mallanna news

20:54 - May 24, 2018

నాకు ఏపదవొద్దంటున్న కోమటిరెడ్డి...పదవొద్దన్నంక రాజకీయాలెందుకు..?, రెవెన్యూ రికార్డుల శుద్ది ఆగమాగం.. లక్షల రికార్డులకు కొత్త సమస్యలు, మున్సిపల్ చెర్మన్ కొడ్కును తిట్టిన జేసీ..ఎందుకో సారుకు  బీసీలంటే అంతకశి, ఊర్లపొంటి కొనసాగుతున్నదాడులు..సుట్టాలను కొట్టి సంపుతున్నజనాలు, రాజకీయ రంగుగ మారిన టీటీడీ పంచాది.. వైసీపీ, టీడీపీల నడ్మ రాజుకున్నది, సాకలోళ్లకు ఇస్తీరి మంగలోళ్లకు కత్తెర్లు.. మరి అగ్రవర్ణాల పనిముట్లేవి సారు..? ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం... 

20:18 - May 22, 2018

ఊర్లపొంటి దొంగలొస్తున్నరట..? మందిని సంపుతున్నరట.. ఇండ్లన్ని దోస్తున్నరట.. పక్కపొంటి ఊరికాడ దొర్కిండ్రట.. ఇట్ల రకరకాల పుకార్లు శికారు జేస్తున్నయ్ సోషల్ మీడియాల.. అటు పోలీసోళ్లు ఎంత మొత్తుకున్నా జనానికి అర్థమైతలేడు.. ఎవ్వడన్న మాశిన బట్టలు పెర్గిన నెత్తితోని గనిపిస్తె వాన్ని వట్కోని సావగొడ్తున్నరు జనం..

ఆంధ్ర రాష్ట్రంల ఎన్నికల వేడి సుర్వైంది.. అసెంబ్లీ ఓట్లకు ఇంకో యాడాది టైమున్నా..? అన్ని పార్టీలు ఒకదాన్ని మించి ఇంకోటి జనంలకు వోతనేఉన్నయ్.. పొయ్యే రూపం వేరున్నా..? అంతిమ లక్ష్యం మాత్రం జనంతానున్న ఓటును గుంజుకునుడే అన్నట్టు.. తెల్గుదేశం గ్రామదర్శిని అంటున్నది.. వైసీపీ పాదయాత్ర జేస్తున్నది.. జనసేనా బస్సుయాత్ర.. జేడీ లక్ష్మీనారాయణ భరోసా యాత్ర, సీపీఎం లెఫ్ట్ పార్టీలు పిట్రోలు యాత్రలు..

నన్ను విమర్శించే అర్హత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి లేదు అంటున్నడు నీతికి నిల్వుటద్దమైన శ్రీ నారా చంద్రాలు సారు.. మీరు రాష్ట్రపతి ఎన్నికలళ్ల.. ఉపరాష్ట్రపతి ఎన్నికలళ్ల బీజేపీ అభ్యర్ధికి అనుకూలంగ ఓట్లేశి రాష్ట్ర ప్రయోజనాన్ని తాకట్టు వెట్టినోళ్లు మీరు నన్నా అనేది అని మస్తు గరమైతున్నడు సారు..

ఏతుల పుంజు ఏతుల పుంజు అంటె ఇన్నరుగని.. ఏతుల పుంజు ఎట్లుంటదో సూశిండ్రా మీరు ఎన్నడన్న..? నల్లగొండ నడిగడ్డమీదున్నది ఆ పుంజు.. ఆ పుంజు ఏతులు జూస్తే.. అవద్దాలు ఆత్మహత్య జేస్కుంటయ్.. మమ్ములను మించిన మొనగాడున్నడా ఈ భూమ్మీద అని..? మరి ఆల్చమెందుకు పాండ్రి సూపెడ్త..

జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం కాడ ఎక్వేం లేదు.. ఐదే ఎక్రాలు కబ్జా వెట్టి పట్టా జేపిచ్చుకున్నరట మన లీడర్లు.. ఎంత శిగ్గుతక్వ ముచ్చట ఒక్కడొక్కడు వందల ఎక్రాలు కబ్జాలు వెట్టుకుంటున్నరు.. వాడెవ్వడో ఐదే ఎక్రాలు వెడ్తడా..? చేశిన దొంగతనమన్న గట్టిగ జేయరాయే.. ఓ యాభై ఎక్రాలు వెడ్తె మన ముఖ్యమంత్రిగారు పర్వునిలవెట్టినోళ్లు అయితరుగని.. చిన్నచిన్నగ జేస్తారు.. ఆయ్..

ఆంచూర్ రైతులు మళ్లొకపారి మోసపోయిండ్రు మార్కెట్ల.. పోయిన యాడాది గూడ ఇసొంటి మోసమే అయ్యింది ఈసారి గూడ రిపీట్ అయ్యింది.. నిజామాబాద్ జిల్లాల ఆంచూర్ రైతులు చాలమందుంటయ్.. అదే అంచూర్ అంటే మామిడి కాడ ఒర్గుదీశి ఎండవెట్టేది.. మద్దతు ధర దొర్కుతదేమో అని మామిడి చెట్టంత ఆశవెట్టుకోని మార్కెటుకోస్తె మళ్ల గదే దళారీగాళ్లు తల్గి ధర తక్వ జేశి కొంటున్నరట..

