Mallanna Muchatlu Latest

20:09 - March 25, 2017

హైదరాబాద్: మళ్లీ అలిగిన అంబర్ పేట హన్మంతన్న..అరెస్ట్ చేసి ఎత్తుకుపోయిన ఫ్రెండ్లీ పోలీస్, ఫ్లెక్సీ అభిమానుల మీద మంత్రిగారి మంట...మళ్లొకపారి కడితే చింపేయాలే లోకమంతా, మహిళ ఉద్యోగిని కడుపులో తన్నిన మంత్రి...శ్రీకాకుళం జిల్లాలో కామాంధుల కావరం, మాటలకే పరిమితం అవుతున్న ఆంధ్రా చంద్రాలు...కర్నూలు జిల్లాలో ఆగని కత్తులు, రక్తాలు, బోధన్ కాడ దున్నపోతు ఈదిందంట...దూడ కోసం దేవులాడుతున్న కేడర్, దుప్పి వేటగాళ్లకు పోలీసుల అండలు..మంత్రిగారి కొడుకే ఉన్నడన్న జనాలు ఇలాంటి అంశాలను తీసుకుని మల్లన్న 'మల్లన్న ముచ్చట్లు' అనే కార్యక్రమంలో మన ముందుకు వచ్చాడు. మరి మీరు కూడా ఆ వివరాలను పూర్తిగా చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి.

20:07 - March 24, 2017

హైదరాబాద్: ఆగానికి వచ్చిన అన్నదాత బతుకు....ఎండిపోతున్న పంటలు, అందని నీళ్లు, తోటి ఉద్యోగినికి తొంటి మెసేజ్ లు.. తీర్చాలన్న సారువారి మోజులు, చిరిగిపోతున్న సిర్పూర్ కత్తుల వర...చూడలేకపోతున్నరట లీడర్లు ఆడ, అమ్మా, నాన్న చిన్నపుడే సచ్చిపోయిండ్రు...బతుకుండి జీవశ్చవం అయిన పోలగాని పిచ్చి గోస, న్యాయాన్ని అమ్మేస్తున్న పోలీసు అధికారి...కడుపుకు పెండ తింటున్నావురా వారి, తిరుమల కొండెక్కిన నర్శింహన్ సారూ...రెండు మాట్లు దర్శించుకున్న గవర్నర్ ఇత్యాది అంశాలతో మల్లన్న 'మల్లన్న ముచ్చట్లు ' కార్యక్రమంలో మన ముందుచు వచ్చారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

20:07 - March 23, 2017

హైబీపీ పెంచుకుంటున్న హన్మంతన్న... అసెంబ్లీలో సెక్యూరిటోనితో పంచాయతీ, ఆంక్షలతో అద్భుతంగా నడుస్తోన్న అసెంబ్లీ... ప్రతిపక్షాల మీద కక్ష కడుతోన్న టీ.సర్కార్, కందుల కొనుగోలు కాడ గోల్ మాల్...ఆలేరు మార్కెట్ కాడ రైతుల ఆగంఆగం, ప్రకాశం జిల్లాలో పంచాయితీకొచ్చిన జనం...గల్లీ,గల్లీకి మోపైన దుకాణాలు, గాలి మోటర్లతో కయ్యం పెట్టుకున్న ఎంపీ సారూ...దింగంగనే చెప్పుతోని కొట్టి కసి తీర్చుకున్నడు. ఇత్యాది అంశాలతో 'మల్లన్న ముచ్చట్లు' కార్యక్రమంలో మల్లన్న మన ముందుకు వచ్చాడు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

20:15 - March 22, 2017

నరం లేని నాల్కె ఎన్నిమాటలన్న మాట్లాడ్తదంటరు సూడు.. గది మన చంద్రాలుకు సూటైతుండొచ్చు ఈ ముచ్చట్ల.. జనగామా ఎమ్మెల్యే సారు.. చర్లపల్లి కాడ కష్టపడి సర్కారు భూమి కబ్జావెట్టుకున్నడట..లోక కళ్యాణం లెక్క.. తెలంగాణ కళ్యాణం గూడ జర్గి తీరవల్సిందే అని.. మన తెలంగాణ సీఎం కేసీఆర్ సారు.. మస్తు తన్లాడుతున్నడు..గోషా మహల్ ఎమ్మెల్యే రాజసింగు సారు యాదికున్నడా..? తెలంగాణ రాష్ట్రం మీద రాహుకేతులువు తిష్టేశి కూసున్నట్టే గొడ్తున్నది.. ఆదిలాబాద్ జిల్లాల జనం ఆగమైతున్నరు.. దుపదూపై అంగలారుస్తున్నరు.. దొంగోని పట్ల కనీస మర్యాదలు పాటించకుంట ఇంట్ల ఏం దాశిపెట్టకుంట ఊరికి వొయ్యిన ఆ ఇంటోళ్ల మీద కోపంరాదా.. ఇగో వచ్చింది..గత పాలకుల లెక్క గాదు మాది రైతు ప్రభుత్వం అని మోడీగారు ఎన్నిమాట్ల మొత్తుకున్నడు...గిసొంటి ముచ్చట్లు సూడాలంటే వీడియో చూడండి..

