసుధ ప్రజలకు సూచించారు. 

17:45 - November 24, 2018

జనరల్‌గా సినిమాలకి టీజర్ కట్ చెయ్యడం మనం చూసాం కానీ, యాడ్స్‌కి టీజర్ కట్ చెయ్యడం  విన్నామా, పోనీ, ఎక్కడైనా చూసామా? ఇప్పుడు ఆ ట్రెండ్ కూడా స్టార్ట్ అయింది. సూపర్‌స్టార్ మహేశ్ బాబు పాపులర్ సాఫ్ట్ డ్రింక్ థమ్స్ అప్‌కి గత కొద్ది సంవత్సరాలుగా బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మహేశ్ థమ్స్ అప్ కొత్త యాడ్‌లో నటిస్తున్నాడు. ఆ యాడ్‌కి సంబధించి ఒక టీజర్ కట్ చేసారు. భారీ కొండ, ఎత్తెన జలపాతం దగ్గర, మహేశ్ చుట్టూ కొంతమంది గన్స్ పట్టుకుని, మహేశ్ వంక కోపంగా చూస్తూ ఉండడం, క్లోజ్‌లో మహేశ్ ఇంటెన్సిటీతో కూడిన చూపు చూస్తూ, సడెన్‌గా కళ్ళు మూయడం వరకు టీజర్‌లో చూపించారు. వాట్ నెక్స్ట్ అంటే, వెయిట్ ఫర్ యాడ్ అంటున్నారు. మినిమం ఒకటి, లేదా, ఒకటిన్నర నిమిషం నిడివి ఉండే యాడ్స్‌కి కూడా టీజర్ కట్ చేసే ట్రెండ్ స్టార్ట్ చేసాడు మా హీరో అంటూ.. మహేశ్ అభిమానులు హ్యాపీగా ఫీలవుతున్నారు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

వాచ్ వీడియో...

 

17:51 - November 16, 2018

హైదరాబాద్: తెలుగు చలనచిత్ర చరిత్రలో విజయవంతమైన చిత్రాలతో దుసుకువెళుతున్న మహేష్ బాబు ఇప్పుడు వ్యాపార రంగంలోకి అడుగు పెడుతున్నారు. జి.మహేష్ ఎంటర్ టైన్ మెంట్స్ పేరుతో  సినీ నిర్మాణ సంస్ధను ప్రారంభించే యోచనలో ఉన్న మహేష్. ఇప్పటికే ఏషియన్ సినిమాతో కలిసి హైదరాబాద్ గచ్చిబౌలిలో  ఏఎంబీ మల్టీప్లెక్స్ ధియేటర్ నిర్మాణాన్ని పూర్తి చేశారు. 7 స్క్రీన్ లతో 1638 మంది   చూసేందుకు వీలుగా, అత్యాధునిక హంగులతో మల్టీప్లెక్స్ రూపుదిద్దుకుంది.

ఈ మల్టీప్లెక్స్ లో మొదటి చిత్రంగా  రజినీకాంత్ నటించిన 2.ఓ ను ప్రదర్శించనున్నారు. త్వరలో  రజనీకాంత్ ఈ ధియేటర్ ఓపెనింగ్ కు హైదరాబాద్ రానున్నారు.  మొదటగా ఈ థియేటర్స్‌ను థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్‌ సినిమాతో ప్రారంభించాలనుకున్నారు. అయితే అనుకున్న సమయానికి నిర్మాణ పనులు పూర్తి కాకపోవటంతో ప్రారంభోత్సవం వాయిదా పడింది. 

మల్టిప్లెక్స్ లోని ప్రతితెర  3డీ టెక్నాలజీ తో,డాల్బీ సౌండ్ సిస్టంతో అధ్భుతంగా రూపు దిద్దుకుంది.  విదేశీ ఆర్కిటెక్ట్ లు నైపుణ్యంతో అలనాటి ఇంద్రభవనాన్ని తలదన్నేలా ధియేటర్ లో అంతా రిచ్ గా ఉందని చెపుతున్నారు. గచ్చిబౌలి లోని సాఫ్ట్ వేర్  హబ్ కు అతి చేరువలో  కొత్తగూడ జంక్షన్ లో రూపొందిన ఈమల్టీప్లెక్స్ రజనీ 2.ఓ సినిమాతో  ప్రారంభంకానుంది.  హైద‌రాబాద్‌లో స‌క్సెస్ అయ్యాక ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ న‌గ‌రాల్లోనూ మ‌ల్టీప్లెక్స్‌లు ప్రారంభించే యోచనలో మహేష్ బాబు ఉన్నారు. ప్ర‌స్తుతం ఉన్న వాటితో పోల్చితే ఈ మ‌ల్టీప్లెక్స్ ల‌గ్జ‌రీగా ఉంటుంది.