ఇదే కన్ఫ్యూజన్ మళ్ల.. నిన్నరాత్రి జగిత్యాల జిల్లాకేంద్రంలున్న సర్కారు దావఖానకు ఇద్దరు గర్భిణీ స్త్రీలొచ్చిండ్రట.. డెలివరీ కోసం ఇద్దరికి ఒక్కటే సారి కాన్పు జేశిండ్రు.. ఇద్దరికి మొగపిల్లలే వుట్టిండ్రు.. మరి ఏడ తేడా వచ్చిందో ఏమో.. మా పిలగాన్ని వాళ్లకిచ్చిండ్రు.. వాళ్ల పిలగాన్ని మాకిచ్చిండ్రని కయ్యం లేశింది.. ఇప్పటికి తేలలే పంచాది..

కోతులకు గూడ కోపం బాగనే ఉండెతట్టుందిగదా..? మన్సులకున్నట్టు.. అవ్విటికి గూడ ఒక్కొక్కపారి బీపీ వెర్గెతట్టుంది.. మన్సులను తంతున్నయ్.. ఇయ్యాళ తాజ్ మహాల్ జూస్తందుకు బైటిదేశం మన్సులొచ్చిండ్రట వాళ్ల మీద వడి కర్శినయట ఇద్దరికి గాయాలైనయంటున్నరు.. మరి అవ్వేమనుకున్నయో ఏమో ఈడ మేముండంగ మీరెట్లొస్తరని కోపానికొచ్చినయో ఎట్లనో గని..? కోతుల కథ జూడుండ్రి..

20:27 - May 14, 2018

ఆంధ్ర ప్రదేశ్ బీజేపీ పార్టీల ముసలం బుట్టింది.. నిన్నగాక మొన్న పార్టీల జేరిన కన్నా లక్ష్మీనారాయణకు బీజేపీ అధ్యక్షుడి పదవి ఇస్తె.. ఇన్నొద్దుల సంది జనం చెవ్వుల పువ్వులు వెట్టి పువ్వుగుర్తును కాపాడుకుంటొచ్చిన మా ప్రియతమ నేత సోమువీర్రాజు పరిస్థితి ఏందని పంచాది రాజుకున్నది.. రాజీనామాల దాక వోతున్నది యవ్వారం..

జానారెడ్డికి భయమైతున్నట్టుంది.. ఆయింత ముఖ్యమంత్రి పదవిని ఉత్తంకుమార్ రెడ్డి గొట్కపోతడా..? లేకపోతె రేవంత్ రెడ్డి ఎసరువెడ్తడా అన్న పుట్టెడు భయంతోని ఉన్నట్టుండు.. ఇగ అయితె గియితే నేను గావాలె గని.. జూనియర్లు వాళ్లెట్లైతరు అని చెప్పలేక.. కొంతమంది అత్యుత్సాహంగ మాట్లాడుతున్నరని కడ్పుల మంటను మీడియా ముంగట వోశిండు..

వారెవ్వ సూస్కోండ్రి.. ప్రపంచంలనే ఎక్కడలేని విధంగ రెవెన్యూ రికార్డులు సదిరినం అని చెప్తున్నడుగదా..? ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ శుద్దికరణల ఎంత గోల్మాల్ ఉన్నదో మచ్చుకు ఒక ముచ్చటొచ్చింది సూడుండ్రి.. రికార్డుల శుద్దిల పేదల భూమిని ముప్పై ఎక్రాలు చెరవట్టేశిండ్రు అధికార పార్టీ లీడర్లు.. వాస్తవమే మరి ప్రపంచంల ఎక్కడలేని విధంగనే జేశిండ్రు ఎక్కడైనా పేదల భూమి పేదలకే ఇచ్చిండ్రు ఈడ దోసుకుంటున్నరు..

కాంగ్రెస్ పార్టోళ్లు సంకురాత్రి గంగెడ్ల లెక్క బస్సుయాత్రలు వెట్టుకోని తిర్గుతున్నరు జనంల అని తిడ్తున్నడు పెద్దపల్లి ఎంపీ బాల్కసుమన్ సారు.. వాళ్లు ఎన్నడు ఏం జేయలేదు.. ఇగ ముంగట గూడ ఏం జేశెటోళ్లు గాదు వాళ్ల మాటలు నమ్మకుండ్రి అని ఆ గంగెడ్ల కంటె ముందుగాళ్లనే మేము మీతానికొచ్చి చెప్తున్నం అనుకొచ్చిండు ఒకతాన మీటింగుల సారు జర్ర మళ్ల జెప్పు..

తెలంగాణ ప్రజలు ఈ కేసీఆర్ జేస్తున్న కుట్రలను పశిగట్టకపోతె ఆగమైతది తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణ నీళ్లు నిధులు నియామకాల కోసం అయితే.. రైతుల కండ్లళ్ల నీళ్లు గారుతున్నయ్.. నిధులు ఆంధ్రాకాంట్రాక్టర్ల జేవుల వడ్తున్నయ్..నియామకాలు కేసీఆర్ ఇంటోళ్లతోని భర్తీ అయితున్నయ్.. తస్మాత్ జాగ్రత్త ఈ ప్రభుత్వాన్ని ప్రజలంత గల్చి గద్దెతించకపోతె ఆగమైతదనుకొచ్చిండు జనసమితి అధ్యక్షుడు కోదండరాం సారు..

ఇంకా శెరమొస్తలేదేమయ్యా ఈ తెలంగాణ ప్రభుత్వానికి ఇంతగనం మొత్తుకుంటున్నం.. వడగండ్ల వానకు రైతుల పంట ఆగమైతున్నది ఏమన్న ఏర్పాట్లు గట్టిగ జేయుండ్రి వాళ్లు ఆగమైతున్నరని ఎన్నొద్దుల సంది మొత్తుకుంటున్నం మనం.. అయినా లాభం లేదు.. అడ్డమైన వానలు జేయంగ మళ్ల మార్కెట్ల పొంట గదే తడ్సుడు గదే ఆగమున్నది..

