manavi

13:27 - March 28, 2017

విద్య, ఉపాధి కోసం అమ్మాయిలు హైదరాబాద్ కు వస్తుంటారు. హాస్టల్ లో ఉంటూ ఉద్యోగాలు చేస్తుంటారు. మరి ప్రైవేట్ హాస్టళ్లలో అమ్మాయిలకు రక్షణ ఎంత.. ? అనే అంశంపై నిర్వహించిన మావని వైదిక చర్చా కార్యక్రమంలో అడ్వకేట్ సురేష్ కుమార్, ఉమెన్స్ హాస్టల్ నిర్వహకుడు శ్రీనివాస్ పాల్గొని, మాట్లాడారు. హాస్టల్ ఏర్పాటుకు అనుమతి తీసుకోవాలి, రిజస్ట్రేషన్ చేసుకోవాలనే రూల్స్ లేవన్నారు. అనుమతి, రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. 

13:30 - March 26, 2017

ఆమె కలంలో అధునాతన భావాల జలపాతాలు జాలువారుతుంటాయి
ఆమె గళంలో ప్రగతిశీల భావనల సముద్రాలు ఉప్పొంగుతుంటాయి
ఆమె స్త్రీజాతి స్వేచ్ఛను కోరి రచనలు చేసిన కవయిత్రి...
ప్రేమకు పెళ్ళికి మధ్య నలిగిపోయిన అంతరాల అంత:సంఘర్షణను అక్షరాల్లో చూపించిన నవలా రచయిత్రి...
ప్రవాసాంధ్ర జీవన దృశ్యాలను కథలుగా..... నవలలుగా శిల్పీకరించిన కథనశిల్పి...
ఆమె కల్పన రెంటాల..
తెల్లటి పూల గుత్తులు రోడ్డంతా
మంచు ప్రేమ మైకంలో మునిగిపోయే మాడిసన్
చివరి చూపు, చివరి మాటల్లాగా
ఎండిపోయిన చెట్లు
ఆఖరిక్షణాల్లో ఆత్మీయపు పలకరింతల్లాగా
మళ్లీ తొలిప్రేమంతా తాజాగా
ఓ తెల్లటి కౌగిలింతలో ఒదిగి పోయిన రెండు రాబిన్ పక్షులు
అంటూ అద్భుత భావుకతతో కవిత్వం రాసిన కల్పన రెంటాల కలానికి రెండు పక్కలా పదునే అని చెప్పాలి. 

కవిత్వం రాసినా.. కథరాసినా.. నవల రాసినా రెంటాల కల్పన అక్షరాలలో జీవితం ఉంటుంది.. జీవం ఉంటుంది.. అనుభూతి ఉంటుంది.. ఆర్ధ్రత ఉంటుంది.. సున్నితమైన మనోభావాలుంటాయి.. బలమైన తాత్వికతా నీడలుంటాయి.. స్త్రీ పురుషుల అంత:సంఘర్షణల తాలుకూ చేదు నిజాలుంటాయి. అణచివేతల ఆనవాళ్లుంటాయి.. మానవీయ కోణాలుంటాయి.. అనుభవాలుంటాయి.. ఆదర్శాలుంటాయి.. ఒక్క మాటలో చెప్పాలంటే రెంటాల కల్పన రచనల్లో.. ఒక కొత్తదనం ఉంటుంది. అందుకు ఉదాహరణే... ఆమె రాసిన సంచలన నవల...తన్హాయి 

వెయ్యేళ్ళ తెలుగు సాహిత్యంలో ఎన్నో నవలలు వచ్చాయి. స్త్రీ పురుష సంబంధాలపై సంచలనాత్మక నవలలు వెలువడ్డాయి.. అందులో చలం మైదానం. ఒకటి.
ఆ.. నవలలోని ఇతివృత్తం అప్పట్లో సంచనలం సృష్టించింది. పెళ్లైన రాజేశ్వరి..ఒక ముస్లిం యువకుని వెంట వెళ్లి స్వేచ్ఛగా జీవించిన ఇతివృత్తం అప్పట్లో ఓ విస్ఫోటనాన్నే సృష్టించింది. సమాజంలోని కట్టుబాట్లను తెంచి తుప్పుపట్టిన మానవ మస్తిష్కాలను కొత్తగా ఆలోచింపజేసిన నవల అది. చాలా ఏళ్ల తర్వాత అదే దారిలో ఓ నవలను రాసి పెను సంచలనం సృష్టించారు కల్పనా రెంటాల.. తన్హాయి నవలతో పలు చర్చలకు తెర లేపారు. పాఠకుల్లో సరికొత్త ఆలోచనలు రేకెత్తించారు..