19:12 - November 6, 2018


సూపర్ స్టార్ రజనీకాంత్, శంకర్‌ల కాంబినేషన్‌లో, రూపొందుతున్న ప్రెస్టీజియస్ మూవీ, 2.ఓ.. అక్షయ్ కుమార్ విలన్‌గా, అమీ జాక్సన్ హీరోయిన్‌గా నటించారు. లైకా ప్రొడక్షన్స్‌ సుభాస్కరన్, రూ. 550 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించాడు. రీసెంట్‌గా రిలీజ్ చేసిన ఈ‌సినిమా ట్రైలర్ సోషల్ మీడియాని షేక్ చేసేస్తోంది. కేవలం, 24 గంటల్లోనే 25 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు 2.ఓ ట్రైలర్ గురించి స్పందించగా, ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు తన అభిప్రాయాన్ని ఆడియన్స్‌తో షేర్ చేసుకున్నాడు. 2.ఓ ట్రైలర్ చూసాను. అద్భుతంగా ఉంది. మైండ్ బ్లోయింగ్ విజువల్స్, ఊహలకందని కాన్సెప్ట్, ఇక చిట్టీని వెండితెరపై ఎప్పుడెప్పుడు చూద్దామా అనిపిస్తుంది. శంకర్, రజనీ సర్, అక్షయ్ కుమార్, ఏఆర్ రెహమాన్‌లతో పాటు, 2.ఓ  టీమ్ అందరికీ శుభాకాంక్షలు.. అని, మహేష్ ట్వీట్ చేసాడు.
మహేష్ ట్వీట్‌కి శంకర్, అక్షయ్ కుమార్.. థ్యాంక్స్‌అని రిప్లై ఇచ్చారు. నవంబర్ 29న  2.ఓ  ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.  

 

11:30 - November 1, 2018

హైదరాబాద్ : బాలీవుడ్, టాలీవుడ్..ఇతర వుడ్ లకు సంబంధించిన నటీ, నటులు సినిమాలే కాకుండా ఇతర వాటిపై కూడా ఫోకస్ పెడుతున్నారు. Image result for AMB Cinemas Kondapurవ్యాపారాల్లో ప్రవేశించి కొంతమంది లాభాలు గడిస్తుండగా మరికొందరు నష్టాలపాలవుతున్నారు. తాజాగా టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు కూడా వ్యాపర రంగంలో అడుగు పెడుతున్నారు. ఇప్పటికే కొన్ని బ్రాండ్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న మహేష్ రెండు చేతులా సంపాదిస్తున్నారు. 
Image result for AMB Cinemas Kondapurమహేష్ బాబు మల్టీప్లెక్స్ రంగంలో అడుగు పెడుతున్నాడు. ఏషియన్ ఫిలింస్ వారితో కలిసి మహేష్ ఈ బిజినెస్ లో రాబోతున్నాడు. ఏఎంబీ సినిమాస్ పేరిట కొండాపూర్ లో ఓ థియేటర్ ను నిర్మించారు. ఈ థియేటర్ నవంబర్ 8 న ప్రారంభం కానుంది. మహేష్ బాబు ఫ్యామిలీ లాంఛనంగా దీనిని ప్రారంభించనున్నారట. మహేష్, ఆయన భార్య నమ్రత శిరోద్కర్ దీనికి డైరెక్టర్లుగా వ్యవహరించనున్నారని టాక్. నవంబర్ 8న రిలీజ్ అయ్యే 'థగ్స్ ఆఫ్ హిందూస్తాన్'.. 'సర్కార్' సినిమాలను మల్టిప్లెక్స్ లో ప్రదర్శించనున్నారు. 

17:27 - October 12, 2018

సూపర్ స్టార్ మహేష్ బాబు, పూజా‌హెగ్డే జంటగా, వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో, అశ్వనీదత్, దిల్ రాజు, పీ.వీ.పీ. కలిసి నిర్మిస్తున్న మూవీ, మహర్షి.. అల్లరి నరేష్ ఇంపార్టెంట్ రోల్ చేస్తున్న మహర్షి షూటింగ్.. ప్రస్తుతం అమెరికాలో జరుగుతోంది. 
మొన్నటి వరకు గెడ్డంతో, చేతిలో బుక్ పట్టుకుని కాలేజ్‌కి వెళ్ళిన మహేష్ ,ఈ షెడ్యూల్‌లో కంపెనీ సీఈవో‌గా మారిపోయాడు.. ఆన్‌లొకేషన్ నుండి ఈ స్టిల్ బయటకొచ్చింది. మహేష్ క్లీన్ షేవ్‌తో, బ్లూ జీన్స్‌ బ్లేజర్, గాగుల్స్‌తో, హాలీవుడ్ హీరోలా ఉన్నాడు.. మహేష్  అలా స్టైల్‌‌గా నడుచుకుంటూ వస్తుంటే, చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది..   ఈ స్టిల్ చూసి, మహేష్ మేల్ ఫ్యాన్స్‌హ్యాపీగా ఫీలవుతుంటే, ఫీమేల్ ఫ్యాన్స్ మాత్రం,  మహేష్ బాబు, అంత అందమేంటయ్యా బాబూ.. అంటూ అసూయ పడుతున్నారు... 2019 సమ్మర్‌లో మహర్షి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..