పూసలోళ్లు నెత్తిల గంప ఎత్తుకోని ఇంటి ముంగటికొస్తె ఆ ఇల్లు కళకళలాడ్తది.. పండుగేదైనా పబ్బమేదైనా.? పూసలి తల్లి తట్ట ఇంటికాడ దిగంది పండుగ పూరాగ గాదు.. పెండ్లి కాడికెళ్లి చిన్న దావతుదాక వాళ్ల చేయివడంది అసలది పండుగనే గాదు.. పండుగకు వన్నెతెచ్చె పూసలోళ్ల తల్లి ఇయ్యాళ మార్కెట్ మాయాజాలం చిక్కి గోసెల్ల వోస్తున్నది.. ఒక్క మాటల జెప్పాల్నంటే పూసల గంప చిన్నవోయింది..

కార్డన్ సర్చ్ అని ఒక కథనడుస్తున్నది చానొద్దుల సంది తెలంగాణ రాష్ట్రంల..మరి ఈ కార్డన్ సర్చ్ తోని ఏం బైటవడ్తున్నది ఏ దొంగ దొర్కుతున్న సంగతి మనకు మాత్రం తెల్వదిగని.. పోలీసోళ్లు ఏడైతె చేయాల్నో సర్చింగు ఆడ జేస్తలేరు.. ఏడ జేయొద్దు ఆడ జేస్తున్నరు.. పేదలు బత్కే బస్తీల పొంట సర్చింగులు గాదు పోలీసోళ్లు మీరు జేయవల్సింది నిజంగ మీకు ధమ్ము ధైర్యం ఉంటే ఇగో గీడ జేయుండ్రి...

 

20:28 - May 11, 2018

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి.. బుర్దల బొర్రిన పందికి పెద్ద తేడా లేదంటున్నడు.. సత్పురుషుడు.. అవినీతి అంటె ఏందో తెల్వనోడు.. నీతికి నిల్వుటద్దం.. వెన్నుపోటంటె ఎట్లుంటదో తెల్వని మహానేత శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు... నా నల్పై ఏండ్ల రాజకీయ జీవితంల ఎన్నడు గింత మచ్చ అంటలేదు నాకు.. అందుకే నన్ను ఎవ్వలేం జేయలేరనుకొచ్చిండు..

ఏగిలం మోపైందిగదా రైతు బందు చెక్కులు.. బుక్కుల కాడ.. ఒక ఆడామె ఏడ్సుడొక్కటే తక్వున్నది.. పాత పాసు బుక్కుల ఆమెకు రెండు ఎక్రాల భూముంటే.. బంగారు తెలంగాణ సర్కారు ఇచ్చిన బుక్కుల పన్నెండు గుంటల భూమే ఉన్నట్టు సూపెట్టిండ్రట.. ఇగ సూస్కో ఆమె పరేషాన్ అయితున్నది..

గద్వాల జిల్లాల గలాటా గిది..కంట్రోలు బియ్యంతోని పేదల కడ్పునిండుడేమోగని.. దొంగలు దోపిడిగాళ్లకు జేవులు మాత్రం నిండుతున్నయ్.. వాస్తవానికి గూడ ఆ కంట్రోలు బియ్యం నిన్నియాళ్ల జనం తింటనే లేరు.. ఇగ ఇదే బియ్యాన్ని లారీలకు లారీలు దీస్కపోయి పాలీష్ జేశి అమ్ముతున్నరట.. కంట్రోలు బియ్యం ఎత్కపోతున్న లారీలను పోలీసోళ్లు ఖమ్మం జిల్లాల వట్కున్నరు..

మొన్ననే జెప్పలే నేను ఆడివిల్లకు చిన్నతనంల పెండ్లీలు జేయుండ్రి అప్పటిలెక్క లేదు యవ్వారం అధికారులొచ్చి ఆపేస్తరు పెండ్ల.. పెండ్లి ఖర్చులు సుట్టాలు.. బోజనాలు అన్ని ఉత్తయే అయితయ్ తర్వాత బాధపడుండ్రి అని గూడ జెప్తి ఇంటరా జనం.. ఇగో ఎన్మిదో తర్గతి సద్వుతున్న బుజ్జికి పెండ్లి జేయ జూశిండ్రు పెండ్లి ఆగిపోయింది..

పోలీసోళ్లు వైన్సు దుక్నం కాడికి ఎప్పుడు రావాలే..? ఆడేమన్న తాగినోళ్లు తన్నుకుంటుంటె రావాలే.. ఏదన్న న్యూసెన్సు అయితే రావాలే.. లేకపోతె మద్యం షాపు టైం దాటినంక గూడ అమ్మితె రావాలే అంతేనా.? కని ప్రకాశం జిల్లా చీరాల కాడ ఒక సీఐ వానికి నెత్తిల పుర్గుగూడ తిర్గిందో లేకపోతె మద్యం షాపోడు మామూలు ఇస్తలేడనుకున్నడో ఏమో.. వచ్చి హల్ చల్ జేశిపోయిండు జర్రశేపట్ల..

ఉపాయం ఉన్నోడు ఉపాసం ఎన్నడుండడు.. కుక్క పిల్లలను అమ్ముకోని బత్కెడోడు ఎంత పెద్ద ఉపాయం గట్టిండో సూడుండ్రి కడప జిల్లాల పార్థు గ్యాంగు తిర్గుతున్నదని జనం భయపడ్తున్నరుగదా..? అగో ఆ భయాన్ని ఆసర జేస్కోని నిజమే పార్థు గ్యాంగు తిర్గుతున్నది.. కావట్టి మీరు ఇంటికో కుక్కను వెంచుకోండ్రి అని కుక్క పిల్లలు దొర్కే అడ్రసుగూడ వెట్టిండట.. సూడుండ్రి వాని వ్యాపర తెల్వి ఎట్లున్నదో..