ప్రవాసాంద్రులైన రెండుకుటుంబాలలోని పెళ్లైన స్రీపురుషుల మధ్య జరిగే ప్రేమతాలూకు అనుభూతుల కెమిట్రీచుట్టూ ..అల్లిన నవల ఇది. స్వేచ్ఛ.., అంత: సంఘర్షణ.., సమాజపు కట్టుబాట్లు.., భార్యాభర్తల మధ్య ఉన్న ప్రేమ రాహిత్యం, విదేశాల్లో ఉన్న భారతీయుల కుటుంబ సంబంధాలు ఇత్యాది అంశాల చుట్టూ అల్లిన నవల తన్హాయి. ఎన్నో ప్రశ్నలు..చర్చలు..లేవదీసిన..తన్హాయి నవల..రచయిత్రికి మంచి గుర్తింపును తెచ్చి పెట్టింది.

కల్పన రెంటాల తొలుత కవయిత్రిగా ఎంతో పేరుతెచ్చుకున్నారు. 2001 లో వెలువరించిన  నేను కనిపించే పదం అనే కవితా సంకలనంలో స్త్రీవాద కవితలతో పాటు వస్తువైవిధ్యం శిల్ప సోయగం ఉట్టి పడే కవితలెన్నో ఉన్నాయి. అవన్నీ ఆమెను.. కవయిత్రిగా.. తెలుగు కవితా రంగంపై నిలబెట్టాయి. అంతేకాదు.కల్పనా రెంటాల..ఒక జర్నలిస్టుగా ఎన్నో మానవీయ కథనాలకు పత్రికల్లో అక్షరరూపమిచ్చిన అనుభవంతో అద్భుతమైన కథలు రాశారు.. ఆమె రాసిన కథల్లో.. స్లీపింగ్ ఫిల్, అయిదో గోడ, కప్లెట్, ఇట్స్ నాట్ ఓ.కె కథలు అప్పట్లో పాఠకులను ఎంతగానో అలరించాయి.ఆలోచింపజేశాయి. కథానిర్మాణంలో పాత్ర చిత్రణలో... వాతావరణ కల్పనలో.. సంఘటనల కూర్పులో ..వాస్తవిక దృశ్యాల చిత్రణలో.. సహజత్వం ఉట్టి పడే కథలవడంతో రచయిత్రికి తెలుగు కథాసాహిత్యంలో మంచి గుర్తింపు వచ్చింది. 

నిజం చెప్పాలంటే కల్పనా రెంటాలకు సాహిత్య అభిలాష, అభినివేశం ఆమె తండ్రి రెంటాల గోపాలకృష్ణ నుంచి వచ్చిందని చెప్పాలి. ఇక ఆమె సహచరుడు ప్రముఖకవి అప్సర్ తో కలసి అనంతపురం నుండి అమెరికా వరకు ప్రయాణించిన ...జీవితం, సాహిత్యం కలబోసిన ప్రయాణంలో ఆమె సృజనాత్మకత వేయి పూలుగా వికసించింది. 2003 లో అమెరికా వెళ్లాక కల్పన రెంటాల కల్పనలో అనూహ్యమైన మార్పులొచ్చాయి. అద్భుతమైన నవల తన్హాయి అక్కడే అక్షరీకరింపబడింది. 2011 లో ఆమె బ్లాగు తూర్పు పడమరలో ఆ...నవల సీరియల్ గా 10 నెలలపాటు వచ్చింది. విశేష ఆదరణ పొందిన తన్హాయి నవల ఆమెకు ఎందరో అభిమాన పాఠకులను తెచ్చి పెట్టింది .

విజయవాడలోనే పుట్టి పెరిగిన కల్పన 1980లో ఆంధ్రజ్యోతి వారపత్రికలో టెలివిజన్ కళాసాంస్కృతిక రంగాల సమీక్షలు రాసే జర్నలిస్టుగా  ఉద్యోగ జీవితం ప్రారంభించారు. తర్వాత స్వాతి వారపత్రికలో పనిచేశారు. విజయవాడ ఆకాశవాణిలో న్యూస్ రీడర్ గా కూడా పనిచేశారు. ఆంధ్రభూమిలో సబ్ ఎడిటర్ గా పనిచేస్తూనే ప్రవృత్తిగా రచనా రంగంలో కృషిచేశారు. ఆమె రాసిన నేను కనిపించే పదం కవితా సంకలనానికి అజంతా అవార్డు లభించింది. అలాగే `ఆమెపాట` పేరుతో కల్పన రెంటాల ఆంధ్రభూమిలో రెండేళ్లపాటు వివిధ భాషల్లో వచ్చిన స్త్రీల కవితల విశ్లేషణతో  ఆమెకు మంచి  గుర్తింపు వచ్చింది. 