20:12 - March 22, 2017

గోషా మహల్ ఎమ్మెల్యే రాజసింగు సారు యాదికున్నడా..? మర్శిపోయే క్యారెక్టరేనా సారుదిగని.. సారుకు నిన్నియాళ్ల ఓట్లేశిన జనం మీద ఏమన్న ప్రేమ వుట్టుకొచ్చిందా..? ఎన్కగన్ మెన్లు లేకపోతె.. జనం కాళ్లు గడ్కి నెత్తిల సల్లుకోని ఆయన ఆఫీసు మీద గూడ సల్లుకునెతట్టుండి.. రెండున్నరేండ్ల సంది లేని ప్రేమ సడన్గ వుట్టుకొచ్చెవర్కళ్ల జనం గోషామహల్ జనం ఆనంద బాష్పాలు గారిస్తె పెద్ద మడుగే తయ్యారైందట.. ఆ కథేందో వీడియోలో సూడుండ్రి..

20:35 - March 20, 2017

సమరభేరి మోగింది. మాటలతో.. కల్లబొల్లి కబుర్లతో నడిపే ప్రభుత్వం పై సమర భేరి మోగింది. అధికారం అనుభవించడం.. అయినవాళ్లతో కలిసి పదవులు పంచుకోవడం తప్ప నిజమైన అభివృద్ధి అంటే సంకల్పం ఒక్కటే. సమర భేరి షురూ అయ్యింది. ప్రశ్నించే గొంతుకలను పిడికిలిలో భిగించి నియతృత్వ పోకడులపై నిలిచే పాలకులపై సమర భేరి మోగింది. బంగారు తెలంగాణ అంటూ బతుకే లేని తెలంగాణను మిగుల్చుతున్న సర్కారీ విధానాలపై సరూర్ నగర్ వేదిక సాక్షిగా సమరభేరి మోగింది. ఇదే అంశంపై నేటి వైడాంగిల్ స్టోరీ. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి.

22:08 - March 16, 2017

సీపీఎం మహాజన పాదయాత్ర బృందంతో మల్లన్న ముచ్చటించాడు. ఆ వివరాలను వారి మాటల్లోనే...
చెరుపల్లి సీతారాములు 
'పాదయాత్రకు అపూర్వమైన స్పందన వస్తుంది. గ్రామాలకు గ్రామాల ప్రజలు కదులుతున్నారు. పాదయాత్రకు ఎదురెళ్లి స్వాగతం చెబుతన్నారు. అనేకమైన విన్నపాలు చేస్తున్నారు. సమస్యలను పాదయాత్ర బృందానికి ఏకరవుపెడుతున్నారు. 
స్థానికంగా సమస్యలపై అధికారులకు మెమోరండం ఇస్తున్నాం. సమస్యలను పాదయాత్ర సందర్భంగానే అధికారులకు దృష్టికి తీసుకెళ్లి.. పరిష్కరిస్తున్నాం.
తమ్మినేని వీరభద్రం..
ఇందిరాపార్క్ వద్ద ఉన్న ధర్నా చౌక్ లలో ధర్నాలు చేయొద్దని...సిటీకి దూరంగా చేయాలని సీఎం కేసీఆర్ అంటున్నాడు.
జనం లేనితాన ధర్నాలు చేసి సమస్యలను చెట్లకు, పట్టలకు చెప్పుకోవాలా..? ప్రతిపక్షాలను లేకుండా చేయాలని సీఎం భావిస్తున్నాడు. పోలీసులను భారీగా పెంచడం, పోలీసు వాహనాలను ఇచ్చాడు. జీతాలు ఇస్తున్నడు. నా లేఖలకు స్పందన లేదు.. ప్రత్యుత్తరం లేదు.. కానీ సమీక్షలు చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులకు కోతా పెడుతున్నారు. నిధులను పక్కదారి పట్టిస్తున్నారు. 9800 కోట్లు వివిధ పథకాలకు కేటాయించాలి. కేంద్ర ప్రభుత్వం దారుణంగా ఉంది. మోడీ ఏ ఒక్క హామీ అమలు చేయలేదు. నల్లధనం వెలికి తీయలేదు. నోట్ల రద్దు దేశానికి పెద్ద విఘాతం. బీజేపీ మత భావాలను రెచ్చగొడుతూ పబ్బం గడుపుకుంటుంది. ప్రజలు బీజేపీకి విజయం ఇచ్చారు..కానీ అది నష్టదాయకం.
రమ...
పాదయాత్ర చాలా బాగుంది. మహిళలకు ప్రభుత్వం ఆచరణలో ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఆశా వర్కర్ల విషయంలో ఎలాంటి న్యాయం చేయలేదని' చెప్పారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..
 