సారూ మన ఆఫీసుల పనిజేస్తున్న రజియొద్దిన్ గాడు నన్ను వేధిస్తున్నడు.. బట్టలిప్పి ఉర్కిస్తాంటున్నడు నేను ఆడమన్షిని జర్ర మీరే చర్యలు దీస్కోండ్రి అని ఉన్నతాధికారులకు జెప్పింది వాళ్లు వట్టిచ్చుకోలే.. ఆఖరికి షీటీమ్సును వేడుకున్నది ఆళ్లు వట్టిచ్చుకోలే ఇగ టెన్ టీవీ ఒక్కటే దిక్కు నా గోడు జెప్పుకునెతందుకు అని ఒక సర్కారు ఆఫీసు ఉద్యోగి మన ముంగటికొచ్చింది..

చిర్తపులులు ఇట్ల సచ్చిపోతున్నయెందుకో ఏమో.. గామొన్న తిరుమల కొండలెక్కే తొవ్వల టక్కరై ఒక చిర్తపులి సచ్చిపోయింది.. ఇయ్యాళ నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం గన్నారం తండకాడ ఇంకో చిర్తపులి యాక్సిడెంట్ల జీవిడ్సింది.. ఇంతకు చిర్తలు రోడ్ల మీదికి ఎందుకొస్తున్నయో ఏమో ఈ నడ్మ బాగైతున్నయ్ ఇసొంటియి..

21:09 - May 7, 2018

అనుకుంటనే ఉన్న ఎన్నడో ఒకసారి పిల్పొస్తది పిల్పొస్తదని రానే వచ్చింది.. ఐఏఎస్ పరీక్షల ఫస్టుర్యాంకు సాధించిన జగిత్యాల పిలగానికి ముఖ్యమంత్రి ఆఫీసుకెళ్లి పిల్పొచ్చింది..ఒక్కటే నాల్గే ఒక్కటే ముచ్చటను నాల్గు తీర్ల మాట్లాడితే దాన్ని నాల్గె అంటరా తాటి మట్ట అంటరా మీరే జెప్పాలే ఇగ.. మిస్టర్ తీగల క్రిష్ణారెడ్డి మహేశ్వరం ఎమ్మెల్యేగారు.. మీకు రూల్సు గీల్చు ఏముండయా..?ఆ సిద్దిపేట ఆర్డీవో ముత్యం రెడ్డిగారు.. మీరు ఆర్డీవో పోస్టు సూటయ్యెతట్టు లేదు...పంచ భూతాలు పగవట్టినట్టే ఉన్నయ్ తెలంగాణ రైతులను..ఇద్దరాలు మొగలు గొట్లాడుకోని పోరన్ని బాయిలేశినట్టు.. రెండు ఊర్లోళ్లు కొట్లాట వెట్టుకోని ఆపెతందుకొచ్చి పోలీసోళ్లను పొర్క పొర్క గొట్టిండ్రు..ఈ విలేజ్ డౌలప్మెంట్ కమిటీలు యాడంగ దాపురమైనయ్ రో.. హురక ఇదెక్కడి నీట్ ఎగ్జాంరో.. విద్యార్థులను ఎట్లంటె గజదొంగల లెక్క జూస్తున్నరు సర్కారోళ్లు.. గీ గరం గరం ముచ్చట్ల కోసం వీడియో క్లిక్ చేయండి. 

20:22 - May 5, 2018

అయ్యా జగన్ బాబు, జనసేనా బాబు.. ఇంటిరా ముచ్చట.. రాబోయే రెండువేల పందొమ్మిది ఎన్నికలళ్ల.. ఆంధ్రరాష్ట్రంలున్న అన్ని అసెంబ్లీ సీట్లు.. అన్నిఎంపీసీట్లు అన్ని కార్పొరేషన్ సీట్లు మేమే గెల్చుకోబోతున్నం.. అని చంద్రాలు సారు బ్రహ్మంగారు రాయంగ ఇడ్సిపెట్టిన కాలజ్ఞానం రాశి సద్విండు.. చంద్రాలు మాటలు ఇని మీరు గుండెవల్గేరు సుమా.. ఎట్లెట్ల చంద్రాలు..?

తెలంగాణ రాష్ట్రమొస్తె కేసీఆర్ జెప్పినట్టు నిజంగనే మా బత్కులు బంగారమైతయేమో అనుకున్నంగని.. అమ్మో ఇంతఆగమైతది మా బత్కు.. ఇంక నమ్ముతాము మేము అంటున్నరు.. కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు.. ఒక్క పెన్నుపోటుతోని మమ్ములను రెగ్కులరైజ్ జేస్తాన్న సారువారు ఏడవన్నడు ఇయ్యాల అని తీరొక్క తిట్టు తిడ్తున్నరు..

ఆర్మూరు బంగారం దొంగతనం కేసుల.. నిందితులు టీఆర్ఎస్ పార్టోళ్లు గాకుంట వేరేటోళ్లు ఉంటే.. ఈ పోలీసోళ్లు ఊకుంటుండెనా..? వాళ్ల ఇండ్ల మీదికి వొయ్యి గొర్ర గొర్ర గుంజుకొచ్చి స్టేషన్ల వడేశి నాల్గు సప్పరిచ్చి జైలుకు వంపకపోతుండే.. అధికార పార్టీ లీడర్లే దొంగలు అయ్యిండ్రన్న ఆరోపణ ఉన్నది గావట్టి వాళ్లను కనీసం అరెస్టు జేశే ధమ్ముగూడ లేదాయే మనోళ్లకు..