తెలుగు స్త్రీవాద సాహిత్యంలో తనదైన గొంతు వినిపించిన కవయిత్రిగా.. కథాసాహిత్యంలో తనదైన సృజన శిల్ప ప్రతిభలను ప్రదర్శించిన కథనశిల్పిగా... తన్హాయి లాంటి ఒక్క నవలతో సంచలన నవలాకారిణిగా గుర్తింపు పొందిన కల్పన,  అప్సర్ తో పాటు సారంగ వెబ్ మాగజైన్ నిర్వహణలో తనదైన కృషిచేస్తూ.. కొత్త కవులకు రచయితలకు బాసటగా కూడా నిచిచారు. 

జర్నలిస్టుగా.. కవయిత్రిగా, నవలా కారిణిగా బహుముఖీనమైన కృషి చేస్తున్న కల్పన రెంటాల కలం నుండి భవిష్యత్తులో మరెన్నో కవితా.. కథా సంకలనాలతో పాటు సంచలన నవలలు కూడా వెలువడాలని ఆశిద్దాం...

13:28 - March 26, 2017

ఆధునిక తమిళ కథా, నవలా సాహిత్యంలో విశేష కృషిచేసిన సుప్రసిధ్ధ రచయిత అశోక్ మిత్రన్. జీవిత వాస్తవికతకు అద్దం పట్టే కథలు, నవలలను రాసిన అశోక మిత్రన్ అసలు పేరు జగదీశ త్యాగరాజన్. ఆయన 1931 సెప్టెంబర్ 22న సికింద్రాబాద్ లో జన్మించారు. 20 ఏళ్లు సికింద్రాబాద్ లోనే చదువుకున్నారు. తర్వాత 1952 లో మద్రాస్ వెళ్ళిపోయారు. అక్కడ జెమిని స్టూడియోలో దశాబ్దం పైగా పని చేశారు.
200 కథలు, 8నవలలు
అశోక్ మిత్రన్ 200 కథలు, 8నవలలు. ఆయన కథల్లో సినీ జీవుల వ్యథలు, సామాన్య ప్రజల జీవన చిత్రాలు, జీవితానుభవాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి.1953 లో ఆయన రాసిన అన్ బిన్ పరిసు నవల అప్పట్లో సంచలనం సృష్టించింది. తన్నీర్, మానస సరోవర్, పావమ్ దళ్ పతడో మెుదలైన నవలలు అశోకమిత్రన్ కు ఎంతో కీర్తిని తెచ్చి పెట్టాయి. ఆయన రాసిన తన్నీర్ నవలను దర్శకుడు వసంత్ సినిమాగా తీశాడు.
తమిళ సాహిత్యంలో గుర్తింపు 
మిత్రన్ వ్యాసరచయితగా, విమర్శకునిగా తమిళ సాహిత్యంలో గుర్తింపు పొందారు. 1966 లో ఆయన రాసిన మై ఇయర్స్ విత్ బాస్  కాలమ్స్ మిత్రన్ కు మంచిగుర్తింపునిచ్చాయి. ఆయన కథలు, నవలలు ఇంగ్లీషుతో పాటు పలు యూరోపియన్ భాషల్లోకి అనువాదమయ్యాయి.
అవార్డులు, రివార్డులలతో సత్కారం...
అశోక్ మిత్రన్ సాహితీ కృషికి ఎన్నో సంస్థలు అవార్డులు రివార్డులిచ్చి సత్కరించాయి. 1995లో అశోక్ మిత్రన్ వెలువరించిన అప్పవిన్ స్నేగిధర్ కథల సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.  యూనివర్సిటీ ఆఫ్ అయోవా నుంచి క్రియేటివ్ రైటింగ్ ఫిలోషిప్, యం.ఆర్ .జి అవార్డు, లిలీ మెమోరియల్ అవార్డు, అక్షర తదితర అవార్డులెన్నో అందుకున్నారు. సాధారణ కుటుంబంనుంచి, గొప్ప రచయితగా ఎదిగి ఇటీవల కన్ను మూసిన అశోక్ మిత్రన్ కు 10 టి.వి.అక్షరం నివాళులర్పిస్తోంది.

 

12:45 - March 20, 2017

పారిజాత...తెలుగింటి అమ్మాయి..ఈమె కెనాడలో స్థిరపడ్డారు. భారత సంగీత సౌరభాన్ని విదేశాల్లో వెదజల్లుతున్నారు. అమెరికాలో ప్రవాస స్త్రీ శక్తిగా ఈమె అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా టెన్ టివి మానవి పలకరించింది. ఈ సందర్భంగా తన జీవిత ప్రయాణం..మధ్యలో వినసొంపైన పాటలను పాడారు. మరి పారిజాత పాటల ప్రయాణం చూడాలంటే వీడియో క్లిక్ చేయండి.