09:20 - October 2, 2018

హైదరాబాద్ : ఎప్పటికైనా నీతి, నిజాయితీలదే గెలుపు అని బిగ్ బాస్ విన్నర్ కౌశల్ ద్వారా మరోసారి నిరూపితమైంది. మొత్తం 16మంది బిగ్ బాస్ సభ్యుల్లో ప్రేక్షకుల ఆదరణను చివరి వరకూ తన సంకల్పంతో, నిజాయితీతో, పట్టుదలతో గెలుచుకుని నేటి యువతకు స్ఫూర్తిగా నిలిచాడు..బిగ్ బాస్ విన్నర్ గా నిలిచాడు కౌశల్. ఇప్పటి వరకూ ఎన్నో భాషల్లో బిగ్ బాస్ నిర్వహించినా..ఏ నటుడికీ..ఏ సెలబ్రిటీకి రానంత ఆదరణ, ప్రేమ, గౌరవం దక్కించుకున్నాడు కౌశల్. 16మంది సభ్యుల్లో బిగ్ బాస్ హౌస్ లో 100 రోజులకు పైగా ఒంటరి పోరాటం చేసి ఓపికతో సహనంతో తాను నమ్మినదానినే చివరివరకూ కొనసాగించి విన్నర్ గా నిలిచాడు కౌశల్. తాను విన్నగా నిలిచింనందుకు అభిమానులందరితో తన సంతోషాన్ని పంచుకున్నాడు. పట్టుదలతో స్వయంకృషితో ఎన్నో ఆటుపోటులు ఎదుర్కొని బిగ్ బాస్ 2 విన్నర్ గా నిలిచి తనకు అందిన పారితోషికాన్ని తన తల్లి క్యాన్సర్ తో మృతి చెందిందనీ..అందుకు ఆ మొత్తాన్ని క్యాన్సర్ రోగులకు వినియోగిస్తానని తెలిపి మరోసారి తన ఉదారతను చాటి చెప్పాడు కౌశల్. ఈ క్రమంలో తాను బిగ్ బాస్ లోకి ఎలా ఎంటర్ అయ్యింది. దానికి కారణం ఎవరో తెలిపాడు కౌశల్..
తాను బిగ్‌బాస్ షోలో పాల్గొనడం వెనక టాలీవుడ్ నటుడు మహేశ్ బాబు ప్రోత్సాహం ఉందని బిగ్‌బాస్-2 విజేత కౌశల్ తెలిపాడు. మహేశ్ బాబు తొలి చిత్రం ‘రాజకుమారుడు’తోనే తమ మధ్య సాన్నిహిత్యం ఉందన్న కౌశల్.. మహేశ్ బాబు లేకుంటే తాను లేనంటూ కౌశల్ చెప్పిన వీడియోను ఇప్పుడు మహేశ్ ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు.
తాను బిగ్‌బాస్‌కు వచ్చానంటే దానికి కారణం మహేశ్ బాబేనని కౌశల్ అన్నాడు. హైదరాబాద్‌లో తొలిసారి మోడలింగ్ అకాడమీ ఏర్పాటు చేసింది తానేనన్న కౌశల్.. అందుకోసం మహేశ్ ఎంతో సాయం చేశాడని గుర్తు చేసుకున్నాడు. రాజకుమారుడు సినిమా సమయంలో దగ్గురుండి అకాడమీని ఏర్పాటు చేయించినట్టు చెప్పాడు. దర్శకుడు రాఘవేంద్రరావు కూడా ఎంతో సాయం చేశారని పేర్కొన్నాడు. ఆ ఏజెన్సీ లేకపోతే తానెప్పుడో తిరిగి వైజాగ్ వెళ్లిపోయి ఉండేవాడినన్నాడు. ఈ సందర్భంగా తన గెలుపునకు కృషి చేసిన కౌశల్ ఆర్మీకి కృతజ్ఞతలు తెలిపాడు.  
 

Pages

Don't Miss

Subscribe to RSS - mahesh babu