ఇప్పుడు గన్క టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, మార్కెట్ల పొంట వోతె జనం గెదిమికొట్టెతట్టున్నరు.. ఎందుకంటె వడగండ్ల వానకు మార్కెట్ల పొంట ధాన్యం గొట్కపాయేగదా..? తెచ్చినయ్ తెచ్చినట్టు గొనకుంట తమాష జేశ్న సర్కారోళ్ల మీద మంటమీదున్నరు రైతులు.. నిన్న బోనగిరి మార్కెట్ కాడ.. కమిటీ చైర్మన్ను గెద్మినంత పనిజేశిండ్రు..

హరే నీయక ఎటువోతున్నది ఈలోకం ఏం కథ..? నిన్నమొన్న మనం ఎన్ని ముచ్చట్లు జెప్పుకున్నం చిన్నతనం పెండ్లీలు జేస్తే ఎంత ఆగమైతది అని..? అనంతపురం జిల్లా రాయదుర్గం కాడున్న ఒక గుడిలె దేవునికి.. చిన్నపిల్లకు పెండ్లి జేశిండ్రు అయ్యగార్లు.. భక్తజనమంతగల్చి.. బాల్యవివాహ వ్యతిరేక చట్టాలు దేవునికి వర్తించయా ఎట్ల..?

ప్రజలారా ఒక్క ముచ్చట మనం ఓపెన్గ మాట్లాడుకోవాలె.. నిజంగ దేవుడు అనేటాయిననే ఉంటే.. ఆయనకు ప్రజల మీద ప్రేమ అభిమానం.. వాళ్ల కష్టాలు తీర్చాలె అన్న కోరిక ఉంటే.. ఆ శక్తి యుక్తులే ఉంటే.. మిమ్ములను గుడిదాక రప్పిచ్చుకోడు.. చర్చిదాక గుంజుకరాడు మసీదు దాక రావాల్సిందే అని చెప్పడు.. ఆయననే మీ ఇంటికొస్తడుగదా.?? ఈ ముచ్చట ఎందుకంటె.. సూడుండ్రి..

డిగ్రీలు పట్టా సర్టిఫికేట్ గావాల్నా మీకు..? మీరు పుస్తకాలతోని కుస్తి వడి సద్వవల్చిన పనిలేదు.. క్లాసులకు రాకున్నా పర్వాలేదు.. ఖాళీ ఎగ్జాం ఫీజు గడ్తె సాలు మిమ్ములను ఫస్టు క్లాసుల ఫాసు జేపిచ్చె బాధ్యత మాది అంటున్నరు యాదాద్రి జిల్లా మోత్కురు కాడ ఓపెన్ డిగ్రీ పరీక్షల సెంటర్ నిర్వాహకులు.. ఒక పెన్ను పరీక్షకు మూడు వందల రూపాలిస్తె సాలు పేజీలు నిండెదాక రాస్కో.. ఇది కథ..

అబ్బా ఈ జనాలు గూడ ఎంత ఎడ్డోళ్లుగ తయ్యారైండ్రంటే.. గొర్రె కసాయోన్ని నమ్ముతదన్నట్టు.. వీళ్లు గూడ మోసం జేశేటోళ్లనే నమ్ముతుంటరు.. మీరు నాల్గు నాల్గు లక్షల రూపాలు గట్టుండ్రి మీకు సర్కారు నౌకర్లు ఇప్పిస్తాని చెప్పంగనే ఆడీడ అప్పుజేశి తెచ్చి ఆ సుప్పనాతి చేతుల వోశిండ్రు.. అది అందరి పైసలు మూటగట్టుకోని రాత్రికి రాత్రే జంపైంది.. ఇప్పుడు మొత్తుకుంటున్నరు ఇండ్ల తప్పెవ్వల్ది చెప్పుండ్రి..?

20:33 - May 4, 2018

అయ్యో నీ వానలు సల్లగుండగదరా..? ఏం వానలు అవ్వి ఏట్లె వానలు.. వడగండ్ల వానలు జనంతోని మూడో ప్రపంచయుద్దం జేశినట్టే ఉన్నది.. ముఖ్యంగ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల పొంటి ఆగమాగం జేశింది వడగండ్ల వాన.. హైద్రావాదుల భూకంపం బుట్టిస్తాని కేసీఆర్ జెప్తె.. భూకంపం బదులు వడగండ్ల వాన మోపైంది.. మొత్తానికి జనం బత్కు సత్రోలైందనే చెప్పవల్సుంటది..

ఊరంత ఒకటుంటే ఊసుగండ్లోనికి ఇంకొకటన్నట్టు.. లోకమంతనేమో వడగండ్ల వానొచ్చి ఆగమైతిమిగదరా అని లొల్లివెడ్తుంటే.. ఒకతాన టీఆర్ఎసోళ్లు, బీజేపోళ్లు ఫ్లెక్సీలు గట్టిండ్రు.. జనాన్ని ఉద్దరిచ్చె ఫ్లెక్సీలు గావు మళ్ల.. వాళ్ల భూములు జాగలు అమ్మి లోకాన్ని ఉద్దరిస్తున్నమన్న కలరింగిచ్చె కటౌట్లు వెట్టిండ్రు పాండ్రి సూపెడ్త దాని యవ్వారమేందో..