09:39 - March 16, 2017

యాదాద్రి : ఒకటే లక్ష్యం.. అదే గమ్యం.. 4 వేల కిలోమీటర్లు పూర్తి చేసినా.. ఇంకా తగ్గని ఉత్సాహం. సామాజిక లక్ష్యం-సమగ్రాభివృద్ధి ధ్యేయంగా సీపీఎం చేపట్టిన మహాజన పాదయాత్ర ఎగిసిపడుతున్న కెరటాల్లా దూసుకెళ్తోంది. వాగులు, వంకలు దాటుకుంటూ.. ఎన్నో పల్లెల్లో కొనసాగుతున్న పాదయాత్ర నేటితో 150 రోజులు పూర్తి చేసుకుంది. ఎంతో ఉత్సాహం కొనసాగుతున్న పాదయాత్రకు అన్ని గ్రామాల్లో ప్రజలు బ్రహ్మరథం పడుతుండగా.. మరోవైపు ఇతర రాజకీయ పార్టీలు సైతం సంఘీభావం తెలుపుతున్నారు. అన్ని సామాజిక వర్గాలకు తగిన ప్రాధాన్యత లభించాలనే ఎజెండాతో కొనసాగుతున్న సీపీఎం మహాజన పాదయాత్ర యాదాద్రి జిల్లాలో సాగుతోంది. మహాజన పాదయాత్రకు ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చి.. తమ సమస్యలపై వినతిపత్రాలు ఇస్తున్నారు. మహాజన పాదయాత్రకు అన్ని వర్గాల నుంచి మంచి స్పందన లభిస్తోంది. వివిధ పార్టీల నేతలు పాదయాత్రకు సంఘీభావం తెలుపుతున్నారు. ఆలేరులో మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్‌ పాదయాత్ర బృందాన్ని కలిసి అభినందించారు.

150వ రోజు...
రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని కేసీఆర్‌ గొప్పలు చెప్పుకుంటున్నా.. పల్లెల్లో ఆ పరిస్థితి లేదన్నారు తమ్మినేని వీరభద్రం. ఇంటింటికో ఉద్యోగం ఇస్తానని చెప్పిన కేసీఆర్‌.. కనీసం ఊరుకో ఉద్యోగం కూడా ఇవ్వలేదన్నారు. దీంతో యువకులు కూలీ పనులు చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. పాదయాత్రను చూసి అన్ని వర్గాలను దగ్గరకు తీసుకునే ప్రయత్నం చేస్తున్న కేసీఆర్‌.. బడ్జెట్‌లో కేటాయించిన నిధులు కూడా ఆ వర్గాల కోసమే ఖర్చు చేస్తారన్న నమ్మకం లేదన్నారు తమ్మినేని. 150వ రోజు పాదయాత్ర.. పులిగిల్ల నుంచి ప్రారంభమై కాటేపల్లి, సికిందర్‌నగర్‌, మోటకొండూర్‌, దిలావార్‌పూర్‌ మీదుగా ఆలేరు వరకు కొనసాగింది. తమ్మినేని బృందం మోటాకొండూరులో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీశారు. మోటాకొండూరు కొత్త మండలంగా ఏర్పడడంతో హాస్టల్‌ విద్యార్థులు సమస్యలు ఎదుర్కొంటున్నట్లు పాదయాత్ర బృందం దృష్టికి వచ్చింది. మండల కేంద్రాన్ని హాస్టల్‌లోనే ఏర్పాటు చేయడంతో గదులు సరిపోవడం లేదని విద్యార్థులు వాపోయారు. దీనిపై స్పందించిన తమ్మినేని.. హాస్టల్‌ సమస్యతో పాటు.. మోటాకొండూరు మండల సమస్యలపై సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. ఇక ఎన్నో ఏళ్లుగా నిర్మాణం లేక వెలవెలబోతున్న బునాదిగాని కాల్వ పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్‌ చేస్తూ తమ్మినేని.. సీఎం కేసీఆర్‌కు మరో లేఖ రాశారు. బడ్జెట్‌లో కాల్వకు నిధులు మంజూరు చేసి తక్షణమే పనులు ప్రారంభించాలని కోరారు.