12:52 - March 14, 2017

హైదరాబాద్: మగువల చేతిలో మట్టి ముద్ద కూడా కళారూపాన్ని సంతరించుకుంటుంది. ఎందుకంటే వారు కళాత్మకతకు, సృజనాత్మకత మారు పేరు కాబట్టి. వారి చేతిలో అంతమైన వస్తువులు రూపుదిద్దుకుంటాయి. అలా మహిళలు చేసే సృజనాత్మక వస్తువులతో మీ ముందుకు వచ్చింది. ఈ నాటి సొగసు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

12:44 - March 14, 2017

హైదరాబాద్: పట్టుదలకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తూ.. ఆరోగ్య సమస్యలు వెన్నంటినా మొక్కవోని దీక్షతో ప్రజల సమస్యలపై అధ్యయనం చేసేందుకు కంకణం కట్టుకుని శ్రామిక మహిళల సమస్యలపై పోరాడుతూ.. కొన్ని నెలల క్రితం సుదీర్ఘ మహాజన పాదయాత్రలో భాగస్వాములయ్యారు. ఈ సంమయంలో తనకు ఎదురై సంఘటనలు, ఊహించని ఘటనలు చిన్నవేనని ఆమె భావించారు. ఈ వారం మానవి' స్ఫూర్'తి ఎస్. రమ ఇతివృత్తం. పూర్తి వివరాలకోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

13:18 - March 10, 2017

ఎప్పుడూ సరికొత్త ఐటెమ్స్ ను పరిచయం చేసే సొగసు.. ఈరోజు మరో కొత్త ఐటెమ్ తో మీ ముందుకు వచ్చింది. మోతీస్ తో కీ చైన్ ఎలా తాయారు చేయాలో ఇవాళ్టి సొగసులో తెలుసుకుందాం.. ఆ వివరాలను వీడియోలో చూద్దాం...

12:55 - March 10, 2017

మహిళా వార్తల సమాహారంతో మానవి న్యూస్ ఇవాళ మీ ముందుకు వచ్చింది. తెలుగు అమ్మాయి లక్ష్మీస్రావ్య అరుదైన ఘనత, ప్రపంచ మహిళా చెస్ చాంపియన్ షిప్ దక్కించుకున్న చైనా అమ్మాయి, తెలుగు రాష్ట్రాల్లో లింగ నిష్పత్తి పెరిగింది. పరుషులతో పొలిస్తే మహిళలకు తక్కువ వేతనం.. సర్వే వివరాలు, హైదరాబాద్ లో షీ టీమ్స్... స్వాతి లక్రా సారథ్యం, భారత పార్లమెంట్ లో మహిళల ప్రాధాన్యత అంతంత మాత్రమే, ఎన్ని చట్టాలు వచ్చినా మహిళలపై ఆగని అత్యాచారాలు, లైంగిక వేధింపులు, కడపలో కామాంధుడికి యావజ్జీవ శిక్ష, సాక్షి మాలిక్... మహిళకు చక్కటి సందేశం, షట్లర్ లో పివి.సింధు, సైనా నెహ్వాల్ లు శుభారంభం, హాకీ సీరిస్... భారత మహిళా జట్టు క్లీన్ స్వీప్ వంటి పలు వార్తలను వీడియోలో చూద్దాం...

 

14:30 - March 9, 2017

'అమ్మాయిలు టెక్నికల్ గా ముందుండాలి' అనే అంశంపై మానవి వేదిక నిర్వభహించిన చర్చాకార్యక్రమంలో సైకాలజిస్టు రవికుమార్, పనినయ మహా విద్యాలయ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ వసుంధరాణి పాల్గొని, మాట్లాడారు. ఈ సందర్భంగా వారు పలు అసక్తికరమైన అంశాలు తెలిపారు. ఆ వివరాలను వీడియోలో చూద్దాం..

 

15:36 - March 8, 2017

హైదరాబాద్: టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో మహిళలపై తీవ్ర వివక్ష కొనసాగుతోందని తెలుగుమహిళా అధ్యక్షురాలు బండ్రు శోభారాణి విమర్శించారు. మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని అమరవీరుల స్థూపం వద్ద తెలుగుమహిళా నాయకులు నివాళులర్పించారు. అనంతరం తెలంగాణ అసెంబ్లీలోకి దూసుకెళ్లేందుకు యత్నించిన వారిని పోలీసులు అరెస్టు చేశారు.

Pages

Don't Miss

Subscribe to RSS - manavi