ఎన్డీయేకు చంద్రబాబుకు విడాకులు ఎందుకైనయో తెల్సా..? ముఖ్యమంత్రి చంద్రబాబే బీజేపీకి మిత్రద్రోహం జేశిండట.. అందుకే టీడీపీ ఎన్డీయే నుంచి బైటికొచ్చిందట.. ఈమాట ఎవ్వలో బైటి మన్షి అన్నది గాదు.. కుద్దు చంద్రాలు కింద పనిజేస్తున్న మంత్రి ఆదినారాయణ రెడ్డి జెప్పిన మాట.. పొరపాటునో గ్రహపాటునో మొత్తం మీద నిజం గక్కేశిండు మీడియా ముంగట..

కళ్యాణానికి ఒక్కడొస్తె.. కన్నమేస్తందుకు ఇంకొకడొచ్చినట్టు.. పాపం పేదలకు ఎన్కట భూములు వంచి అండ్ల బత్కుండ్రని అప్పటి పాలకులు జెప్తె.. ఇప్పటి పాలకులు ఉన్న భూమిని గద్దల పాలు జేస్తున్నరట.. మంత్రి కల్వకుంట్ల తారకరామారావుగారు ఎమ్మెల్యేగునన్న సిరిసిల్ల నియోజకవర్గం కథ ఇది.. జనం వచ్చి రెండు చేతులు జోడిచ్చి నీకు దండం బెడ్తం మమ్ముల మోసం జేయకుండ్రి అని చెప్తున్నరు..

విజయనగరం జిల్లా పార్వతీపురం, బొబ్బిలి మున్సిపాల్టీలళ్ల సాఫ్ సఫాయి కార్మికులు బిచ్చమెత్తుకుంటున్నరు.. వీళ్లు బిచ్చమెత్తుకుంటున్నరంటే.. స్వాతంత్ర్య సమరయోధులు శ్రీ నారా చంద్రాలుగారు , ఆయన మంత్రి నారాయణ వారు శిగ్గుతోని తల్కాయ దించుకోవాలె గదా..? వాళ్లకు ఆపాటి శరం ఏముండదిగని.. మరి వీళ్ల బిచ్చం సంగతేందో సూద్దాం పాండ్రి..

ఇంకో రెండు నెలలళ్ల ప్రతి గుడ్సెకు.. ప్రతి గూడానికి.. ప్రతి పల్లెకు మంచి నీళ్లు తాపియ్యబోతున్నం.. ఇప్పటికే మిషన్ కాకతీయతోని చెర్వులన్ని చెలచెల మెరుస్తున్నయ్.. అని ఒకతాన ముచ్చట జెప్పుకొచ్చింది మెదక్ ఎమ్మెల్యే పద్మమ్మ.. అమ్మగారు అటు ముచ్చట జెప్తుంటే.. ఇంకో దిక్కు తాగునీళ్ల కోసం తక్లీవు వడ్తున్న ఆడోళ్లు బిందెలు వట్కోని రొడ్డెక్కిండ్రు..

అయ్యా కర్నూలు కలెక్టర్ గారు.. మీరు పనిజేస్తున్నరా నిద్రవోతున్నరా..? రైతుకు నష్టపరిహారం ఇయ్యాల్నంటే మీ కింది అధికారులకు లంచం ఇయ్యాల్నంటగదా..? మీ జిల్లాలున్న పాణ్యం మండలం తమ్మరాజు పల్లెకాడ సర్వేయరుగారు యాభైవేల రూపాలు ఇస్తెనే నీకు పరిహారం వచ్చెతట్టు జేస్తాని డిమాండు జేస్తున్నరట.. మరి మీకు గూడ చాలసార్లు చెప్పుకుంటె మీరు పట్టిచ్చుకుంటలేరటగదా..? ఇను రైతు గోస..

నెత్తెంటికెలు బెత్తడు వెర్గితెనే శిటశిటాంటది.. ఎప్పుడు ఉర్కుదామా మంగలాయితానికి ఎప్పుడు కటింగు జేపిచ్చుకుందామా అని సూస్తరు.. కని కొంతమంది ఉంటరు జుట్టు వెంచెటోళ్లు గూడ.. కని గుజరాత్ రాష్ట్రంల నెత్తికి రుమాలు జుట్టుకునుడు బంజేశి.. నెత్తికి ఎంటికెలే సుట్టుకుంటున్నడు ఒక పెద్దమన్షి.. పదిహేను మీటర్ల పొడ్గు సూడుండ్రి..

20:43 - May 2, 2018

తెలంగాణ రాష్ట్రంలో జనసమితి నిర్వహించిన సభ సక్సెస్..మాటల వేడిని పుట్టిస్తున్న కోదండరాం...ప్రత్యేక దొంగ కోసం వెతుకులాటుడుతున్న జనం...వైసిపి..బిజెపి..టిడిలోనే దాగున్నడంట..గుణాత్మక మార్పు...యూపీఏని చీల్చే కుట్ర జరుగుతున్నదంట..మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అహంకారం..దళితుడిని ఇంటిని కూల్చివేయిస్తున్నాడంట..భగీరథ పైపులు పేలుతున్నయి..శవాన్ని అరెస్టు చేసిన ఫ్రెండ్లీ పోలీసులు...ఆంధ్రకు ప్రత్యేక హోదా కల్పిలంచాలనే పోరాటంలో హిజ్రాల ఎంట్రీ...గీ గరం గరం ముచ్చట్ల కోసం వీడియో క్లిక్ చేయండి. 