08:28 - March 16, 2017

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ప్రవేశ పెట్టిన అనంతరం పలు కులసంఘాలు..ఇతరులు సీఎం కేసీఆర్ ను అభినందనలో ముంచెత్తుతున్నారు. దీనిపై సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభధ్రం ఒక డౌట్ తెరమీదకు తెచ్చారు. బడ్జెట్ ప్రవేశ పెట్టిన అనంతరం వాళ్లు ఎలా రెడీ అయ్యారు..గొల్ల అయిన రెడీ ఉండి గొర్రె ఎలా ఇచ్చిండు.? ప్రశ్న లేవనెత్తారు. అసెంబ్లీకి రావాలంటే పాస్ రావాలి కదా. ఈ పాస్ ఎలా వచ్చింది..మంత్రి తలసాని పాస్ ఇచ్చిండు. టీఆర్ఎస్ మంత్రి కదా. ఆయన మనిషి వచ్చి పరిపాలన బాగా లేదంటాడా ? అని పేర్కొన్నారు. పాలు కూడా వీళ్లే తెప్పిస్తారు. బొమ్మ వీళ్లదే. ప్రేమతో పోసిన పాలు కాదు. ముందే చెబుతారని తమ్మినేని తెలిపారు. టైం పెట్టండి..ఏ ఊళ్లోకి రమ్మంటే ఆ ఊళ్లోకి వస్తా. కమ్మరి..బెస్త..వడ్రంగి..అందర్నీ పిలుద్దాం. కేసీఆర్ సర్కార్ మంచి చేస్తుందని చెబితే నేను ఒప్పుకుంటా అని తమ్మినేని తెలిపారు. మరి తమ్మినేని వ్యాఖ్యలపై సర్కార్ స్పందిస్తుందా ? లేదా ? అనేది చూడాలి.

08:04 - March 16, 2017

అధికారంలోకి రాగానే దళితులకు మూడెకరాల భూ పంపిణీ ఇస్తామని ప్రస్తుత పాలకులు పేర్కొన్నారు. మరి మూడెకరాల భూ పంపిణీ జరిగిందా ? ఇతరత్ర సమస్యలు తీరాయా ? అనేది తెలుసుకోవడానికి సీపీఎం మహాజన పాదయాత్రను మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. పాదయాత్ర ముగింపు చేరుకున్న సందర్భంగా పాదయాత్ర రథసారధి, సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో 'మల్లన్న' ముచ్చటించాడు. దళితులకు మూడెకరాల భూ పంపిణీ ఇస్తామని చెప్పి ఎందుకు అమలు చేయడం లేదన్నారు. మూడు ఎకరాల భూమి ఇస్తానని చెప్పాడు కదా..మూడెకరాల భూమి తరువాత సార్..చచ్చినపోయినప్పుడు మూడు గజాల స్థలం లేదు..అని పలువురు తమతో చెప్పారని తెలిపారు. రూ. 5లక్షలు పెట్టి భూమి కొనడానికి సిద్ధంగా ఉంది..ఆ రేటుకు భూమి దొరకతలేదని అని ప్రభుత్వం చెబుతోంది..మూడెకరాల చొప్పున రూ. 15లక్షలు వారి ఖాతాల్లో వేయాలని సూచించారు. ఒకవేళ వారు డబ్బులు ఖర్చు పెడుతారని అనుకుంటే భూమి కొనుక్కొంటే డబ్బులిస్తామనే షరతు పెట్టాలన్నారు. దీని గురించి వినాలంటే వీడియో క్లిక్ చేయండి.

Pages

Don't Miss

Subscribe to RSS - Mallanna Muchatlu Latest