20:23 - April 28, 2018

హురక పదో పతగతి పరీక్షల ఫలితాలు రానేలేదు అప్పుడే పదోతర్గతి బుజ్జికి పెండ్లి వెట్టేశిండ్రు తల్లిదండ్రులు.. అంత పదహారేండ్లు గూడ నిండని బుజ్జికి అప్పుడే పెండ్లి జేశి చేతులు దుల్పుదామనుకుంటున్నరు వాళ్ల తల్లిదండ్రులు ఈ ముచ్చట తెల్చి అధికారులు ఊకుంటరా వచ్చి పెండ్లి ఆపుజేశి పోయిండ్రు..

యాడంగ దాపుమైండ్రో ఏమో మన తెల్గు రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. ఒకాయిననేమో వంద శాతం మేనిఫెస్టోల జెప్పినయన్ని అమలు జేశ్నమని ఇక్కడి చంద్రయ్య జెప్తడు.. నేనేం తక్వనా నేను గూడ తొంబై తొమ్మిదిశాతం అమలు జేశ్నాని అక్కడు చంద్రాలు జెప్తడు.. బాగమోపైండ్రొసు ఆడొకలు ఆడొకలు.. అంటున్నరు సూశినోళ్లు మరి చంద్రాలు కథ ఏందో ఇనుండ్రిగ...

కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ పొన్నం ప్రభాకర్ సారుకు ముఖ్యమంత్రి కేసీఆర్ మీద బాగ ప్రేమ వెర్గినట్టుందిగదా..? ఆయన మీద ఒక సీన్మదీస్తడట.. సీన్మటైటిలు గూడ రిలీజ్ జేశిండు.. మొన్న మహేష్ బాబుది శీన్మరాలే.. అదే భరత్ అనే నేను సీన్మ.. అగో సేమ్ అసొంటిదే దీస్తడట.. ఈ సీన్మపేరు కేసీఆర్ అనే నేను అని పేరువెట్టిండు.. మరి చిత్రం ఎట్లుంటదో అర్సుకుందాం పాండ్రి..

కోదండరాం సారధ్యంలొస్తున్న కొత్త పార్టీ తెలంగాణ జన సమితి ఆవిర్భావ సభ ఈ ఐతారం మూడుగంట్లకు సుర్వైతున్నది.. ఇప్పటికే జిల్లాల పొంట ప్రచారాలు గట్టిగ జేశ్న ఆ పార్టోళ్లు లక్షమందిని సభకు వట్కొచ్చె ఏర్పాట్లు జేశిండ్రట.. సరూర్ నగర్ స్టేడియంల పని ఎట్లైతున్నది ఏం కథ మొత్తం అర్సుకున్నడు కోదండరాం సారు ఇయ్యాళ..

మొన్ననే మూడు రోజుల కింద మార్కెట్ల ధాన్యం కొనుగోలు కేంద్రానికి రిబ్బను కట్ జేశి.. తెలంగాణ ప్రభుత్వం రైతు ప్రభుత్వం.. కేసీఆర్ దేవుడు.. ఆయనంత శిపాయి లేడని ప్రెస్ మీటింగు వెట్టి చెప్పిండు వర్దన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ గారు.. అప్పటిమందం ధాన్యం జోకినట్టు రెండు పోట్వలకు ఫోజిచ్చిండు.. తర్వాతేమైందో సూడుండ్రి..

సూడుండ్రి తెలంగాణ బిడ్డ ఎంత గొప్ప విజయం సాధించిండో.. భారతదేశంలనే నెంబర్ వన్ ర్యాంకు సాధించి.. ఐఏఎస్ అయ్యిండు.. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం చిట్టపూర్ ఊర్లుండే దూరిశెట్టి మనోహర్ కొడ్కు అనుదీప్ సివిల్స్ ల నెంబర్ వన్ ర్యాంకు గొట్టిండు.. తెలంగాణ రాష్ట్రం వచ్చినంక ఫస్టు ఈ పిలగాడే ఇంత పెద్ద ర్యాంకు గొట్టింది... మల్లన్న ముచ్చట్ల తర్పున శుభాకాంక్షలు తమ్మీ నీకు..

నిన్న పోలీసోన్ని భార్య పొర్కపొర్క గొట్టిన ముచ్చట జూశిండ్రుగదా..? చెర్యాల కాడ.. ఇప్పుడు భర్త భార్యను సేమ్ అదే సీన్ల దొర్కిచ్చుకోని కొట్టిండు కాకపోతె.. ఇది చెర్యాలగాదు.. ఆంధ్ర రాష్ట్రంల అయ్యింది.. చేర్యాల కాడ భర్త ఏం జేశిండో.. నెల్లూరు జిల్లా ఆత్మకూరు కాడ భార్యగూడ అదే లత్కోర్ పని జేస్కుంట భర్తకు దొర్కింది.. ఇగ కథ జూడుండ్రి..

రూపాయికి రెండు రూపాలొస్తున్నయంటే ప్రజలకు ఎట్ల ఆశుంటది.. ఇగ ఈ ఆశనే ఆయుధంగ మార్చుకున్నరు కొంతమంది.. ఐదువందల రూపాల నోట్లు.. రెండువేల రూపాల నోట్లు సొంతంగ తయ్యారు జేస్కునె శక్తి సామర్ధ్యాలను ప్రసాదిస్తం మీకని నల్లరంగు కాయిదాలను అంటగట్టి అసలు నోట్లు ఎత్కపోతున్నరనట.. కరీంనగర్ కమీషనర్ కమలాసన్ రెడ్డి సారు జెప్తడు ఇనుండ్రి...

20:13 - April 27, 2018

మామూల్గ పోలీసోళ్లు జనాన్ని గొడ్తుంటరుగని.. సిద్దిపేట జిల్లా చేర్యాల కాడ.. పోలీసోన్నే పొర్కపొర్క గొట్టింది చేస్కున్న భార్య.. ప్రేమించి పెండ్లి జేస్కోని పదేండ్లు సంసారం జేశి.. ఇప్పుడు ఇంకో ఆమెతోని ఉంటుంటే.. ఊకుంటరా..? వచ్చి కొట్టుడంటే మామూల్గ గొట్టలే.. కాల్లు మొక్కుతనే ఇడ్వే అంటె గూడ ఇడ్వలే.. పోలీసు కాటుకు చీపురు దెబ్బ ఎట్లున్నదో సూడుండ్రి..వారెవ్వ ఇంటిరా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ముచ్చట.. గెల్చిన ఫస్టు యాడాది అడ్గితె అగో పశిగుడ్డు ప్రభుత్వమన్నడు.. తర్వాత యాడాది అడ్గితె సంసారం కుదురుకోవద్దా అన్నడు.. మూడో యాడాది అడ్గితె తెలంగాణ ద్రోహులు అన్నడు.. నాల్గో యాడాది కోంపల్లి కాడ అడ్గకముందుకే జెప్పిండు.. మేనిఫెస్టోల జెప్పినయన్ని వందకు వంద శాతం అమలు జేశేశ్నమని.. నోటితోని నవ్వే ముచ్చటనేనా ఇది..? తెలంగాణ రాష్ట్రం గావాలె అని అప్పుడు పోరాటం జేశ్న.. కోటీ కాడ సెల్ టవర్ మీదికి ఎక్కిన.. రాష్ట్రమొస్తె మా బత్కులు మార్తయనుకున్న.. కని ఏం మారలే.. అందుకే ఇగో టీఆర్ఎస్ ప్లీనరీ కటౌట్ మీదికి ఎక్కినా.. ఈ రాష్ట్రంల కేసీఆర్ కుటుంబం బత్కుదెర్వు మారింది గని.. మా అసొంటోళ్లకు ఏంగాలేదని ఒక ఉద్యమకారుడు గీ పనిజేశిండు..ఆ సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ ఆఫీసు బద్దలు బాషింగాలు జేశిండ్రుగదా రైతులు.. రైతులకు కోపమొస్తె ఎవ్వలిని జూడరు.. పదిహేను వందల తొంబై రూపాల మద్దతు ధర అని చెప్పి.. పన్నెండు వందలకు కింటాలు గొంటుంటే రైతులకు కోపంరాదా..? అందుకే మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఇలాకాల మార్కెట్ ఆఫీసును అశోకవనం జేశి రోడ్డెక్కిండ్రు.. దొంగలకు సద్దిగట్టే కేంద్రాలుగ మారిపోతున్నయ్ ఎమ్మార్వో ఆఫీసులు.. వాళ్ల లంచాల కోసం మొత్తం ఒక ఊరినే బలిజేశిండ్రు.. గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం జూలెకల్ అనే ఊరు.. నాదే అని ఒకడు కాయిదాలు తయ్యారు జేశి.. అందరికి నోటీసులు వంపిండు.. లక్ష రూపాలన్న ఇయ్యుండ్రి లేకపోతె ఇల్లు గూలగొడ్తాని పేదలను బెదిరిస్తున్నడట..ఆసీఫా అనే ఎన్మిదేండ్ల బుజ్జిని కిరాతకంగ రేప్ జేశి హత్య జేస్తె దాన్ని ఖండిచిండట పాలమూరు జిల్లాల ఒక దళిత బిడ్డ.. కాషాయం కుక్కలు జేశిన కుట్రను నిరసన గూడ తెల్పలే.. ఆఫీఫాకు మద్దతుగా..? ఒక పోస్టును వాట్సప్ల వెట్టినందుకు.. దండదారంగాళ్లంత జమై ఆ దళిత బిడ్డ మీద పంచాది వెట్టి ఊర్లకెళ్లి వెలేశిండ్రట.. ఎక్కడి కథ ఇది.. ఏంది..? రూపాయికి రెండు రూపాలొస్తున్నయంటే ప్రజలకు ఎట్ల ఆశుంటది.. ఇగ ఈ ఆశనే ఆయుధంగ మార్చుకున్నరు కొంతమంది.. ఐదువందల రూపాల నోట్లు.. రెండువేల రూపాల నోట్లు సొంతంగ తయ్యారు జేస్కునె శక్తి సామర్ధ్యాలను ప్రసాదిస్తం మీకని నల్లరంగు కాయిదాలను అంటగట్టి అసలు నోట్లు ఎత్కపోతున్నరనట.. కరీంనగర్ కమీషనర్ కమలాసన్ రెడ్డి సారు జెప్తడు ఇనుండ్రి... తాడిచెట్టు ఎక్కుడంటే యమధర్మరాజుకు ఎదురుంగ వొయ్యినట్టే ఉంటది.. అసొంటి చెట్టుమీదికి ఒక గౌడన్న ఎక్కిండు.. కటమయ్య పండుగున్నది దేవునికి తాటి ముంజలు వెట్టాలే అని ఎక్కిండట.. మీదికి వోంగనే చెమ్టకు ఏస్కున్న మోకు జారిపోయి కిందవడ్డదట ఆయన మీదనే ఉన్నడు.. ఇగ ఎట్లుంటది.. అప్పటికే సగం పాణం గాలిల వొయ్యింది.. ఇగ ఉన్నసగం పాణం కిందికి దిగేతందుకు సూస్తున్నది..

Pages

Don't Miss

Subscribe to RSS - mallanna news